మెడ సంబధిత సమస్యలు --నివారణ


                  మెడలో సమస్యలు ---మన్యస్తంభ వాతము --- నివారణ              30-7-09.

      ఏదైనా తైలాన్ని వేడి చేసి మర్దన చెయ్యాలి. వెన్నుపూస ప్రారంభం నుండి ప్రక్కలకు, కిందికి రెండు బొటన  వేళ్ళతో మధ్య వేళ్ళతో మర్దన చెయ్యాలి. దీని వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

      ఆముదపు ఆకులను తెచ్చి వాటి పైన ఆముదం రాసి వేడి చేసి నొప్పి వున్నచోట ఆ ఆకులను వేసి కట్టు  కడితే వెంటనే నొప్పి తగ్గుతుంది.

           ఆరు అడుగుల పొడవుగల నూలు గుడ్డను నీటిలో ముంచి,పిండి గొంతుకు,మెడకు
ప్రక్క భాగాలకు బాగా తగిలేటట్లు చుట్టాలి. దానిపై ఒక పొడి బట్టచుట్టి,దాని మీద మందమైన బట్టను చుట్టాలి. ఊపిరాడకుండా గట్టిగా చుట్టకూడదు, వదులుగా వుండాలి. దీని వలన వేడి జనించి మెడ సక్రమమైన స్థితికి వస్తుంది.

      భ్రామరి, అనులోమ, విలోమ ప్రానాయామాలను చెయ్యాలి. ఓంకారాన్ని ఉదయం, సాయంత్రం పది పన్నెండు  సార్లు పలకాలి.

      నువ్వులనూనేను రెండు చుక్కల చొప్పున చెవుల్లో, ముక్కుల్లో వేసుకోవాలి. కొంత నూనెను నోట్లో పోసుకొని  మింగాలి. మేడమీద, ప్రక్కలకు రుద్దాలి. నెయ్యిగాని,నూనె గాని మెడ మీద రుద్ద వచ్చు.
కోడిగుడ్డు సోన
సైంధవ లవణం

     రెండింటిని కలిపి నూరి మెడ మీద పట్టు వేస్తే పది నిమిషాలలో బిగుసుకుపోయి పట్టీలాగా అవుతుంది.    త్వరగా నొప్పి తగ్గుతుంది.

                                 బయట వున్నపుడు మెడ నొప్పి వస్తే;--

     అర చేత్తో కణతకు కొద్దిగా పైన తలను కొద్దిగా పక్కకు నెట్టాలి. తల కదలకూడదు. అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి. రెండు చేతుల వేళ్ళను ఒక చేతి వేళ్ళను ఇంకొక చేతి వేళ్ళలో దూర్చి తల వెనక పెట్టుకొని నొక్కాలి. కాని తల కదల కూడదు. అలాగే అరచేతితో నొసటి మీద తల కదలకుండా నొక్కాలి.

     బొటన వేలు, చూపుడు వేలు యొక్క మధ్య భాగంలోని చర్మాన్ని రెండు నిమిషాలు నొక్కాలి.

కృష్ణ తులసి ఆకుల పొడి                ---- అర టీ స్పూను
దోరగా వేయించిన మిరియాల పొడి  ---- అర టీ స్పూను
తేనె                                              -----ఒక టీ స్పూను

    ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. దీని వలన మెడ నొప్పితగ్గడమే కాకుండా అన్ని రకాల నొప్పులు   నివారించ బడతాయి.

అనుభవం:-- 

పిప్ప్పింటాకు రసం
నువ్వుల నూనె

    సమాన భాగాలుగా తీసుకొని నూనె మాత్రమే మిగిలేటట్లు కాచి ఆ నూనెను తలకు పెట్టుకుంటూ వుంటే  శిరోభారం నివారింప బడుతుంది.

                            మెడ చుట్టూ నల్లని మచ్చలు.---నివారణ                    3-4-10.

     పాలు, కలకండ, వేప నూనె ఒక చుక్క కలిపి తాగుతూ, మూడు లేక ఐదు వేప చిగుళ్ళను తీసుకొని పరగడుపున బుగ్గన పెట్టుకొని నెమ్మదిగా నములుతూ రసాన్ని మింగాలి.

                                   మెడనొప్పి -- నివారణ                                       25-9-10.
బార్లీ గింజల పొడి       
యూసఫ్ గోల్
వెనిగర్

    అన్నింటిని కలిపి మెడ మీద పట్టు వేస్తె  మెడ నొప్పి  లో ఉపశమనం కలుగుతుంది.

                                                    






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి