చచ్చు వాతము--సర్వాంగ వాత సమస్య 18-7-09
.
గోరువెచ్చగా చేసిన తైలాన్ని రెండు చేతులకు పూసుకొని రోగి శరీరానికి మర్దన చెయ్యాలి. అన్ని నాడుల యొక్క మూలాలు (ప్రారంభాలు ) కాళ్ళలో వుంటాయి కాబట్టి అరి కాళ్ళకు తైలం రుద్దడం చాలా అవసరం. రెండు చేతుల వేళ్ళతో ముందుకు, వెనక్కు రుద్దుతూ మర్దన చెయ్యాలి. కాళ్ళ మీద అనగా మడమల నుండి తొడల వరకు రెండు చేతుల హస్తాలను కలిపి నెమ్మదిగా కొట్టాలి. కాళ్ళను ఒత్తాలి. అరచేతులతో భుజం తట్టినట్లుగా శరీరమంతా తట్టాలి. పిడికిళ్ళతో శరీరమంతా రుద్దాలి.
వెన్నుపూస చాలా ప్రధానమైనది. దానికి తైల మర్దన చాలా అవసరం
తులసి, వేప, తంగేడు, జిల్లేడు, వావిలి ---ఇవి వాత నొప్పులను తగ్గించడంలో ప్రధానమైనవి. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిలో గుడ్డను ముంచి ఓర్చుకోగలిగినంత వేడిగా శరీరమంతా కాపడం పెట్టాలి.
19-7-09. Continued..
....
వెన్నుపూసలో సమస్య కలిగిన వాళ్ళను, మెడ నిలపలేని వాళ్ళను, కాళ్ళు చచ్చుబడిన వాళ్ళను నులక మంచం మీద పడుకోబెట్టాలి. మంచం యొక్క నాలుగు కోళ్ళను కలుపుతూ గుడ్డలను కట్టాలి. రోగి పై దుప్పటి కప్పాలి.
ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని నీళ్ళు పోసి దానిలో పైన చెప్పబడిన ఆకులను వేసి మరిగించాలి. ఆ పాత్రను మంచం కింద ఒక రాయి గాని, స్టూలు గాని పెట్టి దాని మీద పెట్టాలి. ఆవిరిని వృధా కానీకుండా శరీరానికి బాగా పట్టాలి. రోగికి బాగా చెమట పట్టాలి.
రోగిని బోర్లా పడుకోబెట్టాలి. మరిగించిన నీళ్ళు వేడి తగ్గి వుంటాయి ఆ గిన్నెను మరలా స్టవ్ మీద పెట్టి మరిగించి మరలా రోగి చాతీ భాగానికి ఆవిరిపట్టాలి. ఆ విధంగా మధ్య మధ్యలో వేడి చేస్తూ శరీరమంతటికి ఆవిరి పట్టాలి.
తరువాత తార్కి టవలును ఆ నీటిలో ముంచి ఓర్చుకో గలిగినంత వేడిగా కాపడం పెట్టాలి.
ఈ విధంగా రెండు పూటలాశ్రద్ధగా చెయ్యాలి.
అశ్వగంధ పొడి
కలకండ పొడి
రెండింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని అర టీ స్పూను పొడిని పాలల్లో కలుపుకొని తాగుతూ వుంటే చలనము లేని అవయవాలలో జీవ శక్తి వస్తుంది.
వ్యాయామం:-- పై కార్యక్రమం పూర్తి అయిన తరువాత రోగిని బోర్లా పడుకోబెట్టి రెండు చేతులతో కాలును పట్టుకొని మోకాలు దగ్గర వెనక్కి వంచాలి. అలాగే పట్టుకొని పాదాలను పిక్కలను కదిలించాలి. చేతులను కూడా అదే విధంగావంచుతూ కదిలించాలి..రోగి మెడను వెనకుకకు విరిచినట్లు వంచాలి. అదే విధంగా రోగిని ప్రక్కకు పడుకోబెట్టి కాళ్ళను, చేతులను కదిలించాలి.
తరువాత వెల్లికిలా పడుకోబెట్టి పాదాల వేళ్ళ దగ్గరనుండి గుండ్రంగా తిప్పుతూ కాలును వంచి మోకాళ్ళ దగ్గర పట్టుకొని గుండ్రంగా తిప్పాలి. తొడల దగ్గర కూడా(గజ్జలదగ్గర కూడా) గుండ్రంగా తిరిగెట్లు కాలును తిప్పాలి.
ఆహారనియమాలు:-- అరగని పదార్ధాలను తినరాదు. చల్లని అన్నం, కొత్త బియ్యం, చల్లని పదార్ధాలు తినకూడదు
పాత బియ్యం,పాత గోధుమలు మాత్రమే వాడాలి. బియ్యం, గోధుమలు రాత్రి నానబెట్టి ఉదయం ఎండబెట్టి వేయించి పిండి పట్టించి వాడాలి. కరివేపాకు పొడి, మెంతికూర, తోటకూర, పొన్నగంటి కూర, లేత మునగాకు తినవచ్చు. మాంసం, గుడ్లు, చేపలు తినరాదు.
వాత సమస్యలు ---నివారణ 25-7-09.
పొట్ట, నాభి మొదలైన చోట్ల చెడు వాయువుల చేరిక వలన వాత నొప్పులు వస్తాయి.
కీళ్ళలో వచ్చే నొప్పులకు, నరాలు లాగే నొప్పులకు ఇది తగిన అఆహార ఔషధం .
దోరగా వేయించిన శొంటి పొడి ---- 50 gr
అశ్వగంధ పొడి ---- 50 gr
దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి ---- 50 gr
కలకండ ---- 50 gr
అన్ని పొడులను కల్వంలో వేసి తగినంత ఆవు నెయ్యి వేసి ముద్దలాగా నూరాలి. లేదా చూర్ణాలను అన్నింటిని కలిపి భద్ర పరచుకొని అప్పటికప్పుడు నెయ్యి కలుపుకొని కూడా వాడుకోవచ్చు.
ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు పది గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించాలి.
దీని వలన బలహీన పడిన నరాలకు బలం చేకూరుతుంది. మెదడుకు శక్తి కలుగుతుంది,
అజీర్ణము వలన కలిగిన నొప్పులు నివారింప బడతాయి. కీళ్లలో అరిగిపోయిన గుజ్జు పెరుగుతుంది. మెహ పొడలు కూడా నివారింప బడతాయి. . మాంసాహార పదార్ధాలు తినకూడదు.
వాత ప్రకృతి గల శరీరులను గుర్తించుట 18-3-11.
సన్నగా పొడవుగా వుంటారు. స్వరం గంభీరంగా వుంటుంది. కళ్ళు చాలా ఎక్కువసార్లు
కొట్టుకుంటూ వుంటాయి. ఆకలి ఎక్కువ. చర్మం పొడిగా ఎండినట్లు వుంటుంది. గంభీరంగా
మాట్లాడుతూ వుంటారు. మాట నిలకడ వుండదు.
తీపి, లవణ, ఆమ్ల పదార్ధాలు ఇష్టపడతారు. వాతాన్ని హరించగల కారం, వగరు, చేదు
గిట్టవు.
కీళ్ళ నొప్పులు ఎక్కువగా వుంటాయి.
వాత, పిత్త, కఫ దోషాల నివారణకు హరీతకీ చూర్ణం 10-3-11.
మెత్తని కరక్కాయల చూర్ణం --- 100 gr
దోరగా వేయించిన శొంటి పొడి --- 100 gr
సైంధవ లవణం --- 25 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.
పెద్దలకు --- ఒక టీ స్పూను పొడి
పిల్లలకు --- అర టీ స్పూను పొడి
దీనిని తేనెతో గాని, గోరువెచ్చని నీటితోగాని వాడవచ్చు. ఉదయం పరగడుపున గాని లేదా
రాత్రి నిద్రించే ముందు గాని వాడవచ్చు.
ఇది సర్వ రోగ నివారిణి , మరియు వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి