పరికర్తిక

                                    పరికర్తిక --నివారణ                             29-5-10.
 
           ఎక్కువసేపు కూర్చునే వాళ్లకు, మలబద్ధకం వున్నవాళ్ళకు, మాంసాహారం ఎక్కువగా  తినేవాళ్ళకు,ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
 
          గుదము చుట్టూ ముళ్ళు లాగా వుంది చీము కారుతూ వుంటుంది.  మల విసర్జనకు వెళ్ళినపుడు  ప్రక్కన వున్న చీలికల ద్వారా రక్తం కారుతూ వుంటుంది.
 
          ఈ వ్యాధి వున్నవాళ్ళు ఎక్కువసేపు కూర్చోకూడదు.  ఆహారపు అలవాట్లు మానుకొని మలబద్ధకం లేకుండా  చూసుకోవాలి.

 నూనె పదార్ధాలను నివారించాలి. నీటితో ఉడకబెట్టిన పదార్ధాలను ఎక్కువగా వాడాలి
 
1. ఒక గ్లాసు వేడి నీటిలో రెండు స్పూన్ల త్రిఫల చూర్ణాన్ని , రెండు గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని కలిపి రాత్రి పూట తాగాలి.
 
2.  5, 6  టీ స్పూన్ల త్రిఫల కషాయాన్ని గోరువెచ్చని  నీటిలో పోసి దానిలోకొంత సేపు  కూర్చోవాలి..తరువాతశుభ్ర పరచి జాత్యాది తైలాన్ని పూసి దూదిని ఒత్తిగా పెట్టాలి. 
3. త్రిఫల గుగ్గులు అనే మాత్రలను పూటకు రెండేసి చొప్పున మూడు పూటలా ఉ+మ+సా  ఆహారం తరువాత సేవించి  గోరువెచ్చని నీటిని తాగాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి