ఆహార నియమాలు
అల్పాహార ఔషధం 15-1-11.
ఇది తీసుకుంటే రోజంతా శక్తివంతంగా వుంటారు
ఎండు ఖర్జూరాలు --- 3
బాదం పప్పులు --- 4
యాలకులు --- 2
సోంపు గింజలు --- ఒక టీ స్పూను
నెయ్యి --- అర టీ స్పూను
పాలు --- అర గ్లాసు
నెయ్యి, పాలు మినహా మిగిలిన వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం బాదం పప్పుల పై పొట్టును తొలగించాలి. యాలకుల తొక్క ను తీసి గింజలను తీసుకోవాలి. అన్నింటిని పాలు, నెయ్యి కలిపి మెత్తగా నూరాలి.
ఉదయం కాఫీ, టీ తరువాత తీసుకోవచ్చు.
ఇది తీసుకుంటే ఆకలి వుండదు. ఒక వేల ఇంకా ఆకలిగా వుంటే కొద్దిగా తీసుకోవచ్చు. దీనిని బ్రెడ్ ముక్క మీద పూసి తినవచ్చు.
ఈ ఆహారం ఎండిన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. దీనినిఆకలి తగ్గినపుడు కూడా వాడుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి