- ఆస్తమా, క్షయ నివారణకు ---అల్లం పాకం
శ్వాస కోశ సంబంధ,ఉదర సంబంధ వ్యాధులు,అగ్ని మాంద్యము,ఆకలి లేకపోవడం,పిల్లి కూతలు,గొంతులో కఫం,శ్వాస ఆడక పోవడం, చాలా కాలంగా ముదిరిపోయిన పడిశం,ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు,ఆయాసము మొదలైనవి నివారింప బడతాయి,పైత్య రోగాలు కూడా నివారింప బడతాయి.
అల్లం రసం ------- 400 gr
పాత బెల్లం -------- 70 gr
మెంతి పొడి ------- 5 gr
దాల్చిన చెక్క పొడి ------- 5 gr
శొంటి పొడి ------- 5 gr
దో.వే. పిప్పళ్ళ పొడి -------- 5 gr
మిరియాల పొడి ------- 5 gr
యాలకుల పొడి ------- 5 gr
లవంగాల పొడి ------- 5 gr
నాగాకేసరాల పొడి ------- 5 gr
బిర్యాని ఆకు పొడి -------- 5 gr
బాణలి స్టవ్ మీద పెట్టి అల్లం రాసంపోయ్యాలి. బెల్లాన్ని మెత్తగా చేసి వెయ్యాలి.లేత పాకం వచ్చే వరకు
మరిగించాలి.ముందే చూర్ణాలన్ని కలిపి పెట్టుకోవాలి.పాకం రాగానే కలిపిన పొడులన్నీ దానిలో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
ఆహారానికి ముందు అరగంట గాని, గంటగాని పెద్దలకు 10 గ్రాములు,చిన్న పిల్లలకు 5 గ్రాములు,ఇంకా చిన్న పిల్లలకు చాలా కొద్దిగా మూడు పూటలా వాడాలి.40 నుండి 60 రోజులలో తగ్గుతుంది.
ఉబ్బసం, దగ్గు,ఆయాసం, ముక్కునుండి నీరు కారడం --నివారణ 28-12-08.
ఉబ్బసం, దగ్గు,ఆయాసం, ముక్కునుండి నీరు కారడం --నివారణ 28-12-08.
పరాశర భస్మం
అరటి ఆకును చిన్న చిన్న ముక్కలుగా తుంచాలి.కాడలు,పీచులు లేకుండా చేసి బాణలిలో వేసి చిన్న మంట మీద నిదానంగా అట్లకాడ తో తిప్పాలి.ఆకు కాలిపోయి నెమ్మదిగా నల్లని బూడిద మాత్రమే మిగులుతుంది
ఆ పొడిని జల్లించుకొని గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
3 గ్రాముల చిన్న పాత బెల్లం ముక్కను తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి ఒక టీ స్పూను నీళ్ళు పోయాలి స్టవ్ మీద పెట్టి కరిగించాలి. ఆ పానకంలో ఒకటి లేక రెండు టీ స్పూన్ల పొడిని వేసి కలపాలి. ఈ విధంగా రోజుకు ఒక సారి మాత్రమేపరగడుపున తీసుకోవాలి. ఇది శరీరం లోని కఫాన్ని తొలగిస్తుంది.
యోగాభ్యాసం :-- చేతిని పూర్తిగా ముందుకు చాపాలి. V గుర్తుతో చూపుడువేలు,మధ్య వేలు పైకి పెట్టి మరొక చేతితో ఆ వెళ్ళాను బాగా నొక్కాలి.అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.తరువాత రెండు వ్హేతులను చాపి వేళ్ళను కలిపి ఎడమ చేతి బొటన వ్రేలును మాత్రం పైకి లేపాలి. ఈ విధంగా 30 నిమిషాల సేపు ఉదయం,సాయంత్రం అభ్యాసం చెయ్యాలి.
ఉబ్బసం, ఆయాసం --నివారణ 13-2-09
ఉబ్బసం, ఆయాసం తీవ్రంగా వుండి,ఊపిరాడకుండా వున్నపుడు ఎగ శ్వాస వస్తున్నపుడు ఈ క్రింది విధంగా చెయ్యాలి.
ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు, మరొక బకెట్ లో చల్లని నీళ్ళు తీసుకోవాలి. కుర్చీ లో కూర్చొని గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టాలి. తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగాలి.ఒక గుడ్డను చల్లటి నీటిలో ముంచి పిండి గుడ్డను తల మీద వేసుకోవాలిబెడ్ షీట్ కప్పుకోవాలి. ఈ విధంగా 15,20 నిమిషాలు ఉంచాలి. తరువాత చన్నీళ్ళలో రెండు నిమిషాలు కాళ్ళు పెట్టాలి. దీని వలన వ్యాధి యొక్క తీవ్రత తగ్గుతుంది.
ప్రాణాయామం:--
1. సూర్యభేదన ప్రాణాయామం :-- నిటారుగా కూర్చొని కుడి చేతి బొటన వ్రేలు తో కుడి ముక్కుపైన పెట్టాలి. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి. ఎడమ(సూర్య), వేడిగాలి, కుడి(చంద్ర) చల్లని గాలి నిదానంగా గాలి పీల్చి వదలాలి.ఈ విధంగా రెండు వైపులా చెయ్యాలి. ఈ వ్యాయామాన్ని 12-24-48 సార్లు చెయ్యాలి. ఎడమ ముక్కుతో మధ్య వేలు తో మూసి కుడి ముక్కుతో గాలి పీల్చి,కుంభించి, వదలాలి అంటే రేచకము.
2. వేగభస్త్రిక ప్రాణాయామం:-- పైన చెప్పబడిన వ్యాయామాలను చాల వేగంగా చెయ్యాలి.
తెల్ల మద్ది (అర్జున) చెట్టు పై బెరడు తెచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.
వ్యాధిగ్రస్తుడు పౌర్ణమి రోజున ఉదయం నుండి ఉపవాసం వుండాలి.అవసరమైతే గోరువెచ్చని నీరు తాగవచ్చు.
చీకటి పడిన తరువాత నాటు ఆవుపాలు, బియ్యం కలిపి దానిలో కలకండ వేసి పాయసం వండాలి.దీనిని పళ్ళెం లో పోసి వెన్నెలలో తెల్లవారుజామున 4 గంటల వరకు పెట్టాలి. ఈ పాయసం లో ఒక టీ స్పూను తెల్ల మద్ది చెక్క పొడి కలిపి దీనిని ఉబ్బస రోగికి పెట్టాలి.అతడు ఎంత వరకు తినగలడో అంత తృప్తిగా తినిపించాలి.తినిన తరువాత 12 గంటల సేపు మేలుకోవాలి. ఈ విధంగా 3 పున్నములు చెయ్యాలి.
3. చక్కెర కేళి అరటి పండు ను తొక్క తీసి పండును చిన్నచిన్న ముక్కలుగా చేసి అవి మునిగే వరకు ఆవు మూత్రం (మొదటి, చివరి మూత్రం వదిలేసి పట్టాలి) పొయ్యాలి. పరగడుపున ప్రతి రోజు తింటూ వుంటే 40 రోజులలో వ్యాధి నివారింపబడుతుంది.
ఆస్తమా ---నివారణ 24-2-09.
ఆవ నూనెను చాతీ మీద రుద్ది తరువాత వ్యాయామం చెయ్యాలి. భుజంగాసనం వెయ్యాలి.
ఆహారం:--
కరక్కాయల బెరడు చూర్ణం ----- 100 gr
తాని కాయల బెరడు చూర్ణం ----- 100 gr
ఉసిరి కాయల బెరడు చూర్ణం ----- 100 gr
పిప్పళ్ళ చూర్ణం ------100 gr
అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి విడివిడిగా దంచి పొడులను చేయాలి. తరువాత అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.
ప్రతి రోజు పావు టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనెతో సేవించాలి.
దీని వలన Dust Allergy (డస్ట్ అలర్జీ ), దగ్గు, ఉబ్బసం వంటివి నివారింప బడతాయి. 40 రోజులు ఉదయం,సాయంత్రం ప్రతిరోజు తీసుకోవాలి.
ఇది వాడేటపుడు వేడి చేసినట్లనిపిస్తే మోతాదును తగ్గించి వాడుకోవాలి. సమస్య ఎక్కువగా వున్నపుడు మోతాదును మూడు పూటలకు పెంచాలి.
ఆస్తమా --నివారణ 25-2-09.
Dust Allergy (డస్ట్ అలర్జీ),ఎగ శ్వాస, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు వున్నవాళ్ళు తక్షణం ఈ క్రింది వ్యాయామాన్ని చెయ్యాలి.
ఉజ్జాయి ప్రాణాయామం :-- గొంతును బిగించి కుడి ముక్కుతో గాలిని మెల్లగా, దీర్ఘంగా పీల్చి ఎడమ ముక్కుతో నెమ్మదిగా వదలాలి. గొంతులోకి కఫం వస్తే వుమ్మెయ్యాలి.
2. సూర్యభేదన ప్రాణాయామం 3. దీర్ఘ భస్త్రిక 4. భుజంగాసనం
Dust Allergy (డస్ట్ అలర్జీ) కి ఆహార ఔషధం
1 తులసి టీ :--
తులసి ఆకులు ----10
మిరియాలు ----10
అల్లం ---- 2 gr
నీళ్ళు ---- 2 కప్పులు
కలకండ ---- 1 స్పూను
తులసి ఆకులను, మిరియాలను, అల్లాన్ని కచ్చా పచ్చాగా నలగగొట్టి నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. దానిని వడపోసి కలకండ కలిపి గోరువెచ్చగా తాగాలి. తాగిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదు, స్నానం చెయ్యకూడదు.
వాసన తగిలినా, పోపు తిరగమోత వాసన తగిలినా, దుమ్ము తగిలినా విపరీతమైన తుమ్ములు వచ్చే వాళ్ళు 100 రోజులు వాడితే తప్పకుండా తగ్గుతుంది.
2. పసుపుకొమ్ములు ----- 100 gr
గోధుమ గింజలు ----- 100 gr
రెండింటిని విడివిడిగా మట్టి మూకుడులో దోరగా వేయించి కలిపి దంచి జల్లించి భద్ర పరచుకోవాలి.
ఆస్తమా ---- నివారణ 17-7-09.
మెడ దగ్గర నుండి బొటన వ్రేలి వరకు శరీరమంతా ముఖ్యంగా గొంతు మీద నువ్వుల నూనెతో గాని, ఆవ నూనెతో గాని గోరువెచ్చగా చేసి మర్దన చెయ్యాలి.
ప్రతిరోజు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి.
తప్పని సరిగా రెండు చుక్కల ఆవ నూనెను వెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. పిల్లలకైతే ఒక చుక్క వేసి ఆవిరి పట్టాలి. వేడి నీటిలో ఉప్పు, పసుపు వేసి ఆవిరి పట్టాలి. ఆ నీటితోనే కాపడం పెట్టాలి.
కపాలభాతి ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం చేయాలి.
దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి ---- 50 gr
సైంధవ లవణం ---- 50 gr
పాత బెల్లం ----150 gr
అన్నింటిని రోట్లో వేసి దంచాలి. ప్రతి రోజు పది గ్రాముల ముద్దను నోట్లో వేసుకొని చప్పరించాలి.
ఆవు పాలు ---- 400 gr
స్వచ్చమైన నువ్వుల నూనె ---- 100 gr
అతిమధురం పొడి ---- 10 gr
అన్నింటిని ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి తేమ శాతం ఇగిరిపోయి100 గ్రాముల నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ నూనెను రెండు చుక్కలు ముక్కుల్లో వేసుకుంటే ఖచ్చితంగా ఆస్తమా నివారింపబడుతుంది.

రెండు పూటలా ఆహారానికి ముందు అర టీ స్పూను పొడిని తేనె తో నాకాలి. లేదా వేడి నీటితో తీసుకోవాలి.
పిల్లలకు ----రెండు చిటికెలు
పెద్దలకు ---- అర టీ స్పూను
మెడ దగ్గర నుండి బొటన వ్రేలి వరకు శరీరమంతా ముఖ్యంగా గొంతు మీద నువ్వుల నూనెతో గాని, ఆవ నూనెతో గాని గోరువెచ్చగా చేసి మర్దన చెయ్యాలి.
ప్రతిరోజు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి.
తప్పని సరిగా రెండు చుక్కల ఆవ నూనెను వెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. పిల్లలకైతే ఒక చుక్క వేసి ఆవిరి పట్టాలి. వేడి నీటిలో ఉప్పు, పసుపు వేసి ఆవిరి పట్టాలి. ఆ నీటితోనే కాపడం పెట్టాలి.
కపాలభాతి ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం చేయాలి.
దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి ---- 50 gr
సైంధవ లవణం ---- 50 gr
పాత బెల్లం ----150 gr
అన్నింటిని రోట్లో వేసి దంచాలి. ప్రతి రోజు పది గ్రాముల ముద్దను నోట్లో వేసుకొని చప్పరించాలి.
ఆవు పాలు ---- 400 gr
స్వచ్చమైన నువ్వుల నూనె ---- 100 gr
అతిమధురం పొడి ---- 10 gr
అన్నింటిని ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి తేమ శాతం ఇగిరిపోయి100 గ్రాముల నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ నూనెను రెండు చుక్కలు ముక్కుల్లో వేసుకుంటే ఖచ్చితంగా ఆస్తమా నివారింపబడుతుంది.
ఉబ్బసము ---నివారణ ---శ్వాసామృతం 24-5-10.
అల్లం యొక్క నిజ రసం ---- 20 gr
వెల్లుల్లి నిజ రసం ---- 20 gr
ఉల్లి నిజ రసం ---- 20 gr
కలబంద గుజ్జు రసం -----20 gr
తేనె -----20 gr
అన్నింటిని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి గుడ్డ కట్టి నేలలో పాతి పెట్టి 72 గంటల పాటు (3రోజులు) ఉంచాలి. తీసి తుడిచి పెట్టుకోవాలి.
ఉపయోగించే విధానం;-- ఒక టీ స్పూను ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు సేవిస్తే ఉబ్బసం ఎంత తీవ్రంగా వున్నా చాలా త్వరగా నివారింప బడుతుంది.
చిన్న పిల్లలకు --- 5, 6 చుక్కలు
పెద్ద పిల్లలకు --- పావు టీ స్పూను
ఆస్తమా -- వర్ధమాన పిప్పలి యోగము ( రసాయనము ) 11-6-10.
చరక సంహిత అను ఆయుర్వేద గ్రంధములో రసాయన అనే అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడినది.
మొదటి రోజు --- ఒక పిప్పలి
రెండవ రోజు --- రెండు పిప్పళ్ళు
మూడవ రోజు -- మూడు పిప్పళ్ళు
నాల్గవ రోజు --- నాలుగు పిప్పళ్ళు
ఐదవ రోజు --- ఐదు పిప్పళ్ళు
ఆరవ రోజు --- ఆరు పిప్పళ్ళు
ఏడవ రోజు --- ఏడు పిప్పళ్ళు
ఎనిమిదవ రోజు --- ఆరు పిప్పళ్ళు
తొమ్మిదవ రోజు --- ఐదు పిప్పళ్ళు
పదవ రోజు --- నాలుగు పిప్పళ్ళు
పదకొండవ రోజు --- మూడు పిప్పళ్ళు
పన్నెండవ రోజు ---- రెండు పిప్పళ్ళు
పదమూడవ రోజు --- ఒక పిప్పలి
ఈ విధంగా పదకొండు రోజుల వరకు పెంచుకుంటూ వెళ్లి పన్నెండవ రోజు నుండి తగ్గించవచ్చు. ఇది వేడి శరీరం కలిగిన వాళ్లకు వేడి చేస్తుంది. మూడు, నాలుగు రోజుల తరువాత వేడి చేసినట్లుగా వుంటే మధ్యలో రెండు రోజులు ఆపి తరువాత కంటిన్యు చెయ్యవచ్చు.
దీనిని వాడడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా నాశనం చేయబడతాయి.
పిప్పళ్లను ఆవు పాలలో ఉడికించి తీసి వాటిని నమిలి తిని, పాలు తాగాలి.
ఆస్తమా నివారణకు ప్రాణమిత్ర 17-7-10.
ఏక మూలికా ప్రయోగం
50 గ్రాముల ముసాంబరాన్ని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి మాత్రలు కట్టాలి.
చిన్న పిల్లలకు --- పెసర గింజంత
పెద్ద పిల్లలకు --- శనగ గింజంత
పెద్దలకు --- బటాణి గింజంత
నీటితో వాడాలి.
గర్భిణి స్త్రీలు వాడకూడదు. శరీరంలో ఎక్కువ వేడి వున్నపుడు, మూత్రంలో, మలంలో రక్తంపడుతున్నపుడుఇవి వాడకూడదు.
రెండు చేతులను చాపి వేళ్ళను దూర్చి గట్టిగా బిగించి పట్టుకొని రెండు బొటన వ్రేళ్ళను పైకి పెట్టాలి. దీనివలన శరీరంలో వేడి వుత్పన్నమై కఫం నివారింప బడుతుంది.
23-11-10
అరటి కాయను తొక్క తో సహా నిప్పుల ;మీద కాల్చాలి. తొక్క తీసి లోపలి పదార్ధాన్ని తింటే ఆయాసంతగ్గుతుంది.
ఉబ్బసం --నివారణ 1-12-10.
ఇది అలర్జీ వలన అంటే వాతావరణం వలన గాని, ఆహారం వలన గాని రావచ్చు, ఇది చాలా సాధారణమైన వ్యాధి.
ఉపశమనం కోసం:--
ఉల్లి రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
దీనిని రోజుకు మూడు సార్లు తీసుకుంటే తీవ్రత తగ్గుతుంది.
పిప్పళ్ళ ;పొడి ---పావు టీ స్పూను
ఉసిరి పొడి --- పావు టీ స్పూను
శొంటి పొడి --- పావు టీ స్పూను
తేనె --- తగినంత
కలకండ ---- తగినంత
అన్నింటిని కలిపి తినాలి. ప్రతి రోజు మూడు పూటలా తీసుకుంటే తీవ్రత తగ్గుతుంది.
ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
బెల్లం ----- అర టీ స్పూను
ఆవనూనె ----- అర టీ స్పూను
రెండుకలిపి ముద్దగా చేసి 21 రోజులు ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే శాశ్వత ఉపశమనం
కలుగుతుంది.
తినకూడనివి :-- శీతా ఫలం, పాల పదార్ధాలు, కఫాన్ని పెంచే పదార్ధాలు తిన కూడదు
అల్లం, మిరియాలను ఆహార పదార్ధాలలో ఎక్కువగా చేర్చాలి.
ఆస్తమా --- చికిత్స 2-10-10
.
ఇది అంటు వ్యాధి కాదు.
లక్షణాలు:- కొంత మందికి ఊపిరాడక పోవడం,కఫం ఎక్కువగా చేరడం, అజీర్ణం, ఆకలికాక పోవడం వంటి లక్షణాలు వుంటాయి. కొంత మందికి ఈ వ్యాధి పుట్టుకతోనే వుంటుంది, మరికొంత మందికి వారసత్వంగా కూడా వస్తుంది.
శరీరంలో ఇన్ఫెక్షన్ చేరి దగ్గు రావడం దానిని పరిష్కరించుకోక పోవడం వలన క్రమేపి అది ఆస్తమా గా
మారడం జరుగుతుంది.
ప్రారంభ దశలో మూల కారణాలకు చికిత్స చేస్తే కొంత నయమవుతుంది.
ప్రాణాయామం, యోగా తప్పనిసరిగా చేస్తుండాలి. ఏదో ఒక ఔషధాన్ని వాడుతూ వుండాలి.
పిప్పళ్ళు --- 50 gr
మిరియాలు --- 50 gr
శొంటి --- 50 gr
ఉసిరిక --- 100 gr
అన్నింటి చూర్ణాలను కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.
చూర్ణం --- పావు టీ స్పూను
తేనె --- రెండు టీ స్పూన్లు
నెయ్యి --- అర టీ స్పూను
అన్నింటిని కలిపి ముద్దగా చేసి ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకోవాలి.
మొదట ఈ మోతాదులో వాడి తరువాత మోతాదు పెంచుకుంటూ పోవాలి.
ప్రతి రోజు 5, 6 తులసి ఆకులను, అర టీ స్పూను పసుపు పొడిని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ వుంటేమంచిది. సుగంధ ద్రవ్యాలను కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.
ఆస్తమా నివారణకు గృహ వైద్యము
కొంత మంది ఆస్తమా వున్నసమయంలో ఊపిరాడక గబుక్కున లేచి కూర్చోవడం జరుగుతూ వుంటుంది.ఆ సమయంలో నువ్వుల నూనెలో కర్పూరం బిళ్ళ, కొద్దిగా ఇంగువ కలిపి వాసన చూస్తే కొంత రిలీఫ్ గా వుంటుంది.
ముక్కు దిబ్బడ మాత్రమే వుంటే
ప్రతి రోజు రెండు పచ్చి ఉల్లి పాయలను తింటూ వుంటే ఈ సమస్య నివారింపబడుతుంది.
ఆస్తమా నివారణకు భుజంగాసనం, భ్రామరీ ప్రాణాయామం అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రెండువ్యాయామాలను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేస్తూ వుంటే కంట్రోల్ అవుతుంది. ఈ ఆసనాల తరువాతపద్మాసనంలో కొంత సేపు రిలాక్స్ అయి తరువాత శవాసనంలో కొంతసేపు రిలాక్స్ కావాలి.
ఉబ్బసము ---నివారణ 18-6-11.
లక్షణాలు :-- ఈ వ్యాధిలో శ్వాస నాళాలు ఉబ్బి వుంటాయి . కఫం చిక్కగా వుంటుంది . రక్తప్రసరణ సరిగా
జరగదు కాబట్టి కళ్ళు తిరుగుతూ వుంటాయి .చలిగాలిలొ తిరిగినపుడు పొడిదగ్గు, ఆయాసం, పిల్లికూతలు, జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి . కొన్ని రకాల మందులు ముఖ్యంగా ఆస్ప్రిన్ వంటివి
వాడినపుడు సమస్య ఎక్కువవుతుంది .
1. అతిమధురం వేరు చూర్ణం ---- ఒక గ్రాము
వేడి నీళ్ళు ---- పావు కప్పు
చూర్ణం నోట్లో వేసుకొని వేడి నీళ్ళు తాగాలి .
ఈ విధంగా 40, 50 రోజులు వాడితే శ్వాస నాళాలు బాగా తెరుచుకుంటాయి .
2. గోధుమలు
పసుపు కొమ్ములు
రెండింటిని విడివిడిగా వేయించి దంచి పొడి చేసి జల్లించి కలిపి నిల్వ చెసుకొవాలి.
ప్రతి రోజు ఒక గ్రాము పొడిని మంచి నీటితో సేవించాలి . ఈ విధంగా నలభై రోజులు చేస్తే సమస్య నివారింప
బడుతుంది .
3. ఆవాలను మెత్తగా నూరి పక్కటెముకల మీద పట్టు వేస్తె అవి బలంగా తయారవుతాయి .
4. ఖర్జూరం
ఎండుద్రాక్ష
బాదంపప్పు
పటికబెల్లం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు ఉదయం రెండు టీ స్పూన్ల పొడిని సేవించాలి . ఈ విధంగా నలభై రోజులు తీసుకుంటే సమస్య
బాగా నివారింపబడుతుంది
ఉబ్బసము --- నివారణ 26-7-11.
తెల్ల జిల్లేడు పూలు --- 100 gr
మిరియాల పొడి --- 100 gr
రెండింటిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు కట్టాలి . తడి లేకుండా
ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .
ఉదయం , సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున తేనెతో గాని , వేడి నీటితో గాని సేవించాలి .
దీనిని వాడడం వలన చెడు కఫం , శరీరం లోని చెడు నీరు తొలగించబడతాయి . పిల్లికూతలు నివారింపబడతాయి .
ఈ ఔషధం కఫాన్ని తొలగించడం లో చాలా ప్రముఖమైనది .
శ్వాసకోశ వ్యాధి --- ఆస్తమా --- నివారణ 8-8-11.
లక్షణాలు :--- ఆహారం జీర్ణం కాదు , రుచి తెలియదు . శరీరం అతివేడి గా గాని లేదా అతి శీతలంగా గాని వుంటుంది .
పూర్వపు రోజులలో కఫ తత్వ శరీరం కలిగిన వాళ్లకు మాత్రమె ఆస్తమా సమస్య ఉండేది . కాని ఈ రోజులలో
ఈ సమస్య అందరిని వేధిస్తున్నది .
నీరుల్లి రసం ---- 50 gr
వెల్లుల్లి రసం ---- 50 gr
కలబంద రసం ---- 50 gr
అల్లం రసం ---- 50 gr
తేనె ---- 50 gr
ఏమాత్రం కొంచం కూడా తడిలేని , బాగా పొడిగా వున్న గాజు సీసాను తీసుకొని పై పదార్దాలన్నింటి పోయాలి .
తరువాత నెలలో 2, 3 అడుగుల లోతులో గొయ్యి తవ్వి సీసాను ఆ గోతిలో వుంచి గోతిని మట్టితో కప్పెయ్యాలి
ఆ విధంగా నేలలో మూడు రోజులు ఉంచాలి .థరువాథ సీసాను బయటకు తీసి పైన శుభ్రంగా కడగాలి .
ప్రతి రోజు ఒక టీ స్పూను చొప్పున తాగుతూ వుండాలి . చిన్న పిల్లలకు పావు టీ స్పూను తాగించాలి . ఇంకా చిన్న
పిల్లలకు ( పాల ఉబ్బసం ) 4, 5 చుక్కలు తాగించాలి
సూచన :--- గిట్టని పదార్ధాలను తినకూడదు .
లింగ ముద్ర వేయాలి . సూర్యభేదన ప్రాణాయామం చేయాలి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి