శిరస్సులో కఫం చేరితే --- నివారణ 20-11-08.
వేళ్ళకు కొద్దిగా నువ్వుల నూనె పూసుకొని సున్నితంగా కళ్ళచుట్టు, కనుబోమలపైన, నుదుటి మీద ,బుగ్గలపైన,ముక్కు మీద, ముక్కుకు రెండువైపులా,గడ్డం మీద,దవడలపైన, గొంతు మీద, చేవులపైన నెమ్మదిగా రుద్దాలి.జుట్టు మీద వెంట్రుకల కుదుళ్ళ లోనికి ఇంకిపోయే విధంగా బాగా రుద్దాలి "మర్దనం గుణవర్ధనం "
చాతీ నుండి పైభాగం వరకు కఫం నిల్వ వుండే స్థానం.కఫం ఏ భాగంలో చేరితే ఆ భాగంలో నెమ్ము చేరి ఆ అవయవాలకు వ్యాధి సోకుతుంది. పై విధంగా నువ్వుల నూనె తో మర్దన చెయ్యడం వలన కఫం తొలగించ బడుతుంది.
పార్శ్వపు నొప్పి (అర తల నొప్పి)
అగ్ని ప్రకోపం వలన,రక్తం లో మలినాలు చేరడం వలన, గాస్ సమస్య వలన, అతి వేడి వలన, వస్తుంది తలలో కఫం చేరడం వలన, రుతువులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన,కూడా వస్తుంది. ఎక్కువగా ఆలో చించడం,అతిగా మేల్కొనడం,అతిగా పని చెయ్యడం,అతిగా నిద్రించడం,అతిగా నీరు తాగడం, మొదలైన కారణాల వలన వచ్చే అవకాశాలు ఎక్కువ.
బాగా వేడిగా ఉన్న నీటిలో రెండు స్పూన్ల పసుపు వేసి ఆవిరి పట్టాలి.(Inhalation ) ఆ నీటిలో గుడ్డను ముంచి ,నీటిని పిండి కాపడం పెట్టాలి.
గిట్టని పదార్ధాలను తినకూడదు.కాలుష్య ప్రదేశాలలోనికి వెళ్ళరాదు.
1. నీళ్ళు -----అర లీటరు
కలకండ పొడి ----- 60 gr
రెండింటిని కలిపి ఒక చెంబులో పోసి మూత పెట్టి నిద్రించే ముందు మంచం కింద పెట్టుకోవాలి. ఉదయం ఖచ్చితంగా 5 గంటలకు నిద్ర లేవాలి . లేచిన వెంటనే ఆ నీటిని తాగాలి. ఈ విధంగా వారం రోజులు చేస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
2. కరక్కాయల పెచ్చుల పొడి --------100 gr
తానికాయల పెచ్చుల పొడి -------- 200 gr
ఉసిరికాయల పెచ్చుల పొడి -------- 400 gr
కలకండ పొడి -------- 700 gr
అన్ని కాయల పెచ్చులను విడివిడిగా రెండు చుక్కల నెయ్యి వేసి కొద్దిగా వేయించాలి. అన్నింటిని విడివిడిగాపొడులు దంచి,జల్లించి అన్నింటిని కలిపి, దానికి కలకండ పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి.
దీనిని నిష్పత్తి ప్రకారం తగ్గించుకోవచ్చు .
ఉదయం దంత ధావనం తరువాత పరగడుపున ఈ పొడిని నోట్లో వేసుకొని గోరు వెచ్చని నీటిని తాగాలి.రాత్రి భోజనం తరువాత కూడా వాడవచ్చు.
పెద్దలకు -------- అర టీ స్పూను
పిల్లలకు --------- పావు టీ స్పూను
దీనిని సెల్ ఫోన్ ల వలన వచ్చే తల నొప్పులకు కూడా వాడవచ్చు.
భావనా పూర్వక వ్యాయామం
1. చిరు ముద్రతో వెన్ను పూసను నిటారుగా పెట్టి రెండు ముక్కు రంధ్రాలతో గాలిని బాగా పీల్చి బాగా పూరించాలి ఆ గాలి నొప్పి వైపు చేరుతున్నట్లు భావించాలి. ఎంతసేపు ఆపగాలరో అంతసేపు ఆపాలి.శుద్ధి అవుతున్నట్లు భావించాలి.నొప్పి ఉన్నచోట కేంద్రీకరింపబడినట్లు భావించాలి. ఆ వాయువు రేచక రంధ్రాల ద్వారా పోతుంది
.
.
2. రెండు బొటన వ్రేళ్ళను రెండు కణతలపై నొక్కడం, వదలడం చెయ్యాలి, నొక్కేటపుడు గాలిని పీల్చాలి,వదిలే టపుడు గాలి వదలాలి (గోళ్ళు తీసేయ్యాలి) ఈ విధంగా 60 సార్లు ఆహారానికి ముందు చెయ్యాలి.
రెండు వైపులా నొప్పి వుంటే రెండు వేళ్ళతో రెండు కణతలను నొక్కాలి.(వదుల్తూ,నొక్కుతూ వుండాలి).
తలనొప్పి నివారణ 6-12-08.
నువ్వుల నూనె ---- 200 gr
వసకోమ్ములు --- 20 gr-
సొంటి --- 20 gr
అతిమధురం ---- 20 gr
విడి విడిగా దంచి పొడి చేసి జల్లించాలి. పాత్రను స్టవ్ మీద పెట్టి నువ్వుల నూనెను పొయ్యాలి.
నూనె మరిగే టప్పుడు అన్ని చూర్ణాలను కలపాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద నిదానంగా కలపాలి. 10 నిమిషాలో తయారవుతుంది. జాగ్రత్తగా వడ పోయాలి. గాజు సీసాలో భద్రపరచాలి. వాడేటపుడు వేడి చేసి వాడితే మంచిది. తలనొప్పి ఉన్నప్పుడు పగటి నిద్ర మంచిది కాదు.

ointment
పైన చెప్ప బడిన తైలం 100 గ్రాములు తీసుకోవాలి. తేనె మైనం 100 గ్రాములు తీసుకొని వేడి చేసి వడపోయ్యాలి.
మైనం వేడి చేసేటప్పుడు చాలా చిన్న మంట పెట్టాలి. లేక పోతే మైనం అంటుకుంటుంది. కరిగించిన మైనాన్ని తైలంలో పొయ్యాలి.స్పూన్ తో కలియ బెట్టాలి. గాలికి పెడితే చల్లారి గడ్డ కడుతుంది . తల నొప్పి, మోకాళ్ళ నొప్పులకు ఉపయోగించవచ్చు.
సూర్యావర్తన శిరోవేదన --నివారణ 25-12-08.
సూర్యావర్తన శిరోవేదన --నివారణ 25-12-08.
సూర్య గమనాన్ని బట్టి వచ్చే తలనొప్పి :---
ఈ సమస్య వున్న వాళ్ళు రోజుకు మూడు పూటలా మాడు మీద కొద్దిగా కొబ్బరి నూనె పోసి లోపలి ఇంకి పోయేటట్లు వేళ్ళతో మర్దన చెయ్యాలి.మెల్లగా మాడు మీద తట్టాలి.దీనితోపాటు ఉదయం, సాయంత్రం శీతలిప్రా ణాయామం చెయ్యాలి. తరువాత శుక్ర వజ్రాసనం వెయ్యాలి.
ప్రకృతి విరుద్ధమైన చర్యల వలన వేడి పదార్ధాలు( కోడికూర, కోడిగుడ్డు, ఆవకాయ మొదలైనవి ) తినడం వలన శరీరం లో పైత్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది
నాటు ఆవునెయ్యి 100 గ్రాములు తెచ్చి ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చెయ్యాలి.దానిలో గుప్పెడు సబ్జా ఆకులను వేసి మరిగించాలి.నల్లగా అయిన తరువాత దించి చల్లార్చి వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి.శీతా కాలంలో గడ్డ కడితే వేడి నీటిలో సీసా వుంచితే కరుగుతుంది.
మూడు పూటలా ఆహారానికి ముందు మూడేసి చుక్కల చొప్పున రెండు ముక్కులలో వేసుకొని పీల్చాలి.
ఇది అద్భుతమైన మందు.
ఆహారం లో పాయసం,తీపి పదార్ధాలు,మజ్జిగ వంటి చలువ చేసే పదార్ధాలు ఎక్కువగా వాడుకోవాలి.మజ్జిగలోకొత్తిమీర,ధనియాలపొడి,పుదీనా,జిలకర,అల్లం వేసి ఒక గంట అలాగే వుంచి అప్పుడప్పుడు తాగాలి.అన్నంలో కూడా తినవచ్చు.
శిరోవేదనను అరికట్టడానికి చూర్ణము
వేయించిన కరక్కాయల పొడి ------- 100 gr
" తానికాయల పొడి ------- 100 gr
" ఉసిరి కాయల పొడి ------- 100 gr
కలకండ పొడి ------- 100 gr
అన్ని పొడులను వస్త్రగాయం పట్టి కలకండ పొడిలో కలపి గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించే ముందు అర టీ స్పూను పొడిని వాడాలి.శిరస్సులో వున్న అన్ని అవయవాలు బాగుపడతాయి.40 రోజులలో శిరస్సు మొత్తం ఆరోగ్యవంతమవుతుంది.

10,12 సంవత్సరాల పిల్లలకు 2,3 చిటికెల పొడి ఇవ్వవచ్చు.తల భారంగా వున్నపుడు జిలకరలో
నిమ్మరసం పిండి నొసటి మీద పట్టు వేస్తే శిరో భారం తగ్గుతుంది.తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

తలపోటు ---సమస్య --నివారణ 30-12-08.
శరీరం లో వాతం చేరడం వలన వస్తుంది,సుఖ విరేచనం కాకపోవడం వలన వస్తుంది.అజీర్ణము వలన సమస్త రోగాలు వస్తాయి.
1. అర లీటరు నీటిలో 5 గ్రాముల ఉప్పు (B. P వున్నవాళ్ళు సైంధవ లవణం ) కలుపుకొని త్రాగాలి.ఉదరచాలనం చెయ్యాలి.(పొట్టను ముందుకు, వెనుకకు కదిలించడం ) ఆ నీళ్ళు తాగడం వలన వాంతి రూపములో బయటకు వస్తుంది.
2. ఎనిమా ద్వారా గోరువెచ్చని నీటి పైపును ఆసనంలో పెట్టి ఆ నీటిని పంపించాలి.2,3 నిమిషాల్లో బయటకు వస్తుంది.
3. అల్లం రసం -----2 స్పూన్లు
తేనె ---- 2 స్పూన్లు
ఆముదం ---- 4 స్పూన్లు.
అన్నింటిని స్టవ్ మీద పెట్టి కాచి రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయానికి సుఖ వ్రేచనం .
దీని వలన ఎంత తల నొప్పి వున్నా తగ్గుతుంది.
" వాత,పిత్త, కఫాలలో వాతము బలీయమైనది."
అకాల నిద్ర, ఆకాలములో లేవడం,అకాలభోజనం, ఆకాలములో దామ్ప్త్యములో పాల్గొనడం వంటి వాటి వలన వాతము చేరుతుంది, అగ్ని మాంద్యము , అరుచి ఏర్పడతాయి.
యోగాసనం:-- పద్మాసనం వేసుకోవాలి.రెండు చేతులయొక్క చూపుడు వేలు,బొటన వేలు నొక్కి పట్టుకొని ,చేతులను మోకాళ్ళపై నుంచి , మిగిలిన మూడు వేళ్ళను కిందికి పెట్టాలి. దీనిని వాయు ముద్ర అంటారు.
5 నిమిషాలతో ప్రారంభించి, 30,40 నిమిషాల వరకు చెయ్యాలి.ఒకేసారి 40 నిమిషాలు చెయ్యకూడదు.వెళ్ళు నొప్పి పుడితే వేళ్ళను సరి చేసుకోవాలి. పొట్ట ఖాళీగా ఉన్నపుడే చెయ్యాలి.
1.
దానిమ్మ మొగ్గలు --- 15 gr
కలకండ --- 5 gr
రెండింటిని కల్వంలో వేసి కొన్ని నీటి చుక్కలు చేర్చి ముద్దగా నూరి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని రెండు, మూడు చుక్కలు ముక్కులో వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
2 2,3 టీ స్పూన్ల నీటిలో చిటికెడు శొంటి,కొద్దిగా బెల్లం వేసి కరిగించి,వదపోయాలి. దానిలో దూది ముంచి రెండు ముక్కుల్లో రెండు చుక్కలు వెయ్యాలి.ఒక్క క్షణం చురుక్కుమంటుంది కాని, చాలా త్వరగా నొప్పి తగ్గిపోతుంది.
తలనొప్పి నివారణకు వ్యాయామం 12-2-09.
ప్రాణాయామం:-- వెల్లకిలా పడుకొని గాలిని పూర్తిగా పీల్చి వదలాలి.రెండు కాళ్ళను పైకిలేపాలి. రెండు చేతులతో నడుమును పట్టుకొని ఎత్తాలి.
సర్వాంగాసనం అలవాటైన తరువాత పై ఆసనం వెయ్యాలి. పాదాలను తల వైపుకు ఎంత వంచ గలిగితే అంత వంచాలి. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.
మత్యాసనం:-- పద్మాసనం వేసుకొని వెనకకు పడుకొని తలను వెనక్కు వంచాలి. మెడ కింద ఖాళి వుండాలి. చేతులతో పాదాలను పట్టుకోవాలి.దీనితో ఎటువంటి తల నొప్పి రాదు.మెడ జబ్బులున్న వాళ్ళు చెయ్య కూడదు.
భ్రామరి ప్రాణాయామం చెయ్యాలి.,ఐదారుసార్లు చెయ్యాలి
తలనొప్పి రావడానికి కారణాలు-, తీసుకోవలసిన జాగ్రత్తలు:--
1. అతిగా నీరు త్రాగడం వలన నీరు జతరాగ్నిని చల్లబరుస్తుంది. దీని వలన వాత, పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి.
2. చల్లనిగాలి,దుమ్ము,ధూళి, పొగలో తిరగడం మంచిది కాదు.
3. అంతులేని కోరికలు.
4. తలనొప్పి వున్నా లేకపోయినా ఆహారానికి ముందు బొటన వేళ్ళను మిగిలిన వేళ్ళతో రెండు నిమిషాలు నొక్కాలి.
5. తులసి ఆకులను దంచి వస్త్రగాయం పట్టి నిల్వ వుంచుకోవాలి.ఒక చిటికెడు పొడిని నశ్యం లాగా రెండు ముక్కులతో పీల్చాలి.
దీర్ఘకాలిక తలనొప్పి--నివారణ 8-3-09.
సబ్జా (రుద్రజడ, గోగ్గెర) ఆకులు ---- గుప్పెడు
ఆవు నెయ్యి ---- 100 gr
సబ్జా ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి.ఆవు నెయ్యిని స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కాచాలి. దానిలో ఆకులను వెయ్యాలి. అవి నల్లగా మాడే వరకు కాచాలి. చల్లార్చి వడపోసుకోవాలి.
ఆహారానికి ముందు పిల్లలకైతే రెండు చుక్కలు, పెద్దలకైతే మూడు చుక్కలు గోరు వెచ్చగా ముక్కులో వెయ్యాలి. దీనితో దీర్ఘ కాలంగా వున్న తల నొప్పి నివారింప బడుతుంది.ముక్కు మూసుకుపోవడం, ముక్కు మీద వాయడం, మాడు నొప్పి ముక్కు నుండి చిక్కటి చీము కారడం కూడా నివారింప బడతాయి.
కఫం చేరడం వలన వచ్చే పార్శ్వపు నొప్పి -- నివారణ 10-7-09.
ముక్కులో నువ్వుల నూనె చుక్కలు వేసుకోవాలి. పసుపు వేసి మరిగించిన నీటి ఆవిరి పీల్చాలి. బెడ్ షీట్ను కప్పుకొని చెమట పట్టేటట్లు ఆవిరి పట్టించాలి. ఆ నీటిలో టవలును ముంచి నొప్పి వున్న చోట కాపడంపెట్టాలి
భస్త్రిక, వేగభస్త్రిక, దీర్ఘభస్త్రిక వ్యాయామాలను చెయ్యాలి. వీటి వలన తల నొప్పి అప్పటికప్పుడు తగ్గుతుంది.
తినకూడని పదార్ధాలు:-- కొత్త బియ్యం, పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ పనికి రావు. అతి చలువ చేసే పదార్ధాలు
జీర్ణం కాని పదార్ధాలు:--- , మినుములు, ఉలవలు, నీరు ఎక్కువగా వున్న పదార్ధాలు వాడరాదు.
తినదగిన పదార్ధాలు:-- కరివేపాకు కారం పొడి, కొయ్యతోటకూర, దానిమ్మ, బొప్పాయి., ద్రాక్ష, మొదలైన పండ్లువాడ వచ్చును.
ఆవు పాలు ---- పావు లీటరు
కొబ్బరి నీళ్ళు ----- పావు లీటరు
ఆవు న ----- అర లీటరు
లక్షణాలు:-- ఈ నొప్పితో బాధపడే వారి ముఖం చాలా నీరసంగా వుంటుంది. కంటి చూపులో అందం తగ్గుతుంది.
కరక్కాయల పొడి --- 100 gr
తాని కాయల పొడి --- 100 gr
ఉసిరికాయల పొడి --- 100 gr
కలకండ --- 100 gr
త్రిఫలాలను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి.
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఉదయం, సాయంత్రం అర టీ స్పూను పొడి ఒక టీ స్పూను తేనెతో గాని, లేదా నీటితో గాని సేవించాలి.
దీని వలన ఇక ఎప్పటికి నొప్పి రాదు.
1. వాతజ శిరో వ్యాధి సమస్య నివారణ 6-8-09.
ఎప్పుడైనా, సమయ నియమాలు లేకుండా తలలో ఏ భాగంలోనైనా వస్తుంది. తలలో చెడు వాయువులు చేరడం వలన వస్తుంది. ఉదరంలోని చెడు వాయువులు పైకి చేరడం వలన వస్తుంది.
వ్యాయామం:--
వేగ భస్త్రిక , ఉద్యాన బంధము, ఉదర చాలనము లేక అగ్నిసార, కపాలభాతి ప్రాణాయామం అనునవి చేయాలి.
1వేడిగా వున్న గంజి
కరక్కాయల పొడి ---- మూడు చిటికెలు
శొంటి పొడి ---- మూడు చిటికెలు
సైంధవ లవణం ---- మూడు చిటికెలు
వేడిగా వున్న గంజి లేదా జావలో అన్నింటిని కలిపి తాగితే వాత శిరస్సు శూల తగ్గుతుంది
2. వేడి పాలు తాగినా తగ్గుతుంది.
3. ఆముదపు గింజల పప్పు
తగరిస గింజల పప్పు
రెండింటిని గంజితో నూరి వేడి చేసి పట్టు వెయ్యాలి.
కొత్త బియ్యం. కొత్త గోధుమలు , చల్లని పదార్ధాలు (వండిన తరువాత ఎక్కువ సేపు వున్న పదార్ధాలు ) తినకూడదు. వీలైనంత వేడిగా వున్న పదార్ధాలను తినాలి. గిట్టని పదార్ధాలు తినకూడదు. ఏ పదార్ధాలు తింటేనొప్పి వస్తుందో గమనించి వాటిని మానెయ్యాలి.
తూర్పుకు ఎదురుగా పద్మాసనం లో కూర్చొని చూపుడు వేలును కిందికి వంచి బొటన వేలితో నొక్కి మిగిలిన వేళ్ళను కిందికి వంచి ముద్ర వేసుకోవాలి. ఈ ఆసనంలో అరగంట సేపు వుండాలి. మొదట ఐదు, పది నిమిషాలతో ప్రారంభించి చెయ్యాలి.
కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు.
ఈ ముద్ర ద్వారా నొప్పులు తగ్గడం అనుభవం ద్వారా చెప్పబడినది. కావన అందరు ఆచరించ వచ్చు. చూపుడు వేలు వాయువు యొక్క రూపం.
2. పిత్తజ (పైత్యము వలన )శిరోవ్యాది -- నివారణ 7-8-09.
లక్షణాలు:-- ఈ వ్యాధిలో సూదులు పెట్టి గుచ్చినట్లు మంటలుగా వుంటుంది. ముక్కునుండి వేడి ఆవిర్ల లాగా గాలి వస్తుంది.
జన్మతః పైత్య శరీరము కలిగిన వాళ్లకు ఇది ఎక్కువగా వుంటుంది. దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళకు మానసిక రుగ్మత వలన పైత్యము అధికముగా ఉత్పన్నమై ఈ శిరో వ్యాధి వస్తుంది.
పైత్యాన్ని ఎక్కువ చేసే అంటే వేడి చేసే పదార్ధాల వలన ఈ వ్యాధి వస్తుంది.
వ్యాయామాలు"--
1. చంద్ర భేదన ప్రాణాయామం:-- కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు నుండి గాలిని పీల్చి కుడి ముక్కుతో వదలాలి. పన్నెండు సార్లు చెయ్యాలి. తరువాత వేగంగా చెయ్యాలి.
2. శీతలి ప్రాణాయామం:-- నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని చాలా త్వరగా పీల్చి కొంత సేపు ఆపి తరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా వదలాలి. దీని వలన శిరస్సు లో చేరిన వేడి బయటకు తొలగించబడుతుంది. దీనిని కూడా వేగంగా చెయ్య వచ్చు.
3. శీత్కారి ప్రాణాయామం;--
సూర్యాస్తమయం తరువాత ఎటువంటి మందు వాడకపోయినా తల నొప్పి దానంతట అదే తగ్గి పోతుంది.
కళ్ళు ఆవిర్లు కమ్మితే:-- ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పసుపు వేసి మరిగించి అర గ్లాసుకు రానిచ్చి, గోరువెచ్చగా అయిన తరువాత గుడ్డను ముంచి కళ్లపై వేసుకుంటే ఆ కళ్ళ మంటలు వెంటనే తగ్గుతాయి. ఈ వేడిని విరేచనం ద్వారా తొలగించాలి.
చెరకు రసం --- అర గ్లాసు
ద్రాక్ష రసం --- అర గ్లాసు
త్రిఫల చూర్ణం ---- ఒక స్పూను
అన్నింటిని కలిపి తాగాలి.
పైత్యం పెరిగినట్లయితే అతి వాగుడు వుంటుంది. చిన్న, పెద్ద అనే విచక్షణ పోతుంది. ఆత్మపరిశీలన ప్రతిరోజు నిద్రించే ముందు చేసుకోవాలి.
ఆవు నెయ్యి ---- 100 gr
సబ్జా ఆకులు ---- పిడికెడు
నేతిలో సబ్జా ఆకులు వేసి స్టవ్ మీద పెట్టి నల్లబడే వరకు కాచి వడపోసి సీసాలో భద్రపరచాలి. ఈ తైలాన్నిరెండు ముక్కుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటే అర గంటలో మంటలు తగ్గుతాయి. ఒక వారం రోజులువేసుకుంటే ఎప్పటికి రాదు.
ధనియాలు ---- రెండు టీ స్పూన్లు
నీళ్ళు ---- ఒక గ్లాసు
ధనియాలను నలగగొట్టి నీళ్ళలో వేసి అర గ్లాసుకు వచ్చేట్లు మరిగించాలి.దానిలో ఒక టీ స్పూను కలకండ వేసి లేదా చక్కెర కలుపుకొని తాగితే పైత్యం తగ్గుతుంది.
ముఖ్యంగా పాదాలకు, శరీరానికి కూడా కొబ్బరి నూనె రాస్తే పైత్యం తగ్గుతుంది.
3. కఫజ శిరోవ్యాది సమస్య -- నివారణ 10-8-09.
కారణాలు;-- చలిగాలిలో తిరగడం, A.C లలో వుండడం వలన, చల్లని పదార్ధాలు నిరంతరం తినడం వలన అధికంగా నీరు తాగడం వలన కఫం ఉత్పన్నమవుతుంది.
కఫాన్ని మొత్తాన్ని వుమ్మెయ్యకుండా మింగడం వలన కడుపులో ఆకలి మందగిస్తుంది.
గజకర్ణి:--(వమన భాతి):-- గోరువెచ్చని నీటిలో సైంధవ లవణం కలిపి కొద్ది కొద్దిగా తాగాలి. వేళ్ళు లోపలి పోనిచ్చివాంతి చేసుకుంటే కఫం అంతా బయటకు వస్తుంది. B.P. వున్నవాళ్ళు ఉప్పు లేకుండా నీళ్ళు మాత్రమే తాగి వమనం చేసుకోవాలి.
గోరువెచ్చని తైలాన్ని ముక్కులో వేసుకోవాలి.
Inhalation ద్వారా ముక్కుకు, చెవులకు ఆవిరి పట్టాలి. (దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టడం) ఆ నీటిలో బట్టను ముంచి ముక్కు మీద, ముఖం మీద అద్దాలి.
" ప్రతి రోజు ఎవరైతే త్రిఫల చూర్ణాన్ని ఉపయోగిస్తారో వారికి వాత, పిత్త, కఫ రోగాలుండవు"
ఈ వ్యాధిలో తల భారంగా వుంటుంది, నోటిలో దుర్వాసన వుంటుంది, కళ్ళనుండి పుసులు వస్తాయి, కఫం చేరి గురక వస్తుంది.
వావిలాకులను కచ్చాపచ్చాగా నలగగొట్టి కొంచం నువ్వులనూనె గాని, ఆముదం గాని వేసి వేయించి గుడ్డలోవేసి తలకు కట్టుకోవాలి. తల బరువుగా వుంటే వెంటనే తగ్గుతుంది.
లేత వావిలాకు చిగుళ్ళు పది లేక పదిహేను తీసుకొని పాత్రలో వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి మరిగించి అర గ్లాసు కు రానిచ్చి తాగితే కఫం కరిగిపోతుంది.
నాటు ఆవు మూత్రంలో అన్ని వ్యాధులను పోగొట్టగల వ్యాధి నిరోధక శక్తి వుంటుంది.
ఆవు మూత్రాన్ని ఏడు మడతలు వేసిన బట్టలో వడకట్టాలి.
అర కప్పు ఆవు మూత్రంలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్ట కరిగిపోతుంది.శరీరంలోని అన్ని మలినాలు తొలగిపోతాయి.
4. సన్నిపాతజ శిరోవ్యాది సమస్యలు-- నివారణ 11-8-09.
శరీరంలో ఎక్కడి వాయువులు అక్కడే ఆగి పోతే వ్యాధులు ప్రకోపిస్తాయి.
వాత, పిత్త, కఫాలు సమస్తితిలో ఉండాలంటే"--
1. ఆరడుగుల గుడ్డను తడిపి రొమ్ము భాగం లో వీపు మీదుగా చుట్టాలి. మళ్లీ అంతే పొడి గుడ్డను, అంతే మందమైన గుడ్డను దాని పై పరచాలి. .
2. శరీరమంతా తైలంతో మర్దన చెయ్యాలి.
3. భుజంగాసనం, శలభాసనం, సర్వాంగాసనం వెయ్యాలి.
తరువాత శరీరమంత సున్నిపిండితో రుద్ది స్నానం చేస్తే శిరోభారం తగ్గుతుంది.
వావిలి లేక మునగాకును వాడ్చి తలకు కట్టుకోవాలి.
ధనియాల కషాయం తాగాలి.
తైల శిరోవస్తి:-- తలలో సూదులు గుచ్చినట్లు ఒకసారి, భారంగా ఒకసారి వున్నపుడు తలపై ఒక తోలు టోపీ పెట్టుకోవాలి. మినప పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బి ఆ టోపీ మీద పూయాలి.
నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి ఆ టోపీ మీద పోయాలి. టోపీ మీద మినప పప్పులో నువ్వుల నూనె నిలిచేటట్లు గుంత చేసి నూనెను దానిలో పోయాలి. దీనితో శిరోభారం తగ్గుతుంది.
5. రక్తజ శిరో వ్యాధి నివారణ 12-8-09.
రక్త ప్రసరణ ఎక్కువైనపుడు ఈ శిరోవ్యాది వస్తుంది. తల కాలిపోతుండడం ఈ వ్యాధి లక్షణం.
ఆరడుగుల బట్టను చల్లని నీటిలో తడిపి తలకు చుట్టాలి. అంతే పొడవున్న పొడి బట్టను దాని పై చుట్టాలి.అంతే పొడవైన మందమైన బట్టను దానిపై చుట్టాలి. ఈ విధంగా చెయ్యడం వలన అర గంటలో పైత్యము అధీనం లోకి వస్తుంది.
చన్నీటి లింగ స్నానం:-- స్త్రీ గాని, పురుషుడు గాని చేతిగుడ్డను తీసుకొని చల్లటి నీటిలో ముంచి మర్మాంగానికి తాకిస్తూ, తీస్తూ వుండాలి. ఈ విధంగా ఐదు నిమిషాలు చెయ్యాలి. సమస్య తీవ్రంగా వుంటే పది నిమిషాలుచెయ్యాలి. దీని వలన చాలా వేగంగా నివారించ బడుతుంది.
"పిత్తాదిక్యత రక్తములో కలవడం వలన రక్తజ శిరోవ్యాది ఏర్పడుతుంది."
ముక్కు నుండి, నోటినుండి వేడి ఆవిర్లు వస్తాయి. నోరు ఎండిపోతుంది. ముక్కులో చెక్కులు కడతాయి. ఈ వ్యాధిలో వేడి శృతి మించి నొప్పి ఎక్కువై తాకినా భరించలేనంత నొప్పి వుంటుంది.ఈ సమయంలో అతివేడిని పుట్టించే మాంసం, చేపలు, గుడ్లు తినకూడదు. రజో గుణాన్ని, గర్వాన్ని పెంచే కారము, ఉప్పు, పులుపుఅతిగా వాడ కూడదు.
కొబ్బరి నీళ్ళు బాగా పనిచేస్తాయి.
బార్లీ పాయసం:-- .
ఒక కిలో బార్లీని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి ఒక్కలు ముక్కలుగా దంచి ఒక డబ్బాలో
నిల్వ చేసుకోవాలి చారెడు గింజలను తీసి ఉడికించి పాలు పోసి కలకండ కలిపి ఎండుద్రాక్ష వేసి వండాలి.
ఒకటి లేక మూడు టీ స్పూన్లు నెయ్యి కలుపుకొని తాగితే ఎంతటి నొప్పి అయినా తగ్గుతుంది.
ఎండిన అంజీర పండ్ల పొడి ---- ఒక టీ స్పూను
వెన్న ---- "
కలకండ లేదా చక్కెర ---- "
యాలకుల పొడి ---- చిటికెడు
దోరగా వేయించి దంచిన మిరియాల పొడి -- "
అన్నింటిని మంచి నీటితో సేవిస్తే రక్త శిరోజ వ్యాధి చాలా త్వరగా నయమవుతుంది.
పద్మాసనంలో కూర్చొని చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. బొటన వ్రేలు, చిటికెన వేలు కలిపి మిగిలిన వేళ్ళను కిందకు వంచి మనసులో ఇష్టమైన దైవం పై మనసు లగ్నం చేసి అరగంటసేపు వుండాలి.
6. క్షయజ శిరోవ్యాది సమస్య --- నివారణ 13-8-09.
రక్తం క్షీణించి పోవడం వలన ఏర్పడే శిరో సమస్యను క్షయజ శిరోవ్యాది అంటారు.
ఈ సమస్య వలన శిరస్సుకు రక్త సరఫరా జరగక చేతన లేకుండా అయి పోతుంది.
ఒక గాజు సీసా తీసుకొని దానిలో గోరు వెచ్చని నీటిని పోసుకొని మెడ మీద కాపడం పెట్టాలి. లేక గోరువెచ్చని నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి.
తైల మర్దన:-- బలాశ్వగంద తైలాన్ని ఉపయోగించి మర్దన చెయ్యాలి.
కొద్దిగా ఆముదం లో వేపాకును వేసి వేయించి తలకు కట్టుకోవాలి.
గోరువెచ్చని నువ్వుల నూనెను చెవుల్లో ముక్కులో వేసుకోవాలి, పీల్చాలి.
సుఖ పూర్వక ప్రాణాయామం:-- చాలా నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి.
శిరస్సులో సమస్థాయిలో ఉండవలసిన రక్తం క్షీణించి పోవడం వలన మిగిలిన అన్ని విషయాల్లో కూడా క్షీణతఏర్పడుతుంది. మాంసం, కొవ్వు ఏర్పడడంలో క్షీణత,ద్రవపదార్ధాలు ఏర్పడడంలో కూడా క్షీణత ఏర్పడుతుంది.
దీనివలన రోజుకు కొన్ని వందల సార్లు తుమ్మడం జరుగుతుంది.
మునగాకు రసంలో మిరియాల పొడి వేసి గుజ్జుగా నూరి తలకు లేపనం చెయ్యాలి. దీని వలన అతి త్వరగా నొప్పి నివారింప బడుతుంది.
పిప్పళ్ళు ---- 10 gr
సైంధవ లవణం ---- 10 gr
నువ్వుల నూనె ---- 50 gr
పిప్పళ్ళను, సైంధవ లవణాన్ని కలిపి కల్వంలో వేసి తగినంత నీరు చేర్చి గంధంలాగా మెత్తగా నూరాలి. దానిని తీసి గిన్నెలో వేసి నువ్వుల నూనె పోసి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.తరువాత వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
రెండేసి చుక్కల చొప్పున ముక్కులో వేసుకుంటే తలనొప్పి వెంటనే నివారింప బడుతుంది.
7. క్రిమిజ శిరోవ్యాది-- నివారణ 14-8-09.
పీల్చే గాలి వలన గాని, త్రాగే నీటి వలన గాని, తినే పదార్దముల వలన గాని పుట్టిన క్రిములు ముందు అండ రూపములో శిరస్సులో చేరి అభివృద్ధి చెంది తలలో తిరగడం వలన ఈ శిరో వ్యాధి వస్తుంది. దీని వలన ముక్కునుండి, చీము, నెత్తురు కారుతూ వుంటాయి.
దీనిని నివారించుటకు ఉదరములో నిల్వలు లేకుండా చేసుకోవాలి.
1. వేప గింజల నుండి తీసిన పలుచని (ఎక్కువ సార్లు వడకట్టగా వచ్చిన) తైలం ముక్కులో రెండు లేక మూడు చుక్కలు వేసుకోవాలి. చిన్న పిల్లలకు ఒక చుక్క చాలు. దీని వలన క్రిములు హరించి పోవడం ప్రారంభం అవుతుంది.
2. శిరస్సుకు మట్టి పట్టి వేసుకోవాలి.
3. అగ్నిహోత్రం వెయ్యాలి. మూలికల పొడిని వెయ్యడం వలన వచ్చే దూపాన్ని ఆఘ్రానించాలి.
4. దీనితోబాటు ప్రాణాయామం కూడా చెయ్యాలి.
5. కపాలభాతి ప్రాణాయామం
6. వారానికొకసారి ఎనిమా చేసుకోవాలి.
లక్షణాలు:-- శిరస్సులో క్రిములున్నందుకు నిదర్శనం తలలో ఏదో తిరుగుతున్నట్లు వుంటుంది. ముక్కునుండి కారే స్రావాలతోపాటు క్రిములు కూడా వస్తుంటాయి.
శొంటి ----10 gr
పిప్పళ్ళు ---- 10 gr
మిరియాలు ----10 gr
మునగ చెక్క పొడి ----30 gr
కానుగ చెట్టు బెరడు పొడి ----30 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవలాలి.
పావు టీ స్పూను లేక అర టీ స్పూను పొడిని తీసుకొని మేక పంచితం కలిపి నూరి గుడ్డలో వేసి పిండితే వచ్చే రసం ముక్కులో వేసుకోవాలి. దీని వలన అద్భుతంగా క్రిములు సంహరింపబడి బయటకు తొలగించబడతాయి.
వాకుడు కాయలు ఎండబెట్టి దంచిన పొడిని నిప్పుల మీద వేసి పీల్చాలి. చెవులకు పొగ బడితే ముక్కునుండి, చేవులనుండి క్రిములు బయటకు వస్తాయి.
8 సూర్యావర్త శిరోవేదన ---నివారణ 17-8-09.
20 నిమిషాల సేపు తల మీద మట్టి పట్టి వెయ్యాలి. లేదా తలకు చల్లని గుడ్డను చుట్టి,దానిమీద
పొడి గుడ్డను చుట్టి, దాని మీద లావు గుడ్డను చుట్టాలి.
చంద్రభేదన, శీతలి, శీత్కారి ప్రానాయామాలను చెయ్యాలి.
ఈ వ్యాధిలో సూర్య గమనాన్నిబట్టి నొప్పి ఎక్కువ అవుతూ వుంటుంది. సూర్యాస్తమయం తోకూడా తగ్గుతుంది.
వేడిని కలిగించే పదార్ధాలను మానేయాలి.
కొంతమందికి చల్లని నీటిలో ముంచిన గుడ్డను కట్టడం వలన తగ్గుతుంది. మరికొంతమందికి వేడినీటిలో గుడ్డను ముంచి కట్టడం వలన తగ్గుతుంది. శరీర తత్వాన్ని బట్టి నిర్ణయించు కోవాలి.
గుంటగలగర ఆకు రసం
మేక పాలు
సమానంగా తీసుకొని కలిపి ఎండబెట్టాలి. పూర్తిగా ఎండి పోడిలాగా తయారవ్వాలి. దానిని నూరి సీసాలో భద్రపరచుకోవాలి. చిటికెడు పొడిని పీల్స్తే వెంటనే నొప్పి తగ్గుతుంది.
మేక పాలను సాన రాయి మీద వేసి శొంటి కొమ్ముతో అరగదీసి గంధం తీయాలి. దీనిని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే నొప్పి వెంటనే తగ్గుతుంది. ఈ గంధంతో సూర్యావర్తన శిరోవేదన మాత్రమే కాక అన్నిరకాల తల నొప్పులు తగ్గుతాయి.
9. అనంత వాత శిరోవ్యాది --- నివారణ 18-8-09.
ఈ వ్యాధి వేళకు భోన్చేయక పోవడం, వేళకు నిద్ర ప్కపోవడం వంటి కారణాల వలన వస్తుంది.
దీనికి తైల (నువ్వుల నూనె) మర్దన తప్పనిసరి. తైలమర్దనం మూడు దోషాలను తొలగిస్తుంది.
అనులోమ, విలోమ ప్రానాయామాలను చెయ్యాలి.
వాయువు సమస్తితిలో వుంటే ఆయువు సమస్తితిలో వుంటుంది.
అర చేతులకు, గోళ్ళకు తైలాన్ని బాగా పట్టించి చేతులను బాగా రుద్దాలి. దీని వలన నాడులకు
బలం చేకూరుతుంది.
గోరువెచ్చని నీటిలో పాదాలను వుంచి తల మీద చల్లటి చేతి గుడ్డను వేసుకోవాలి. 15 నిమిషాలు ఉంచాలి. గుడ్డ ఆరిపోతే మళ్లీ తడిపి వెయ్యాలి.
ఈ వ్యాధిలో అనంత వాయువు మెడ చుట్టు, ముచ్చెన గుంట ప్రాంతాలలో చేరి వుంటుంది.
కణతలకు ప్రాణ వాయువు అందక కొట్టుకుంటూ వుంటాయి. చెంపలు వణుకుతూ వుంటాయి. శిరస్సులోని అన్ని భాగాలు నీరసించి పోయి అనారోగ్యంగా తయారవుతాయి. తల ప్రక్కకు కూడా తిప్పనివ్వదు . తల కదిలిస్తేనే తలలో విపరీతంగా నొప్పిగా వుంటుంది.
త్రిదోషాలను సామ్యము చేయగల సమాహారం తీసుకోవాలి.
త్రిఫల చూర్ణం తీసుకోవాలి.
అతి ఉప్పు, అతి పులుపు, అతి కారం పనికి రావు.
బాల ( ముత్తవ పులగం)
గరిక
నల్ల నువ్వులు
తెల్ల గలిజేరు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని తగినంత నీరు కలిపి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని మూడు చుక్కల చొప్పున ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది.
1. తూర్పుకు ఎదురుగా కూర్చొని రెండు కణతలను బొటన వేళ్ళతో 60,70 సార్లునెమ్మదిగా నొక్కాలి. నొక్కుతూ, తీస్తూ వుండాలి. బొటనవేళ్ళు కిందికి వుండాలి. వెంటనే తగ్గుతుంది.
2. వెనక అంటే ముచ్చెన గుంటకు రెండు వైపులా అదే విధంగా బొటన వేళ్ళతో నెమ్మదిగా నొక్కాలి. నొక్కుతూ తీస్తూ వుండాలి.
అల్లం రసం,బెల్లం సమానంగా తీసుకొని దానిలో చిటికెడు సైధవ లవణం పొడి, చిటికెడు దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి గుడ్డలో వేసి రసం పిండాలి. దానిని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే క్షణాల్లో నొప్పి తగ్గిపోతుంది.
శిరోవ్యాది సమస్యలు --పార్శ్వపు నొప్పి -- నివారణ 19-8-09.
నొప్పి ఎటు వైపు వస్తుందో అటు వైపును గురించి, ఆ నొప్పిని గురించి పట్టించుకోక పోతే ఆ వైపు కన్ను,చెవి పనికి రాకుండా పోతాయి.
ఈ నొప్పి వున్నపుడు ఒక్కోసారి కణతను కూడా తాకనివ్వదు. ఆ సమయంలో ఏదో ఒక తైలాన్ని తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా కణత మీద, గొంతు మీద, మెడ మీద మర్దన చెయ్యాలి. చెవిలో రెండు చుక్కల తైలం వేసి కదిలించాలి. వేడి నీటిలో పసుపు వేసి కాపడం పెట్టాలి.
ప్రాణాయామం తప్పనిసరిగా చెయ్యాలి. :-- గాలి పీల్చేటపుడు స్వచ్చమైన ప్రాణ వాయువు తలలో నిండినట్లు శుద్ధి చేస్తునట్లు భావించాలి. దేహములోని మలిన, వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతున్నట్లు భావించాలి.
ఈ విధంగా 24 సార్లు చేస్తే ఆశ్చర్యకరమైన ఎంతో మార్పు వస్తుంది.
బొటన వేలు తో కణత మీద లేదా ఎక్కడనొప్పి ఉన్నదో అక్కడ మర్దన చెయ్యాలి. నొక్కుతూ, వదులుతూ వుండాలి. దీని వలన తల మొత్తం శుద్ధి అవుతుంది.
శొంటి
బెల్లం
రెండు కలిపి వాసన చూస్తే నొప్పి తగ్గి పోతుంది. కొద్దిగా తీసుకొని చప్పరించాలి.
అర తల నొప్పిని అశ్రద్ధ చేస్తే కన్ను, చెవి కి ప్రమాదం జరుగుతుంది.
కనుగుడ్డును అన్ని వైపులకు తిప్పాలి. ఒక వైపు తిప్పడం, అర చేతులు రుద్ది కాపడం పెట్టడం, రెండవ వైపుతిప్పడం మరలా కాపడం పెట్టడం చెయ్యాలి. కంటి మీద, చెవి మీద రెండేసి నిమిషాల చొప్పున వేలితో నొక్కాలి.
శిరస్సుకు సంబంధించిన సమస్యల నివారణకు తులసి తైలం 19-2-10.
అనేకసార్లు వదకట్ట బడిన స్వచ్చమైన వేపనూనెను తీసుకొని మట్టి పెంకులో పోసి పొయ్యి మీద
పెట్టి అది వేడెక్కిన తరువాత కొన్ని తులసి దళాలను వేసి ఆకులు నల్లగా అయిన తరువాత (మాడకుండా) దించి వదపోసుకొని సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని గోరువెచ్చగా చేసి తలకు పూసుకోవాలి.
ఇది శిరస్సులోని మలినాలను పోగొట్టి తలనొప్పిని పోగొడుతుంది.
శిరోవ్యాదులు ---అపస్మారకం ---నివారణ 10-4-10.
శిరస్సులో రక్తం గడ్డ కట్టడం, మాట్లాడుతూ అలాగే వుండి పోవడం ( మౌనంగా ఉండిపోవడం,లేక అపస్మారకం )
శిరస్సులో ఎప్పుడూ సన్న నొప్పి వుండడం, సడన్ గా పడిపోవడం వంటివి జరుగుతూ వుంటాయి.
దీనికి ముఖ్యమైన నివారణ ముక్కుల్లో. చెవుల్లో నువ్వుల నూనె వేసుకోవడం.
కలబంద రసం --- 20 gr
పట్టు తేనె --- 40 gr
దీనిని మోతాదును పెంచుకోవచ్చు.
ఈ రెండింటిని సీసాలో పోసి బాగా షేక్ చెయ్యాలి.తరువాత రెండు రోజులు ఎండలో పెట్టాలి. తరువాత గుడ్డలో వడ పోసుకోవాలి. చుక్కల సీసాలో పోసి భద్ర పరచుకోవాలి.
ఉదయం, సాయంత్రం రెండేసి చుక్కల చొప్పున ముక్కుల్లో వేసుకొని పీల్చాలి. దీని వలన రక్త ప్రసరణబాగా జరుగుతుంది.
దీనివలన తల దిమ్ము, తలపోటు, హిస్టీరియా, మూర్చ వంటి రోగాలు నివారింప బడతాయి. తల చల్లబడుతుంది. రక్త నాళాల్లో గడ్డ కట్టిన రక్తం కరుగుతుంది.
తలనొప్పి --నివారణకు -- శివాంజనం--Ointment 23-5-10 .
ముద్ద కర్పూరం ---- 60 gr
వాము పువ్వు ---- 30 gr
పుదీనా పువ్వు ---- 15 gr
అన్నింటిని కలిపి సీసాలో పొయ్యాలి. కొంత సేపటికి ద్రవ పదార్ధంగా మారుతుంది.
ఆవు నెయ్యి ---- 180 gr
తేనె మైనం ---- 60 gr
ఒక గిన్నెలో తేనేమైనం వేసి సన్న మంట మీద కరిగించి వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. దానిలో ఆవునెయ్యి కలిపి వేడి చేసి దించి చల్లార్చాలి. కొంచం గోరువెచ్చగా వున్నపుడు దానిలో మూడు తైలాల మిశ్రమాన్ని కలపాలి. కొంచం సేపటికి బాగా చల్లారి అంజనం ( Ointment) తయారవుతుంది.
దీనిని తలనొప్పి నివారణకు, వాతనొప్పులకు,జలుబు, గొంతునొప్పి వంటి కఫ సమస్యల నివారణ కు ఉపయోగించవచ్చును.
అన్ని రకాల తల నొప్పులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు --
మెదడులో చెడు పదార్ధాలు చేరకుండా జాగ్రత్త పడాలి.
ఉదయం నిద్ర లేచిన తరువాత కాల కృత్యాలు తీర్చుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని చెవులలో తెల్లనువ్వుల నూనెను రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. ముక్కులలో పుటములనుండి లోపలి కి వెళ్ళే విధంగా వెయ్యాలి.
దీని వలన నూనె మెదడుకు చేరుతుంది.
కొంతనూనె నోట్లో పోసుకుని పుక్కిలించాలి. చేతులకు, కాళ్ళకు మర్దన చెయ్యాలి.
కళ్ళలో వేసుకోవాలి.
దీని వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. చర్మము నున్నగా తయారవుతుంది. ముక్కుల నుండి తుమ్ములు, కఫము రావడం తగ్గిపోతుంది. చెవుల నుండి కారే చీము మొదలైనవి రావు. కాళ్ళలో శక్తి వచ్చి, నడకలో వేగం హెచ్చుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
ఈ విధంగా 40 రోజులు చేయాలి.
తల నొప్పి వచ్చినపుడు కొంత మంది దవడలను బిగిస్తుంటారు. కొన్ని సార్లు దవడలను బిగించడం
వలన తల నొప్పి వస్తుంది. దీని వలన దవడ కండరాలకు, తలకు మధ్య వున్న రక్త నాళాల లో సరఫరా సమస్యలు ఏర్పడతాయి. దీని వలన తలనొప్పి వస్తుంది.
దీనిని నివారించడానికి పెన్సిల్ ను పళ్ళ మధ్య ముఖ్యంగా ముందు పళ్ళ మధ్య పట్టుకుంటే తగ్గుతుంది. గట్టిగా నొక్క కూడదు.
25-9-10.
బార్లీ గింజల పొడి
వెనిగర్
కలిపి తలకు పట్టువేస్తే తల నొప్పి తగ్గుతుంది.
తలలో కురుపుల నివారణకు చిట్కా 21-12-10.
వెలమ సంధి అనే ఆకును నూరి పూస్తే తగ్గుతుంది.
అలసట వలన వచ్చే తలనొప్పి 27-12-10.
.
.
సబ్జా (రుద్రజడ, గోగ్గెర) ఆకులు ---- గుప్పెడు
ఆవు నెయ్యి ---- 100 gr
సబ్జా ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి.ఆవు నెయ్యిని స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కాచాలి. దానిలో ఆకులను వెయ్యాలి. అవి నల్లగా మాడే వరకు కాచాలి. చల్లార్చి వడపోసుకోవాలి.
ఆహారానికి ముందు పిల్లలకైతే రెండు చుక్కలు, పెద్దలకైతే మూడు చుక్కలు గోరు వెచ్చగా ముక్కులో వెయ్యాలి. దీనితో దీర్ఘ కాలంగా వున్న తల నొప్పి నివారింప బడుతుంది.ముక్కు మూసుకుపోవడం, ముక్కు మీద వాయడం, మాడు నొప్పి ముక్కు నుండి చిక్కటి చీము కారడం కూడా నివారింప బడతాయి.
కఫం చేరడం వలన వచ్చే పార్శ్వపు నొప్పి -- నివారణ 10-7-09.
ముక్కులో నువ్వుల నూనె చుక్కలు వేసుకోవాలి. పసుపు వేసి మరిగించిన నీటి ఆవిరి పీల్చాలి. బెడ్ షీట్ను కప్పుకొని చెమట పట్టేటట్లు ఆవిరి పట్టించాలి. ఆ నీటిలో టవలును ముంచి నొప్పి వున్న చోట కాపడంపెట్టాలి
భస్త్రిక, వేగభస్త్రిక, దీర్ఘభస్త్రిక వ్యాయామాలను చెయ్యాలి. వీటి వలన తల నొప్పి అప్పటికప్పుడు తగ్గుతుంది.
తినకూడని పదార్ధాలు:-- కొత్త బియ్యం, పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ పనికి రావు. అతి చలువ చేసే పదార్ధాలు
జీర్ణం కాని పదార్ధాలు:--- , మినుములు, ఉలవలు, నీరు ఎక్కువగా వున్న పదార్ధాలు వాడరాదు.
తినదగిన పదార్ధాలు:-- కరివేపాకు కారం పొడి, కొయ్యతోటకూర, దానిమ్మ, బొప్పాయి., ద్రాక్ష, మొదలైన పండ్లువాడ వచ్చును.
ఆవు పాలు ---- పావు లీటరు
కొబ్బరి నీళ్ళు ----- పావు లీటరు
ఆవు న ----- అర లీటరు
అన్నింటిని కలిపి ఒక పాత్ర పోసి స్టవ్ మీద పెట్టి కొబ్బరినీళ్ళు, పాలు ఇంకిపోయి నెయ్యి మాత్రమే మిగిలే వరకు కాచాలి. వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం నాలుగైదు చుక్కల నేతిని ముక్కులో వేసుకోవాలి. కరగాబెట్టి దూది ముంచి వేసుకోవచ్చు.
దీని వలన చాలా త్వరగా పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.లక్షణాలు:-- ఈ నొప్పితో బాధపడే వారి ముఖం చాలా నీరసంగా వుంటుంది. కంటి చూపులో అందం తగ్గుతుంది.
కరక్కాయల పొడి --- 100 gr
తాని కాయల పొడి --- 100 gr
ఉసిరికాయల పొడి --- 100 gr
కలకండ --- 100 gr
త్రిఫలాలను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి.
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఉదయం, సాయంత్రం అర టీ స్పూను పొడి ఒక టీ స్పూను తేనెతో గాని, లేదా నీటితో గాని సేవించాలి.
దీని వలన ఇక ఎప్పటికి నొప్పి రాదు.
1. వాతజ శిరో వ్యాధి సమస్య నివారణ 6-8-09.
వ్యాయామం:--
వేగ భస్త్రిక , ఉద్యాన బంధము, ఉదర చాలనము లేక అగ్నిసార, కపాలభాతి ప్రాణాయామం అనునవి చేయాలి.
1వేడిగా వున్న గంజి
కరక్కాయల పొడి ---- మూడు చిటికెలు
శొంటి పొడి ---- మూడు చిటికెలు
సైంధవ లవణం ---- మూడు చిటికెలు
వేడిగా వున్న గంజి లేదా జావలో అన్నింటిని కలిపి తాగితే వాత శిరస్సు శూల తగ్గుతుంది
2. వేడి పాలు తాగినా తగ్గుతుంది.
3. ఆముదపు గింజల పప్పు
తగరిస గింజల పప్పు
రెండింటిని గంజితో నూరి వేడి చేసి పట్టు వెయ్యాలి.
కొత్త బియ్యం. కొత్త గోధుమలు , చల్లని పదార్ధాలు (వండిన తరువాత ఎక్కువ సేపు వున్న పదార్ధాలు ) తినకూడదు. వీలైనంత వేడిగా వున్న పదార్ధాలను తినాలి. గిట్టని పదార్ధాలు తినకూడదు. ఏ పదార్ధాలు తింటేనొప్పి వస్తుందో గమనించి వాటిని మానెయ్యాలి.
తూర్పుకు ఎదురుగా పద్మాసనం లో కూర్చొని చూపుడు వేలును కిందికి వంచి బొటన వేలితో నొక్కి మిగిలిన వేళ్ళను కిందికి వంచి ముద్ర వేసుకోవాలి. ఈ ఆసనంలో అరగంట సేపు వుండాలి. మొదట ఐదు, పది నిమిషాలతో ప్రారంభించి చెయ్యాలి.
కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు.
ఈ ముద్ర ద్వారా నొప్పులు తగ్గడం అనుభవం ద్వారా చెప్పబడినది. కావన అందరు ఆచరించ వచ్చు. చూపుడు వేలు వాయువు యొక్క రూపం.
2. పిత్తజ (పైత్యము వలన )శిరోవ్యాది -- నివారణ 7-8-09.
లక్షణాలు:-- ఈ వ్యాధిలో సూదులు పెట్టి గుచ్చినట్లు మంటలుగా వుంటుంది. ముక్కునుండి వేడి ఆవిర్ల లాగా గాలి వస్తుంది.
జన్మతః పైత్య శరీరము కలిగిన వాళ్లకు ఇది ఎక్కువగా వుంటుంది. దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళకు మానసిక రుగ్మత వలన పైత్యము అధికముగా ఉత్పన్నమై ఈ శిరో వ్యాధి వస్తుంది.
పైత్యాన్ని ఎక్కువ చేసే అంటే వేడి చేసే పదార్ధాల వలన ఈ వ్యాధి వస్తుంది.
వ్యాయామాలు"--
1. చంద్ర భేదన ప్రాణాయామం:-- కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు నుండి గాలిని పీల్చి కుడి ముక్కుతో వదలాలి. పన్నెండు సార్లు చెయ్యాలి. తరువాత వేగంగా చెయ్యాలి.
2. శీతలి ప్రాణాయామం:-- నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని చాలా త్వరగా పీల్చి కొంత సేపు ఆపి తరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా వదలాలి. దీని వలన శిరస్సు లో చేరిన వేడి బయటకు తొలగించబడుతుంది. దీనిని కూడా వేగంగా చెయ్య వచ్చు.
3. శీత్కారి ప్రాణాయామం;--
సూర్యాస్తమయం తరువాత ఎటువంటి మందు వాడకపోయినా తల నొప్పి దానంతట అదే తగ్గి పోతుంది.
కళ్ళు ఆవిర్లు కమ్మితే:-- ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పసుపు వేసి మరిగించి అర గ్లాసుకు రానిచ్చి, గోరువెచ్చగా అయిన తరువాత గుడ్డను ముంచి కళ్లపై వేసుకుంటే ఆ కళ్ళ మంటలు వెంటనే తగ్గుతాయి. ఈ వేడిని విరేచనం ద్వారా తొలగించాలి.
చెరకు రసం --- అర గ్లాసు
ద్రాక్ష రసం --- అర గ్లాసు
త్రిఫల చూర్ణం ---- ఒక స్పూను
అన్నింటిని కలిపి తాగాలి.
పైత్యం పెరిగినట్లయితే అతి వాగుడు వుంటుంది. చిన్న, పెద్ద అనే విచక్షణ పోతుంది. ఆత్మపరిశీలన ప్రతిరోజు నిద్రించే ముందు చేసుకోవాలి.
ఆవు నెయ్యి ---- 100 gr
సబ్జా ఆకులు ---- పిడికెడు
నేతిలో సబ్జా ఆకులు వేసి స్టవ్ మీద పెట్టి నల్లబడే వరకు కాచి వడపోసి సీసాలో భద్రపరచాలి. ఈ తైలాన్నిరెండు ముక్కుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటే అర గంటలో మంటలు తగ్గుతాయి. ఒక వారం రోజులువేసుకుంటే ఎప్పటికి రాదు.
ధనియాలు ---- రెండు టీ స్పూన్లు
నీళ్ళు ---- ఒక గ్లాసు
ధనియాలను నలగగొట్టి నీళ్ళలో వేసి అర గ్లాసుకు వచ్చేట్లు మరిగించాలి.దానిలో ఒక టీ స్పూను కలకండ వేసి లేదా చక్కెర కలుపుకొని తాగితే పైత్యం తగ్గుతుంది.
ముఖ్యంగా పాదాలకు, శరీరానికి కూడా కొబ్బరి నూనె రాస్తే పైత్యం తగ్గుతుంది.
3. కఫజ శిరోవ్యాది సమస్య -- నివారణ 10-8-09.
కారణాలు;-- చలిగాలిలో తిరగడం, A.C లలో వుండడం వలన, చల్లని పదార్ధాలు నిరంతరం తినడం వలన అధికంగా నీరు తాగడం వలన కఫం ఉత్పన్నమవుతుంది.
కఫాన్ని మొత్తాన్ని వుమ్మెయ్యకుండా మింగడం వలన కడుపులో ఆకలి మందగిస్తుంది.
గజకర్ణి:--(వమన భాతి):-- గోరువెచ్చని నీటిలో సైంధవ లవణం కలిపి కొద్ది కొద్దిగా తాగాలి. వేళ్ళు లోపలి పోనిచ్చివాంతి చేసుకుంటే కఫం అంతా బయటకు వస్తుంది. B.P. వున్నవాళ్ళు ఉప్పు లేకుండా నీళ్ళు మాత్రమే తాగి వమనం చేసుకోవాలి.
గోరువెచ్చని తైలాన్ని ముక్కులో వేసుకోవాలి.
Inhalation ద్వారా ముక్కుకు, చెవులకు ఆవిరి పట్టాలి. (దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టడం) ఆ నీటిలో బట్టను ముంచి ముక్కు మీద, ముఖం మీద అద్దాలి.
" ప్రతి రోజు ఎవరైతే త్రిఫల చూర్ణాన్ని ఉపయోగిస్తారో వారికి వాత, పిత్త, కఫ రోగాలుండవు"
ఈ వ్యాధిలో తల భారంగా వుంటుంది, నోటిలో దుర్వాసన వుంటుంది, కళ్ళనుండి పుసులు వస్తాయి, కఫం చేరి గురక వస్తుంది.
వావిలాకులను కచ్చాపచ్చాగా నలగగొట్టి కొంచం నువ్వులనూనె గాని, ఆముదం గాని వేసి వేయించి గుడ్డలోవేసి తలకు కట్టుకోవాలి. తల బరువుగా వుంటే వెంటనే తగ్గుతుంది.
లేత వావిలాకు చిగుళ్ళు పది లేక పదిహేను తీసుకొని పాత్రలో వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి మరిగించి అర గ్లాసు కు రానిచ్చి తాగితే కఫం కరిగిపోతుంది.
నాటు ఆవు మూత్రంలో అన్ని వ్యాధులను పోగొట్టగల వ్యాధి నిరోధక శక్తి వుంటుంది.
ఆవు మూత్రాన్ని ఏడు మడతలు వేసిన బట్టలో వడకట్టాలి.
అర కప్పు ఆవు మూత్రంలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్ట కరిగిపోతుంది.శరీరంలోని అన్ని మలినాలు తొలగిపోతాయి.
4. సన్నిపాతజ శిరోవ్యాది సమస్యలు-- నివారణ 11-8-09.
శరీరంలో ఎక్కడి వాయువులు అక్కడే ఆగి పోతే వ్యాధులు ప్రకోపిస్తాయి.
వాత, పిత్త, కఫాలు సమస్తితిలో ఉండాలంటే"--
1. ఆరడుగుల గుడ్డను తడిపి రొమ్ము భాగం లో వీపు మీదుగా చుట్టాలి. మళ్లీ అంతే పొడి గుడ్డను, అంతే మందమైన గుడ్డను దాని పై పరచాలి. .
2. శరీరమంతా తైలంతో మర్దన చెయ్యాలి.
3. భుజంగాసనం, శలభాసనం, సర్వాంగాసనం వెయ్యాలి.
తరువాత శరీరమంత సున్నిపిండితో రుద్ది స్నానం చేస్తే శిరోభారం తగ్గుతుంది.
వావిలి లేక మునగాకును వాడ్చి తలకు కట్టుకోవాలి.
ధనియాల కషాయం తాగాలి.
తైల శిరోవస్తి:-- తలలో సూదులు గుచ్చినట్లు ఒకసారి, భారంగా ఒకసారి వున్నపుడు తలపై ఒక తోలు టోపీ పెట్టుకోవాలి. మినప పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బి ఆ టోపీ మీద పూయాలి.
నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి ఆ టోపీ మీద పోయాలి. టోపీ మీద మినప పప్పులో నువ్వుల నూనె నిలిచేటట్లు గుంత చేసి నూనెను దానిలో పోయాలి. దీనితో శిరోభారం తగ్గుతుంది.
5. రక్తజ శిరో వ్యాధి నివారణ 12-8-09.
రక్త ప్రసరణ ఎక్కువైనపుడు ఈ శిరోవ్యాది వస్తుంది. తల కాలిపోతుండడం ఈ వ్యాధి లక్షణం.
ఆరడుగుల బట్టను చల్లని నీటిలో తడిపి తలకు చుట్టాలి. అంతే పొడవున్న పొడి బట్టను దాని పై చుట్టాలి.అంతే పొడవైన మందమైన బట్టను దానిపై చుట్టాలి. ఈ విధంగా చెయ్యడం వలన అర గంటలో పైత్యము అధీనం లోకి వస్తుంది.
చన్నీటి లింగ స్నానం:-- స్త్రీ గాని, పురుషుడు గాని చేతిగుడ్డను తీసుకొని చల్లటి నీటిలో ముంచి మర్మాంగానికి తాకిస్తూ, తీస్తూ వుండాలి. ఈ విధంగా ఐదు నిమిషాలు చెయ్యాలి. సమస్య తీవ్రంగా వుంటే పది నిమిషాలుచెయ్యాలి. దీని వలన చాలా వేగంగా నివారించ బడుతుంది.
"పిత్తాదిక్యత రక్తములో కలవడం వలన రక్తజ శిరోవ్యాది ఏర్పడుతుంది."
ముక్కు నుండి, నోటినుండి వేడి ఆవిర్లు వస్తాయి. నోరు ఎండిపోతుంది. ముక్కులో చెక్కులు కడతాయి. ఈ వ్యాధిలో వేడి శృతి మించి నొప్పి ఎక్కువై తాకినా భరించలేనంత నొప్పి వుంటుంది.ఈ సమయంలో అతివేడిని పుట్టించే మాంసం, చేపలు, గుడ్లు తినకూడదు. రజో గుణాన్ని, గర్వాన్ని పెంచే కారము, ఉప్పు, పులుపుఅతిగా వాడ కూడదు.
కొబ్బరి నీళ్ళు బాగా పనిచేస్తాయి.
బార్లీ పాయసం:-- .
ఒక కిలో బార్లీని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి ఒక్కలు ముక్కలుగా దంచి ఒక డబ్బాలో
నిల్వ చేసుకోవాలి చారెడు గింజలను తీసి ఉడికించి పాలు పోసి కలకండ కలిపి ఎండుద్రాక్ష వేసి వండాలి.
ఒకటి లేక మూడు టీ స్పూన్లు నెయ్యి కలుపుకొని తాగితే ఎంతటి నొప్పి అయినా తగ్గుతుంది.
ఎండిన అంజీర పండ్ల పొడి ---- ఒక టీ స్పూను
వెన్న ---- "
కలకండ లేదా చక్కెర ---- "
యాలకుల పొడి ---- చిటికెడు
దోరగా వేయించి దంచిన మిరియాల పొడి -- "
అన్నింటిని మంచి నీటితో సేవిస్తే రక్త శిరోజ వ్యాధి చాలా త్వరగా నయమవుతుంది.
పద్మాసనంలో కూర్చొని చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. బొటన వ్రేలు, చిటికెన వేలు కలిపి మిగిలిన వేళ్ళను కిందకు వంచి మనసులో ఇష్టమైన దైవం పై మనసు లగ్నం చేసి అరగంటసేపు వుండాలి.
6. క్షయజ శిరోవ్యాది సమస్య --- నివారణ 13-8-09.
రక్తం క్షీణించి పోవడం వలన ఏర్పడే శిరో సమస్యను క్షయజ శిరోవ్యాది అంటారు.
ఈ సమస్య వలన శిరస్సుకు రక్త సరఫరా జరగక చేతన లేకుండా అయి పోతుంది.
ఒక గాజు సీసా తీసుకొని దానిలో గోరు వెచ్చని నీటిని పోసుకొని మెడ మీద కాపడం పెట్టాలి. లేక గోరువెచ్చని నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి.
తైల మర్దన:-- బలాశ్వగంద తైలాన్ని ఉపయోగించి మర్దన చెయ్యాలి.
కొద్దిగా ఆముదం లో వేపాకును వేసి వేయించి తలకు కట్టుకోవాలి.
గోరువెచ్చని నువ్వుల నూనెను చెవుల్లో ముక్కులో వేసుకోవాలి, పీల్చాలి.
సుఖ పూర్వక ప్రాణాయామం:-- చాలా నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి.
శిరస్సులో సమస్థాయిలో ఉండవలసిన రక్తం క్షీణించి పోవడం వలన మిగిలిన అన్ని విషయాల్లో కూడా క్షీణతఏర్పడుతుంది. మాంసం, కొవ్వు ఏర్పడడంలో క్షీణత,ద్రవపదార్ధాలు ఏర్పడడంలో కూడా క్షీణత ఏర్పడుతుంది.
దీనివలన రోజుకు కొన్ని వందల సార్లు తుమ్మడం జరుగుతుంది.
మునగాకు రసంలో మిరియాల పొడి వేసి గుజ్జుగా నూరి తలకు లేపనం చెయ్యాలి. దీని వలన అతి త్వరగా నొప్పి నివారింప బడుతుంది.
పిప్పళ్ళు ---- 10 gr
సైంధవ లవణం ---- 10 gr
నువ్వుల నూనె ---- 50 gr
పిప్పళ్ళను, సైంధవ లవణాన్ని కలిపి కల్వంలో వేసి తగినంత నీరు చేర్చి గంధంలాగా మెత్తగా నూరాలి. దానిని తీసి గిన్నెలో వేసి నువ్వుల నూనె పోసి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.తరువాత వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
రెండేసి చుక్కల చొప్పున ముక్కులో వేసుకుంటే తలనొప్పి వెంటనే నివారింప బడుతుంది.
7. క్రిమిజ శిరోవ్యాది-- నివారణ 14-8-09.
పీల్చే గాలి వలన గాని, త్రాగే నీటి వలన గాని, తినే పదార్దముల వలన గాని పుట్టిన క్రిములు ముందు అండ రూపములో శిరస్సులో చేరి అభివృద్ధి చెంది తలలో తిరగడం వలన ఈ శిరో వ్యాధి వస్తుంది. దీని వలన ముక్కునుండి, చీము, నెత్తురు కారుతూ వుంటాయి.
దీనిని నివారించుటకు ఉదరములో నిల్వలు లేకుండా చేసుకోవాలి.
1. వేప గింజల నుండి తీసిన పలుచని (ఎక్కువ సార్లు వడకట్టగా వచ్చిన) తైలం ముక్కులో రెండు లేక మూడు చుక్కలు వేసుకోవాలి. చిన్న పిల్లలకు ఒక చుక్క చాలు. దీని వలన క్రిములు హరించి పోవడం ప్రారంభం అవుతుంది.
2. శిరస్సుకు మట్టి పట్టి వేసుకోవాలి.
3. అగ్నిహోత్రం వెయ్యాలి. మూలికల పొడిని వెయ్యడం వలన వచ్చే దూపాన్ని ఆఘ్రానించాలి.
4. దీనితోబాటు ప్రాణాయామం కూడా చెయ్యాలి.
5. కపాలభాతి ప్రాణాయామం
6. వారానికొకసారి ఎనిమా చేసుకోవాలి.
లక్షణాలు:-- శిరస్సులో క్రిములున్నందుకు నిదర్శనం తలలో ఏదో తిరుగుతున్నట్లు వుంటుంది. ముక్కునుండి కారే స్రావాలతోపాటు క్రిములు కూడా వస్తుంటాయి.
శొంటి ----10 gr
పిప్పళ్ళు ---- 10 gr
మిరియాలు ----10 gr
మునగ చెక్క పొడి ----30 gr
కానుగ చెట్టు బెరడు పొడి ----30 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవలాలి.
పావు టీ స్పూను లేక అర టీ స్పూను పొడిని తీసుకొని మేక పంచితం కలిపి నూరి గుడ్డలో వేసి పిండితే వచ్చే రసం ముక్కులో వేసుకోవాలి. దీని వలన అద్భుతంగా క్రిములు సంహరింపబడి బయటకు తొలగించబడతాయి.
వాకుడు కాయలు ఎండబెట్టి దంచిన పొడిని నిప్పుల మీద వేసి పీల్చాలి. చెవులకు పొగ బడితే ముక్కునుండి, చేవులనుండి క్రిములు బయటకు వస్తాయి.
8 సూర్యావర్త శిరోవేదన ---నివారణ 17-8-09.
20 నిమిషాల సేపు తల మీద మట్టి పట్టి వెయ్యాలి. లేదా తలకు చల్లని గుడ్డను చుట్టి,దానిమీద
పొడి గుడ్డను చుట్టి, దాని మీద లావు గుడ్డను చుట్టాలి.
చంద్రభేదన, శీతలి, శీత్కారి ప్రానాయామాలను చెయ్యాలి.
ఈ వ్యాధిలో సూర్య గమనాన్నిబట్టి నొప్పి ఎక్కువ అవుతూ వుంటుంది. సూర్యాస్తమయం తోకూడా తగ్గుతుంది.
వేడిని కలిగించే పదార్ధాలను మానేయాలి.
కొంతమందికి చల్లని నీటిలో ముంచిన గుడ్డను కట్టడం వలన తగ్గుతుంది. మరికొంతమందికి వేడినీటిలో గుడ్డను ముంచి కట్టడం వలన తగ్గుతుంది. శరీర తత్వాన్ని బట్టి నిర్ణయించు కోవాలి.
గుంటగలగర ఆకు రసం
మేక పాలు
సమానంగా తీసుకొని కలిపి ఎండబెట్టాలి. పూర్తిగా ఎండి పోడిలాగా తయారవ్వాలి. దానిని నూరి సీసాలో భద్రపరచుకోవాలి. చిటికెడు పొడిని పీల్స్తే వెంటనే నొప్పి తగ్గుతుంది.
మేక పాలను సాన రాయి మీద వేసి శొంటి కొమ్ముతో అరగదీసి గంధం తీయాలి. దీనిని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే నొప్పి వెంటనే తగ్గుతుంది. ఈ గంధంతో సూర్యావర్తన శిరోవేదన మాత్రమే కాక అన్నిరకాల తల నొప్పులు తగ్గుతాయి.
9. అనంత వాత శిరోవ్యాది --- నివారణ 18-8-09.
ఈ వ్యాధి వేళకు భోన్చేయక పోవడం, వేళకు నిద్ర ప్కపోవడం వంటి కారణాల వలన వస్తుంది.
దీనికి తైల (నువ్వుల నూనె) మర్దన తప్పనిసరి. తైలమర్దనం మూడు దోషాలను తొలగిస్తుంది.
అనులోమ, విలోమ ప్రానాయామాలను చెయ్యాలి.
వాయువు సమస్తితిలో వుంటే ఆయువు సమస్తితిలో వుంటుంది.
అర చేతులకు, గోళ్ళకు తైలాన్ని బాగా పట్టించి చేతులను బాగా రుద్దాలి. దీని వలన నాడులకు
బలం చేకూరుతుంది.
గోరువెచ్చని నీటిలో పాదాలను వుంచి తల మీద చల్లటి చేతి గుడ్డను వేసుకోవాలి. 15 నిమిషాలు ఉంచాలి. గుడ్డ ఆరిపోతే మళ్లీ తడిపి వెయ్యాలి.
ఈ వ్యాధిలో అనంత వాయువు మెడ చుట్టు, ముచ్చెన గుంట ప్రాంతాలలో చేరి వుంటుంది.
కణతలకు ప్రాణ వాయువు అందక కొట్టుకుంటూ వుంటాయి. చెంపలు వణుకుతూ వుంటాయి. శిరస్సులోని అన్ని భాగాలు నీరసించి పోయి అనారోగ్యంగా తయారవుతాయి. తల ప్రక్కకు కూడా తిప్పనివ్వదు . తల కదిలిస్తేనే తలలో విపరీతంగా నొప్పిగా వుంటుంది.
త్రిదోషాలను సామ్యము చేయగల సమాహారం తీసుకోవాలి.
త్రిఫల చూర్ణం తీసుకోవాలి.
అతి ఉప్పు, అతి పులుపు, అతి కారం పనికి రావు.
బాల ( ముత్తవ పులగం)
గరిక
నల్ల నువ్వులు
తెల్ల గలిజేరు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని తగినంత నీరు కలిపి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని మూడు చుక్కల చొప్పున ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది.
1. తూర్పుకు ఎదురుగా కూర్చొని రెండు కణతలను బొటన వేళ్ళతో 60,70 సార్లునెమ్మదిగా నొక్కాలి. నొక్కుతూ, తీస్తూ వుండాలి. బొటనవేళ్ళు కిందికి వుండాలి. వెంటనే తగ్గుతుంది.
2. వెనక అంటే ముచ్చెన గుంటకు రెండు వైపులా అదే విధంగా బొటన వేళ్ళతో నెమ్మదిగా నొక్కాలి. నొక్కుతూ తీస్తూ వుండాలి.
అల్లం రసం,బెల్లం సమానంగా తీసుకొని దానిలో చిటికెడు సైధవ లవణం పొడి, చిటికెడు దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి గుడ్డలో వేసి రసం పిండాలి. దానిని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే క్షణాల్లో నొప్పి తగ్గిపోతుంది.
శిరోవ్యాది సమస్యలు --పార్శ్వపు నొప్పి -- నివారణ 19-8-09.
నొప్పి ఎటు వైపు వస్తుందో అటు వైపును గురించి, ఆ నొప్పిని గురించి పట్టించుకోక పోతే ఆ వైపు కన్ను,చెవి పనికి రాకుండా పోతాయి.
ఈ నొప్పి వున్నపుడు ఒక్కోసారి కణతను కూడా తాకనివ్వదు. ఆ సమయంలో ఏదో ఒక తైలాన్ని తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా కణత మీద, గొంతు మీద, మెడ మీద మర్దన చెయ్యాలి. చెవిలో రెండు చుక్కల తైలం వేసి కదిలించాలి. వేడి నీటిలో పసుపు వేసి కాపడం పెట్టాలి.
ప్రాణాయామం తప్పనిసరిగా చెయ్యాలి. :-- గాలి పీల్చేటపుడు స్వచ్చమైన ప్రాణ వాయువు తలలో నిండినట్లు శుద్ధి చేస్తునట్లు భావించాలి. దేహములోని మలిన, వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతున్నట్లు భావించాలి.
ఈ విధంగా 24 సార్లు చేస్తే ఆశ్చర్యకరమైన ఎంతో మార్పు వస్తుంది.
బొటన వేలు తో కణత మీద లేదా ఎక్కడనొప్పి ఉన్నదో అక్కడ మర్దన చెయ్యాలి. నొక్కుతూ, వదులుతూ వుండాలి. దీని వలన తల మొత్తం శుద్ధి అవుతుంది.
శొంటి
బెల్లం
రెండు కలిపి వాసన చూస్తే నొప్పి తగ్గి పోతుంది. కొద్దిగా తీసుకొని చప్పరించాలి.
అర తల నొప్పిని అశ్రద్ధ చేస్తే కన్ను, చెవి కి ప్రమాదం జరుగుతుంది.
కనుగుడ్డును అన్ని వైపులకు తిప్పాలి. ఒక వైపు తిప్పడం, అర చేతులు రుద్ది కాపడం పెట్టడం, రెండవ వైపుతిప్పడం మరలా కాపడం పెట్టడం చెయ్యాలి. కంటి మీద, చెవి మీద రెండేసి నిమిషాల చొప్పున వేలితో నొక్కాలి.
శిరస్సుకు సంబంధించిన సమస్యల నివారణకు తులసి తైలం 19-2-10.
అనేకసార్లు వదకట్ట బడిన స్వచ్చమైన వేపనూనెను తీసుకొని మట్టి పెంకులో పోసి పొయ్యి మీద
పెట్టి అది వేడెక్కిన తరువాత కొన్ని తులసి దళాలను వేసి ఆకులు నల్లగా అయిన తరువాత (మాడకుండా) దించి వదపోసుకొని సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని గోరువెచ్చగా చేసి తలకు పూసుకోవాలి.
ఇది శిరస్సులోని మలినాలను పోగొట్టి తలనొప్పిని పోగొడుతుంది.
శిరోవ్యాదులు ---అపస్మారకం ---నివారణ 10-4-10.
శిరస్సులో రక్తం గడ్డ కట్టడం, మాట్లాడుతూ అలాగే వుండి పోవడం ( మౌనంగా ఉండిపోవడం,లేక అపస్మారకం )
శిరస్సులో ఎప్పుడూ సన్న నొప్పి వుండడం, సడన్ గా పడిపోవడం వంటివి జరుగుతూ వుంటాయి.
దీనికి ముఖ్యమైన నివారణ ముక్కుల్లో. చెవుల్లో నువ్వుల నూనె వేసుకోవడం.
కలబంద రసం --- 20 gr
పట్టు తేనె --- 40 gr
దీనిని మోతాదును పెంచుకోవచ్చు.
ఈ రెండింటిని సీసాలో పోసి బాగా షేక్ చెయ్యాలి.తరువాత రెండు రోజులు ఎండలో పెట్టాలి. తరువాత గుడ్డలో వడ పోసుకోవాలి. చుక్కల సీసాలో పోసి భద్ర పరచుకోవాలి.
ఉదయం, సాయంత్రం రెండేసి చుక్కల చొప్పున ముక్కుల్లో వేసుకొని పీల్చాలి. దీని వలన రక్త ప్రసరణబాగా జరుగుతుంది.
దీనివలన తల దిమ్ము, తలపోటు, హిస్టీరియా, మూర్చ వంటి రోగాలు నివారింప బడతాయి. తల చల్లబడుతుంది. రక్త నాళాల్లో గడ్డ కట్టిన రక్తం కరుగుతుంది.
తలనొప్పి --నివారణకు -- శివాంజనం--Ointment 23-5-10 .
ముద్ద కర్పూరం ---- 60 gr
వాము పువ్వు ---- 30 gr
పుదీనా పువ్వు ---- 15 gr
అన్నింటిని కలిపి సీసాలో పొయ్యాలి. కొంత సేపటికి ద్రవ పదార్ధంగా మారుతుంది.
ఆవు నెయ్యి ---- 180 gr
తేనె మైనం ---- 60 gr
ఒక గిన్నెలో తేనేమైనం వేసి సన్న మంట మీద కరిగించి వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. దానిలో ఆవునెయ్యి కలిపి వేడి చేసి దించి చల్లార్చాలి. కొంచం గోరువెచ్చగా వున్నపుడు దానిలో మూడు తైలాల మిశ్రమాన్ని కలపాలి. కొంచం సేపటికి బాగా చల్లారి అంజనం ( Ointment) తయారవుతుంది.
దీనిని తలనొప్పి నివారణకు, వాతనొప్పులకు,జలుబు, గొంతునొప్పి వంటి కఫ సమస్యల నివారణ కు ఉపయోగించవచ్చును.
మైగ్రేన్ (Migrane) 26-5-10.
2 అల్లం రసం చుక్కలను రెండు ముక్కుల్లో వేసుకుంటే రెండు సంవత్సరాలుగా వున్న మైగ్రేన్
తలనొప్పి వారం రోజులలో ఘగ్గుతుంది.
వెల్లుల్లి తో తలనొప్పి నివారణ 2-6-10.
వాతావరణం మారినప్పుడు వచ్చే తలనొప్పి
5, 6 వెల్లుల్లి పాయలను నలగగొట్టి దానిలో ఒక టీ స్పూను తులసి రసం, కొద్దిగా వాము పొడి, మిరియాలపొడి, కొంచం తేనె కలిపి తీసుకుంటే జ్వరంతో కూడిన దగ్గు జలుబు, తలనొప్పి తగ్గుతాయి.
తలనొప్పి ---చికిత్స 18-6-10.
కారణాలు:--
నాడీ సంబందితమైనది
రక్తనాళాలలో కలిగే మార్పుల వలన
ఒత్తిడి ( మానసిక శ్రమ ) వలన
ఒత్తిడి ( మానసిక శ్రమ ) వలన
కంటి చూపు సమస్యల వలన
T. V. ని దగ్గరగా చూడడం
శరీరం లో వేడి చాలా ఎక్కువగా ఉండడం
పైత్యం (పిత్త ప్రకోపం) వలన
జలుబు వలన
మొదలైన కారణాల వలన తలనొప్పి వచ్చే అవకాశం కలదు.
నివారణా చర్యలు:--
సాధారణమైన తలనొప్పి అయితే గోరు వెచ్చని నూనెను తలకు రాసుకోవాలి
దాల్చిన చెక్క ను నుదిటి మీద రాస్తూ వుంటే తగ్గుతుంది.
ఒక గ్లాసు నీటిలో గాని పాలలో గాని చక్కెర కలుపుకొని తాగాలి.
ఉసిరిక ముక్కలను మెత్తగా నూరి ఆ ముద్దను మాడు మీద పెట్టుకుంటే చాలా త్వరగా తగ్గుతుంది.
ఆవు నేతిలో వేలు ముంచి వాసన చూస్తుంటే కొన్ని నిమిషాలలో తగ్గుతుంది.
తంగేడు తో తలనొప్పి నివారణ 3-7-10.
కారణాలు:-- అజీర్ణము వలన, కఫం ఎక్కువ కావడం వలన, వేడి పదార్ధాలను తినడం వలన, తలలో ఎక్కువగా వేడి చేరడం వలన తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.
తంగేడు పూలు, ఆకులు తెచ్చి కచ్చ పచ్చాగా దంచి ఆవు నేతిలో గాని ఆముదం లో గాని వేసి వేయించిఅరటి ఆకులో గాని, ఆముదపు ఆకులో గాని వేసి తలకు కట్టుకుంటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది.
వేడి తగ్గడానికి బార్లీ, టెంకాయ నీళ్ళు, పలుచని మజ్జిగ తీసుకోవాలి.
పైత్యం తగ్గడానికి త్రిఫల వాడాలి.
అజీర్ణం వలన విరేచనం కాకుండా వుంటే లేహ్యాలు వాడాలి. .
24-11-10
తమలపాకును నిలువుగా రెండు భాగాలుగా చీల్చి నుదుటి మీద అంటించాలి.
పైత్య దోషము వలన పురుషులలో శిరోవేదన 29-11-10.
రెండు నిమ్మ కాయల రసాన్ని వడపోసి అర కప్పు నీటిలో కలిపి తాగితే పైత్య శిరోవేదన అప్పటికప్పుడుతగ్గుతుంది.
చింత పండు యొక్క పలుచని రసాన్ని తాగితే కూడా తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
తలనొప్పి ---చంద్ర లేపనం
మెంతుల పొడి ---- 50 gr
ధనియాల పొడి ---- 50 gr
ఉసిరిక ముక్కల పొడి ---- 50 gr
అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయాన్నే ఈ పేస్ట్ ను తలకు పెట్టుకొని గంట తరువాత తల స్నానం చెయ్యాలి. శరీరానికి కూడా పూసుకోవచ్చు.
సూర్యావర్తన శిరోవేదనము 3-12-10.
సూర్యోదయానికి ఒక గంట ముందు ఆవు పెరుగుతో అన్నం తింటూవుంటే శిరోవేదనం తగ్గుతుంది
దాల్చిన చెక్కను సాన రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని రెండు కణతలకు పూయాలి.
దేవదారు చెక్క
పుష్కర మూలం
శొంటి
వట్టివేళ్ళు
నువ్వులు
అన్నింటిని సమాన భాగాలు తీసుకోవాలి. చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు మూడు టీ స్పూన్ల పొడిని తీసుకొని పల్చని గంజితో నూరి తలకు పట్టు వేస్తే అన్ని రకాల తల నొప్పులు మాయమవుతాయి
యాలకుల గింజలను దంచి వస్త్ర ఘాలితం చేసి సీసాలో భద్ర పరచుకోవాలి. చిటికెడు పొడిని తీసుకొని ఒక ముక్కు మూసి ఇంకొక ముక్కుతో నశ్యం లాగా పీల్చాలి.

ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేస్తే సూర్యావర్తన శిరోవేదనం తగ్గుతుంది.
పార్శ్వపు నొప్పి--- నివారణ 3-12-10.
ఇది వాత నొప్పి.
మునగాకు, వావిలాకు, తక్కలాకు ( తక్కలాకు అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది.). ఏదో ఒక ఆకును తీసుకొని కొద్దిగా ఆముదం వేసి వేయించి నొప్పి ఎటు వైపు ఉన్నదో అటువైపు కణతలపై వేసి కట్టాలి.
మెదడులో చెడు పదార్ధాలు చేరకుండా జాగ్రత్త పడాలి.
ఉదయం నిద్ర లేచిన తరువాత కాల కృత్యాలు తీర్చుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని చెవులలో తెల్లనువ్వుల నూనెను రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. ముక్కులలో పుటములనుండి లోపలి కి వెళ్ళే విధంగా వెయ్యాలి.
దీని వలన నూనె మెదడుకు చేరుతుంది.
కొంతనూనె నోట్లో పోసుకుని పుక్కిలించాలి. చేతులకు, కాళ్ళకు మర్దన చెయ్యాలి.
కళ్ళలో వేసుకోవాలి.
దీని వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. చర్మము నున్నగా తయారవుతుంది. ముక్కుల నుండి తుమ్ములు, కఫము రావడం తగ్గిపోతుంది. చెవుల నుండి కారే చీము మొదలైనవి రావు. కాళ్ళలో శక్తి వచ్చి, నడకలో వేగం హెచ్చుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
ఈ విధంగా 40 రోజులు చేయాలి.
శిరో వ్యాధి నివారణకు చేమంతి పూల తైలం 5-12-10.
కొబ్బరి న ---- పావు కిలో
చేమంతి పూల రెక్కల ---- 125 gr
దవనం ---- 10 gr
తుంగ గడ్డలు ---- 10 gr
యాలకులు ---- 10 gr
కచ్చూరాలు ---- 10 gr
దవనం, తుంగ గడ్డలు, యాలకులు, కచ్చూరాలను నీటిలో వేసి కషాయం కాచాలి. దానిలో చేమంతి
రెక్కలను కూడా వేయాలి. కాగిన తరువాత వడపోయాలి.
ఈ కషాయంలో కొబ్బరి నూనె, పాలు కలిపి స్టవ్ మీద పెట్టి నీటి శాతం ఇగిరిపోయి తైలం మాత్రం
మిగిలేట్లు కాచాలి. తరువాత చల్లార్చి వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని ప్రతి రోజు గోరువెచ్చగా తలకురాసుకొని, సున్నితంగా మర్దన చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం
వలన వెంట్రుకల కుదుళ్ళు గట్టి పడతాయి. అన్ని రకాల తల నొప్పులు నివారించ బడతాయి.
తలనొప్పి --- నివారణ 9-12-10.కొబ్బరి న ---- పావు కిలో
చేమంతి పూల రెక్కల ---- 125 gr
దవనం ---- 10 gr
తుంగ గడ్డలు ---- 10 gr
యాలకులు ---- 10 gr
కచ్చూరాలు ---- 10 gr
దవనం, తుంగ గడ్డలు, యాలకులు, కచ్చూరాలను నీటిలో వేసి కషాయం కాచాలి. దానిలో చేమంతి
రెక్కలను కూడా వేయాలి. కాగిన తరువాత వడపోయాలి.
ఈ కషాయంలో కొబ్బరి నూనె, పాలు కలిపి స్టవ్ మీద పెట్టి నీటి శాతం ఇగిరిపోయి తైలం మాత్రం
మిగిలేట్లు కాచాలి. తరువాత చల్లార్చి వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని ప్రతి రోజు గోరువెచ్చగా తలకురాసుకొని, సున్నితంగా మర్దన చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం
వలన వెంట్రుకల కుదుళ్ళు గట్టి పడతాయి. అన్ని రకాల తల నొప్పులు నివారించ బడతాయి.
తల నొప్పి వచ్చినపుడు కొంత మంది దవడలను బిగిస్తుంటారు. కొన్ని సార్లు దవడలను బిగించడం
వలన తల నొప్పి వస్తుంది. దీని వలన దవడ కండరాలకు, తలకు మధ్య వున్న రక్త నాళాల లో సరఫరా సమస్యలు ఏర్పడతాయి. దీని వలన తలనొప్పి వస్తుంది.
దీనిని నివారించడానికి పెన్సిల్ ను పళ్ళ మధ్య ముఖ్యంగా ముందు పళ్ళ మధ్య పట్టుకుంటే తగ్గుతుంది. గట్టిగా నొక్క కూడదు.
25-9-10.
బార్లీ గింజల పొడి
వెనిగర్
కలిపి తలకు పట్టువేస్తే తల నొప్పి తగ్గుతుంది.
తలలో కురుపుల నివారణకు చిట్కా 21-12-10.
వెలమ సంధి అనే ఆకును నూరి పూస్తే తగ్గుతుంది.
అలసట వలన వచ్చే తలనొప్పి 27-12-10.
లవంగాలను నానబెట్టి నూరి వేడి చేసి నుదుటి మీద పట్టు లాగా వేస్తే అరగంటలో తగ్గుతుంది.
పార్శ్వపు నొప్పి --నివారణ 8-1-11.
గసాలు --- 6 gr
ధనియాలు --- 3 gr
మిరియాలు --- 9
అన్నింటిని యొక్క చూర్ణాన్ని కలిపి సూర్యోదయానికి ముందే తీసుకుంటే తగ్గుతుంద
శిరో రోగాలు 29-3-11.
తలనొప్పి
పైపూతకు :--
శొంటి పొడి --- 50 gr
సోంపు గింజల పొడి --- 50 gr
తుంగ ముస్తల పొడి --- 25 gr
అతిమధురం పొడి --- 50 gr
వట్టివేర్ల పొడి --- 25 gr
దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి --- 20 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని పాలతో కలిపి నుదిటిపై పట్టు వేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.
లేదా నిద్రపోవాలి.
దీని వలన అన్ని రకాల తల నొప్పులు నివారింపబడతాయి.
తలలో కురుపుల నివారణకు -- చిట్కా 30-3-11.
మరియు పులిపిర్ల నివారణ
నక్కపెంటి గడ్డలను తెచ్చి ముళ్ళు తొలగించి గడ్డలను కాల్చి బూడిద చేసి కొబ్బరి నూనెలో
కలిపి పూయాలి. దీనితో తలలోని కురుపులు మాని పోతాయి.
దీనిని పులిపిర్ల మీద ప్రయోగిస్తే అవి నివారింప బడతాయి.
పార్శ్వపు నొప్పి --నివారణ 9-4-11.
అధిక కఫం, అధిక వాయువు, అధిక వేడి మరియు మలినాలు తలలో చేరడం వలన ఈ
నొప్పి వస్తుంది.
ఆవు పాలలో చాలా కొద్దిగా ( సగం చిటికెడు) కలిపాలి ఆ పాలలో దూదిని ముంచి ఆ పాల ను రెండు మూడు చుక్కలు ముక్కులో వేసుకోవాలి. ఈ విధంగా రోజుకు రెండు, మూడు సార్లు వేసుకుంటే నొప్పి తగ్గుతుంది.
వేసవిలో వచ్చే పార్శ్వపు నొప్పి-- నివారణ 15-4-11.
వట్టి వేర్ల పొడి --- 50 gr
తుంగ ముస్తల పొడి --- 50 gr
బ్రాహ్మి పొడి --- 50 gr
కరక్కాయల పొడి --- 50 gr
బెల్లం --- తగినంత
అన్నింటిని కలిపి కల్వంలో వేసి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు తయారు చేయాలి.
పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం నీటితో సేవించాలి. ( 2 + 2 )
పార్శ్వపు నొప్పి మరియు అన్ని రకాల శిరోభారాలు ---నివారణ 30-5-11.
కిస్మిస్ --- 20 gr
కలకండ --- 30 gr
రెండింటిని రాత్రి తగినన్ని నీళ్ళలో వేసి నానబెట్టాలి . ఉదయం పరగడుపున ఒక్కొక్కటిగా తిని ఆ నీళ్ళు తాగాలి . ఈ విధంగా రెండు, మూడు వారాలు చేస్తే ఈ నొప్పులు పూర్తిగా తగ్గుతాయి
2. ఉసిరిక పొడి --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
ఆహారానికి ముందు రెండు పూటలా వాడాలి .
3. ఆహారానికి అరగంట ముందు ఆవాల నూనెను రెండు, మూడు చుక్కలు ముక్కుల్లో వేసుకోవాలి
వ్యాయామం :-- పద్మాసనం లో కూర్చోవాలి . ఉంగరపు వేలును బోటనవేలుకు , చూపుడు వేలుకు మధ్యలోకి నెట్టి మిగిలిన మూడు వేళ్ళను ముందుకు చాపాలి . అదే విధంగా రెండవ
చేతిని కూడా పెట్టి రెండు చేతులను చాపాలి .
ఇది సకల శిరోరోగ నివారణ ముద్ర .
తలనొప్పి నివారణకు చిట్కా 10-6-11.
ఆవు నేతిని వేడి చేసి రెండు మూడు చుక్కలు ముక్కుల్లో వేసుకొంటూ వుంటే వారం రోజులలో
నివారింపబడుతుంది
తలపోటు ---- నివారణ 2-7-11.
తుంగ ముస్తల చూర్ణం ---- 25 gr
వట్టి వేర్ల చూర్ణం ---- 25 gr
అతిమధురం వేర్ల చూర్ణం ---- 25 gr
సోంపు గింజల చూర్ణం ---- 25 gr
శొంటి చూర్ణం ---- 25 gr
పాలు ---- తగినన్ని
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
తలనొప్పి తో బాధపడుతున్నపుడు అవసరమైననత పొడిని తీసుకొని దానికి తగినన్ని పాలను కలిపి లేపనం లాగా చేసి నొసటి మీద పట్టించాలి .
పైత్య సంబంధ శిరోవేదనం --- నివారణ 6-7-11.
నలగ గొట్టిన ఉసిరిక ముక్కలు --- 10 gr
నలగ గొట్టిన ధనియాలు --- 10 gr
రెండింటిని రాత్రి పూట మట్టి పిడతలో వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచాలి . ఉదయం స్పూనుతో బాగా కలిపి
వడకట్టాలి . దానిలో పది గ్రాముల పటికబెల్లం లేదా చక్కర గాని కలిపి ఉదయం పరగడుపున తాగాలి గంట వరకు ఏమీ
తినకూడదు .
దీని వలన వేడెక్కిన తల లోని భారం తగ్గుతుంది . కళ్ళు మూసుకు పోవడం , చిరాకు , విసుగు తగ్గిపోతాయి .
సూచన ;--- వేడి చేసే వస్తువులను వాడకూడదు .
శిరో వాతము యొక్క నివారణకు శిరో ఘ్రుతము 30-7-11
గసాలు --- 10 gr ఆవు నెయ్యి ---- 60 gr
చిన్న యాలకుల పొడి --- 10 gr
సోంపు గింజల పొడి --- 10 gr
నీళ్ళు --- తగినన్ని
అన్ని పదార్ధాలను నీళ్ళు పోసి బాగా మెత్తగా గుజ్జుగా నూరాలి . ఈ గుజ్జును ఒక గిన్నెలో వేసి దానిలో నెయ్యి పోసి
స్టవ్ మీద పెట్ట సన్న మంట మీద మాడకుండా కాచాలి . చివరకు నెయ్యి మాత్రమె మిగలాలి . తరువాత వడకట్టి చల్లార్చి
సీసాలో నిల్వ చేసుకోవాలి . దీనిని మోతాదు పెంచి కూడా చేసుకోవచ్చు .
ఉపయోగాలు :--- మామూలు తల నొప్పి , పార్శ్వపు తల నొప్పి నివారింపబడతాయి . నరాలు లాగడం తగ్గుతుంది .
శిరోవేదనము --- నివారణ 7-8-11.
కారణాలు :--- మానసిక రుగ్మతలు , కడుపులో గ్యాస్ చేరడం , తల నొప్పి సూర్యోదయం నుండి ప్రారంభమై , మధ్యాహ్నానికి తగ్గడం .
తలకు రక్తప్రసరణ , వాయు ప్రసరణ సక్రమం గా వుంటే ఎలాంటి వ్యాధులు రావు .
1. వృద్దులకు వాత సంబంధమైన తలనొప్పులు వస్తాయి .
2. మధ్య వయస్కులకు పైత్య సంబంధమైన తలనొప్పులు వస్తాయి .
3. బాల్యంలో కఫ సంబంధమైన తలనొప్పులు వతాయి
1.వాథ సంబంధ తల నొప్పుల నివారణకు :--- తల పట్టేసినట్లు వుంటుంది .
అల్లం రసం ---- రెండు టీ స్పూన్లు
తేనె ---- రెండు టీ స్పూన్లు
వంతాముడం ---- నాలుగు టీ స్పూన్లు
అన్నింటిని కలిపి వేడి చేసి తెల్లవారుజామున తాగాలి కొంతసేపటికి విరేచనం అవుతుంది . ఒకటి రెండు సార్లు
సిరేచనాలు అవుతాయి దీనితో తల నొప్పి తగ్గుతుంది
వావిలాకు , లేత మునగాకు , అవిశాకు తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఆముదం వేసి వాడ్చి తల మీద పరిచి తలకు
గుడ్డ కట్టాలి . దీనివలన వాత సంబంధమైన తలనొప్పులు నివారించబడతాయి . వాయు ముద్ర వేయాలి .
2. అతి వేడి వలన వచ్చే పైత్యసంబంధ తలనొప్పుల నివారణకు :---
ఆహారం లో నెయ్యి ఎక్కువగా వాడుకోవాలి .కొబ్బెర నూనెతో తలంతా మర్దన చేయాలి . వంటలో ఎక్కువగా
ఆముదం వాడుకోవాలి . వరుణ ముద్ర 10 నుండి 20 రోజులు వేస్తె ఎంతో మంచి ఫలితం వుంటుంది .
ఆవు నెయ్యి ---- 50 gr
సబ్జా ఆకులు ---- పిడికెడు
ఒక గిన్నెలో ఆవునెయ్యి పోసి స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టాలి . నెయ్యి వేడెక్కిన తరువాత సబ్జా ఆకులను
వేయాలి . ఆకులు నల్లగా మాడే వరకు కాచాలి . దించి , చల్లార్చి , వడకట్టి సీసాలో పోసి భద్రపరచుకోవాలి .
ఒక్కొక్క ముక్కులో మూడు చుక్కల చొప్పున మూడు పూటలా అంటే ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం వేసుకోవాలి .
కొబ్బరినూనె లేదా ఆముదం లేదా నెయ్యి కణతల మీద , మేడమీద , గొంతు మీద బాగా మర్దన చేయాలి .
కాళ్ళను రెండు పాదాలు మునిగేవరకు చన్నీటి లో పెట్టాలి . ఈ విధంగా చేయడం వలన 10, 15 నిమిషాలలో తలనొప్పి తగ్గుతుంది .
ఆహారంలో వేడి చేసే పదార్ధాలను వాడకూడదు చంద్రభేదన ప్రాణాయామం చేయాలి .
3. కఫసంబంధ మైన తలనొప్పుల నివారణకు :---
గోరువెచ్చని నీటిని ఒక గిన్నెలో పోసి దానిలో పాదాలను పెట్టాలి . ముక్కులో వేడి నూనె చుక్కలు వేస్తె తలలో ఎంత
కఫం వున్నా అద్భుతంగా లాక్కొస్తుంది అదేవిధంగా గోరువెచ్చగా వున్న ఆవనూనేను రెండు , మూడు చుక్కలు చెవుల్లో
వేసుకోవాలి . జలసంహార ముద్ర వేయాలి .
శరీర తత్వాన్ని బట్టి గిట్టని పదార్ధాలను మానుకోవాలి
అన్నింటికీ కలిపి మహా శిరోవ్యాది ముద్ర వేయాలి . ఉంగరపు వేలును మధ్యలోకి వంచాలి . బొటనవేలు , చూపుడువేలు
మధ్యవేలు లను కలిపి పట్టుకోవాలి . చిటికెన వేలును వదలాలి
శిరస్సులోని సమస్యలు --- నివారణ ( తలనొప్పి ) 10-8-11.
అల్లం రసం ---- ఒక టీ స్పూను
పిప్పళ్ళ పొడి ---- చిటికెడు
సైంధవ లవణం ---- "
బెల్లం ---- 5 గ్రాములు
అన్ని పదార్ధాలను కల్వం లో వేసి నూరితే పలచగా అవుతుంది .
ఒక చిన్న గుడ్డను మడిచి దానిలో ఈ పలుచని మిశ్రమాన్ని వేసి ముక్కులో రెండు చుక్కలు పిండాలి . ముక్కులో
మంట పుడితే ముక్కు లోపల తేనె పూసుకోవచ్చు . వెంటనే తల నొప్పి తగ్గుతుంది .
తలనొప్పి ---- నివారణ 17-8-11.
1 చేతిని నేరుగా చాచి బొటన వ్రేలును పైకి లేపాలి . తరువాత రెండవ చేత్తో ఆ బొటన వేలును 100 సార్లు నొక్కాలి
విధంగా ఆహారానికి ముందు చేయాలి .
2. రాత్రి వేళ ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను కలకండ ను వేసి మూత పెట్టాలి . ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని
తాగాలి . ఈ విధంగా వారం రోజులు చేస్తే తల నొప్పి తప్పక తగ్గిపోతుంది .
3. 2. 3 చుక్కల వేపనూనెను ముక్కులో వేసుకుంటూ వుంటే తల నొప్పి తగ్గిపోతుంది .
-.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి