ఆకు కూరలు --- ఆయుర్వేద ఉపయోగాలు

                                ఆకు కూరలు --- ఆయుర్వేద ఉపయోగాలు

                                                   పాలకూర ( జీవంతి )                                     5-3-11
.
                  ఇది చలవ చేస్తుంది. ఉత్తమోత్తమమైనది.
1. కళ్ళమంటల నివారణ :-- పాల కూరను మెత్తగా గ్రైండ్ చేసి ముద్దను కళ్ళ మీద పరిచికట్టు
కట్టాలి. కళ్ళమంటలు వెంటనే తగ్గుతాయి.
2. క్యాన్సర్ :-- దీనిలో క్యాన్సర్ క్రిములకు వ్యతిరేకంగా పోరాడే పదార్ధాలు వున్నాయి.
దీనిని తరచుగా కూర లాగా వాడుకోవాలి. వ్యాధి నియంత్రణలో వుంటుంది. ఇది రుజువు చేయ
బడినది.
3. మధుమేహం :-- పాల కూరను మిక్సిలో వేసి గ్రైండ్ చేసి వడకట్టి రసం తీయాలి. ప్రతి రోజు
ఆహారానికి ముందు అర కప్పు రసాన్ని తాగుతూ వుంటే మధుమేహం నివారింప బడుతుంది.
4. విష పదార్ధాలు పొరబాటున కడుపులోకి ప్రవేశిస్తే :--
50 గ్రాముల పాలకూర రసాన్ని తాగితే వాంతి అయి విషం బయటకు వస్తుంది.

                                              చుక్క కూర                                                      15-3-11.

          దీనిలో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి.

          ఇది బలహీనంగా వున్నవాళ్ళకు,  ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లకు, ఎదిగే పిల్లలకు
  ఎంతో ఉపయోగకరం.

  రక్తహీనత :-- గర్భిణీ స్త్రీలు కూడా ఈ కూరను వాడుకోవచ్చు.

                    చుక్కాకు రసం           --- ఒక టీ స్పూను 
                           తేనె                   ---  ఒక టీ స్పూను 

           కలిపి తీసుకోవాలి.

  గొంతునొప్పి :--  ( టాన్సిల్స్ వలన నొప్పి):--

                    చుక్కాకుతో కాచిన కషాయం       --- పది గ్రాములు
                                       ఉప్పు                    --- ఒక టీ స్పూను 

           కషాయంలో ఉప్పును బాగా కరిగించి నోట్లో పోసుకుని గులగరించి,  పుక్కిలించి ఉమ్మేయ్యాలి.
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి