సన్నగా వున్నవాళ్ళు లావు కావడానికి --- ఆహార ఔషధం 3-6-09.
నువ్వుల నూనెను ఆపాదమస్తకం మర్దన చెయ్యాలి. దీని తరువాత సర్వాంగాసనం వెయ్యాలి.
సర్వాంగాసనం:-- మోకాళ్ళు, నడుము, మెడ గుండ్రంగా, పక్కలకు తిపాలి. చేతులను పూర్తిగా చాపి వేళ్ళు ముడుస్తూ మణికట్టు దగ్గర గుండ్రంగా తిప్పాలి. ప్రతిదీ ఐదు ఐదు సార్లు చొప్పున చేస్తే చాలు. బుగ్గలను పూరించాలి. కళ్ళు పైకి కిందికి తిప్పాలి, చెవులు లాగాలి, గిచ్చినట్లు నొక్కుతూ లాగాలి.
దీని వలన సన్నగా వున్న పిల్లలు బలంగా, దృడంగా తయారవుతారు.
నువ్వుల నూనె మర్దన వలన ఎంత లావు అవసారమో అంతే అవుతారు, ఎంత తగ్గాలో అంతే తగ్గుతారు.
తెల్ల జొన్నలు
బార్లీ గింజలు
రెండింటిని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి. తిరగలిలో గాని, మిక్సిలో గాని వేసి రవ్వ లాగా తిప్పాలి. వీటిని వేర్వేరుగా సీసాలలో భద్ర పరచుకోవాలి. ఉదయం ఒక రవ్వను, సాయంత్రం మరొక రవ్వను వాడాలి.
రవ్వలో పాలు పోసి ఉడికించాలి. దానిలో చక్కెర, ఎండుద్రాక్ష వేసి తాగాలి.
బార్లీ పాయసం ఒక పూట, జొన్న పాయసం మరొక పూట తాగాలి.
3 రోజులలో బరువు పెరగాలంటే --చిట్కా 8-3-11.
పోలీసులుగా సెలెక్ట్ కావడానికి, పెళ్లి చూపుల కొరకు అవసరం అవుతుంది.
రోజుకు ఒక డజను అరటి పండ్ల చొప్పున మూడు రోజులు తింటే లావేక్కుతారు.
3 రోజులలో బరువు పెరగాలంటే --చిట్కా 8-3-11.
పోలీసులుగా సెలెక్ట్ కావడానికి, పెళ్లి చూపుల కొరకు అవసరం అవుతుంది.
రోజుకు ఒక డజను అరటి పండ్ల చొప్పున మూడు రోజులు తింటే లావేక్కుతారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి