చొంగ కారడం

          పిల్లలకు, పెద్దలకు తెలియకుండానే చొంగ కారడం                                 22-12-08.

       అధికమైన  కఫ  ప్రభావం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
యోగాభ్యాసము:--  ధ్యాన ముద్ర వేసుకొని 10,12  సార్లు ఓంకారం పలకాలి.స్ఫుటముగా,గంభీరంగా గాలి పీలుస్తూ పలకాలి, తరువాత గాలి వదలాలి .గొంతును బిగించడం,వదలడం చెయ్యాలి.ఉజ్జాయి ప్రాణాయామం చెయ్యాలి.గొంతు గోడలను బిగించి ప్రాణాయామం చెయ్యాలి.కఫం నోట్లోకి వస్తే దాన్ని వుమ్మేయ్యాలి.కొద్దిసేపు మాత్రమే చెయ్యాలి,రెండు పూటలా చెయ్యాలి.
      దంతదావనానికి ముందుగాని,తరువాత గాని రాత్రి ఆహారానికి ముందుగాని,తరువాత గాని నువ్వుల నూనెను నోట్లో పోసుకొనిబాగా  పుక్కిలించాలి. నూనె నోట్లో అన్నివైపులకు తిరిగేటట్లు పుక్కిలించాలి.కొంత సేపటికి నూనె నీరుగా మారుతుంది.దీని వలన నోరు పరిశుభ్రమవుతుంది

 .నిద్రించే ముందు కొద్ది నీటిలో ఒక స్పూను తేనె వేసి కలిపి ఆ నీటితో పుక్కిలించడం కూడా మంచిది.
        శిరస్సులో 231 వ్యాధులు వస్తాయి.
        జువ్వి చెట్టు యొక్క బెరడును తెచ్చి ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. కొన్ని ముక్కలను తీసుకొని ఒక గ్లాసు  నీటిలో వేసి 24 గంటలు నానబెట్టాలి.తరువాత కషాయం కాచి ఒక కప్పుకు రానివ్వాలి.దానిలో కలకండ కలుపుకొని గోరువెచ్చగా అయిన తరువాత నెమ్మదిగా కాఫీ లాగా తాగాలి.

                                                   10-1-11

          ఇది వ్యాధి కాదు,  లాలాజల గ్రంధుల వలన ఏర్పడే సమస్య . 
          
          ముఖ పక్ష వాతం వున్నవాళ్ళకు,  బుద్దిమాంద్యం  వున్నవాళ్ళకు  ఈ సమస్య ఎక్కువగా వుంటుంది.నోటి ద్వారా గాలి పీల్చడం వలన,  నోరు తెరుచుకుని  నిద్ర పోవడం వలన  కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

వెల్లుల్లి                        ----  100 gr
అజామోదం                 ----- 100 gr
వాయువిదంగాలు          -----100 gr
గజ పిప్పళ్ళు              -----   50 gr ( నిమ్మ రసంలో నానబెట్టి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి)
దాల్చిన చెక్క పొడి        ----    50 gr
పిప్పలి కట్టే                 -----   50 gr
ఇంగువ                       ----    50 gr  (నేతిలో వేయించాలి) 
త్రిఫల చూర్ణం              -----   50 gr
ఎందుఖర్జూరం            -----   50 gr
పాతబెల్లం                   -----   తగినంత
              
            అన్నింటిని విడివిడిగా దంచి  జల్లించి చూర్నాలు తయారు చేసి  అన్నింటిని కలిపాలి. దానికి తగినంత  బెల్లం కలిపి బటాని గింజలంత మాత్రలు  తయారు చేసి నీడలో ఆరబెట్టి  బాగా ఎండిన తరువాత నిల్వచేసుకోవాలి.

            ప్రతి రోజు ఆహారానికి ముందు పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం తేనెతో గాని,   నేతితో గాని,  నీటితో గాని సేవించాలి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి