పిప్ప్పిగోళ్ళు 18-3-09.
1. కరక్కాయ పెచ్చులను నీళ్ళు పోసి మెత్తగా నూరి ముద్దగా చేసి గోళ్ళకు గోరింటాకు లాగా పెట్టుకోవాలి.
2. కరక్కాయ పొడి ----పావు టీ స్పూను
తేనె ---- ఒక స్పూను
రెండు కలిపి రంగరించి రాత్రి పడుకునే ముందు కడుపులోకి తీసుకోవాలి.గోళ్ళు బాగవుతాయి.
౩ .కొద్దిగా తేనె మైనం తీసుకొని వేడి చేస్తే కరుగుతుంది.దానిలో సమాన భాగంగా బియ్యం కడిగిన నీళ్ళు కలిపి మెత్తగా నూరితే మెత్తటి ఆయింట్మెంట్ తయారవుతుంది.దీనిని గోరింటాకు లాగ పెడితే గోళ్ళు పుచ్చడం తగ్గుతుంది.
గోరుచుట్టు --- నివారణ 7-7-10.
మునగ బంకను మెత్తగా నూరి గోరుచుట్టు పై పెడితే త్వరగా నివారింపబడుతుంది .
గోరుచుట్టు --- నివారణ 7-7-10.
మునగ బంకను మెత్తగా నూరి గోరుచుట్టు పై పెడితే త్వరగా నివారింపబడుతుంది .
నఖ సౌందర్యానికి --- తైలం 21-12-10.
శరీరం లో ఎక్కువైన కాల్షియం గోళ్ళ ద్వారా, వెంట్రుకల ద్వారా విసర్జింప బడుతుంది. నువ్వుల నూనె --- 100 gr
జిల్లేడు ఆకులు --- మూడు
ఉమ్మెత్త ఆకులు ---- మూడు
ఉమ్మెత్త, జిల్లేడు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
నువ్వుల నూనెను స్టవ్ మీద సన్న మంట మీద పెట్టి కాగిన తరువాత జిల్లేడు ఆకుల ముక్కలను నెమ్మదిగా వేయాలి. తరువాత ఉమ్మెత్త ఆకుల ముక్కలను వేయాలి. ఆకులు నల్ల బడిన తరువాత వడకట్టి చల్లార్చిఆ తైలాన్ని సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ తైలాన్ని వుపయోగించి గోళ్ళకు సంబంధించిన అన్ని సమస్యలను నివారించుకోవచ్చు.
గోళ్ళలో ఫంగస్ చేరితే --నివారణ 5-1-11.
గోళ్ళకు ఫంగస్ సోకడం వలన ఇతర శరీర భాగాలు కూడా ప్రభావిత మవుతాయి.
లక్షణాలు :-- గోళ్ళలో ఒకటి గాని ఎక్కువగాని మందంగా తయారవుతాయి. ఇది ఫంగస్ చేరడానికి గుర్తు. గోళ్ళు పగులుబారడం, ఆకారం దెబ్బ తినడం, గోళ్ళు కాంతిని కోల్పోవడం వంటి లక్షణాలు వుంటాయి. గోళ్ళుఊడిపోవడం, వేళ్ళ చివర్లలో నొప్పి, గోళ్ళలో నీచు వాసన వుంటాయి.
కారణాలు :-- గోళ్ళకు సరిగా రక్త సరఫరా జరగక పోవడం వలన, చెప్పుల వలన, స్వేదాదిక్యత వలన రావచ్చు. చెమట ఆరక పోవడం వలన రావచ్చు.
సూచన :--(1) గోళ్ళను ఎప్పుడు పొడిగా వుంచుకోవాలి. సోడా ఉప్పును దూదితో గోళ్ళ మీద అద్దుతూ వుంటే క్రమేపి తగ్గుతుంది.
(2) త్రిఫల చూర్ణం --- ఒక టీ స్పూన్
ఒక జగ్గు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో గోళ్ళను కడుగుతూ వుండాలి.
ఒక జగ్గు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో గోళ్ళను కడుగుతూ వుండాలి.
(3) నీళ్ళలో పని చేసే వాళ్ళు ఎల్లప్పుడూ గ్లవ్స్ వాడుతూ వుండాలి. పరిశుభ్రత పాటించాలి.
(4) దాల్చిన చెక్కను నీళ్ళలో వేసి కషాయం కాచి గోళ్ళ మీద పోస్తూ వుంటే తగ్గుతుంది. టీ బాగ్ ను నీళ్ళలో ముంచి దానితో గోళ్ళను తుడవాలి.
(5) తగిరస గింజల ముద్దకు నిమ్మరసం కలిపి పూయాలి.
(6) పచ్చి వెల్లుల్లి ముద్దను పూయవచ్చు.
పిప్పి గోళ్ళు నివారణ 10-1-11.
గోళ్ళలో మృత కణాలు చేరితే ఫంగస్ చేరి పుచ్చిపోతాయి.
బియ్యాన్ని కలియబెట్టడం మట్టిని కలియబెట్టడం, టేబుల్ డ్రాయర లలో చేతులు పెట్టి వెతకడం ,సబ్బు నీటిలో ఎక్కువ సేపు చేతులుంచడం వంటి కారణాల వలన ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. అందువలన ఈ సమస్య వున్నవాళ్ళు ఈ పనులను మానెయ్యాలి.
1 టంకణం కొద్దిగా తీసుకుని పెనం మీద పెట్టి వేడి చేస్తే పొంగుతుంది. ఇది చల్లారిన తరువాత చూర్ణం చేయాలి.
దీనిని కొద్దిగా తీసుకుని గొల్ల మీద వేసి టేప్ అంటించాలి. దీనితో ఈ సమస్య అద్భుతంగా నివారింప బడుతుంది.
2. కరక్కాయ పెచ్చులకు కొబ్బరినూనె కలిపి నూరి గోళ్ల మీద పూయాలి . దీనితో గోళ్ళ లోని ఫంగస్, దుర్వాసన నివారింప బడతాయి.
3. చెంగల్వ కోష్టు
జీలకర్ర
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి నూరి గోళ్ళ మీద పూయాలి.
గోరుచుట్టు 10-3-11.
కరక్కాయల పొడి ---10 gr
చింతపండు గుజ్జు ---10 gr
కరక్కాయ పొడిని పెనం మీద వేసి కొద్దిగా వేయించాలి. దానికి చిక్కటి చింతపండు గుజ్జును కలపాలి. దీనిని ముద్దగా చేసి గోరువెచ్చగా గోరు మీద టోపీ లాగా తొడిగి ఒక పూటంతా అలాగే వదిలెయ్యాలి.
2. మెంతి ఆకులు ---రెండు గుప్పెళ్ళు
పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు
రెండింటిని ముద్దగా నూరి గోరుచుట్టుకు తొడగాలి. లోపల చీము వుంటే అది పగిలి బయటకు
వస్తుంది.
3. నిమ్మకాయ కు రంధ్రం చేసి గోరుచుట్టుకు తొడగాలి.
పుచ్చిన గోళ్ళ నివారణకు చిట్కా 10-6-11.
కరక్కాయ పొడి
పసుపు పొడి
వేపాకు పొడి
అన్నింటిని కలిపి నూరి పుచ్చిన గోళ్ళ మీద పూయాలి.
గోళ్ళ సమస్య --- నివారణ 29-6-11.
1. పిప్పిగోళ్ళ మీద కరక్కాయను నూరి ముద్దగా పెట్టాలి .
2. కరక్కాయ చూర్ణం
గోరింటాకు చూర్ణం
గుంటగలగర ఆకు చూర్ణం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి సీసాలో భద్రపరాచుకోవాలి .
ఈ చూర్ణాన్ని తగినంత తీసుకొని నీరు కలిపి ముద్దగా చేసి పుచ్చిన గోళ్ళ మీద గోరింటాకు లాగా పెట్టాలి .
గోరుచుట్టు 10-3-11.
కరక్కాయల పొడి ---10 gr
చింతపండు గుజ్జు ---10 gr
కరక్కాయ పొడిని పెనం మీద వేసి కొద్దిగా వేయించాలి. దానికి చిక్కటి చింతపండు గుజ్జును కలపాలి. దీనిని ముద్దగా చేసి గోరువెచ్చగా గోరు మీద టోపీ లాగా తొడిగి ఒక పూటంతా అలాగే వదిలెయ్యాలి.
2. మెంతి ఆకులు ---రెండు గుప్పెళ్ళు
పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు
రెండింటిని ముద్దగా నూరి గోరుచుట్టుకు తొడగాలి. లోపల చీము వుంటే అది పగిలి బయటకు
వస్తుంది.
3. నిమ్మకాయ కు రంధ్రం చేసి గోరుచుట్టుకు తొడగాలి.
పుచ్చిన గోళ్ళ నివారణకు చిట్కా 10-6-11.
కరక్కాయ పొడి
పసుపు పొడి
వేపాకు పొడి
అన్నింటిని కలిపి నూరి పుచ్చిన గోళ్ళ మీద పూయాలి.
గోళ్ళ సమస్య --- నివారణ 29-6-11.
1. పిప్పిగోళ్ళ మీద కరక్కాయను నూరి ముద్దగా పెట్టాలి .
2. కరక్కాయ చూర్ణం
గోరింటాకు చూర్ణం
గుంటగలగర ఆకు చూర్ణం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి సీసాలో భద్రపరాచుకోవాలి .
ఈ చూర్ణాన్ని తగినంత తీసుకొని నీరు కలిపి ముద్దగా చేసి పుచ్చిన గోళ్ళ మీద గోరింటాకు లాగా పెట్టాలి .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి