ఉదర సంబంధ వ్యాధులు



                                                        ఉదర సంబంధ వ్యాధులు


పొట్టలో నొప్పి ,ఉబ్బరం,ఆకలి మందగించడం,జీర్ణం కాకపోవడం ,బంక విరేచనాలు,మలం మురిగి క్రిములు

పుట్టడం వంటి సమస్యలు,గాసు,ఎసిడిటి వంటి వ్యాధులకు సంబంధించి :----

స్వర్ణ పత్రి ఆకు పొడి (సునాముఖి) -------60 gr
కరక్కాయల పెచ్చుల పొడి            ------ 20 gr
తానికాయల పొడి                       ------ 20 gr
ఉసిరి కాయల పొడి                     ------ 20 gr
నల్ల ఉప్పు                               ------ 30 gr

అన్నింటిని కలిపి కల్వం లో వేసి తగినంత నీరు కలిపి ముద్దగా ,నీరు ఇంకి పొయ్యే వరకు నూరాలి.

శనగ గింజలంత మాత్రలు తయారు చేసి తేమ లేకుండా నీడలో ఆరబెట్టాలి.ఒక సంవత్సరం వరకు నిల్వ వుంటాయి.

పిల్లలకు ------------ 1 మాత్ర
పెద్దలకు ------------ 2 మాత్రలు

     వేడినీటితో భోజనానికి ముందు గాని,తరువాత గాని వాడ వచ్చు.


                                           ఉదర శూల (కడుపులో నొప్పి)                                   21-1-09.

ఉదరాకర్షణ ఆసనము :--గొంతు కూర్చొని ఒక మోకాలును పొట్టకు అడుముకోవాలి.రెండవ మోకాలును నేలకు ఆనించాలి .  అదే విధంగా రెండవ వైపు కూడా  చెయ్యాలి.

   ఏదో ఒక తైలాన్ని గాని లేదా నువ్వుల నూనెను గాని గోరువెచ్చగా చేసి బొడ్డుకింద, చుట్టూ ఎడమ నుండి

కుడివైపుకు మర్దన చెయ్యాలి చింత,వేప,జిల్లేడు, వావిలి ఆకులలో ఒకటిగాని లేదా అన్ని ఆకులను గాని నీటిలో వేసి   కాచి నీటిలో గుడ్డను ముంచి పొట్ట మీద కాపడం పెట్టాలి. దీని వలన ఉదరశూల తగ్గుతుంది .

       ఎనిమా డబ్బాలో నీళ్ళు పోసి ఆసనం లో పెట్టాలి.లేదా కొంచం సేపు అటు ఇటు తిరిగితే శుభ్రంగా సుఖవిరేచనము 
 అవుతుంది . .

తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే ఉదరశూల వస్తుంది .


మృదువుగా, గోరువెచ్చగా వున్న ఆహారం తీసుకోవాలి. నిల్వ వున్న ఆహారం తీసుకో కూడదు.

ఆవుపాలు (గేదె)
మంచి నీళ్ళు
కలకండ లేదా పంచదార
నెయ్యి

   అన్ని కలిపి ఉదయం, సాయంత్రం తాగుతూ వుంటే కడుపులో నొప్పి తగ్గుతుంది.


                                       ఉదర రోగాలకు స్వర్ణ పత్రి మాత్రలు                   26-1-09.

సునాముఖి ఆకు పొడి --------50 gr
కరక్కాయ పొడి          --------50 gr
తాని కాయ పొడి         --------50 gr
ఉసిరి కాయ పొడి        --------50 gr
నల్ల ఉప్ప్పు పొడి      -------- తగినంత

    అన్నింటిని ఒక గిన్నెలో పోసి తగినంత నిమ్మరసం పోసి బాగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి గాలి
వెలుతురు తగిలేటట్లుగా నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

పెద్దలకు  ---------2 మాత్రలు
పిల్లలకు --------- 1 మాత్ర

    అజీర్ణము, గ్యాస్, అగ్నిమాంద్యము వంటి అన్ని ఉదర సంబంధ వ్యాధులు 8 రోజులలో నివారింప బడతాయి.


                                          సమస్త ఉదర రోగాల నివారణ                         6-2-09.


యోగాసనం :-- 1 ఉత్తాన పాదాసనం:-- వెల్లకిలా పడుకొని చేతులు చాపి గాలి పీలుస్తూ, వదులుతూ నెమ్మదిగా కాలును పైకి లేపాలి,అదే విధంగా రెండవ వైపుకూడా చెయ్యాలి,తరువాత రెండు కాళ్ళు ఒకే సారి లేపాలి.

2. పవన ముక్తాసనం:-- ఒక మోకాలును రెండు చేతులతో బంధించి మోకాలును గడ్డానికి ఆనించాలి.తలను పైకిలేపాలి.అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి. విధంగా రోజుకు ఐదు సార్లు చేస్తే ఎంత లావు పొట్ట అయినాకరిగి పోతుంది.

3.రెండు మోకాళ్లను రెండు చేతులతో పట్టుకొని పైకి లేస్తూ, పడుకుంటూ వుండాలి.


4. బోర్లా పడుకొని కాలును పైకి లేపాలి,తలను కూడా కొంచం లేపాలి.రెండవ వైపుకూడా చెయ్యాలి మరల రెండు కాళ్ళ తోను చెయ్యాలి. విధంగా ఐదు సార్లు చేస్తే చాలు.

5. భుజంగాసనం 6. యోగాముద్రాసనం

7. పద్మాసనం లేక అర్ధ పద్మాసనం లేక సుఖాసనం లో కూర్చొని రెండు చేతులు పైకెత్తి పైన కలపాలి.తలను  పూర్తిగా కాళ్ళ వరకు వంచాలి.

ఆహారం :--

ఉదయపు భోజనం         ----- 10 గంటల లోపు
రాత్రి భోజనం                ------ 8 గంటల లోపు
మధ్యాహ్నం                ------ అల్పాహారం

              పిల్లలకైతే 3 పూటలా భోజనం

భోంచేసేటపుడు మౌనం పాటించాలి,

చిన్న కరక్కాయలు(కరక పిందెలు)           ---- 100 gr

    ముక్కలు గా నలగగొట్టి చిన్న మంటపై వేయించి దంచి పొడి చెయ్యాలి.

దోరగా వేయించి దంచిన సోంపు గింజలు  ----- 20 gr
మెత్తగా దంచిన ఉప్పు పొడి                  ----- 10 gr

   ఈ మూడు ఒక పాత్రలో వేసి కలపాలి. గాజు సీసాలో భద్రపరచాలి.భోజనం తరువాత 3 చిటికెల పొడిని వేసుకొని నీళ్ళు  తాగాలి.

     దీని వలన అల్సర్, అజీర్ణం, జలోదరం,లావు అన్ని నివారింపబడతాయి.

                                       ఉదరశూల సమస్య --నివారణ                            18-3-09.

                    అన్ని రకాల కడుపు నొప్పులు ఒకే కారణంగా రావు.

       పూర్వ కాలం లో మూడు నెలల కొకసారి విరోచానానిక్ వేసుకోవడం వలన సమస్యలు
ఉండేవి కావు.

పొట్టలోని చెత్తను వెంటనే బయటకు పంపించాలంటే :--

1. నీటిలో ఉప్పు కలిపి త్రాగి పొట్ట మీద సున్నితంగా పైకి, కిందికి, ప్రక్కలకు కదిలించాలి (సీసాను కడిగినట్లు)

(లేదా) బోర్లా పడుకొని వెనక నడుము మీద చేతులను పెట్టుకొని దొర్లాలి. తరువాత వాష్ బేసిన్ దగ్గర కెళ్ళి వంగి ఎడమ చేతితో పొట్టను పట్టుకొని,కుడి చేతి వేళ్ళను నోటిలో పెట్టుకొని వాంతి చేసుకోవాలి.

వారానికి ఒక రోజు పండ్ల రసాల తోనే గడపాలి. దీనినిరసోపాసనం అంటారు.

ప్రతి రోజు తీసుకునే ఆహారం లో జరిగే పొరపాట్లను సమీక్షించు కోవాలి.

అతి భోజనం, అతి వేడి, అతి చల్లని, అతి కఠినమైన ఆహారం భుజించ రాదు.

ప్రతి రోజు ఒక నిమ్మ పండు రసం ఏదో ఒక విధంగా శరీరంలోకి తీసుకోవాలి.

ఉసిరికను ఏదో ఒక రూపంలో(మురబ్బా, పచ్చడి, పొడి) తీసుకోవాలి.

ప్రతి రోజు ఒక పచ్చి ఉల్లి గడ్డ ముక్కలు తినాలి.

పాలిష్ తక్కువగా ఉన్నపాత బియ్యాన్ని వాడాలి.

ఉదయపు భోజనం లో మజ్జిగ, రాత్రి భోజనం లో పాలు వుండాలి

మాంసాహారం భుజించ రాదు.

భోజనపు వేళను అతిక్రమించా రాదు.

నెలకొకసారి లేదా రెండు నెలలకొకసారి విరేచానానికి వేసుకోవాలి.

విరేచనానికి :---

అల్లం రసం           ----- రెండు టీ స్పూన్లు
     తేనె               ----- రెండు టీ స్పూన్లు
ఆముదం             ----- నాలుగు టీ స్పూన్లు .

    ఒక గిన్నెలో అన్నింటిని వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు వచ్చేంత వరకు
కాచి తాగాలి.    ఇది పెద్దలకు ఇవ్వవలసిన మోతాదు, పిల్లలకు మోతాదును తగ్గించాలి.

                          ఉదర సంబంధ వ్యాధులకు సాంబారు పొడి                   18-3-09.

పొంగించిన ఇంగువ పొడి        ---- 100 gr
దో. వే మిరియాల పొడి         ---- 100 gr
శొంటి పొడి                         ---- 100 gr
జిలకర పొడి                       ---- 100 gr
వాము పొడి                        ---- 100 gr

     అన్ని పొడులను కలిపి జల్లించి బాగా కలిపి సీసాలో భద్ర పరచు కోవాలి.

  దీనిని ఆహారంలో వాడుకుంటూ వుంటే ఉదరసంబంధ వ్యాధులు నివారింప బడతాయి.

             (1.) వాతము వలన ఉదర సంబంధ సమస్య -- నివారణ             19-3-09.

     అతిగా మాట్లాడడం, అతిగా తీరిక లేకుండా పనిచెయ్యడం, అతి సంభోగం, ఒకదానికొకటి
గిట్టని ఆహారపదార్ధాలను అనగా ఉదాహరణకు ఫ్రిజ్ లోని అతి చల్లని నీటిని తాగి వెంటనే వేడిగా వున్నటీ తాగడం వంటివిపనికి రావు.

1. పవనముక్తాసనం 2. విపరీత పవన ముక్తాసనం

యోగాసనాల వలన శరీరం లోని వాతం తగ్గుతుంది. మందులు కూడా అవసరం లేదు.

3. అర్ధ చంద్రాసనం

అరగని పదార్ధాలను తినకూడదు. ఆసనాలను, వ్యాయామాలను అతిగా చేయకూడదు.

ఆహారం:__

1. గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగాలి.

2. పొట్టలో నొప్పి తిరుగుతూ వుంటే చారెడు నువ్వులు తీసుకొని నీటి తో నూరి ఉడికించి నూలుబట్ట లో వేసి     పొట్ట మీద కాపడం పెట్టాలి. దీని వలన నొప్పి వెంటనే తగ్గుతుంది.

ఇంగువ                     -----5 gr
సైంధవ లవణం          ----- 5 gr
నువ్వుల నూనె          -----5 gr

   అన్నింటిని కలిపి ఆవు మూత్రం తో మెత్తగా గంధం లాగా నూరి గోరు వెచ్చగా చేసి బొడ్డు లోపల, బయటపట్టు వేస్తే పట్టు ఆరే లోపల తగ్గుతుంది.

                                (2). ఉదరములో పైత్య శూల --నివారణ                  20-3-09.

    ఈ వ్యాధి ఎక్కువగా పుట్టుకతోనే పైత్య శరీరం తో పుట్టిన వాళ్లకు ఎక్కువగా వస్తుంది. వీరికి
కోపం ఎక్కువగా వుంటుంది. అతి దాహం, అతి వేడి పదార్ధాలను ఎక్కువగా సేవించడం వలన ఉదరములో పైత్య రసము ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

1. పలుచని గుడ్డను తడిపి పొట్ట చుట్టూ చుట్టాలి. దాని మీద పొడిగా వున్న పలుచని గుడ్డను చుట్టాలి.దాని మీద మందంగా వున్న గుడ్డను కప్పాలి. ఒక గంట సేపు అలాగే ఉంచితే వెంటనే తగ్గి పోతుంది.

2. చంద్ర భేదన ప్రాణాయామం:-- కుడి ముక్కుతో గాలిని చాలా నెమ్మదిగా పీల్చి బంధించి ఎడమ రంధ్రంగుండా నెమ్మదిగా వదలాలి. అదే విధంగా రెండు వైపులా 12,18,24 సార్లు చెయ్యాలి.

గుర్తించడం :-- అతి వేడి వలన పొట్ట బిగుసుకు పోయినపుడు నాలుక పిడచ కట్టుకు పోవడం, శరీరం అతి వేడిగా ఉండడం,శోష, తాపం, కళ్ళు ఎర్రంబడడం వంటి లక్షణాలుంటాయి.

ఆహారం:-- ఇది కేవలం ఉదరశూల కే కాదు వేడికి కూడా అన్వయించు కోవచ్చు.
మూత్రంలో, మలం లో రక్తం పడడం శరీరం నల్లగా మారి పోవడం

శతావరి వేర్ల పొడి లేదా పచ్చి వేర్ల రసం    --- ఒక కప్పు
తేనె లేక కలకండ                                  --- అర స్పూను.

     ఈ రెండింటిని కలుపుకొని తాగితే అతి పైత్యం, అతి ఉష్ణం నివారింప బడతాయి.

                           (3.) కఫజ ఉదర శూల-- నివారణ                                    21-3-09.

కారణాలు :-- ఫ్రిజ్ లోని పదార్ధాలు ఎక్కువగా వాడడం వలన వచ్చే అవకాశం కలదు.

యోగాసనం :--గోరు వెచ్చని నువ్వుల నూనె తో పొట్ట మీద బాగా మర్దన చెయ్యాలి. వేడి నీటిలో పసుపు వేసి  గుడ్డను ముంచి పొట్ట మీద కాపడం పెట్టాలి.

కఫ ప్రభావాన్ని తగ్గించే వేడి పానీయాలు తీసుకోవాలి. బియ్యపు లేదా సజ్జల జావ, ఉలవ కట్టు వాడాలి.

బార్లీ చాలా మంచిది.

    కఫము వలన మలము కూడా బంధించ బడుతుంది. ఎనిమా చేసుకోవాలి. ఉప్పు నీటి వాంతి చేసుకోవాలి.

1. ప్రాణాయామం 2. సూర్య భేదన ప్రాణాయామం 12,18,24 సార్లు చొప్పున రోజుకు ఒకటి రెండు సార్లు చెయ్యాలి.

ఆహారం:-- కఫము వలన అన్నం తినాలంటే ఓకరింపు, నోట్లో నీళ్ళు ఊరడం, పొట్ట బరువుగా గట్టిగా వుంటుంది.

నాలుకకు రుచి తెలియదు.

సైంధవ లవణం                 ----- 50 gr
కరక్కాయ బెరడు             ----- 50 gr
శొంటి                             ----- 50 gr
వాము                            ----- 50 gr
పిప్పలి కట్టే                      ----- 50 gr

              సైంధవ లవణం తప్ప మిగిలిన వాటిని  దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి.
గాజు సీసాలో నిల్వవుంచుకోవాలి.

పిల్లలకు             ----అర టీ స్పూను లేదా రెండు గ్రాములు
పెద్దలకు            ---- ఒక టీ స్పూను లేదా ఐదు గ్రాములు

గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.

ఇది ఆకలిని పుట్టిస్తుంది కఫాన్ని కరిగించి మలమును జారీ చేస్తుంది. రుచిని తెలియ జేస్తుంది.

              (4). వాత, పిత్త, కఫ, అన్ని దోషాలు  కలిసి ప్రకోపించడం వలన వచ్చే సన్నిపాత ఉదరశూల
                                                        24-3-09.

ఇది చాలా ప్రమాదకరమైనది.

అతి కారం, అతి పులుపు, అతి ఉష్ణం. అతి మైధునం, అతి ప్రేలాపన వలన ఇది వస్తుంది.

1. లఘుశంక ప్రక్షాళనం :-- Treatment రేపు ప్రారంభిస్తామనగా ముందు రోజు చాలా తేలికైన ఆహారం తీసుకోవాలి.

నీళ్ళలో ఉప్పు కలుపుకొని ఒక్కొక్క చుక్క తాగాలి. లేచి అటు ఇటు తిరగాలి లేదా తేలిక పాటి వ్యాయామం  చెయ్యాలి.

   వజ్రాసనం లో కూర్చొని కుడి మోకాలును వంచి ఎడమ పాదానికి తాకించి ముఖాన్ని ఎడమ వైపుకు తిప్పి చూడాలి.అదే విధంగా రెండావ వైపు కూడా చెయ్యాలి.

ఆహారం:-- మితముగా ఎవరికీ ఏది తినాలనిపిస్తే అటువంటి ఆహారం తీసుకోవాలి.

వాము                      ---- 100 gr
శొంటి                       ---- 100 gr .
సైంధవ లవణం             ---- 60 gr
నిమ్మ రసం                ---- తగినంత

     అన్ని పొడులను బాగా కలిపి గాజు సీసాలో పోసి పొడి అంతా మునిగే వరకు నిమ్మ రసం
పోసి ఎండలో పెట్టాలి.

   అది మెత్తబడి హల్వా లాగా తయారవుతుంది.

       ఉదయం, సాయంత్రం 10 గ్రాముల చొప్పున తినడం వలన ఎటువంటి ఉదరశూల అయినా నివారింపబడుతుంది.

                 ( 5. ) ఉదరం లోఆమం  చేరడం వలన వచ్చే ఆమశూల --నివారణ           25-3-09.

ఆమ = కుళ్ళిన లేక మురిగిన

అధికంగా తినడం, ఎక్కువగా నీళ్ళు తాగడం, వేళ గాని వేళ లో తినడం వలన తట్టుకొనే శూల వస్తుంది.

యోగాసనం:__ 1. ఉడ్యానబంధం 2. అర్ధ మత్స్యేంద్రాసనం 3. యోగ ముద్రాసనం

యోగ పద్మాసనం :-- పూర్తి పద్మాసనం వేసుకొని రెండు చేతులను వెనక్కి పెట్టి నడుము మీద కలిపి తలనుపూర్తిగా కిందకు వంచాలి.

4. కపాలభాతి ప్రాణాయామం :-- వీటి వలన ఉదరములో గడ్డ కట్టిన మలము, విషపదార్ధాలు కరిగి బయటకు వస్తాయి. తరువాత ఎనిమా తీసుకొని కొంతసేపు అటు ఇటు నడవాలి.

వ్యాధిని గుర్తించడం:-- ఆమ శూల ఏర్పడినపుడు కడుపులో గుడగుడ శబ్దం, నోట్లో నీళ్ళు ఊరడం, అరుచి  మొదలైన లక్షణాలుంటాయి.

ఆహారం:-- వంటాముదం            ---- 10 gr
వెల్లుల్లి రసం                            ---- 10 gr
సైంధవ లవణం                           ---- 5 gr
మేలైన ఇంగువ పొంగించిన పొడి        -- 2 gr

   అన్నింటిని కలిపి రెండు భాగాలు చేసి ఉదయం,సాయంత్రం సేవించాలి. విధంగా చేస్తే వ్యాధి నివారించబడుతుంది.

( 6.) ఉదరంలో పరిణామ శూల                             26-3-09.

        ఉదరంలో ఆహారం జీర్ణమయ్యేటపుడు జరిగే మార్పుల వలన వచ్చే కడుపు నొప్పిని
పరిణామ శూల అంటారు. అనగా ఆహారం దాతువుగా మారేటపుడు కలిగే నొప్పి అంటే అన్నం తిన్న వెంటనే నొప్పి రావడం.

ఒక లీటరు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి నిదానంగా తాగాలి. కొంత సేపైన తరువాత నోట్లో వేళ్ళు పెట్టుకొని వాంతి చేసుకోవాలి.

         వజ్రాసనం లో కూర్చొని చక్ర స్థానం లో ధ్యానం పెట్టాలి ( బొడ్డుకు మర్మ స్థానానికి మధ్య పొత్తికడుపు )

15 నిమిషాలు కూర్చోవాలి.

 గొంతులో నుండి కఫం కిందికి జారి ఉదరం లోకి ప్రవేశించినపుడు, జీర్ణ క్రియలో మార్పులు జరిగే టపుడు నొప్పి వస్తుంది. నొప్పి ఎక్కువగా ఆహార నాళము, గొంతు, పొట్ట, గజ్జల్లో ఎక్కడైనా రావచ్చు.

శొంటి               --- 10 gr
నువ్వులు         --- 10 gr
పాత బెల్లం        --- 10 gr

        అన్నింటిని నలగగొట్టి అర గ్లాసు పాలల్లో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి దించి వడపోసి
గోరు వెచ్చగా తాగాలి.

    ఈ నొప్పి వున్న వాళ్లకు బలవంతంగా ఆహారం ఇవ్వ కూడదు. సమయంలో మాంసాహారం భుజించకూడదు.

 సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే సకాలంలో భుజించాలి.

                        ఉదరసమస్యలు తగ్గడానికి స్వర్ణ పత్రి మాత్రలు                        30-3-09.

సునాముఖి ఆకు పొడి                ------ 60 gr
కరక్కాయల పెచ్చుల పొడి          ------ 20 gr
తాని కాయల పొడి                     ------ 20 gr
ఉసిరికాయల పొడి                     ------ 20 gr
నల్ల ఉప్ప్పు                            ------ 30 gr

          అన్నింటిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజలంత
మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టాలి. పూర్తిగా తేమ లేకుండా ఆరిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు వీటిని భోజనం తరువాత ఒకటి వేసుకుంటే ఉదర సమస్యలన్నీ నివారింప బడతాయి.

                                    ఉదరశూల అసలు రాకుండా ఉండాలంటే                   31-3-09.

ఆహారపు నియమాలు పాటించాలి.

మోకాళ్ళపై కూర్చొని పొట్టను లోపలి పీల్చాలి.

"ఆహారాన్ని ఔషధంగా వాడుకునే వాళ్ళు ఆరోగ్యంగా వుంటారు."

కాకరకాయ, బీర, పొట్ల, మునగకాయ, మునగాకు ఆరోగ్యకరమైనవి.

         గోమూత్రాన్ని ఏడు సార్లు వడపోసి ప్రతి రోజు ఒక ఔన్సు తీసుకుంటూ వుంటే ఎటువంటి
వ్యాధులు రావు.

పధ్యం:- గోరువెచ్చని పదార్ధాలను తినవలెను. అతి చేదు, ,అతి చల్లని పదార్ధాలను తినకూడదు. అతి వ్యాయామం చేయకూడదు. పెరుగు వాడకూడదు.

                  వీటి వలన లావుగా ఉన్న పొట్ట, కడుపులో నొప్పి తగ్గుతాయి.

               వర్షాకాలంలో వచ్చే ఉదరసంబంధ సమస్యలు --- నివారణ                   3-7-09.

కాలంలో వాత, పిత్త, కఫసమస్యలు ప్రకోపిస్తాయి.

      వర్షాకాలానికి ముందున్న వేసవిలో సాధారణంగా ఉదరంలో అజీర్ణం, అగ్ని మాంద్యం ఏర్పడి వుంటాయి. మొదట  వాటిని తొలగించుకోవాలి.

  వమన భాతి లేదా గజకర్ణి:-- ఒక లీటరు నీటిలో మూడు వేళ్ళతో వచ్చినంత ఉప్పును కలపాలి .
నీటిని   తాగాలి. తరువాత వాంతి చేసుకోవాలి. ఎక్కువ బి,పి వున్న వాళ్ళు చెయ్యకూడదు.

సమస్య తక్కువ వున్న వాళ్ళు వారానికి ఒకసారి చేస్తే చాలు.

1. మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళను వెనక్కు పెట్టుకొని మోచేతులను మోకాళ్ళపై పెట్టుకొని పొట్టను లోనికి  పోనివ్వాలి.

2. వెల్లకిలా పడుకొని ఒకేసారి కాళ్ళను పైకి లేపాలి. చేతులను పైకి వెనక్కు పెట్టాలి. అలాగే పడుకొని కాళ్ళను    దూరం చేస్తూ, దగ్గర చేస్తూ కదిలించాలి, సైకిల్ తొక్కినట్లు కదిలించాలి.

ఆహారనియమాలు:-- పొట్ట ఉబ్బరంగా వుంటే పొట్టకు విశ్రాంతినివ్వాలి. ద్రవపదార్ధాలు లేక మెత్తనిఅరటిపండు తీసుకోవాలి.

గోధుమ పిండి      --పావుకిలో
వంటాముదం      -- 50 gr
నెయ్యి              -- ఒకటి లేక రెండు స్పూన్లు

  అన్నింటిని కలిపి రొట్టెలాగా చేసుకొని నిప్పుల మీద గాని లేదా మట్టి మూకుడు లో గాని కాల్చి చక్కెర  అద్దుకొని తినాలి. నేతితో కూడా కాల్చవచ్చు.

                                   జలోదర సమస్య --- నివారణ                                 5-8-09.

              శరీరంలోని నీరు పొట్టలో నిండి పోవడాన్ని జలోదర సమస్య అంటారు.

1. రోగి ఎర్ర రంగు కాగితాన్ని ( బుల్బులకు చుట్టే కాగితం) పొట్టపై కప్పుకొని ఎండలో వెల్లికిలా పడుకోవాలి. దీని వలన అల్ట్రా ఎర్ర కిరణాలు శరీరంలోని నీటిని లాగేస్తాయి. లేదా లైటు బాగా పొట్ట మీద పడేట్లు చేసి లైటును  ఆర్పుతూ వెలిగిస్తూ వుండాలి.

2. గాజు గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని దానికి ఎర్ర రంగు కాగితాన్ని చుట్టి ఎండలో బెట్టి సాయంత్రం వరకు ఉంచాలి తరువాత నీటిని ఉదయం, సాయంత్రం రెండు భాగాలు చేసుకొని తాగాలి. దీని వలన సమస్య నుండి  త్వరగా బయట పడవచ్చు.

      పొట్ట ఎక్కువగా పెరిగి బాన లాగా వుండి మెరుస్తూ వుంటుంది . ఆకలి మందగిస్తుంది. తెల్లగా
పాండు రోగిలాగాఅవుతారు. రోగికి ముందుగా విరేచనం చేయించాలి. అంటే ఆముదం తాగించాలి.

అల్లం రసం                 ---- రెండు టీ స్పూన్లు
తేనె                           ---- రెండు టీ స్పూన్లు
ఆముదం                   ---- నాలుగు టీ స్పూన్లు

      అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి మూఫు పొంగులు పొంగించి తెల్లవారు జామున తాగాలి.

                            తులసి తో ఉదరసంబంధ వ్యాధుల నివారణ                           3-3-10.

1. పద్మాసనంలో కూర్చొని చేతులను ముడుచుకొని పిడికిళ్ళు బిగించి పొట్టలో పెట్టుకొని తలను కిందికి ఆనించాలి  .గాలి వదిలి కిందికి వంగాలి. పైకి లేచే టపుడు పీల్చాలి.

2.ఉడ్యానబంధం: -- మోకాళ్ళ మీద కూర్చొని అరచేతులను తొడలపై ఆనించి పొట్టను లోపలి లాక్కోవాలి. పొట్టమీద ఉత్తరేణి తైలంతో బాగా మర్దన చేసి తరువాత ఉడ్యానబంధం చెయ్యవచ్చు.

3. ఉదరచాలనం 4. కపాలభాతి 5. అర్ధచంద్రాసనం

పొట్టలో నొప్పి, కుట్టు, ఉన్నప్పుడు,అన్నం తినకూడదు. పలుచని గంజి తాగాలి. ఒకసారి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే వరకు మరలా ఆహరం తీసుకో కూడదు.

4. తులసి గింజల లేదా ఆకుల పొడి   --- 50 gr
శొంటి పొడి                                    --- 50 gr
పాత బెల్లం                                    --- 50 gr

                 అన్నింటిని కలిపి నూరి సీసాలో నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు పిల్లలకు బటాణి గింజంత, పెద్దలకు కుంకుడు గింజంత మాత్రలు సేవిస్తే ఉదర సంబంధ వ్యాధులు  నివారింప బడతాయి.

                                 కడుపు నొప్పి---నివారణ                            3-5-10.

కరక్కాయ పొడి                 ---- 50 gr
శొంటి పొడి                       ---- 50 gr
వాము పొడి                      ---- 50 gr
సైంధవ లవణం                  ---- 25 gr

       అన్నింటిని దోరగా వేయించి దంచి, జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి.

అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. లేదా చూర్ణాన్ని అన్నంయొక్క తొలి ముద్దలో కలుపుకొని అయినా తినవచ్చు. దీని వలన కడుపులో నొప్పి వెంటనే తగ్గుతుంది.

                         ఉదరసంబంధ సమస్యలు-- నివారణ                             18-7-10.

     ఆముదపు ఆకులను తెచ్చి కడిగి దంచి రసం తీయాలిదానికి సమానంగా నువ్వులనూనెను కలపాలి. రెండింటిని ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి రసం ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత వడపోసి సీసాలో భద్ర పరచుకోవాలి.

     పిల్లలకు, పెద్దలకు సమస్య వచ్చినపుడు తైలం తో పొట్ట మీద మర్దన చెయ్యాలి.

      కడుపులో పురుగులు చేరినపుడు పిల్లలు సరిగా ఎదగరు. ఆముదపు ఆకును తెచ్చి నలిపి రసాన్ని  గుదము చుట్టూ రుద్దితే పురుగులు బయటకు వస్తాయి.


                           కడుపునొప్పి, మలబద్ధక నివారణకు                      18-11-10.

ఆకు పచ్చని ధనియాలు
శొంటి
మారేడుపండు గుజ్జు

     అన్నింటిని కలిపి కషాయం కాచి తాగాలి.

                               కడుపుబ్బరం, ,త్రేన్పులు -- నివారణ                     8-12-10.

కరివేపాకు
శొంటి
మిరియాలు

కరివేపాకును కడిగి నీడలో ఆరబెట్టాలి. పొడి దంచాలి.

  అన్ని పొడులను సమాన భాగాలుగా తీసుకోవాలి. కలిపి వస్త్ర ఘాలితం పట్టి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను నిండుగా పొడిని తీసుకొని అన్నంలో కలుపుకొని తినాలి.

కడుపు నొప్పి నివారణకు

కరివేపాకు
మిరియాలు

    రెండింటిని సమాన భాగాలు గా తీసుకొని పొడి చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని ఆవు నెయ్యిలో ఉడికించి    ఒక స్పూను పొడిని నేరుగా గాని అన్నం లో కలుపుకొని గాని తీసుకోవాలి.

కరివేపాకును ముద్దగా నూరి మజ్జిగలో కలుపుకొని తాగితే కడుపులో నొప్పి తగ్గుతుంది.

                                    కడుపు నొప్పి నివారణకు                              9-12-10.

        చిటికెడు ఇంగువను ఒక టీ స్పూను ఆముదంలో వేసి వేడి చేసి పేస్ట్ మాదిరిగా కలపాలి.
దీనిని కడుపులోకి  తీసుకోవాలి. నొప్పి తగ్గిపోతుంది. చిన్న పిల్లలకైతే దీనిని బొద్దు చుట్టూ లేపనం చేయాలి. లోపలి ఇవ్వ కూడదు.

2. ఇంగువ --- పావు టీ స్పూను
      నెయ్యి --- అర టీ స్పూను

రెండింటిని మజ్జిగలో కలిపి తాగితే పొట్టలో నొప్పి తగ్గుతుంది.

               ఉదర సంబంధ వ్యాధుల నివారణకు వైశ్వానర చూర్ణము                    17-7-10.

సైంధవ లవణం                    ---- 50 gr
వాము                               ---- 50 gr
అజామోదం                        ---- 50 gr
శొంటి                                ---- 50 gr
పిప్పళ్ళు                           ---- 50 gr
కరక్కాయ పెచ్చులు           ---- 500 gr

         అన్నింటిని విడివిడిగా ఎండబెట్టి దంచి, జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి.

      రాత్రి భోజనం తరువాత ఒకటి లేక రెండు టీ స్పూన్ల పొడిన నోట్లో వేసుకుని నీళ్ళు తాగాలి.
దీని వలన ఉదయానికి సుఖ విరేచనమవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ఎసిడిటి తగ్గుతుంది. పొట్టలో పేరుకుపోయిన మలము బయటకు నెట్ట బడుతుంది.

                           జీర్ణ సమస్యల నివారణకు చిట్కా                            12-10-10.

   జామ పండు రసంలో వామును వేసి నానబెట్టాలి, తరువాత ఎండబెట్టాలి. ఈ విధంగా ఏడు సార్లు చేయాలి. తరువాత పూర్తిగా ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

   ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని సేవిస్తూ వుంటే అజీర్ణ సమస్యలు నివారింప బడి ఉదర.శుద్ధి జరుగుతుంది.


                         కడుపు పట్టేయ్యడం --ఉదా వర్ద రోగము --నివారణ       23-11-10.

వాయువులను వదలక పోవడం వలన వ్యాధి వస్తుంది.

నోటి ద్వారా గాని, గుదము ద్వారా గాని వాయువులు విసర్జింప బడక పోవడం వలనవ్యాధి
వస్తుంది.  దీనిని  ఉదావర్ద్జ రోగము అంటారు

లక్షణాలు :-- కడుపులో పట్టేసినట్లు వుండడం, గుండె పట్టినట్లుగా వుండడం, ఊపిరి ఆడనట్లుగా వుండడంఉన్నట్లుంది పొట్టలో జరిగినట్లుగా వుండడం వంటి లక్షణాలు వ్యాధిలో వుంటాయి. వంగితే, లేస్తే, నొప్పిరావడం , గాలి పీల్చాలంటే, వదలాలంటే నొప్పిగా వుండడం వుంటుంది.

" ఆవలింత, దగ్గు, తుమ్ము, అపాన వాయువు లను బంధించ కూడదు

వ్యాధి ఎక్కువగా అజీర్ణ సమస్యల వలన వస్తుంది.

వమనము, విరేచనం కర్మలను వైద్యుల పర్యవేక్షణలో చేయించాలి.

మంగకాయల పెచ్చులు                -- 100 gr
దోరగా వేయించిన పిప్పళ్ళు            -- 50 gr
చెంగల్వ కోష్టు                               -- 50 gr
తెల్ల ఆవాలు                                 -- 25 gr
బెల్లం                                        --- 200 gr

        అన్నింటిని మెత్తటి చూర్ణాలు చేసి కల్వంలో వేసి బెల్లం కలిపి మెత్తగా నూరాలి. అవసరమైతే
పాలు కలపాలి

రెండు అంగుళాల పొడవుతో ఒత్తులు లాగా చేసి ఆరబెట్టి బాగా ఎండిన తరువాత వాడాలి.
దీనిఒక క్యారట్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి జిలకరలో ముంచి తింటే నొప్పి తగ్గుతుంది.
కాలేయము, గుండె, మూత్రాశాయము, మూత్ర పిండాలు మొదలైన అవయవాలలో సమస్యలున్నపుడు పొట్ట పెరగడం జరుగుతుంది.
సమస్య నివారణకు జలోదిరాదిరస వాడుకోవాలి.

1. వెంపలి సమూలముగా తెచ్చి దంచి నిల్వచేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసు కషాయానికి రానివ్వాలి. దీనిని ఉదయంసాయంత్రం తాగాలి.

2. వెంపలి మొక్కను సమూలముగా తెచ్చి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి వుంచుకోవాలి. ఒక కుండలో నీళ్ళు పోసి దానిలో బూడిదను వెయ్యాలి. కుండను కదిలించకుండా ఉంచాలి. కొంత సేపైనా తరువాత పై నీటిని వంచేసి పేరుకున్న బూడిద నీటిని తాగాలి.

4. వర్ధమాన పిప్పలి యోగాన్ని ఆచరించాలి.

జీర్ణ శక్తికి చిత్ర మూలం వేర్ల పొడిని వాడాలి.

               విరేచానానికి త్రిఫల చూర్ణం గాని, సునాముఖి చూర్ణం గాని, వాడి విరేచనం సక్రమంగా
ఉండేట్లు చూసుకోవాలి.
 .
                                      కడుపులో గడ్డలు                                   5-2-11.

ఇంగువ          --- 20 gr ( నేతిలో పొంగించాలి )
పిప్పళ్ళు        --- 20 gr ( ఒక రోజంతా నిమ్మ రసం లో నానబెట్టి మరుసటి రోజు నుండి

        బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి.)

ముసాంబరం                    ---- 20 gr ( కలబంద రసాన్ని ఎండబెడితే వస్తుంది)
పటికబెల్లం లేదా తాటి బెల్లం -- 20 gr

     అన్నింటిని కలిపి కల్వంలో వేసి బాగా నూరి పెసర గింజంత మాత్రలు చేయాలి. బాగా ఆరిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి.

                                           కడుపులో నొప్పి                                                   18-3-11.
  
               దోరగా వేయించిన వాము పొడి           --- 5 gr
                                  నల్ల ఉప్పు పొడి           --- 2 gr

          రెండింటిని కలిపి వేసుకుని  నీళ్ళు తాగితే నొప్పి తగ్గుతుంది.

                           కడుపులో గ్యాస్ నివారణకు ---ఉదర  మిత్ర                               2-4-11.

         గ్యాస్  వలన తీవ్రమైన కడుపునొప్పి  వస్తుంది. ఇది పొట్టంతా వ్యాపిస్తూ కదులుతుంది.
  దీని వలన      కదులుతుంది.  ఇది  గ్యాస్ ను గుర్తించడం లో   అతి ముఖ్యమైనది .
  కారణాలు :-- నోరు ఎక్కువగా  తెరిచి ఆహారం తినడం,  మాట్లాడేటపుడు గాలిని మింగడం,వంటి
 వాటి వలన ఈ సమస్య వస్తుంది.  దీని వలన వాంతులు,  వికారం వంటి లక్షణాలు కూడా
  వుంటాయి.
                     వాము స్ఫటికాలు          --- 5 gr (ఒక టీ స్పూను)
                     పచ్చ కర్పూరం            ---10 gr  (లేక) సదాప గింజల తైలం
                     పుదీనా స్ఫటికాలు        --- 5 gr

         ఒక సీసాలో అన్నింటిని వేసి కలిపితే లేక కొంతసేపు అలాగే ఉంచితే ద్రవం లాగా కర్పూర
   తైలం తయారవుతుంది.

         కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడినపుడు ఒక కలకండ ముక్కను తీసుకుని దాని మీద 
 ఒకటి, రెండు చుక్కల కర్పూర తైలం వేసి చప్పరించాలి.వెంటనే గ్యాస్ సమస్య నివారింపబడుతుంది.
 ఈ విధంగా ప్రతి రెండు గంటల కొకసారి చేయాలి.


సూచనలు :--  పొట్టలో ఉబ్బరింపు,  వాంతులు,  వికారాలు మొదలైన సమస్యలు వున్నపుడు
ప్రధమ చికిత్స గా దీనిని వాడవచ్చు.     గాలిని మింగ కూడదు.

 ఆహారాన్ని బాగా నమిలి తినాలి. లేకపోతే గ్యాస్ తయయారవుతుంది.

                           కడుపులో గ్యాస్, ఉబ్బరింపు ---నివారణ                                 6-6-11.

కారణాలు :-- హెవీ ఫుడ్, కొవ్వు పదార్ధాలు చిక్కుళ్ళు, క్యాబేజీ, కూల్ డ్రింక్స్ మొదలైనవి సేవించడం

1. నల్ల నువ్వులు               ---ఒక టీ స్పూను
            నీళ్ళు                 --- ఒక గ్లాసు
 
      నీళ్ళలో  నువ్వులను వేసి సగం గ్లాసు అయ్యే వరకు కాచాలి తరువాత వడకట్టి కొద్దికొద్దిగా
తాగుతూ వుంటే గ్యాస్ నుండి మంచి రిలీఫ్ వుంటుంది . 

2. వెల్లుల్లి పాయలు          ---- రెండు
          పాలు                   ---- ఒక కప్పు

       వెల్లుల్లి పాయలను పాలలో మెత్తగా ఉడికించి వాటిని తీసిభోంచేసిన గంట తరువాత  తినాలి.

3.వాము                        ---- ఒక గ్రాము
  పాత బెల్లం                   ---- ఒక గ్రాము
       ఉప్పు                    ---- చిటికెడు

       అన్నింటిని కలిపి మెత్తగా నూరి అర గ్లాసు తియ్యటి మజ్జిగలో కలుపుకొని తాగాలి .

                                      కడుపులో తిప్పటం ---నివారణ                                   12-6-11.

కారణాలు :-- లివర్ సరిగా పనిచెయ్యక పోవడం

1. ఒక కప్పు పాలలో ఒక టీ స్పూను కలకండ,  అర టీ స్పూను నెయ్యి కలుపుకొని తాగాలి.

2.  అల్లం రసం               ---- ఒక టీ స్పూను
           తేనె                  ---- ఒక టీ స్పూను

     రెండింటిని కలిపి ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకోవాలి.

3. గోరువెచ్చని నీళ్ళు తాగాలి.

4. గోరువెచ్చని పాలు తాగాలి.

5. అర్ధ శక్తి వ్యాయామం చేయాలి.

                                     పొట్టలోని మలిన పదార్ధాలను తొలగించడానికి
                                                            సదారోగ్య గుటికలు                                 13-6-11.

సునాముఖి ఆకుల చూర్ణం                       ---50 gr
చింతపండు గుజ్జు                                   ---50 gr
సైంధవ లవణం                                      ---25 gr

      అన్నింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి బాగా ఆరబెట్టాలి.
తేమ లేకుండా బాగా ఆరి గట్టిపడిన తరువాత నిల్వ చేసుకోవాలి.

పెద్దలకు                         --- రెండు మాత్రలు
చిన్న పిల్లలకు                --- ఒక మాత్ర

      మలబద్ధకం వున్నవాళ్ళు 3 మాత్రలు వాడవచ్చు.
      ఇంట్లో అందరూ వాడవచ్చు.

                                           కడుపు నొప్పి ------ నివారణ                       23-6-11.
కారణాలు :---
      ఆపిల్ , సోయాచిక్కుడు , ఉల్లిపాయ , సెనగపిండి వంటి పదార్ధాలను తినడం వలన
      పిల్లలు సబ్బులు చాక్పీసులు ,  మట్టి వంటివి తినడం వలన 
      విషపదార్ధాలను తినడం వలన   వచ్చే అవకాశం కలదు

     24 గంటల కద్పులో నొప్పి, కిద్నీలలో ఇన్ఫెక్షన్ వలనవలన , ఆడపిల్లలో  ఒవరీస్ ట్విస్ట్ అయినపుడు
కడుపులో నొప్పి వచ్చే అవకాశం కలదు .
     
     కానీ ముఖ్యమైన కారణం అజీర్ణం .

 వాము            ---- ఒక టీ స్పూను
 నీళ్ళు             ---- అరగ్లాసు

     రెండింటిని కలిపి మరిగించి వడపోసి చిటికెడు ఉప్పు కలిపి మూడు పూటలా తాగాలి .
  ఈ విధంగా రెండు మూడు రోజులు చేస్తే  తగ్గుతుంది .

ఆవాలు            ----ఒక టీ స్పూను
వేడి నీళ్ళు        ---- ఒక కప్పు

  రెండింటిని కలిపి నమలకుండా నీళ్ళతో సహా తాగాలి .
  దీనితో నొప్పి తగ్గుతుంది .

                              పొట్ట ఉబ్బరింపు ---గ్యాస్ సమస్య ---నివారణ ---కిస్మిస్ చట్ని            18-7-11

కిస్మిస్ పండ్లు              ---- 30 gr
సోంపు గింజల పొడి       ---- 10 gr
మిరియాల పొడి          ---- 10
సైంధవ లవణం            ---- అర టీ స్పూను  నుండి ముప్పావు స్పూను
అల్లం రసం                 ---- రెండు టీ స్పూన్లు
నీళ్ళు                       ---- నాలుగైదు టీ స్పూన్లు
       
        అన్నింటిని కలిపి మెత్తగా ముద్దగా నూరాలి
        దీనిని అన్నం లో కలుపుకొని తినవచ్చు  లేదా రొట్టెతో గాని తినవచ్చు  లేదా దేనిలో కలపకుండా  అలాగే చప్పరించి
తినవచ్చును .

        దీనిని పిల్లలకు ,  పెద్దలకు ఉబ్బరింపు ఏర్పడినపుడు వాడితే బాగా నివారింపబడుతుంది .

                                                 ఉదారశూల  సంహారిణి                                8-8-11.
కరక్కాయ పొడి             ----  5 gr
నెయ్యి                        ----  5 gr
బెల్లం                         ---- 10 gr

      అన్నింటిని కలిపి పిసికి బుగ్గన పెట్టుకొని  చప్పరిస్తూ వుండాలి .
      ఈ మోతాదు ఒక్క సారికి మాత్రమె .  పిల్లలకైతే దీనిలో సగం మోతాదు వాడాలి . ఈ విధంగా ఉదయం , సాయంత్రం
రెండు పూటలా వాడాలి .

                                                   పొట్ట తగ్గడానికి                                      29-8-11.

లక్షణాలు :--- పొట్ట ఉబ్బరింపు , ఆయాసము  వుంటాయి . థైరాయిడ్ సమస్య వున్నా ఈ సమస్య ఏర్పడుతుంది .
శరీరంలో నీరు చేరడం , పనికి తగిన ఆహారం తీసుకోక పోవడం ,  కొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన  ఈ
పొట్ట  లావెక్కడం అనే సమస్య ఏర్పడుతుంది .

1. వంటాముదం             ---- ఒక టీ స్పూను
        తేనె                     ----   "   "    "
    వేడి పాలు                 ---- అరకప్పు

        రాత్రి పాలలో ఆముదం , తేనె కలిపి తాగడం వలన ఉదయం సుఖ విరేచం అవుతుంది .

2. రేవల్ చిన్ని                            ---- అర టీ స్పూను
   వంట సోడా                              ----   "    "     "
   పల్లేరు కాయల చూర్ణం               ----   "    "     "
   వేడి నీళ్ళు   లేదా పల్చటి మజ్జిగ ---- అర కప్పు

      వేడి నీటిలో గాని లేదా మజ్జిగలో గాని  అన్ని పదార్ధాలను కలిపి తాగాలి .

సూచనలు :--- అర్ధశాక్తిగా వ్యాయామం చేయాలి . ఆహారంలో వేపుడు కూరల వాడకం తగ్గించాలి .


           



  

 






















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి