జలుబు



                                         దీర్ఘకాలిక పడిశము ---నివారణ                    10-12-08.


యోగాసనం :-- జలుబు ఎక్కువగా వున్నపుడు ఆవాల నూనెను, తక్కువగా వున్నపుడు నువ్వులనూనె ను వాడాలి. నూనెను వేడి చేసి ముక్కు మీద ముక్కు పక్కన, గొంతు మీద నెమ్మదిగా మర్దన చెయ్యాలి.

    మెడకు,   వీపు మీద మేరుదండానికి, నూనెను చేతికి పూసుకొని తిప్పుతూ మర్దన చెయ్యాలి.

భుజాల మీద,ప్రక్కటెముకల మీద,పొట్ట మీద రుద్దాలి.తొడలకు, పిక్కలకు, ముఖ్యముగా అరికాళ్ళకు రుద్దాలి.రెండు బొటన వేళ్ళతో అరికాళ్ళపై  కాలి వేళ్ళపై రుద్దాలి.అరికాళ్ళ పైన రెండు బొటన వేళ్ళతో నొక్కాలి.

ప్రాణాయామం చెయ్యాలి. 1 గంట తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాల్లి.

ఆహారం :-- అతిగా కఫాన్ని పెంచే పదార్దాలైన పాలు,పెరుగు, మజ్జిగ వంటివి వాడకూడదు. మజ్జిగలో పసుపు వాడాలి. చక్కెరకు బదులుగా తేనె వాడాలి. రాత్రి పూట అన్నానికి బదులు గోధుమ ఆహారాన్ని వాడాలి.

  ఒక గరిటలో కొబ్బరి నూనె ను తీసుకొని దానిలో 1,2 కర్పూరం బిళ్ళలు వేసి వేడిచేసి కరిగించాలి.    నూనెతో గొంతు మీద,ప్రక్కటెముకల మీద మర్దన చెయ్యాలి.

వేపాకులు                   ----- 100 gr
దో.వే. మిరియాల పొడి     ---- 50 gr

  రెండింటిని కల్వంలో వేసి తగినంత నీరు చేర్చి బాగా మెత్తగా, ముద్దగా నూరాలి.శనగ గింజలంత మాత్రలుకట్టి నీడలో ఆరబెట్టి పూర్తిగా తేమ లేకుండా ఆరిన తరువాత నిల్వ చేసుకోవాలి.

     ప్రతి రోజు రాత్రి పూట ఒక మాత్ర గోరువెచ్చని నీటితో వేసుకోవాలి.సమస్య తీవ్రంగా వుంటే రెండుపూటలా vరెండు మాత్రలు వేసుకోవాలి.

                           జలుబు--దగ్గు --నివారణ                            11-3-09

తులసి ఆరబెట్టి దంచిన పొడి            ----- 100 gr
పుదీనా ఆకు పొడి                            -----100 gr
సుగంధ పాల వేర్ల పొడి                     ----- 100 gr
ధనియాల పొడి                               ----- 20 gr
జిలకర పొడి                                  ------ 20 gr
నల్ల మిరియాల పొడి                      ------ 10 gr
చిన్న యాలకుల పొడి                   ------ 10 gr
దాల్చిన చెక్క పొడి                        ------ 10 gr
జా పత్రి                                        -- -- 10 gr
ఆకు పత్రి పొడి                             ------ 10 gr

    ఒక పాత్రలో 5 గ్లాసుల నీళ్ళు పోసి 5 టీ స్పూన్ల పొడి వెయ్యాలి. పొడి ఎక్కువైనా పరవా లేదు. నీటిలో పొడిని  కలిపి స్టవ్ మీద పెట్టాలి. టీ డికాషన్ లాగా మరిగించాలి. దీనిలో 5 గ్లాసుల పాలు కలపాలి. దానిలో కలకండ పొడి  కలపాలి. మధుమేహం వున్న వాళ్ళు తాటిబెల్లం వేసుకోవచ్చు. కొంచం సేపు పాలు కలకండ తో మరిగించాలి.

     చలి గాలి ఎక్కువగా తగిలే ప్రాంతంలో నివసించే ప్రజలు కఫము తో బాధ పడుతుంటే ఆ
సమస్య నివారింప బడుతుంది.

దీనిని సేవిస్తే తలపోటు, తలదిమ్ము, గొంతు సమస్యలు నివారింప బడతాయి. వాత రోగాలు పోతాయి. దించే   ముందు మరి కొన్ని తులసి ఆకులను వేయవచ్చు, మూడు పొంగులు వచ్చిన తర్వాత వడ పోసుకోవాలి.

                           జలబు --దగ్గు --- నివారణ                                   26-5-10.

అల్లం రసం
తులసి రసం
తేనె
       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి మూడు రోజులు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

                                   జలుబు--ఆయుర్వేద చికిత్స                        15-6-10.

కారణాలు:-- వాతావరణంలో 200 రకాల వైరస్ లు వునతాయి. అవిశారీరంలో చేరినపుడు జలుబు వస్తుంది.

ఇది రోగం కాదు. ఎక్కువైతే వ్యాధి కిందికి మారుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన వస్తుంది. రోగ  సంబంధ సమస్యల వలన, వాతావరణ కాలుష్యం వలన, ఆహార మార్పుల వలన వస్తుంది.

జలుబు వున్నసమయంలో పిల్లలకు వెచ్చని దుస్తులను వెయ్యాలి. ఆవిరి పట్టడం, నీళ్ళు కాచి దానిలో  ఉప్పు, తులసి ఆకులు వేసి పీల్చాలి లేదా మెంతాల్ వేసి గాని విక్స్ వేసి గాని పీల్చాలి.

తులసి ఆకుల రసం                 --- మూడు టీ స్పూన్లు
తమలపాకుల రసం                 --- మూడు టీ స్పూన్లు
మిరియాల పొడి                     ----చిటికెడు
పిప్పళ్ళ పొడి                        ---- చిటికెడు

                  అన్నింటిని కలిపి దానికి తగినంత తేనె కలిపి తీసుకోవాలి.

చిన్న పిల్లలకు            ---- 5, 6 చుక్కలు
పెద్ద పిల్లలకు              ---- ఒక టీ స్పూను
పెద్దలకు                    ---- రెండు టీ స్పూన్లు

జలుబు తోపాటు జ్వరం, దగ్గు వున్నపుడు లక్ష్మి విలాస రసం వంటివి తీసుకోవాలి.

                                          18-11-10.

లక్ష్మీ విలాస రసం మాత్రలను గోరువెచ్చని నీటితో ప్రతి రోజు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి.

ఉసిరికను నేరుగా గాని పొడిగా గాని వేడి నీటితో తీసుకుంటే జలుబు నివారింప బడుతునది.

                                          24-11-10.

తమలపాకులు                     --- రెండు
తులసి ఆకులు                    --- గుప్పెడు
మిరియం గింజలు                --- మూడు

    అన్నింటిని కలిపి నూరి రసం పిండి దానిలో తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫసమస్యలు
నివారింప బడతాయి.
                                       జలుబు నివారణకు వాము                            1-12-10.

    వామును కచ్చా పచ్చాగా దంచి గుడ్డలో వేసి గట్టిగా మూటగట్టి నలిపి వాసన చూడడం వలన ముక్కు  దిబ్బడ, జలుబు తగ్గుతాయి.

                                        జలుబు--రొంప -- నివారణ                          13-12-10.

ఉల్లి రసం                    ---- ఒక టీ స్పూను
అల్లం రసం                 ---- ఒక టీ స్పూను
తేనె ---- ఒక టీ స్పూను

కలిపి ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

                                                        17-9-10

మంచి పెరుగులో మిరియాల పొడిని కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగితే తప్పక తగ్గుతుంది.

                                             తుమ్ములు రాకుండా చికిత్స                        1-10-10.

        ముక్కులోని మ్యూకస్ పొర బయటి చలి గాలిని పీల్చినపుడు వేడెక్కుతుంది. వేడి గాలిని పీల్చినపుడు   చల్లబడుతుంది.

తుమ్ముల సమస్య రావడానికి చాలా కారణాలు వున్నాయి. బహిష్టు సమయంలో ఋతుస్రావం ఎక్కువ  కావడం ఒక్కో సారి తక్కువకావడం, వ్యాధి నిరోధక శక్తి లేక పోవడం మొదలైనవి కూడా కారణాలే.

అల్లం
వెల్లుల్లి'
పసుపు
మిరియాలు

పదార్ధాలను ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒకటి వుండే విధంగా చూసుకోవాలి.
మిరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

                                   జలుబు -- సత్వర నివారణ                             13-1-11.

మిరియాలు                   --- ఒక టీ స్పూను
బెల్లం                            --- ఒక టీ స్పూను
పెరుగు                         --- ఒక గ్లాసు

                   కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.


                                                   12-2-11

     లవంగాదివటి, లాదిటి వంటి ఔషధాలను వాడుకోవాలి.

నువ్వుల నూనెను ప్రతి రోజు రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటూ వుంటే తగ్గుతుంది.

శొంటి పొడి                         ---50 gr
మిరియాల పొడి                 --- 50 gr
వస పొడి                           --- 50 gr
తులసి సమూలం పొడి       --- 100 gr
నల్ల జిలకర పొడి -                -- 50 gr
పాత బెల్లం                      --- తగినంత

     అన్ని చూర్ణాలను  కల్వంలో వేసి బెల్లం కలిపి బాగా మాత్ర కట్టుకు వచ్చేట్లుగా మెత్తగా నూరాలి. శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి, బాగా ఎండిన తరువాత నిల్వ   చేసుకోవాలి.

              పూటకు ఒక్కొక్కటి చొప్పున గాని లేదా రెండు రెండు చొప్పున గాని మూడు పూటలా 
ఉదయం,   మధ్యాహ్నం. రాత్రి వేసుకోవాలి.

                                                     జలుబు ---నివారణ                                          19-6-11.

       జలుబు    ఎక్కువగా చేతుల ద్వారా  వ్యాపిస్తుంది

1. నీటిలో పసుపు వేసి కాచి రాత్రిపూట తాగాలి .
2. వేడి నీటిలో పసుపు తేనె కలుపుకొని  తాగాలి .
3. నీరు ఎక్కువగా తాగాలి .
4. ఒక టీ స్పూను గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలపాలి . సింక్ దగ్గరకు వెళ్లి ఇంకు ఫిల్లర్ తో ఒక చుక్క
    సొల్యుషన్  ను  ఒక ముక్కులో వేయాలి . దీనితో కఫం కారి పోతుంది . అదే విధంగా రెండవ వైపు కూడా
    చేయాలి .

                                వర్షాకాలం లో వచ్చే జలుబు , దగ్గు నివారణకు  --- టీ                         22-8-11.

                   ఇది కఫ సంబంధ సమస్యలను నివారిస్తుంది .

అల్లం తురుము                 --- పావు టీ స్పూను
తులసి ఆకులు                 --- ఎనిమిది
మిరియాల గింజలు           --- రెండు
యాలకులు                     --- రెండు
లవంగాలు                       --- రెండు .  
పుదీనా ఆకులు                --- ఐదు
పసుపు                           --- అర టీ స్పూను
తేనె                               --- ఒక టీ స్పూను
నీళ్ళు                            --- ఒక కప్పు

      స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి . కొంచం మరిగిన తరువాత పదార్దాలన్నింటిని ఒక్కొక్కటిగా వేయాలి .
3, 4 నిమిషాలు మరిగించి , స్టవ్ ఆపి  వడపోసుకోవాలి . గోరువెచ్చగా అయిన తరువాత తేనె కలపాలి  ( ఇది గొంతు నొప్పిని
తగ్గిస్తుంది.)   వేడి గా ఉండగానే సిప్ చేస్తూ తాగాలి . అది గొంతులోకి వెళ్ళినంత దూరం పని చేస్తూ దిగుతుంది .

      అవసరమైతే దీనిని తాజాగా తయారు చేసుకొని రోజుకు రెండు సార్లు తాగవచ్చు .దీని వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్త్స్
వుండవు . 5 , 6 పూటలు  వాడితే మంచిది .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- కఫాన్ని పెంచే ఆహార పదార్ధాలను తినకూడదు .  అరటి పండు , పుల్లటి పదార్ధాలు, ఎసిడిటి
పెంచే పదార్ధాలు వాడకూడదు . వర్షంలో తడిస్తే వెంటనే బాగా తుడుచుకోవాలి

                                                             6-9-11
1. అల్లం  ముద్ద         --- ఒక టీ స్పూను
    పసుపు ముద్ద       --- ఒక టీ స్పూను
    నిమ్మ రసం          --- ఒక టేబుల్ స్పూను
    ఆవ నూనె            --- ఒక టేబుల్ స్పూను    

           ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి . దీనిని జలుబు వున్నవాళ్ళ ముఖానికి , ముక్కు మీద
పోయాలి . అరగంట సేపు అలాగే వుంచి  తరువాత వేడినీటితో స్నానం చేయాలి .  ఈ విధంగా 3 వారాలు చేస్తే ఎంతటి
మొండి జలుబైనా నివారింపబడుతుంది .

                                  దీని తరువాత  కడుపులోకి

2. అల్లం
    బెల్లం
    పసుపు
             ఒక్కొక్క దానిని ఒక్కొక్క టీ స్పూను చొప్పున తీసుకొని కలపాలి . పూటకు ఒక స్పూను చొప్పున మూడు పూటలా కడుపులోకి తీసుకోవాలి .

3. నువ్వుల నూనె           ---- ఒక టీ స్పూను
    నీరుల్లిపాయల రసం    ---- నాలుగు టీ స్పూన్లు

     రెండింటిని ఒక చిన్న గిన్నెలో వేసి సన్న మంట మీద పెట్టి రసం ఇంకి పోయి , నూనె మాత్రమె మిగిలేవరకు కాచాలి .
దీనిని చిన్న సీసాలో నిల్వ చేసుకోవాలి .

     ప్రతి రోజు రెండు చుక్కల చొప్పున  రెండు ముక్కుల్లో వేసుకోవాలి . ఈ విధంగా 2 , 3  వారాలు చేయాలి



                               
 
































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి