కాలిన గాయాలు

                                          కాలిన గాయాలకు -- తెల్ల మచ్చలకు                    31-12-08.
 
                         "విశ్వాసమే విజయానికి మూలం " 
 
         బార్లీ గింజలను బాణలిలో వేసి బాగా మాడ్చాలి  దీనిని తీసి నూరి జల్లించాలి.ఈ పొడిని భద్రపరచుకోవాలి
ఆ పొడిని కల్వంలో వేసి తగినంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరాలి.మెత్తని పేస్టు లాగా తయారవుతుంది
దీనిని కాలిన గాయాలకు పూయడం వలన గాయాలు అతి త్వరగా మానుతాయి.
 
                                             కాలిన చర్మం తెల్లగా అయితే
 
        నేరేడు చెట్ల ఆకులు తీసుకొని ముక్కలు చేసి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా బూడిద లాగా అయిన తరువాత జల్లించాలి.దీనిలో నల్ల నువ్వుల నూనె వేసి మెత్తగా నూరాలి. సీసాలో భద్ర పరచాలి. ప్రతి రోజు రెండు పూటలా గాయాల మీద లోపలి ఇంకి పోయ్తట్లు పూయాలి. క్రమేపి తెల్ల మచ్చలు నల్లగా చర్మపు రంగులో కలిసి పోతాయి.
 
                       కాలిన గాయాలకు ఆత్రేయ అగ్నివ్రణ లేపనం                                   14-2-09.
 
                          కరక్కాయ బెరడు ముక్కలు    ------- 100 gr
                          తాని కాయల బెరడు ముక్కలు ------ 100 gr
                          ఉసిరి కాయల బెరడు ముక్కలు -----  100 gr
                                     పత్తి  గింజల తైలం      -----     75 gr
                                            తేనె మైనం         ------    75 gr
 
      స్టవ్ మీద బాణలి పెట్టి అన్నింటిని వేసి సన్న మంట మీద ముక్కలన్నీ నల్లగా మసి లాగా అయ్యేట్లు కలియ బెట్టాలి. వేడి తగ్గిన తరువాత జల్లించాలి.ఈ చూర్ణం ఎంత మెత్తగా వుంటే లేపనం అంత మెత్తగా వుంటుంది.
     ఒక చిన్న పాత్రను స్టవ్ మీద పెట్టి తైలము,మైనము వేసి చాల చిన్న మంట మీద కరిగించి వదపోయ్యాలి.
ఈ తైలం లో త్రిఫలాల భస్మాన్ని నెమ్మదిగా వేస్తూ కలపాలి.ఇది ద్రవ పదార్ధం లాగా వుంటుంది.దీనిలో 10 నుండి 20 గ్రాముల ముద్ద కర్పూరాన్ని చల్లాలి. అది కూడా కరిగి పోతుంది. చల్లని గాలిలో ఉంచితే గడ్డ కడుతుంది.
 
     దీనిని కాలిన గాయాల పై పూస్తే పుండ్లు  చాల త్వరగా మానుతాయి. స్త్రీలకు, పురుషులకు మర్మాంగాల వద్ద వచ్చే పుండ్లు కూడా మానతాయి.
 
                     కాలిన గాయాలు మానడానికి అగ్నివ్రణ లేపనం                                  19-3-09.

                           తంగేడు పూలు             ----- 100 gr
                           కొబ్బరి నూనె               -----   50 gr
                           తేనె మైనం                    -----  50 gr
                           ముద్దకర్పూరం               -----  20 gr

         తంగేడు పూలను నీడలో బాగా గాలి తగిలే చోట ఎండబెట్టాలి.
         ఎండిన తంగేడు పూలను బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా మాడే వరకు వేయించాలి.  నల్లగా బూడిద లాగా తయారయ్యాక స్టవ్ ఆపి చల్లార్చి జల్లెడలో జల్లించాలి. తరువాత తేనెమైనాన్ని వేసి కరిగించి వడకట్టాలి. దీనిలో కొబ్బెర నూనెను మరియు తంగేడు బూడిదను కూడా కలిపి బాగా కలియబెట్టాలి.. వేడి తగ్గిన తరువాత కర్పూరmu కలపాలి. కొంచం సేపు చల్లరనిస్తే ఇది ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. దీనిని వెడల్పు మూత ఉన్న గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
         చర్మం కాలిన వెంటనే దీనిని పూస్తే మంట తగ్గుతుంది చల్లగా వుంటుంది. బొబ్బలేక్కకుండా వుంటుంది.

                                                             9-4- 10
 
        కరివేపాకును మెత్తగా నూరి నూరి పూస్తే మంట తగ్గుతుంది.  కొద్ది రోజులు పూస్తూ వుంటే మచ్చలు కూడా శరీరపు రంగులో కలిసిపోతాయి.

                                                            4-5-10
 
      కలబంద గుజ్జును పిసికి కాలిన గాయాలపై లేపనం చేస్తే వెంటనే మంట తగ్గుతుంది. తక్కువగా కాలినపుడు దీనిని వెంటనే ప్రధమ చికిత్సగా వాడ వచ్చు.
 
     ఇది మచ్చలను కూడా నివారిస్తుంది. రోజు పూస్తూ వుండాలి.
 
     కలబంద అందుబాటులో లేకపోతే తేనె పూయాలి. వెంటనే చల్లబడుతుంది. ఔషధం లాగా పనిచేస్తుంది.
     ఔషలు  అనే మొక్క యొక్క తైలం తేనె తో కలిపి వాడితే ఇంకా బాగా పనిచేస్తుంది.
 
                                                           29-6-10     

      కాలిన వెంటనే సొర చెట్టు ఆకులను ( అనప చెట్టు ) తెచ్చి దంచి రసం తీసి పూస్తే  5,  6 నిమిషాలలో పూస్తే బొబ్బలు రావు. ఇన్ఫెక్షన్ చేరదు. గాయాలు త్వరగా మానిపోతాయి.
 
               కాలిన గాయాలకు అగ్ని వ్రణ సంహారిణి                                               5-7-10.

కరక్కాయ పొడి                    ---- 50 gr 
తాని కాయ పొడి                   ---- 50 gr
ఉసిరిక కాయ  పొడి               ----  50 gr
 
      అన్నింటిని బాణలిలో వేసి బాగా మాడే వరకు వేయించాలి.  చల్లారిన తరువాత అంతటిని కల్వంలో వేసినువ్వుల నూనె కలిపి బాగా మెత్తగా నూరాలి. ఇది లేపనం లాగా తయారవుతుంది. దీనిని సీసాలో నిల్వ చేసుకోవాలి.  ఇది ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
ఉపయోగాలు:-- కాలిన గాయాలపై వెంటనే పూయాలి. తెల్ల మచ్చలు రాకుండా, పుండ్లు పడకుండా,  కాకుండా కాపాడుతుంది.   కావాలంటే కొద్దిగా కర్పూరం కలుపుకోవచ్చు. 
     దీని  వలన సుఖ వ్యాధుల వలన ఏర్పడే పుండ్లు కూడా మానిపోతాయి

                                                             24-11-10 


               పది  తమలపాకులను రసం తీసి దానితో గాయాన్ని కడగాలి.  తరువాత నెయ్యి, తేనె కలిపి పూస్తే గాయం త్వరగా మానుతుంది మచ్చ కూడా పడదు.

                                                              20-12-10

               ఒక చేతి వేలు కాలినపుడు  రెండవ చేతి వేలుతో ఆ ప్రదేశంలో గట్టిగా నొక్కాలి.  దీని వలన సహజమైన ఉష్ణోగ్రత వస్తుంది. బొబ్బలేక్కవు.

        
    కాలిన గాయాలు, వ్రణాలు మానడానికి   శతదౌత  ఘ్రుతం                               26-12-10.
 
పేరిన ఆవు నెయ్యి                 ---- పావుకిలో
చల్లని నీళ్ళు                         ---- బిందెడు


విశాలమైన  స్టీలు పాత్ర లేదా కంచు పాత్ర
 
       ఆవు నేతిని పాత్రలో పోసి అర లీటరు నీళ్ళు పోసి బాగా చేతితో  పిసకాలి.  ఈ విధంగా  30 -- 40 సార్లు పిసికిఆ నీటిని వంచేయ్యాలి. ఈ విధంగా  100  సార్లు కడిగితే అంత మంచి ఔషధ లక్షణాలు వస్తాయి. 1000  సార్లు కడిగితే సహస్ర దౌత ఘ్రుతం అవుతుంది

                     కాలిన గాయాలు-- నివారణ                                                    3-1-11.

మొదటి దశ :-- పై పోర మాత్రమే కాలడం,   దీనిలో చర్మం ఎర్రగా కమిలి  వాపు,  నొప్పి  వుంటాయి.

రెండవ దశ  ;-- రెండవ పోర కూడా కాలడం,  దీనిలో నీటి బోబ్బలు తయారవడం ( తీవ్రతరం) తీవ్రమైన నొప్పివాపు వుంటాయి  మూడు  అంగుళాల కు ముంచి కాలితే  తొడలు,  పిరుదులు  కాలితే జాగ్రత్త వహించాలి.

మూడవ దశ :-- శరీరంలో అన్ని భాగాలు  లోతుగా కాలడం.  దీనిలో శ్వాస పీల్చుకోవడం  కష్టతరమవుతుంది.

నివారణ,  చికిత్స :-- మొదటి దశలో చల్లని పంపు నీళ్ళ కింద  నొప్పి తగ్గే వరకు ఉంచాలి. లేదా పలుచని గుడ్డనుచుట్టాలి. దూది  కప్పకూడదు. ఐస్ వాడకూడదు  దీని వలన రక్త ప్రసరణ  ఆగి పోతుంది..
          రెండవ స్థాయి లో దుస్తులను తొలగించడానికి ప్రయత్నించ కూడదు. చల్లని నీళ్ళు ప్రయోగించకూడదు.
 
దీని వలన శరీర ఉష్ణోగ్రత  తగ్గుతుంది.  కాలిన గాయానికంటే  గుండె  పైకి  ఉంచాలి. గుడ్డను కప్పి ఉంచవచ్చు.

1.  కలబంద గుజ్జును నీళ్ళతో కడిగి గాయం మీద కప్పితే మచ్చ పడదు.

2.  నువ్వుల నూనె
     కొబ్బరి  నూనె
 
            రెండింటిని  సమంగా కలిపి పూయాలి.
             పలుచని శుభ్రమైన గుడ్డను తీసుకొని ఆ తైల మిశ్రమం లో ముంచి గాయం పై పరిచి గాజ్ గుడ్డతో కట్టు కట్టాలి .
            
             మాంసకృత్తులు  ( పప్పులు ) ఎక్కువగా వున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే గాయం త్వరగా మానుతుంది .  గాయం లో ఇన్ఫెక్షన్ చేరితే చీము పడుతుంది .  అంతే గాని పప్పులు తినడం వలన కాదు .
          

3.    100 గ్రాముల నేరేడు ఆకులను ముద్దగా నూరి అర లీటరు ఆవనూనె కలిపి తైలం తయారు చేసి ప్రయోగించాలి.

4.  ఒక స్పూను మెంతులను మెత్తగా నూరి గాయం పూయాలి . ఈ విధంగా రెండు, మూడు రోజులు చేస్తే గాయం త్వరగా
     మానుతుంది .     ( 2-7-11 )

                                        కాలిన గాయాలు మానడానికి  --- చికిత్స                           17-8-11.
      కకలడం  3 దశలు  గా వుంటుంది .

      ఈ చికిత్స ద్వారా  మొదటి దశ  కాల్పులను , రెండవ దశలోని ప్రధమ భాగం మాత్రమె నాయమవుతావి మూడవ
దశలో మాంసం ,  క్రొవ్వు , ఎముకలు కాలి పెద్ద గాయాలు అవుతాయి .  కాబట్టి వీటిని ఈ ఔషధం ఉపయోగించ కూడదు .వైద్యుల సలహా తప్పక తీసుకోవాలి .

1. ఉల్లి పాయ                   ---- సగము
    చన్నీళ్ళు                    ---- ఒక గ్లాసు

       కాలిన ఐదు నిమిషాల తరువాత  నీటిని  గాయం మీద ధారగా పోయాలి .  తరువాత  ఉల్లిపాయతో నెమ్మదిగా
గాయం మీద రుద్దాలి . ఈ విధంగా చేయడం వలన గాయం సెప్టిక్ కాదు

2. పసుపు పొడి                  ---- ఒక టీ స్పూను
    పెరుగు                        ---- ఒక టీ స్పూను

      ఒక ఘిన్న గిన్నెలో రెండింటిని వేసి బాగా కలిపి గాయం మీద మలామ్  లాగా పూయాలి .

సూచన :--- గాయం మీద నోటితో వూడకూడదు . అలా ఊదితే నోటిలో సూక్ష్మ జీవులు గాయం లో చెరీ గాయం పెద్దది
అవుతుంది

ఆహారం :--- మాంసాహారం , మాంస రసం , కోడిగుడ్డు , పప్పులు ఎక్కువగా తింటూ వుండాలి . దీని వలన గాయం లో
నష్ట పోయిన మాంసం అభివ్రిద్ది చెందుతుంది .


      
                      
                                 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి