అపెండిసైటిస్

                       అపెండిసైటిస్  లేదా ఆంత్రకృచ్చ వ్యాధి ----నివారణ                11-3-10.

     ఇది చాలా కాలంగా అజీర్ణంతో బాధపడే వాళ్లకు వస్తుంది. అపెండిసైటిస్ మలినాలను తనలో నిల్వ చేసి నెమ్మదిగా విడుదల చేస్తుంది.  అది చెయ్యలేని పరిస్థితులలో విపరీతమైన నొప్పి వస్తుంది.

     వేప, కానుగ, వావో;ఓ, పసుపు వేసి నీటిని కాచి వడపోసి ఎనిమా పాత్రలో పోసి ఎనిమా ఇవ్వడం వలన   అపెండిసైటిస్ లో చేరిన మలిన పదార్ధాలు తొలగి వాపు తగ్గుతుంది.

     చల్లని నీరు ఒక పాత్రలో , మరొక పాత్రలో వేడి నీరు తీసుకోవాలి. నాలుగు మడతల నూలు బట్టను తీసుకొని  మొదట వేడి నీటిలో ముంచి పొట్ట మీద  అపెండిసైటిస్ వున్న చోట వెయ్యాలి. తరువాత దుప్పటి కప్పి నాలుగు నిమిషాలు ఉంచాలి.  తరువాత చల్లని నీటిలో ముంచిన బట్టను వెయ్యాలి.  దీనితో విష పదార్ధాలు కరుగుతూ  బయటకు బహిష్కరింప బడతాయి.

     కొద్దిగా అడవి తులసిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి బాణలిలో వేసి వేడి చెయ్యాలి. దానిలో మూడు, నాలుగు చిటికెల మెత్తటి ఉప్పు పొడిని వేసి బిళ్ళలాగా తయారు చెయ్యాలి. ఆ బిళ్ళను  పొట్ట మీద అపెండిసైటిస్   వున్న చోట వేసి దూది కప్పి, దుప్పాటి కప్పాలి. ఈ పట్టును 48  గంటల్లో మూడు సార్లు ( 16 గంటలకోకసారి)  వెయ్యాలి.  దీనితో వాపు, భరించలేని నొప్పి తగ్గి పోతాయి.

    రాత్రి పూట ఐదు తులసి దళాలను రాగి చెంబులో వేసి ఉదయం ఆ నీటిని తాగాలి.

    సులభంగా జీర్ణమయ్యే అతి మెత్తని పదార్ధాలను తిన వలెను.

    అతి కారం, పులుపు, ఉప్పు, పెరుగు పనికి రావు. 

    ఇదొక ప్రాధమిక చికిత్స  మాత్రమే తప్పని పరిస్థితుల్లో    ఆపరేషన్ అవసరం.

    అరి చేతిలో చూపుడు వేలుకు పూర్తిగా కింద కాకుండా కొద్దిగా పైన 60---70 నొక్కాలి. అలాగే రెండవవైపు  కూడా నొక్కాలి.  అపెండిసైటిస్ సమస్య వున్నవాళ్ళకు అలా నొక్కినపుడు నొప్పిగా అనిపిస్తుంది.  8 గంటల  కొకసారి చొప్పున 2, 3  రోజులు చేస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది.

      అన్ని అవయవాల యొక్క మొదళ్ళు అరచేతుల్లో వుంటాయి.

      వాము, పటికబెల్లం, ఆవు నెయ్యి సమాన భాగాలుగా కలిపి చేసిన అగస్త్య లేహ్యాన్ని ఉదయం, రాత్రి ఆహారానికి గంట ముందు గాని, తరువాతగాని తినడం వలన పై సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది, రాదు, నివారింప బడుతుంది.

                        దీర్ఘ కాలంగా వున్న అపెండిసైటిస్  తగ్గడానికి                        29-11-10.
        పొట్టలో కుడి వైపు నొప్పి అనిపిస్తూ వుంటుంది.
మెంతులు                   --- ఒక టేబుల్ స్పూన్
నీళ్ళు                          ---అర లీటరు
    మరిగించి అర కప్పు కషాయానికి రానివ్వాలి.   వదకట్టుకొని తాగాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే నొప్పి నివారింప బడుతుంది.







.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి