గింజ ధాన్యాలు
పెసలు 20-1-11
పప్పు ధాన్యాలలో అత్యుత్తమ మైనది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. పత్యం కింద వాడు కోదగినది. రక్తప్రసరణ లో ఉపయోగ పడుతుంది.
అర్శమొలలు :---
పెసర పప్పు ----- పావు కప్పు
నీళ్ళు ---- నాలుగు కప్పులు
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు కాచాలి. దీనిని ప్రతిరోజు
తాగితే దురదలు తగ్గుతాయి.
జ్వరం :-- దీనిని తీసుకుంటే శక్తి వస్తుంది.
పెసరపప్పు
బెల్లం
రెండింటిని కలిపి ముద్దగా దంచి నెయ్యి కలిపి తింటూ వుంటే తొందరలో కండపుష్టి కలుగుతుంది.
బటాణీలు 17-3-11.
బటాణీ లను ఎక్కువగా తినకూడదు. అప్పుడప్పుడు మాత్రమే తినాలి.
చికెన్ పాక్స్ :--
ఎండు బటాణీలు --- 50 gr
బటాణీ లను పలుకుగా నూరాలి.వీటిని నీటిలో వేసి మరిగించి కషాయంకాచి
ఆ నీటితో ముఖాన్ని కడుగుతూ వుంటే మచ్చలు తగ్గుతాయి.
ఈ నీటితో కడగడం వలన మొటిమల మచ్చలు కూడా నివారింపబడతాయి.
కొలెస్ట్రాల్ నివారణ :--
పచ్చి బటాణీలు --- 50 gr
నీళ్ళు --- తగినన్ని
దాల్చిన చెక్క --- అర టీ స్పూను
మిరియాల పొడి --- అర టీ స్పూను
బటాణీ ల బరక చూర్ణాన్ని నీళ్ళలో వేసి కషాయం కాచి వడకట్టి దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది.
కోపం, ఆందోళన :--
వేయించిన బటాణీలను తింటూ వుంటే ఒత్తిడి తగ్గి కోపం, ఆందోళన
నివారింపబడతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి