బోదకాలు

                                బోదకాలు --నివారణ                              5-6-10.
 
            మన దేశం లోని కోస్తా ప్రాంతాల్లోని , పర్వత ప్రాంతాల్లోని ప్రజలలో ఎక్కువగా వుంటుంది.  ముఖ్యంగా  మన దేశంలో ఇది ఎక్కువ.
 
            కాళ్ళు, చేతులు రొమ్ము మొదలైన భాగాలలో ఎక్కువగా వస్తుంది.
 
            ఈ వ్యాధికి సంబంధించిన క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తరువాత జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన తరువాత  ఈ వ్యాధి బయట పడడానికి మూడు నెలలనుండి  కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు.
 
                                            24-11-10

తమలపాకులు                 --- 7  (మెత్తగా నూరాలి)
సైంధవ లవణం                ---- ఒక గ్రాము
 
  రెండు కలిపి వేడి నీటితో తీసుకుంటే తగ్గుతుంది. 40 రోజులు  వాడాలి.

                                              13-12-10.

         బోద  పురుగులు మోకాళ్ళ నుండి పాదాల మధ్య వరకు వ్యాపించి నివాసం ఏర్పరచుకుంటాయి. ఇవి మూత్ర  పిండాలలోని  లింఫు నాళాలలో చేరి లింఫు గ్రంధులు పని చెయ్యకుండా చేస్తాయి.

         కాళ్ళు లావెక్కడం, గజ్జలలో దురదలు మొదలగు లక్షణాలు వుంటాయి. 

         వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు రావడానికి అవకాశాలెక్కువ.

నిత్యానంద రసం
యోగ రాజ గుగ్గులు
మహా యోగ రాజ గుగ్గులు

       పై ఔషధాలలో దేనినైనా వాడుకోవచ్చును.

సముద్రపాల కాయల గింజలను లేదా కాయలను పెరుగులో నానబెట్టి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి. --10 gr
కరక్కాయల పెచ్చులను ఆముదం లో వేయించి దంచి పొడి చెయ్యాలి                                           --10 gr
తిప్ప తీగ కాండం  రసం లేదా ఎండబెట్టిన  పొడి                          --- 50 gr
పల్లేరు కాయల పొడి                                                             ----50 gr

      అన్నింటిని కలిపి సీసాలో  భద్ర పరచుకోవాలి,  ఈ పొడిని నీటితో గాని, పెరుగు తేట తో గాని తీసుకుంటే  వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

                                                          13-6-11

         ఈ సమస్య వచ్చిన సంవత్సరంలోపు మాత్రమె అయితే వ్యాధి నివారింపబడుతుంది.

కరక్కాయ పొడి                       
బార్లీ నీళ్ళు
పాలు
         అన్నింటిని కలుపుకొని తాగాలి.

         కరక్కాయ పెచ్చులను చిన్న ముక్కలుగా చేసి కొన్ని చుక్కల వంటాముదం వేసి వేయించి
దంచి,  జల్లించి చూర్ణాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి.

        పావు నుండి అర టీ స్పూను చూర్ణాన్ని దేశవాళీ ఆవు మూత్రంలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి.

                                        బోదకాలు --- నివారణకు  --- స్లీపద మంజరి                       16-8-11.
స్లీపద  = బోదకాలు
రకాలు :---  బోదకాలు , బోడ చేతులు ,  బోడ వృషణాలు  అని రకాలున్నాయి .

నెల తాడి గడ్డల చూర్ణం                       ---- 50 gr
ఉత్తరేణి వేర్ల చూర్ణం                             ---- 50 gr
దోరగా వేయించిన పిప్పళ్ళ  చూర్ణం        ---- 50 gr
                     బెల్లం                          ----150 gr

        అన్ని పదార్ధాలను కల్వం లో వేసి మెత్తగా నూరి  10 గ్రాముల మోతాదుగా మాత్రలు తయారు చేయాలి
ఇది మాత్ర కట్టుకు రాకపోతే   10 గ్రాముల చూర్ణాన్ని చప్పరించి నీళ్ళు తాగాలి .

వేపాకు
గోంగూర
         కలిపి నూరి వాపు వున్న చోట వేసి కట్టు కట్టాలి .

                                           




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి