ఇతర వ్యాధులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇతర వ్యాధులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

క్షయ వ్యాధి

                                   క్షయ  వ్యాధి --నివారణ                                                   25-11-10

     వర్ధమాన పిప్పలి యోగాన్ని పాటించాలి.
           
     ఇది               అను అంశము లో చేర్చబడి యున్నది.

పిత్తాశయము (గాల్ బ్లాడర్ )

                   పిత్తాశయము (గాల్ బ్లాడర్ ) లో రాళ్ళు--నివారణ            25-5-10.
 
       అతి ముఖ్యమైన గ్రంధులలో కాలేయము ఒకటి.ఇది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసాన్ని పిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కో సారి రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది.

  గాల్ బ్లాడర్  లో Bile juice, bile salts, కొవ్వు కణాలు, నీరు  వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగా కదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములో మార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.

ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలన సమస్యలు ఏర్పడతాయి.
 
మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
 
ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా సమస్య ఏర్పడుతుంది.
 
లక్షణాలు;-- సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనే పొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పి రావడం జరుగుతుంది.
 
                                                        నారికేళ లవణం
 
    లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగా వున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచును తొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోని నీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణం పొడితో నింపాలి.
 
      ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టి పూసి టెంకాయ కనబడకుండా గుడ్డను చుట్టాలి. బాగా ఆరనివ్వాలి. 10 15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయ చుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయను పగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.
దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
      పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపి ఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.
విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా నివారించుకోవచ్చు.
 
దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూల మొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది.
 
పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమం తప్పకుండా కడుపులో నొప్పి రావడం.

                                         పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే                              13-6-11.

జాజికాయ
జాపత్రి
పచ్చకర్పూరం

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి.

       ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు
వాడాలి.

కుష్టు

                                   కుష్టు --- నివారణ                                                    20-2-10.
కృష్ణ తులసి దళాల పొడి
దోరగా వేయించిన శొంటి పొడి
      సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
      ఆహారానికి గంట ముందు మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని తీసుకొని వేడి నీటితో సేవించాలి.
     తులసి, మారేడు, వేప  రసాలను కలిపి పండ్లకు పూస్తుంటే 6 నెలల నుండి ఒక సంవత్సరము వరకు పూస్తుంటే నయమవుతాయి.

      ఉప్పు, పులుపు, కారం పూర్తిగా విసర్జించాలి.  చింత పండు పనికి రాదు. ఆవకాయ, పచ్చళ్ళు, ఆవాలు, వంకాయ, గోంగూర, మినుములు, చేపలు, గుడ్లు, మేక మొదలైనవి నిషిద్ధం.

                      కుష్టు వ్యాధి నివారణ                                               25-12-10.
       ఈ వ్యాధి బ్యాక్టీరియ ద్వారా  సంక్రమిస్తుంది.   ఇది నెమ్మదిగా జ్వరముతోప్రారంభమవుతుంది.  కాని  దీనిని వెంటనే గుర్తించడం కష్టం.  తీవ్రమైన తరువాత దీనిని అంటువ్యాధిగా గుర్తించవచ్చు.  దీనిని ప్రారంభ దశలో నివారించ వచ్చు,  తీవ్ర స్థాయిలో కష్టం.
రస మాణిక్య
పంచ తిక్త గుగ్గులు
   వీటిలో దేనినైనా వాడుకోవచ్చు.
బావంచాల పొడి               --- 100 gr
తిప్పతీగా పొడి                 ---100 gr
గలిజేరు వేరు పొడి           --- 100 gr
పిప్పళ్ళ పొడి                  --- 100 gr
పసుపు పొడి                    --- 200 gr
సూచనలు :-- బావంచాలను  రాత్రి పూట గోమూత్రంలో నానబెట్టాలి. ఉదయం ఎండబెట్టాలి,  ఈ విధంగా గోమూత్రం పోస్తూ ఎందబెడుతూ  ఇరవై రోజులు చేయాలి.  పిప్పళ్ళను  నిమ్మ రసంలో నానబెట్టి ఎండబెట్టాలి.
     అన్ని పదార్ధాలను  విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
     ఒక టీ స్పూను పొడిని గోమూత్రంతో గాని లేదా గోఅర్కం తో గాని కలిపి సేవిస్తుంటే   ఈ వ్యాధి ప్రాధమిక దశలోనే  నివారింప బడుతుంది.  తీవ్ర దశలో  తీవ్రతను తగ్గించి  వ్యాధి పెరగకుండా కాపాడుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు :--  రోగ నిరోధక శక్తి లేని   వాళ్లకు ఈ వ్యాధి త్వరగా తీవ్రమవుతుంది.
      ఈ వ్యాధి వున్నవాళ్ళు వేరే వాళ్ళతో కలవకూడదు.  సబ్బు , టవలు వంటివి వేరుగా ఉంచుకోవడం మంచిది,







పోలియో

           అంగ వైకల్య సమస్యలను నివారించే పునర్నవ తైలం                                     8-8-09.
        ఈ తైలం ఏ అవయవం బలహీన పడివుంటే దానిని పునరుద్ధరిస్తుంది.
                                           పునర్నవ     =   తెల్ల గలిజేరు
తెల్ల గలిజేరు ఆకులు        ---- అరకిలో
నువ్వుల నూనె               ---- పావు ;కిలో
     స్టవ్ మీద నూనె పెట్టి కొంచం  వేడెక్కిన తరువాత ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి నూనెలో వెయ్యాలి, ఆకులు నల్లబడే వరకు కాచాలి (మాడ కూడదు)  చల్లారిన తరువాత జాగ్రత్తగా వదపోసుకోవాలి. గాజు సీసాలో నిల్వ  చేసుకోవాలి.
     కాళ్ళు, చేతులు పనిచేయని పరిస్థితులలో, నరాలు బలహీనంగా వున్నపుడు పిల్లలు సరిగా మెడ నిలపలేక   పోయినపుడు  తిమ్మిర్లుగా వున్నచోట ఈ తైలంతో మర్దన చేస్తే ఆయా అవయవాల లో శక్తి పుంజుకుంటుంది.
ఈ తైలాన్ని గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి. వెన్నుపూస మీద తైలం పూసి రెండు బొటన వేళ్ళతో నెమ్మదిగా మర్దన చెయ్యాలి.  తైలంతో ఆపాదమస్తకం మర్దన చెయ్యవచ్చు.







కలరా

                                   కలరా ---నివారణ                                             29-11-10.

కాకర కాయ రసం            ----  రెండు టీ స్పూన్లు
నువ్వుల నూనె               -----  ఒక టీ స్పూను
     రెండింటిని కలిపి రోజుకు రెండు సార్లు తీకుంటూ వుంటే కలరా తగ్గుతుంది.

క్లోమము

            బహిష్టు సమస్యలవలన క్లోమ గ్రంధికి వచ్చే వ్యాధుల నివారణ                      18-6-09.
 
              ఇది నాభి దగ్గర వుంటుంది.
 
              నాలుగైదు నెలలు బహిష్టు రాక పోవడం వలన క్లోమ గ్రంధిలో సమస్యలు ఏర్పడతాయి.  దీని వలన  మధుమేహం  వచ్చే అవకాశం ఎక్కువగా కలదు. దృష్టి కణాలు దెబ్బ తింటాయి.
 
 మధుమేహం వస్తుందని అనుమానం వున్నా లేక మధుమేహం వున్నా ఈ క్రింది వ్యాయామాలు చెయ్యాలి:---
 
భుజంగాసనం:-- బోర్లా పడుకొని చేతులను నేలపై ఆనించి తలను పైకెత్తాలి నాభిని మాత్రం నెలకు ఆనించి ఉంచాలి.          
     ఒక నిమిషం విరామం తరువాత ---
 
శలభాసనం :-- రెండు చేతులను తొడల కింద పెట్టుకొని కాళ్ళను పైకిలేపాలి. ముందు ఒకాలునులేపాలి.తరువాత  మరొక కాలును లేపాలి తరువాత రెండు కాళ్ళను లేపాలి.
 
ధనురాసనం :--  బోర్లా పడుకొని తలను పైకెత్తి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకొని లేపాలి
.
వజ్రాసనం :-- మోకాళ్ళ మీద కూర్చొని చేతులను మోకాళ్ళ మీద పెట్టుకొని ధ్యానం చేయాలి.
క్లోమ గ్రంధి బలహీన పడడానికి కారణాలు:-- స్త్రీలు గర్భాశయాన్ని  తొలగించుకోవడం, పురుషులలో అజీర్ణ సమస్య వలన  ఈ సమస్య వస్తుంది.
 
                                  తంగేడు పూల పొడి     
                                          ఉసిరిక   పొడి
                                           పసుపు పొడి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి పెట్టుకోవాలి.

     ఆహారానికి ముందు ఉదయం, రాత్రి పావు టీ స్పూను పొడి చొప్పున గోరువెచ్చని నీటితో సేవిస్తూ వుంటే  మధుమేహం నియంత్రణలో వుంటుంది.

క్లోమ గ్రంధి బలహీన పడే సమయాన్ని గుర్తించడం :-- పిక్కల నొప్పులు,కాళ్ళు బలహీన పడడం, సరిగా నడవ  లేక పోవడం,చూపు సరిగా కనపడక పోవడం వంటి లక్షణాలు వుంటాయి.

    ఉంగరపు వేలు కింది బుడిపెను అర చేతికి పై భాగంలో నొక్కినపుడు   ఉండే నొప్పిని బట్టి మధుమేహం ఎంత   స్థాయిలో వున్నది చెప్పవచ్చు.

    చిటికెన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు కింది భాగంలో రెండు నిమిషాలు మాత్రమే ఒత్తిడి కలిగించాలి.

    రక్తంలో మధుమేహం వుంటే మణికట్టు మధ్య భాగంలో పైనుండి కిందికి ఆరు చోట్ల నొక్కాలి. దీని వలన మంచి ఫలితం వుంటుంది.
                                  












ప్లీహము

                          ప్లీహము నందలి వ్యాధుల నివారణ                                   5-3-09.
 
వ్యాయామం :-- రెండు కాళ్ళను దూరంగా పెట్టి చేతులను బార్లా చాపి వంగి కుడి చేతితో కుడి కాలి బొటన వేలును తాకాలి ఎడమ చేతిని పూర్తిగా పైకేత్తలి. అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి. ఈ విధంగా చేసేటపుడు  గాలిని పీలుస్తూ వంగాలి గాలిని వదులుతూ లేవాలి.
 
      అదే విధంగా నిలబడి కుడి చేతితో ఎడమ పాదాన్ని తాకాలి. ఎడమ చెయ్యి పైకి నిటారుగా వుండాలి. అదే  విధంగా రెండవ వైపు కూదాచేయ్యాలి.

      బాసింపట్టు వేసుకొని నిటారుగా కూర్చోవాలి. చేతులను వెనక్కు పెట్టుకొని ముందుకు వంగాలి.

      కింద కూర్చో లేకపోతే కుర్చీలో కూర్చొని చెయ్యవచ్చు. గాలి పీలుస్తూ ముందుకు వంగాలి గాలి వదులుతూ పైకి లేవాలి.

వ్యాధిని గుర్తించడం:-- పొట్ట మీద ఎడమ వైపు ఉబ్బెత్తుగా వుంటుంది (బల్ల)
ఆహారం:--
      నాటు ఆవుల మూత్రాన్ని ఉదయాన్నే సేకరించాలి. మొదటి, చివరి మూత్రాన్ని వదిలి మధ్య మూత్రాన్ని
మాత్రమే ముంతలో పట్టుకోవాలి. దీనిని ఏడు సార్లు వడపోయ్యాలి.
     ఈ విధంగా వడపోసిన దానిని పావు కప్పు తీసుకొని దానిలో చిటికెడు రాళ్ళ ఉప్పు పొడిని కలిపి సేవిస్తే
ప్లీహ వ్యాధులు నివారింప బడతాయి.
                                                          ప్లీహ వ్యాధుల నివారణ                                                  6-3-09.
వ్యాయామాలు:--

1. మేరుదండాసనం:-- వెల్లకిలా పడుకొని కాళ్ళు ముడిచి నడుము దగ్గరకు రానివ్వాలి. చేతులను ముందుకు
చాచి కాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ నడుమును పైకెత్తాలి, దించాలి. దీని వలన ప్లీహము, గుండె, ఊపిరితిత్తులు,
నడుము మొదలైన వాటికి సంబంధించిన వ్యాధులు నివారింప బడతాయి.

2. మత్స్యాసనం    3. ఉదర చాలనం    3. ఉడ్యానబంధం.

             100 గ్రాముల వామును  చెరిగి, శుభ్ర పరచి మట్టి మూకుడులో పోసి అది మునిగే వరకు కలబంద గుజ్జు
రసం పోయాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం ఎండబెట్టాలి. సాయంత్రం లోపల రెండు మూడు సార్లు పుల్ల తో కలియ
బెట్టాలి. మరల రెండవ రోజు అదే విధంగా కలబంద రసం తో తడిపి మరుసటి రోజు ఎండలో పెట్టాలి . ఈ విధంగా
మూడు రాత్రులు, మూడు పగళ్ళు చెయ్యాలి. తరువాత దంచి పొడి చెయ్యడానికి వీలుగా ఎండ బెట్టాలి. పూర్తిగా
ఎండిన తరువాత దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.

                           పిల్లలకు              --- రెండు చిటికెలు
                           పెద్దలకు              --- పావు టీ స్పూను.

    నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఈ విధంగా 40 రోజులు చేయాలి. ఈ మందు వాడేటపుడు అన్నం తిన కూడదు.
గోధుమ రొట్టె మాత్రమే తినాలి. చపాతీలోకి పుదీనా పచ్చడి, ముల్లంగి కూరలు వాడుకోవాలి. పప్పు ధాన్యాలు,
నెయ్యి, నూనె వాడకూడదు.

                              బహిష్టు సమస్యల వలన ఏర్పడే ప్లీహవ్యాది --- నివారణ                                17-6-09.

     50 గ్రాముల వామును మట్టి మూకుడులో వేసి అది మునిగేంత వరకు కలబంద రసం పోసి ఎండబెట్టాలి.
రాత్రి మరలా కలబంద రసం పోసి ఉదయం ఏనాదబెట్టాలి. ఈ విధంగా మూడు రోజులు చేయాలి. తరువాత పూర్తిగా ఎండబెట్టాలి. తరువాత దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
     పావు స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి.
    నెయ్యి, నూనె, కారం వాడకూడదు.

                                           ప్లీహములోని సమస్యలు ---నివారణ                                             3-9-11.
     వెంపలి  మొక్కల వేర్లను కడిగి , ఎండబెట్టి , దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి .

వెంపలి వేర్ల పొడి                ---- 2, 3 చిటికెలు
మజ్జిగ                             ---- ఒక గ్లాసు

     మజ్జిగలో పొడిని కలుపుకొని తాగితే  ప్లీహములొ ఎంత వాపు వున్నా తగ్గిపోతుంది .
    









పక్షవాతం

                         పక్షవాత నివారణకు వెల్లుల్లి తైలం --తైల మర్దన                        1-3-09.
 
        ప్రతి రోజు నువ్వుల నూనెతో తప్పకుండా మర్దన చెయ్యాలి.
 
                           నువ్వుల నూనె                   ----పావు కిలో
                           ఒలిచిన తెల్ల పాయలు        ---- 50 gr
                           మిరియాల పొడి                 ---- 25 gr
                           ముద్దకర్పూరం                    ---- 3 టీ స్పూన్లు
                               వెల్లుల్లి  పాయలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. నువ్వులనూనెను స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద  మరిగించాలి. వెల్లుల్లిపాయల ముక్కలను నూనె చిందకుండా నెమ్మదిగా నూనెలో వెయ్యాలి.  పాయలు నల్లగా మాడేవరకు కాచాలి. తరువాత జాగ్రత్తగా వడ పోసుకోవాలి. దీనిలో మెత్తని మిరియాల పొడిని నూనెలో చల్లాలి.
నూనె గోరువెచ్చగా అయిన తరువాత ముద్దకర్పూరం కలపాలి.
       దీనిని శరీరంలో చచ్చుబడిన ప్రదేశంలో రుద్దితే కదలిక వస్తుంది ., నరాలు బలంగా తయారవుతాయి.
 
                                                పాలు                  ----- ఒక కప్పు
                                                నీళ్ళు                  ----- ఒక కప్పు
                                               వెల్లుల్లి పాయలు    ----- 2,3
                                               కలకండ                ----- ఒక టీ స్పూను
                                               వాయువిడంగాల పొడి -- ఒక్క గ్రాము మాత్రమే
 
     పాలు, నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి వెల్లుల్లి పాయలను తోకలు కత్తిరించి పాలల్లో వెయ్యాలి. చిన్న మంట మీద పాలు పొంగి పోకుండా ఒక కప్పు మిగిలే వరకు కాచాలి. తరువాత వడ  పోయ్యాలి ఈ పాలలో కలకండ, వాయు విడంగాలపొడిని కలపాలి.
 
    ఈ పాలను పక్షవాతపు రోగికి తాగించి పై తైలం తో మర్దన చెయ్యాలి.(ఆవు పాలైతే శ్రేష్టం).  ఎక్కడికక్కడ బిగుసుకుపోయిన అవయవాలు,నరాలు తిరిగి బలాన్ని పొంది
త్వరగా కోలుకుంటాయి.
 
                     పక్షవాతాన్ని పోగొట్టే తైలం                                                             25-4-09.

     పక్షవాతం చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంది.

 దెబ్బలు తగలడం వలన వచ్చే పక్షవాతం.

B.P. పెరగడం వలన వచ్చే పక్షవాతం.

ముఖ పక్షవాతం,

హస్త పక్షవాతం

 శరీరంలోని  అన్ని భాగాలకు వచ్చే పక్షవాతం

                                        చేతులకు, కాళ్ళకు వచ్చే పక్షవాతం -- నివారణ

                   వెల్లుల్లి రెబ్బల సన్న ముక్కలు        ---- 30 gr
                   ఉమ్మెత్త కాయలు                           ---- 2 మాత్రమే
                   ఆవ నూనె                                     ---- 200 gr

        వెల్లుల్లి పాయలను సన్న ముక్కలుగా తరగాలి. ఉమ్మెత్త కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి    వెల్లుల్లి ముక్కలను, ఉమ్మెత్త ముక్కలను ఆవ నూనెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలి  బాగా ఎర్రగా  కాగే వరకు కాచాలి. తరువాత స్టవ్ ఆపి వడకట్టాలి. చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగించే విధానం:--  మెడ,వెన్నుపూస, నడుము లమీద ఈ తైలం తో మర్దన చెయ్యాలి. రెండు బొటన వేళ్ళతో జిగ్ జాగ్ పద్ధతిలో మర్దన చెయ్యాలి. దీని వలన రక్త ప్రసరణ పునరుద్ధరించ బడుతుంది. 
       తైల మర్దన చేసేటపుడు శరీరం భరించ గలిగినంత వేడిగా మర్దన చెయ్యాలి.  అర చేతులలో కూడావేడి పుట్టే వరకు  రుద్దాలి.
తరువాత ఆవిరి పట్టాలి.  నీటిలో జిల్లేడు  ఆకులు,వావిలాకులు, పసుపు మరిగించాలి. ఆ నీటిలో నూలు గుడ్డను ముంచి పిండి వేడి గమనించి కాపడం పెట్టాలి.

      కుడి భాగంలో పక్షవాతం వస్తే మెదడు లో ఎడం భాగంలో రక్తం గడ్డ కట్టి వుంటుంది. వేడి నీటిలో ముంచిన గుడ్డను తల మీద కూడా  అద్దాలి. అదే విధంగా వెనక వైపు కూడా చేయాలి.

      అర చేతులకు, వేళ్ళకు  ఎక్కువ ప్రాధాన్యమిచ్చి బాగా కాపడం పెట్టాలి.

      తరువాత చేతులు, మెడ మొదలైన అవయవాలకు వ్యాయామం చెయ్యాలి.
 contd...          26-4-09.

   తైలం మర్దన చేసిన తరువాత కాళ్ళకు వ్యాయామం చేసేటపుడు  మడమ పై చేయి వుంచి కాలి వేళ్ళను కదిలించాలి. వేళ్ళను ప్రక్కలకు, గుండ్రంగా త్రిప్పాలి, కదిలించాలి. మోకాలి మీద చేయి పెట్టి పాదాన్ని పట్టుకొని కాలును గుడ్రంగా తిప్పాలి.

       చేతి మణికట్టు దగ్గర పట్టుకొని చేతి వేళ్ళతో వ్హేసే వాళ్ళు వేళ్ళు మార్చి వేళ్ళను కదిలించాలి. గుండ్రంగా మరియు పక్కలకు తిప్పాలి. మోచేయి దగ్గర పట్టుకొని చేతిని పైకి కిందికి కదిలించాలి.

       మెడను కూడా అలాగే కదిలించాలి.

       తరువాత కుర్చీలో కూర్చొని కాళ్ళ కింద చెక్కతో చేసిన ముళ్ళ రోలర్ను పెట్టుకొని మడమ నుండి వేల్లవరకు దొర్లించాలి.
    అదే విధంగా   చేతులపై  హస్తంనుండిభుజంవరకు రోలర్ తో రుద్దాలి.మెడమీద, వెన్నుపూస మీదతిప్పాలి.
 చాలా సున్నితంగా చెయ్యాలి. రెండు అర చేతుల మధ్యలో పెట్టుకొని తిప్పాలి.

                         ముఖ పక్షవాతం (అర్ధ ముఖ పక్షవాతం)                                 2-4-09.

కారణాలు:-- ప్రమాదాలు జరగడం వలన, అధిక రక్తపోటు, రక్తప్రసరణ సరిగా లేకపోవడం, ఎక్కువ చలిగాలిలో తిరగడం,వంటి కారణాల వలన ఎక్కువగా వచ్చే అవకాశం కలదు.

                                నువ్వుల నూనె           ---100 gr
                                వావిలాకు                 ---100 gr

      నువ్వుల నూనెను స్టవ్ మీద పెట్టి పచ్చి ఆకులను వేడి నూనెలో వేయాలి.కొంత సేపటికి ఆకులు నల్లగా  మాడిపోతాయి. చల్లారిన తరువాత వడకట్టాలి. సీసాలో భద్ర పరచుకోవాలి.

ఉయోగించే విధానం:--  కణత దగ్గర నుండి చెంప మీదుగా రుద్దాలి. cheeks మీద గుండ్రంగా మర్దన చెయ్యాలి. చెంప మీద నుండి చేతిని నోటి వైపుకు మర్దన చెయ్యాలి.చెవి వెనక నుండి మెడ మీదుగా గొంతు వరకు సున్నితం గా నెమ్మదిగా మర్దన చెయ్యాలి. ముక్కు, మీసాల దగ్గర నుండి చెంప వైపుకు రుద్దాలి.

ఆవిరి పట్టడం:--  నీటిలో పసుపు, వావిలాకు  వేసి మరిగించి దానిలో నూలు గుడ్డను ముంచి పిండి వేడి గమనించుకొని ఆవిరి పట్టాలి.కన్ను మూసుకొని చెయ్యాలి. వావిలాకు దొరకని పక్షంలో మునగాకుగాని, కానగాకు గాని, కసివింద ఆకు గానితంగేడు ఆకు గాని వేసి పసుపు వేసి మరిగించాలి.

వ్యాయామం:-- 1  కుడి వైపు పక్షవాతం వుంటే మూతిని ఎడమ వైపుకు లాగాలి(స్వయంగా) కదిలించలేని స్థితిలో వుంటే వేరే వ్యక్తులచే లాగించుకోవచ్చు.

2. బుగ్గలను బాగా పూరించి ఉబ్బించాలి.

3. కళ్ళు మూసుకొని దవడలను బిగించడం వదలడం చెయ్యాలి.

4. తలను కదిలించకుండా కళ్ళను పైకెత్తడం దించడం చెయ్యాలి.

5. గాలి వదులుతూ తలను కిందకి దించాలి, గాలి పీలుస్తూ తలను పైకెత్తాలి. తలను ప్రక్కలకు భుజాలు కదల కుండా తిప్పాలి.

6. నాలుకను బాగా ముందుకు చాపడం పూర్తిగా వెనక్కు లాక్కోవడం చెయ్యాలి.

              శరీరం లో ఏ భాగానికి పక్షవాతం వచ్చినా --నివారణ                               3-5-09.

కారణాలు;-  విపరీతమైన ఆందోళన,మితిమీరిన ఆవేశం వలన, అకస్మాత్తుగా ప్రమాదకరమైన వార్త వినడం వలన శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం వున్నది.

      50 గ్రాముల తేనె తీసుకొని పోస్తూ వుంటే కోలుకుంటారు.

      100 గ్రాముల మిరియాలు తీసుకొని తగినంత నీరు కలిపి మెత్తగా నూరి నువ్వుల నూనె కలిపి ముడుచుకు పోయిన వేళ్ళ మీద మర్దన చెయ్యాలి. అలాగే కాలిమీద మిగిలిన ముద్దను పట్టు వెయ్యాలి.  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

      " కసివింద  ఆకు తెచ్చి వెన్న కలిపి నూరి పట్టు వెయ్యాలి. దీని వలన మంచి ఫలితాలు కనబడ్డాయి."

కడుపులోకి:--
                                     అల్లం రసం             ---- 50 gr
                                     ఉల్లిపాయల రసం    ---- 20 gr
                                     తేనె                      ---- 20 gr

      కలిపి ఉదయం, సాయంత్రం తాగించాలి.  దీని వలన సుఖవిరేచనము అవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగు తుంది.B.P. కంట్రోల్ అవుతుంది.

                                     వస కొమ్ముల పొడి         ---- 50 gr
                                     శొంటి పొడి                    ---- 30 gr
                                     నల్ల జిలకర పొడి            ---- 20 gr

      వస కొమ్ములను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తీసి నలగగొట్టి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చెయ్యాలి.

అన్ని పొడులను కలిపి సీసాలో భద్ర పరచాలి.

       3 చిటికెల పొదిలో తేనె కలిపి ఉదయం, సాయంత్రం తినిపించాలి.

       దురదగొండి రసం చెవులలో వెయ్యాలి.  దాని వేర్ల చూర్ణాన్ని (3 చిటికెలు) నీటితో కలిపి రుద్దాలి.

      తైలం తో మర్దన చేస్తే కట్టే లాగా బిగుసుకుపోయిన భాగాలు మృదువుగా తయారవుతాయి.

వ్యాయామం:--చేతి వేళ్ళను గోరువెచ్చని నూనెతో   మర్దన చేసి ఒక చేతి యొక్క నాలుగు వేళ్ళను ఇంకొక చేతితో పట్టుకొని ముందుకు వెనుకకు వంచాలి. తరువాత ఒక్కొక్క వేలును వంచాలి.

     రోగి యొక్క నాలుగు వేళ్ళలో మన యొక్క వేళ్ళను దూర్చి మణికట్టు దగ్గర ముందుకు, వెనుకకు వంచాలి
అదే విధంగా కాలును మోకాలి దగ్గర పట్టుకొని ముందుకు, వెనుకకు వంచాలి. రోగిని పక్కకు పడుకోబెట్టి కాలును పైకి లేపాలి కిందికి దించాలి. బోర్లా పడుకోబెట్టి కాలును పైకి కిందికి కదిలించాలి.

    పాదం పట్టుకొని వేళ్ళను, పాదాన్ని కదిలించాలి.

ఆహార నియమాలు:--

     రోగిని చల్లని వాతావరణం వున్న గదిలో ఉంచకూడదు, వేడిగా వున్న గదిలో ఉంచాలి. అతి చలువ చేసే పదార్ధాలు పెట్టకూడదు. సొరకాయ(అనప  కాయ), దోసకాయ, ఫ్రిజ్ లోని పదార్ధాలు పెట్టకూడదు.
తెల్లవి, కొత్త బియ్యం వాడకూడదు. పాత గోధుమ రవ్వ గంజి చాలా  మంచిది.  పాత బియ్యం మంచిది.

     తేనె ను ఒక టీ స్పూను తో ప్రారంభించి నాలుగు టీ స్పూన్లకు పెంచాలి.  రోజుకు మూడు, నాలుగు సార్లు ఇవ్వాలి/. ప్రతి రోజు ఇవ్వాలి.

     ఆహారం గట్టిగా వుండకూడదు వీలైనంత మెత్తగా వుండాలి.సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను వాడాలి.

     పావురాళ్ళ మాంసం,రక్తం అవసరం లేదు. రెట్టను తేనె కలిపి తింటే త్వరగా కోలుకుంటారు.

                        పక్ష వాతము --- నివారణ                                           25-5-10.
 
శొంటి
దుంప రాష్ట్రం
అక్కల కర్ర
 
        అన్నింటి  యొక్క చూర్నాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి అర గ్లాసుకు రానిచ్చి  ప్రతిరోజు తాగాలి.
 
       మిరియాలను మంచి నీటితో నూరి చచ్చుగా వున్న శరీర భాగాలపై పలుచగా లేపనం చెయ్యాలి.

                                  వెల్లుల్లితో పక్షవాత నివారణ                                                  2-6-10.
 
      మొదటి రోజు ఒక వెల్లుల్లి పాయ, రెండవ రోజు రెండు, మూడవ రోజు మూడు ఈ విధంగా 20  వ రోజు 20 పాయలు ముద్దగా నూరి మింగాలి.  21  వ రోజు 19 పాయలు, 20 వ రోజు 18  పాయలు ఆవిధంగా ఒకటి వరకు   తగ్గించుకుంటూ రావాలి.
 
     వెల్లుల్లిని  చిన్న పిల్లలలకు నేరుగా వాడకూడదు.

                      పక్షవాతం ---నివారణ ---వాతాదివటి                                            30-3-11.
    
     వెల్లుల్లి               --- 150 gr
     జీలకర్ర పొడి       ---  ఒక  గ్రాము
     నల్ల ఉప్పు         ---    "      "
     త్రికటు చూర్ణం     ---   "       "
     ఆముదం           ---  తగినంత
      
       కల్వంలో  వెల్లుల్లిని  కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా,  ముద్దగా నూరాలి. దీనికి మిగిలిన చూర్ణాలను
  కలపాలి.  తరువాత దానికి తగినంత ఆముదం కలిపి  మెత్తగా నూరాలి.

       తరువాత కుంకుడు గింజలంత ( ఒక గ్రాము )   మాత్రలు కట్టాలి.

       పూటకో మాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు ఆముదంతో తీసుకోవాలి. స్పూను లో ఆముదం
  తీసుకుని  దానిలో మాత్ర వేసుకుని కలిపి తాగాలి.

       ధూమపానం,  స్థూల కాయం  తప్పని సరిగా తగ్గించుకోవాలి.

        మొలకెత్తిన గింజలను తీసుకోవాలి.  తక్కువ క్యాలరీలు వున్న ఆహారం తినాలి.

                                           ముఖ పక్షవాతం --నివారణ                                        8-7-11.

1. వెల్లుల్లి గర్భాలు          --- పది
         వీటిని మెత్తగా నూరి ఆముదంతో గాని లేదా తేనెతో గాని పది రోజులు సేవిస్తే ముఖం పక్కకు లాగడం సమస్య
సులభంగా నివారింపబడుతుంది .

2. తమలపాకులు                  --- 3
    అడవితులసి ఆకులు          --- గుప్పెడు
    వెల్లుల్లి రెబ్బలు                 --- 3
    మిరియాలు                      --- 20

         అన్నింటిని కలిపి మెత్తగా నూరి గుడ్డలో వేసి పిండి ఆ రసాన్ని తాగాలి .

3. ఒక కప్పు పాలలో చిటికెడు శొంటి వేసుకొని తాగాలి .

                                                    పక్షవాతం  --- నివారణ                                   20 -8 - 11.
కానుగ చెట్టు బెరడు రసం
           ఆముదం

        రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి స్టవ్ మీద పెట్టి  రసం ఇంకిపోయి  ఆముదం మాత్రమె మిగిలేవిధంగా
కాచాలి .        దీనితో శరీరం లో  చచ్చు పడిన భాగం మీద రుద్దాలి .

                                     కసివింద  మొక్కతో  --- పక్షవాత నిర్మూలన                     2-9-11.

         కసివింద  ఆకులను తగినంత వెన్న కలిపి నూరి చచ్చుబడిన భాగానికి లేపనం చేసి పట్టు లాగా వేయాలి . ఈ
విధంగా 5, 6 సార్లు పట్టు వేస్తె మామూలు స్థితికి వస్తుంది



      
       



    

  










                  









                       

క్యాన్సర్

                        కాన్సర్  రాకుండా  నివారణ                                             8-3-09.

                                   (వ్యాధులు రాకుండా కాపాడుకోవడం )

    ఎరువుల ద్వారా ఆహారంలో ప్రవేశించిన రసాయనాలు శరీరంలో అక్కడక్కడ ఆగి పోవడం వలన ఈ వ్యాధి రావచ్చు. ఆయాభాగాల్లో చేరి మాంస భాగాలను చిల్లులు పడేట్లు చేసి పుట్ట కురుపు గా మారుతుంది.

   ఈ ఔషధాన్ని వర్షాకాల ప్రారంభం నుండి వాడాలి.

                                    దోరగా  వేయించిన జిలకర పొడి       ------ 100 gr
                                    ఇంటిలో దంచిన పసుపు పొడి          ------ 100 gr
                                     కలకండ  పొడి                             ------ 100 gr

    మూడింటిని విడివిడిగా సీసాలలో భద్ర పరచాలి.

    కలబంద ను తీసుకొని పై చెక్కు తీసి లోపలి గుజ్జును ఏడు సార్లు కడగాలి. దానిని 10 గ్రాములు తీసుకోవాలి.

ఒక్కొక్క సీసా నుండి ఒక్కొక్క టీ స్పూను పొడిని తీసుకొని మూడు స్పూన్ల పొడిని ఒక ప్లేటులో వేసుకోవాలి

   కలబంద గుజ్జును ఆ పొడిలోఅద్దుకొని సూర్యోదయ సమయం లో తినాలి.  దీనిని పరగడుపున సేవిస్తే సర్వ రోగాలు పోతాయి.

        కలబంద ను సంస్కృత భాషలో "కుమారి" అంటారు.

        దీనిని వాడడం వలన Fybroids , గర్భాశయం లో గడ్డలు, రొమ్ముల్లో గడ్డలు, నివారింప బడతాయి, రాకుండా కూడా నివారించ వచ్చు.

       తీవ్ర మసాలాలు, పులుపు, కారం,వాడకూడదు.

       దీనిని వాడితే గడ్డలు కరిగి పోతాయి  .ఇది నిరూపించ బడినది.
                                                      
                                         కాన్సర్ నివారణకు                                                  22-11-10.

నల్ల జీడి గింజలు                                        పల్లేరు కాయలు                                 పిప్పళ్ళు 
వాయు విడంగాలు                                     ఉసిరి కాయలు                                    కరక్కాయలు
గలిజేరు                                                     వరుణ చెక్క                                     తానికాయలు 
శొంటి                                                         శతావరి                                          మారేడు
 
         అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
         ప్రతి రోజు  ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున  చూర్ణాన్ని తేనె కలిపి గాని నెయ్యి కలిపి గాని తీసుకోవాలి. ఈ విధంగా మూడు నెలలు  వాడి ఒక నెల ఆపి మరలా మూడు నెలలు వాడాలి.
 
2. అతి మధురం
    తిప్ప తీగ
    అశ్వగంధ
 
         అన్నింటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.  ఈ చూర్ణాన్ని వాడడం వలన కాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాన్సర్ లేనివాళ్ళు దీనిని వాడడం వలన రోగ నిరోధకశక్తి పెరిగి, వ్యాధి రాకుండా నివారించ బడుతుంది.
                                                  బిళ్ళ గన్నేరు తో క్యాన్సర్ నివారణ                            7-9-11

        ఈ మొక్క యొక్క ఆకులు బ్లడ్ క్యాన్సర్ ను కూడా నివారిస్తాయి .  దీనిని వాడడం వలన కాలేయం పునరుద్దరించ
బడుతుంది .
        ఈ మొక్క రెండు రకాలుగా వుంటుంది .  ఏదైనా పరవా లేదు . దీని యొక్క ఆకులను తెచ్చి నీడలో ఆరబెట్ట్టి , దంచి
జల్లించి  సీసాలో భద్రపరచుకొవాలీ.

        ప్రతి రోజు ఉదయం పరగడుపున చిటికెడు పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి .

        









 
         

మధుమేహం

                                                       మధుమేహం                                           27-12-08.
 
తులసి ఆకుల పొడి                             -----50 gr
వేపాకుల పొడి                                   ----- 50 gr
మారేడు ఆకుల పొడి                           ---- 50 gr
కాగితం పూల ఆకుల పొడి                   ----- 50 gr
దోరగా వేయించిన మిరియాల పొడి          --- 50 gr
 
      అన్నింటిని ఒకదాని తరువాత ఒకటిగా వేసి బాగా కలపాలి.తరువాత వస్త్రగాయం పట్టి సీసాలో భద్రపరచు కోవాలి.
 
మధుమేహం యొక్క తీవ్రతను బట్టి ఆహారానికి అర గంట ముందు ఉదయం, రాత్రి అర టీ స్పూను పొడి వేసుకోవాలి. 200 దాటిన వాళ్ళు 3/4 స్పూను పొడిని కాచి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలి. ఇతర ఔషధాలు వాడేవాళ్ళు మందులలో సగం మందులు వాడాలి.10 రోజుల తరువాత పాతిక భాగం మందులను వాడాలి
 
    తరువాత ఔషధాలను పూర్తిగా మానెయ్యాలి. విధంగా 40 రోజులు వాడాలి.తగ్గిన తరువాత క్రమేపి మోతాదును తగ్గించాలి.
 
      ఆస్తమా వున్నవాళ్ళు పై మోతాదును బట్టి వాడుకోవాలి.
 
చర్మ వ్యాధులు వున్నవాళ్ళు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడి ని వేసి, మరిగించి అర గ్లాసుకు
రానిచ్చి తాగాలి.దీని వలన రక్తం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. వేడి శరీరం వున్నవాళ్ళు మజ్జిగతో, కఫశరీరం వున్నవాళ్ళు కాచి చల్లార్చిన నీటితో సేవించాలి.
 
                                                మధుమేహ నివారణకు --నేరేడు కాఫీ
 
నేరేడు గింజల పొడి        ------- 100 gr
మోదుగు పువ్వుల పొడి  ------- 100 gr
సుగంధ పాల వేర్ల పొడి    ------- 100 gr
 
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
     ఒక టీ స్పూను పొడిని వేడి నీళ్ళలో వేసి డికాషన్ లాగా తయారు చేసి దానిలో పాత బెల్లం గాని, తాటిబెల్లం గాని కలుపుకొని తాగితే వేరే మందులేమి అవసరము లేదు.
 
                                   మధుమేహ నివారణకు -- ఆహారం                               4-1-09.
 
శనగ పిండి         ------ 100 gr
బార్లీ పిండి            ------ 50 gr
జిలకర పొడి       ------ 3 చిటికెలు
వాము పొడి        ------ "     "
మిరియాల పొడి ------  "     "
సైంధవ లవణం పొడి  --  "    "
 
     అన్నింటిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతి పిండి లాగా ముద్దగా చెయ్యాలి.
తరువాత  రొట్టెలు రుద్ది సన్న మంట మీద కాల్చాలి.ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఒకటి లేక రెండు రొట్టెలను ఆకలిని బట్టి తినవచ్చు. దీనిని ప్రారంభించిన తరువాత శరీరంలో మార్పులను గమనించాలి.
 
చేతిని పూర్తిగా చాపి అర చేతిని పైకి పెట్టి ఉంగరపు వేలు బుడిపే పైన చిన్నగా నొక్కాలి.అలా
 రెండు చేతులకు చెయ్యాలి.షుగర్ వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది , ఆహారాన్ని బాగా నమిలితే (ప్రతి ముద్ద 32 సార్లు ) షుగర్ లేని వాళ్లకు రాదు. ఉన్న వాళ్లకు పోతుంది.
 
                                               మధుమేహ నివారణ                              13-2-09.
 
వక్రాసనం:-- ఎడమ కాలు చాపి కుడి కాలు మధ్యకు మడిచి ఎడమ చేత్తో కుడి కాలు బొటన వ్రేలు పట్టుకొని  కుడి చేతితో నడుము పట్టుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపు చేయాలి. చేతితో నడుము పట్టుకోలేనివాళ్ళు నేల మీద ఆనించవచ్చు.
 
2. యోగాముద్రాసనం-- అర్ధ లేక పూర్తి పద్మాసనం వేసుకొని చేతులను కలిపి, పైకెత్తి,తలను కిందికి నేలకు ఆనేట్లు తాకించాలి.
 
      పై రెండు ఆసనాలు pancreas (ప్లీహము) ను ఉత్తేజ పరుస్తుంది.
 
3.కపాలభాతి: ప్రాణాయామం ద్వారా ఆసనం అన్ని చక్రాలను కదిలిస్తుంది.సుఖాసనం లో కూర్చొని పొట్టను లోపలి బయటకు చక చకా కదిలించాలి. మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించాలి.అతి సంభోగం హానికరం,
 
కరక్కాయల చూర్ణం     -------100 gr
తానికాయల చూర్ణం -   ------ 200 gr
ఉసిరికాయల చూర్ణం   ------- 400 gr
తిప్ప తీగ పొడి           ------- 700 gr (ఆకులు, తీగల పొడి)
 
    అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను పొడి వరకు కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని తాగుతూ వుంటే మధుమేహం  క్రమేపినివారించబడుతుంది. అంగము దెబ్బ తినకుండా కాపాడుతుంది.
 
     ఈ వ్యాధి రాబొయ్యే వాళ్లకు, వున్న వాళ్లకు కాళ్ళు లాగడం, పాదాలలో రక్త ప్రసరణ జరగక పోవడం , కంటి చూపు దెబ్బ తినడం జరుగుతుంది. కాళ్ళ నొప్పులకు వాము తైలం చాలా
 బాగా ఉపయోగ పడుతుంది..

                              మహిళల్లో మధుమేహం --నివారణ                                  16-2-09.

    వంశపారంపర్యం కావచ్చు. బహిష్టు సమయం లో తీసుకొనే ఆహారాన్ని బట్టి మధుమేహం వచ్చే అవకాశం కలదు. సమయంలో అన్నం, పాలు, పెసరపప్పు, నెయ్యి, కలకండ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రావు. బహిష్టు సమయం లో ఆసనాలు వేయకూడదు. ఋతుస్రావం పూర్తిగా ఆగిన తరువాత వెయ్యాలి.
 
1. శశాంకాసనం :-- కాళ్ళు వెనక్కి పెట్టి రెండు చేతులు పూర్తిగా ముందుకు చాపాలి. తలను నేలకు ఆనించాలి.గాలి  ని  పీలుస్తూ వంగాలి,వదుల్తూ లేవాలి.
 
2. శుక్రవజ్రాసనం :-- పైవిధంగా కూర్చొని తలను వెనక్కు పూర్తిగా కిందికి నేలకు ఆనించాలి కాళ్ళను చేతుల తో పట్టుకోవాలి.
 
3. ఉష్ట్రాసనం :-- కాళ్ళను వెనక్కు పెట్టి తలను వెనక్కు వంచి రొమ్ము భాగాన్ని పైకెత్తాలి.
 
       పై ఆసనాలన్ని గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మరల వేరే ఆసనాలు వేయవచ్చు. ఆసనాలు వేసేటపుడు పొట్ట ఖాళీగా వుండాలి.
 
                                    మధుమేహ నివారణకు --ఔషధం                           23-2-09.
 
1. మారేడు ఆకుల పొడి ---3 చిటికెలు ప్రతి రోజు ఉదయం తీసుకుంటే మధుమేహం నివారింప బడుతుంది.

2. తుమ్మ ముళ్ళు గుచ్చుకొని వాచినపుడు మారేడు ఆకు దంచి కడితే ముల్లు బయటకు వస్తుంది, వాపు తగ్గుతుంది.ఆకును నూరి కట్టు కట్ట వచ్చు.

3 బొట్టు పెట్టుకునే చోట మచ్చను నివారించ వచ్చు.

 4. పాదాల మీద, కాళ్ళ మీద వచ్చే మెహ పొడలు (నల్ల మచ్చలు) మారేడుఆకు పొడిని నీటితో నూరి పూయడం వలన మాని పోతాయి.
 
                                      మధుమేహం --నివారణ                                   20-6-09.
 
పొడపత్రి ఆకుల పొడి     ---- 50 gr
నేరేడు గింజల పొడి       ---- 50 gr
కాకర ఆకుల పొడి         ---- 50 gr (లేదా) ఎండిన కాకర కాయల ముక్కల పొడి
 
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచాలి.
 
మూడు వేళ్ళతో పట్టుకున్నంత పొడిని అర కప్పు నీటిలో కలుపుకొని తాగాలి.
 
పంచదార పూర్తిగా మానెయ్యాలి. రంగు వెయ్యని బెల్లాన్ని వాడుకోవచ్చు ఒక బుట్ట బెల్లం తెచ్చి
ఒక సంవత్సరం అట్టేపెట్టి తరువాత వాడుకోవాలి. దీనిని ఎంత వాడినా షుగర్ రాదు.

                     365 ఎపిసోడ్ మధుమేహ సమస్య --- నివారణ                     24-8-09

మేహవ్యాధులు 20 రకాలు.

వ్యాధి శరీర శ్రమ లేకపోవడం వలన, మానసిక సమస్య వలన వస్తుంది.

మొదట శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి.

 మణిపూరక చక్రంలో క్లోమగ్రంధి (బ్రహ్మ గ్రంధి) వుంటుంది. ఇది అగ్నిస్థానం. అక్కడ ఎప్పుడూ అగ్ని మండుతూ వుండాలి. అగ్నిని మండించడానికి గాలిని పంపించాలి.

1. పవనముక్తాసనం:-- వెల్లకిలా పడుకొని మోకాలును రెండు చేతులతో పట్టుకొని గడ్డానికి ఆనించాలి. అదే విధంగా రెండవ కాలును కూడా ఆనించాలి. తరువాత రెండు కాళ్ళను ఒకే సారి పట్టుకొని ఆనించాలి. దీని వలన క్లోమగ్రంధికి ఘర్షణ జరుగుతుంది.

 2.భుజంగాసనం:-- బోర్లా పడుకొని రొమ్ము భాగంలో చేతులను నేలపై ఆనించి తలను పైకి లేపాలి.

3. శలభాసనం:-- బోర్లా పడుకొని చేతులను కిందికి చాపి ఒక కాలును పైకెత్తాలి. అలాగే రెండవ కాలును పైకి ఎత్తాలి. తరువాత రెండు కాళ్ళను ఒకేసారి పైకి లేపాలి. వీని వలన మణిపూరక చక్రానికి అన్ని వైపులనుండి ఘర్షణ కలుగుతుంది.

4. ధనురాసనం:-- బోర్లా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి రెండు చేతులతో పట్టుకొని, తలను పైకెత్తి ఊగాలి. దీనిలో పొట్ట మాత్రమే నెలకు ఆనాలి.

 శరీరానికి శ్రమ లేకపోతే ధాతువులు క్షీణిస్తాయి.

లొద్దుగ చెక్క పొడి              ---- 100 gr
తుంగ గడ్డల పొడి               ---- 100 gr
కరక్కాయ పెచ్చుల పొడి      ---- 100 gr
 గుమ్ముడు టేకు పొడి         ---- 100 gr 

అన్నింటిని విడివిడిగా దంచి, కలిపి సీసాలో భద్ర పరచాలి.

 ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. చల్లారనిచ్చి ఒక టీ స్పూను తేనె కలుపుకొని ఆహారానికి గంట ముందు తాగితే మధుమేహం నివారింప బడుతుంది

.                      మధుమేహం రావడానికి ముందు కనిపించే లక్షణాలు 
 
 దవడలు పీక్కు పోవడం
 దంతాలలో పాచి పట్టడం
 అరికాళ్ళు, అరిచేతులలో మంటలుగా వుండడం    
కాళ్ళు పీకడం
శరీరం మిసమిస లాడుతూ వుండడం  
నోరు తియ్యగా వుండడం
మూత్ర విసర్జన చేసిన చోట చీమలు చేరడం

     వంటి లక్షణాలు వుంటే మధుమేహం వున్నదని గుర్తించవచ్చు.

           ఏ అవయవం బలహీన పడుతుందో దానికి బలం వచ్చేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి..

 జామ ఆకును రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో వేసి మూత పెట్టి ఉదయం నీటిని తాగాలి. విధంగా 40 రోజులు చేస్తే మధుమేహం అదుపులో వుంటుంది. జామ ఆకునకు బదులుగా నేరేడు ఆకునైనా వాడుకోవచ్చు.

                               మధుమేహం నివారణకు ఆహారనియమాలు       27-8-09.

     కొత్త బియ్యం మాంసాహారం పనికి రావు. 100 గ్రాముల పంచదార తిన్న తరువాత శరీరంలో
ఎంత షుగర్ వుంటుందో 100 గ్రాముల మాంసం తిన్న తరువాత కూడా అంతే షుగర్ వుంటుంది.

                               మధుమేహం ఎప్పటికి రాకుండా ఉండాలంటే

  కృష్ణ తులసి ఆకులను కడిగి ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో భద్ర పరచి వంట ఇంటిలో పెట్టుకోవాలి. ప్రతి కూరలో చిటికెడు పొడిని వేసుకుంటూ వుంటే మధుమేహం రాదు.

 తులసి కాడలను రాగి తీగతో మూడు పేటలుగా అల్లి మెడలో  వేసుకోవాలి. దీని వలన మధుమేహం అదుపులో వుంటుంది.
అంతే కాక కఫం పెరగదు , గుండె జబ్బులు నివారించ బడతాయి.

                                                       16-2-10

       తులసి ఆకుల పొడి అశ్వగంధ పొడి దోరగా వేయించిన మెంతుల పొడి అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్ర పరచాలి. పావు టీ స్పూను పొడిని నీటితో సేవించాలి. మధుమేహం వలన కృశింఛిన  వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

 మధుమేహం తోబాటు రక్తంలో కొవ్వు చేరిన వాళ్లకు ---

కలబంద గుజ్జు                  ---- 20 gr
పసుపు                           ---- మూడు వేళ్ళకు వచ్చినంత
కరక్కాయల పొడి             ----      "        "            "
నీళ్ళు                             ---- అర కప్పు

    అన్నింటిని కలిపి సేవించాలి. ఆహారానికి అర గంట ముందు సేవించాలి. మొదట ఒక పూతతో ప్రారంభించి తరువాత రెండు పూటలకు రావాలి.

మధుమేహానికి చెందిన క్లోమగ్రంది నాభి దగ్గర వుంటుంది. సుఖాసనంలో కూర్చొని "రం" అనే అక్షరాన్ని పలకాలి.

మధుమేహం వలన అన్ని అవయవాయాలు దెబ్బ తింటాయి.

పద్మాసనం వేసుకొని కూర్చొని రెండు చేతుల యొక్క అన్ని వేళ్ళ  యొక్క చివరలను కలపాలి.

ఒక్క నిమిషం  పాటు అలాగే వుంచి  మధ్య వేళ్ళను విడదీయాలి,

 తరువాత ఉంగరపు వేళ్ళను వదిలి మధ్య వేళ్ళను కలపాలి.

 తరువాత చిటికెన వేళ్ళను వదిలి ఉంగరపు వేళ్ళను కలపాలి.
తరువాత బొటన వేళ్ళను, తరువాత చూపుడు వేళ్ళను వదలాలి.

ఒక్కొక్క వేళ్ళను వదిలే టపుడు మిగిలిన రెండు చేతుల యొక్క నాలుగు వేళ్ళను కలిపి ఉంచాలి.

వేళ్ళను వదిలినపుడు ఒక్కొక నిమిషం  సమయాన్ని పాటించాలి.

విధంగా వేళ్ళను వదిలిన సమయంలో "రం" అనే అక్షరాన్ని పలుకుతూ వుండాలి.

  విధంగా చేయడం వలన రక్త ప్రసరణలో మార్పులు మనకే అర్ధమవుతాయి. విధంగా 40 రోజులు చేస్తే మధుమేహం నివారింప బడుతుంది.
 
                                       తంగేడు తో మధుమేహ నివారణ                      29-6-10.
 
తేనె రంగులో మూత్రం జారీ అవడం మధుమేహం యొక్క ముఖ్య లక్షణం .
 
తంగేడు విత్తనాల చూర్ణం            --- 100 gr
బలమైన పసుపు కొమ్ముల పొడి    --- 100 gr
ఉసిరిక పొడి                              --- 100 gr
 
            అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.
 
5 -- 10 గ్రాముల పొడిని కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని పరగడుపున తాగాలి.
 
విధంగా చయడం వలన క్రమేపి మధుమేహం తగ్గుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది.
 
పిల్లలకు --- మూడు  వేళ్ళకు వచ్చినంత
 
        ఈ ఔషధం వాడక ముందు వాడుతున్న మందులను వెంటనే మానేయ్యకూడదు. క్రమేపి
 తగ్గిం చాలి.
 
శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దన చేసుకొని స్నానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
  
                         మధుమేహం రాకుండా నిరోధించడానికి                          9-4-10.
 
ప్రతి రోజు 10 --- 15   కరివేపాకులను  ఉదయం, సాయంత్రం నమిలి మింగుతూ వుంటే మధుమేహం
రాకుండా నివారించవచ్చు. వచ్చిన వాళ్ళు నియంత్రించు కోవచ్చు.
 
బ్లడ్ షుగర్ కంట్రోల్ కావాలంటే ప్రతి రోజు 12 గ్రాముల కరివేపాకు పొడిని వాడాలి.
 
                            మధుమేహం వలన వచ్చే చర్మ సమస్యల నివారణ
 
           మధుమేహం వున్నవాళ్ళకు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.

పూటకు 10 ---15 కరివేపాకులను నూరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం నియంత్రించ బడుతుంది. చర్మ వ్యాధులు నివారింప బడతాయి.

                                                       16-9-10

     మధుమేహం ప్రారంభ దశలో వున్నపుడు ఒకటి లేక రెండు వెల్లుల్లి పాయలు తింటూ వుంటే
షుగర్ పెరగకుండా వుంటుంది.

                                                      9-10-10

ఉసిరిపెచ్చులు                  --- 100 gr
కరక్కాయ పెచ్చులు           --- 100 gr
 తాని కాయ పెచ్చులు        ----100 gr
 తిప్ప తీగ పొడి                 --- 100gr
 నేలవేము                        ----100 gr
 నేల ఉసిరిక                     ----100gr
పసుపు కొమ్ముల పొడి        ----100 gr
 వేగిసచెక్క బెరడు పొడి      ----100 gr
మెంతి పొడి                       ----100 gr

           అన్నింటిని విడివిడిగా దంచి పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచాలి. ప్రతి రోజు ఉదయం,
 సాయంత్రం పరగడుపున ఒక టీ స్పూను పొడిని నీటిలో కలుపుకొని భోజనానికి ముందు వాడాలి.

దీని వలన షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.

                         మధుమేహానికి ఔషధ గుణాలు కలిగిన ఆహారం                      2-11-10

. రెండు అంగుళాల దాల్చిన చెక్కను అన్నంలో వేసి వండి తినాలి.

                                                        చిట్కా                                            13-11-10.

       తంగేడు పూల పొడిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు అర టీ స్పూను పొడిని ఇతర ఔషధాలతో
కలిపి తీసుకుంటూ వుంటే మధుమేహం అదుపులో వుంటుంది.

                             మధుమేహం వలన కలిగే నీరసం -- నివారణ                        29-11-10. 

శరీరంలో కావలసినంత క్లోమ రసం తయారు కాకపోవడం వలన,
 రోగ నిరోధక శక్తి తగ్గడం వలన ,
 ఆహార నియమాలను పాటించక పోవడం వలన నీరసం వస్తుంది 


 మధుమేహ రోగులు సహజంగానే సన్నగా కావడం గాని లేదా లావుగా కావడం గాని జరుగుతుంది. సడన్ గా బరువు తగ్గితే షుగర్ వ్యాధి ఉందేమోనని అనుమానించ వచ్చు. వీళ్ళకు శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు కావడం వలన పోషక పదార్ధాలు సరిగా అందక నీరసం వస్తుంది.

 1. నిశామ్లకి చూర్ణము

నిశా = పసుపు, ఆమ్లకి = ఉసిరిక

బలమైన పసుపుకొమ్ముల చూర్ణం   --- 100 gr
ఉసిరి పెచ్చుల చూర్ణం                  --- 100 gr

    రెండింటిని కలిపి భద్రపరచు కోవాలి. ప్రతి రోజు పరగడుపున ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటితో తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.

2. ఆశ్వ గంధ దుంపల  పొడి         --- 100 gr
    సుగంధ పాల వేర్ల పొడి               --- 50 gr
    శతావరి వేర్ల పొడి                     --- 50 gr
    కౌంచ బీజాల పొడి                  --- 100 gr
    పల్లేరు కాయల పొడి               --- 100 gr

       అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. కుంకుడు గింజలంత మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూటకు రెండు మాత్రల చొప్పున ఆహారం తరువాత తీసుకోవాలి. ఇది మధుమేహ రోగుల యొక్క నీరసాన్ని పోగొడుతుంది.

                              మధుమేహం వలన కాళ్ళ మంటలు                           29-11-10.

 అంతర తామర ఆకులను నూరి పేస్ట్ లాగా చేసి కాళ్ళకు పట్టిస్తే మంటలు తగ్గుతాయి.

.               మధుమేహ వ్యాధిగ్రస్తులకు విరేచనం సాఫీగా జరగడానికి             20-12-10

    మెంతులను నానబెట్టి గాని అలాగే కాని రాత్రి పూట మింగి నీళ్ళు తాగాలి. దీనివలన విరేచనం తేలికగా అవుతుంది. మధుమేహం కూడా నివారింప బడుతుంది.
                                                   29-12-10 
 
నానబెట్టిన మెంతులను , చిన్న అల్లం ముద్దను కలిపి రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేసుకుని తినాలి.
                                                       9-2-11.
 
లక్షణాలు:-- శరీరంలో అసాధారణంగా చక్కర శాతం పెరిగిపోవడం , గాయాలు తగిలితే
మానక పోవడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా వుండడం, అధిక బరువు మొదలైన లక్షణాలు
వుంటాయి.
 
1. చింతగింజల తొక్కలు              --- 5 gr
    మేడి చెట్టు పాలు                     --- 5 -- 10 చుక్కలు
 
      చింతగింజల తొక్కలను మెత్తగా నూరి మేడి పాలు కలిపాలి. విధంగా రోజుకు రెండు సార్లు
ఆహారానికి ముందు కడుపులోకి  తీసుకుంటూ వుంటే బ్లడ్ షుగర్ నివారింప బడుతుంది.
 
2. రావి చెట్టు పట్టకషాయం    --- 5 ml
                       తేనె           --- 5 ml
 
రెండింటిని కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ వుంటే వ్యాధి నియంత్రించ బడుతుంది.
రక్తంలో చక్కర స్థాయి పెరిగిందా లేదా అని గమనించుకుంటూ వుండాలి.

                                            మధుమేహం ---నివారణ                               11-3-11.

     రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా  పెరగడాన్ని  మధుమేహం అంటారు.

     కారణాలు:--   వయసు, అధిక బరువు, పొట్టలో కొవ్వు ఎక్కువగా చేరడం,  అధిక రక్తపోటు
 వ్యాయామం చేయకపోవడం,  జన్యు కారణాలు మొదలైనవి.

      1.  100 గ్రాముల   తాజా కాకర కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి
 దంచి రసం తీయాలి.
        ప్రతి రోజు 20 ml రసాన్ని రెండు పూటలా తాగుతూ వుంటే మధుమేహం నియంత్రణలో
 వుంటుంది.

    2.   సంపంగి పూలు                   --- 10 gr ( 4, 5) వీలైతే అర విరిసిన పూలు
                  తేనె                        ---  ఒక టీ స్పూను 

        పూలను మెత్తగా నూరి  దానికి తేనె కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.
        ఇది కూడా బాగా పని చేస్తుంది.

    3.  మోదుగ పూల ముద్ద                 --- 10 gr ( 5, 6)
                      తేనె                          ---   3 gr
                      నెయ్యి                      ---   3-gr

         అన్నింటిని కలిపి తీసుకోవాలి.  ఈ విధంగా ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటూ వుంటే    
    మొండిగా వున్న  మధుమేహం కూడా నివారింపబడుతుంది.

                                                 మధుమేహం                                               16-3-11.

          ఆయుర్వేదంలో అష్ట విధ ప్రమాదకరమైన వ్యాధులను గురించి చెప్పబడినది. వాటిలో
                            మధుమేహం ఒకటి.

   లక్షణాలు :--  బరువు తగ్గడం,  నిస్త్రాణ,  అతిదాహం,  ఫంగల్ ఇన్ఫెక్షన్,  అతిగా మూత్రాన్ని
   విసర్జించడం,  గాయాలు మానకపోవడం,  తిమ్మిర్లు  మొదలైన లక్షణాలు వుంటాయి.

                           కరక్కాయ పెచ్చుల పొడి                  --- 50 gr
                           తాని కాయపెచ్చుల పొడి                  --- 50 gr
                           ఉసిరికాయ పెచ్చుల పొడి                 --- 50 gr
                                     శిలాజతు భస్మం                  --- 50 gr

           అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

           ప్రతిరోజు ఉదయం,  సాయంత్రం  ఒక్కొక్క టీ స్పూను చొప్పున భోజనానికి ముందు తీసు
   కుంటూ వుంటే మధు మేహం వలన కలిగే నీరసం తగ్గుతుంది.

            2.                        త్రిఫల చూర్ణం                       --- 50 gr
                                  శిలాజతు భస్మం                        --- 50 gr
                                        లోహ భస్మం                       --- 50 gr

               అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

                                    తిప్ప తీగ రసం                        --- ఒక గ్లాసు
                                            తేనె                               --- ఒక టీ స్పూను

               అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు తిప్ప తీగ రసంలో కలుపుకుని,  దానికి ఒక టీ స్పూను
    తేనె కలిపి తాగాలి.

                 మధుమేహం వలన ఏర్పడే అతిమూత్ర సమస్య ---నివారణ                   31-3-11.

               ఆహారంలో సరిగా నియమాలు పాటించక పోవడం  వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ సమస్యలో  మూత్రం ఎక్కువగా జారీ కావడమే కాకుండా  గ్లూకోజ్  కూడా ఎక్కువగా బయటకు
పోతుంది.
              పిట్యుటరి  గ్రంధి  నియంత్రణలో లేకపోవడం వలన కెఫీన్  పిట్యుటరి గ్రంధి మీద ఎక్కువగా
పని చేస్తుంది.
              అతి మూత్రం వలన నరాలు దెబ్బతిని కళ్ళు సరిగా కనబడక పోవడం, కాళ్ళు నల్లబడి
గాంగ్రియా  వంటి వ్యాధులు రావడం,  గడ్డలు,  రాళ్ళు వంటి గట్టి భాగాలుగా ఏర్పడడం జరుగుతుంది .
             మధుమేహంలో బరువు తగ్గిపోవడం,  ఎక్కువగా చెమట పట్టడం, అతిగా మూత్రం విడుదల  కావడం వంటి లక్షణాలు వుంటాయి.

    1.  నేరేడు ఆకుల కషాయాన్ని ప్రతి రోజు తాగితే కంట్రోల్ లో వుంటుంది.

    2.            నేరేడు గింజల పొడి            --- 50 gr
                   ఉసిరిక పొడి                      --- 50 gr
                   పసుపు పొడి                     --- 50 gr
                   నేలవేము  రసం                --- 50 gr

          అన్ని చూర్ణాలను  కల్వంలో వేసి నేలవేము రసం వేసి నూరి శనగ గింజలంత  మాత్రలు
    కట్టాలి.  తేమ లేకుండా ఆరబెట్టి నిల్వచేసుకోవాలి.

           పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం,  మధ్యాహ్నం,  సాయంత్రం ఆహారానికి  ముందు   వాడాలి.

  చిట్కా :--  మధుమేహ రోగులు అరికాళ్ళ మంటలను నివారిన్చుకోవడానికి :--- 27-6-11.

ఆవాల నూనె
వాము పొడి
పచ్చ కర్పూరం

                మూడింటిని కలిపి  కాళ్ళకు  మర్దన చేయాలి ,

                                                         7-9-11

                                   నిత్యమల్లి = బిళ్ళ గన్నేరు = సదాబహార్

          ప్రతి రోజు 3, 4 ఆకులను నమిలి పరగడుపున  తింటూ వుంటే మధుమేహం నియంత్రణలో వుంటుంది . పచ్చి
ఆకులను తినడం కష్టమైతే ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసి నిల్వచేసుకొని ప్రతి రోజు చిటికెడు పొడి తిని నీళ్ళు తాగాలి .

          దీని వలన అధిక , అల్ప రక్తపోటు కూడా నివారింపబడతాయి .

                                

.