చికెన్ గునియా

                      చికెన్ గునియా ----చికిత్స                                             2-9-10.

                 ఇది వైరస్ వలన వస్తుంది.  ఈజిప్ట్ లో   ఈడిస్ అనే దోమ కుట్టడం వలన ఈ వ్యాధి వస్తుంది,  ఈ దోమ పొట్ట మీద తెల్లని చారలుంటాయి. ఇది ఉదయం 11  గంటల నుండి  సాయంత్రం 4 గంటల వరకు యాక్టివ్ గా వుంటుంది.   ఇది వున్నప్రదేశం నుండి  50  మీటర్ల వరకు మాత్రమే ప్రయాణం చేయగలుగుతుంది.

               ఈ వ్యాధి వున్నపుడు  శరీర భాగాలలో వంకర్లు ఏర్పడతాయి.  ఇది టాంజానియాలో ప్రారంభమైనది.  ఆ భాషలో చికెన్ గున్యా అంటే వంచబడిన అని అర్ధము.

లక్షణాలు:--  24  గంటల లోపల విపరీతమైన జ్వరము, ప్రత్యేకమైన విపరీతమైన కీళ్ళనొప్పులు, ఆకలి లేకపోవడం   శరీరంపై రాష్  తీవ్రమైన తలనొప్పి, కొన్ని సార్లు నోటిపోక్కులు, విపరీతమైన నీరసం, నిస్త్రాణ, నడవలేని పరిస్తితి , తీవ్రమైన కండరాల నొప్పులు వంటి లక్షణాలు వుంటాయి.

             వ్యాధి నివారణ చర్యలతోబాటు ఎందుకు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి.

                                     జ్వర నివారణకు  సుదర్శన చూర్ణము

   ఇది యాభై రకాల మూలికలతో తయారు చేయబడినది.

    ఒకటి నుండి ఆరు గ్రాముల చూర్ణాన్ని చిన్న పిల్లలకు వాడితే తగ్గుతుంది.

                     చికెన్ గునియా --సంధిక సన్నిపాత జ్వరం                                       17-11-10.

             ఇంటిలో పొగ వెయ్యడం వలన బాక్టీరియా నశిస్తుంది.

లక్షణాలు :-- ఇది దోమ కాటు వలన వస్తుంది. దోమల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది,  అంతే కాని    ఇది అంటువ్యాధి కాదు.

             ఈ వ్యాధిలో కీళ్ళ నొప్పులు, శరీరమంతా నొప్పులు  వుంటాయి. రోజు రోజుకు నొప్పులు పెరుగుతాయి.

కాళ్ళలో, పాదాలలో, చేతులలో వాపు వుంటుంది.  104 డిగ్రీల జ్వరం వరకు పెరుగుతుంది. ఆకలి వుండదు.

మహా యోగ రాజ గుగ్గులు
అమృతాది కషాయం
అమృతాది గుగ్గులు

    వీటిలో ఏదైనా ఒకటి తెచ్చి వాడవచ్చును.

శొంటి పొడి                       --- 50 gr
శతావరి చూర్ణం                --- 50 gr
తిప్ప తీగ పొడి                ---100 gr
దేవదారు చెక్క పొడి         ---  50 gr
గంధ కచ్చూరాలు            ---  50 gr
త్రిఫల చూర్ణం                  ---100 gr
తులసి  ఆకుల పొడి        ---   50 gr
దుంప రాష్ట్రం                  ---  50 gr

      అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
      ఒక స్పూను పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి అర గ్లాసుకు రానిచ్చి ఉదయం,  రాత్రి తాగుతూ వుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి.    తగ్గిన తరువాత ఆపెయ్యాలి.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి