బాహు మూలాలు

                బాహు మూలాలలో నలుపుదనం,మచ్చలు ---నివారణ                            14-12-10.

            ఈ సమస్య శ్వేతాదిక్యత   వలన, హార్మోన్ల ప్రభావం వలన, ఘాటైన మసాలాలు తినడం వలన, మొద్దుబారిన బ్లేడులు వాడడం వలన ఏర్పడుతుంది.

1. నిమ్మ రసం పూస్తే  మృత కణాలు తొలగింప బడతాయి.

2. బేకింగ్ సోడా రుద్దడం, స్నానం తరువాత ఫేస్ పౌడర్ లో కొద్దిగా బేకింగ్ సోడా  కలిపి బాహు మూలాలలోచల్లాలి

            బేకింగ్ సోడా అల్సర్ ను, చెమటను తగ్గిస్తుంది.

3.   నిమ్మ రసం        --- ఒక టీ స్పూను
      దోసకాయ రసం  ----ఒక టీ స్పూను
      పసుపు పొడి     ---- చిటికెడు

            అన్నింటిని కలిపి పేస్ట్ లాగా చేసి పూసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడగాలి.

4. పెరుగు           --- ఒక టేబుల్ స్పూను
    పెసర పిండి      --- ఒక టీ స్పూను
    పసుపు           --- చిటికెడు
    పాలు              --- ఒక టీ స్పూను

          అన్నింటిని కలిపి పూసి కొంత సేపు వుంచి కడిగి  రోజ్ వాటర్ పూయాలి.







 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి