చర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నంజు

                                                                          నంజు                               23-7-11.
    
           శరీరంలో చెడు నీరు చేరడాన్ని  నంజు అంటారు .
లక్షణాలు :---- శరీరంలో చురుకులు , పోట్లు , బరువు , కదలలేక పోవడం వంటి లక్షణాలు వుంటాయి .

దోరగా వేయించిన శొంటి పొడి                   ---- 50 gr
   "          "        మిరియాల పొడి            ---- 50 gr
   "          "          పిప్పళ్ళ పొడి             ---- 50  gr

           అన్నింటిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపీ నూరి కుకుడు గింజలంత మాత్రలు తయారు చేయాలి .    
           ప్రతి రోజు ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి చొప్పున రోజుకు రెండు మాత్రలు వాడాలి . ఈ విధంగా 40 రోజులు
వాడాలి .
           ఆవాల నూనెను వేడి చేసి శరీరమంతా మర్దన చేస్తూ వుంటే  వేలాడే చర్మం గట్టిపడుతుంది


                                                             

చర్మ సమస్యలు --- 2

                                                        చర్మ సమస్యలు    --- 2                         21-7-11.
ఆవు మూత్రం               --- అర  కప్పు
     నీళ్ళు                    --- పావు కప్పు
      తేనె                      --- ఒక టీ స్పూను

      ఆవు మూత్రాన్ని ఏడు సార్లు వడకట్టి స్టవ్ మీద పెట్టి కాచి పావు కప్పుకు రానివ్వాలి . దానికి నీటిని , తేనెను కలిపి
తాగాలి .

ఉపయోగాలు :-- ఇది కాలేయాన్ని , ప్లీహాన్ని , చర్మాన్ని శుద్ధి చేస్తుంది .
గిట్టని పదార్ధాలను  వాడకూడదు .

                                                  చర్మ రోగాలు  --- నివారణ                             23-7-11.

విరుద్ధ ఆహార సేవనం వలన వచ్చే అవకాశం ఎక్కువగా కలదు .

వాయువిదంగాల చూర్ణం                  ---- 10 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణం              ---- 10 gr
తానికాయల చూర్ణం                       ---- 10 gr
ఉసిరిక చూర్ణం                              ---- 10 gr
శొంటి చూర్ణం                                ---- 10 gr
పిప్పళ్ళ  చూర్ణం                           ---- 10 gr
మిరియాల చూర్ణం                         ---- 10 gr
శుద్ధి చేసిన గుగ్గిలం చూర్ణం               ---- 10 gr

         అన్ని చూర్నాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
         దీనిని ప్రతి రోజు 5 గ్రాముల చూర్ణాన్ని నీటితో సేవించాలి .

ఉపయోగాలు :--- దీనితో దుర్వాసన పట్టిన పుండ్లు , సోరియాసిస్ ,  భయంకరమైన చర్మ వ్యాధులు నివారింపబడతాయి .

                                               సోరియాసిస్   ---  నివారణ                               9-8-11.

        18 రకాల కుష్టు వ్యాదులలో ఇది ఒకటి .

చండ్ర  చెక్క              
బాగా ముదిరిన వేపచెక్క బెరడు

       రెండింటిని సమాన భాగాలుగా తెచ్చి బాగా ఎండబెట్టి, దంచి, జల్లించి చూర్ణం చేయాలి ,  తరువాత దానిని 
పరిశుభ్రమైన డబ్బాలో భద్రపరచుకోవాలి .

       రెండు స్పూన్ల పొడిని అర లీటరు నీటిలో వేసి నానబెట్టి బాగా మరిగించి పావు లీటరుకు రానివ్వాలి . \

        ఉదయం అరపావు , సాయంత్రం అరపావు కషాయాన్ని తాగాలి .

సూచన :--- వంకాయ , గోంగూర , మామిడి కాయ , మాంసాహార పదార్ధాలు భుజించ కూడదు .                    

                                       చర్మ వ్యాధుల నివారణ                                       11-8-11.

లక్ష్మితులసి ఆకుల పొడి                ---- 100 gr
మిరియాల పొడి                           ----  20  gr
అల్లం రసం                                  ---- తగినంత

      అన్నింటిని కలిపి కల్వంలో వేసి మెత్తగానూరాలి .  శనగ గిన్జలంత మాత్రలు తయారు చేసి నీడలో తడిలేకుండా
ఆరబెట్టాలి .

      ప్రతిరోజు ఒక మాత్రను నీటిని కలిపి రంగరించి నాకాలి . దీనివలన రక్తశుద్ధి జరుగుతుంది .

                                     ఎగ్జిమా ,  తీట ,  గజ్జి ,  తామర    --- నివారణ            

    ఒక తెల్లబట్ట ముక్కను తీసుకొని దానిని జిల్లేడు పాలతో  తడిపి ,  నానబెట్టాలి . దీనిని నువ్వుల నూనెలో వేసి అది
నూనెలో కలిసి పోయేవిధంగా మరగబెట్టాలి  ఆ నూనెను గజ్జి వున్న చోట పూయాలి .
   
     జిల్లేడు పాలకు బదులుగా జిల్లేడు ఆకు రసాన్ని కూడా ఉపయోగించవచ్చును .

                                                             8-9-11.

కొండతులసి ఆకుల రసం
నువ్వుల నూనె
ముద్దకర్పూరం

       కొండ  తులసి రసం , నువ్వుల నూనె లను సమానంగా తీసుకోవాలి .  రెండింటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి
రసం ఇంకిపోయి , నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి . గోరువెచ్చగా అయిన తరువాత ముద్దకర్పూరం కలిపి సీసాలో
నిల్వ చేసుకోవాలి .

      దీనిని చర్మం పై దురద వున్నచోట పూయాలి .
      దీని వలన గజ్జి , తామర , దురద , చిడుము మొదలైనవి నివారింపబడతాయి .

                                                            13-9-11

     పిచ్చి కుసుమ  లేదా బలురక్కసి  ని సమూలంగా దంచి నిజ రసం తీయాలి ( నీళ్లు కలపకుండా తీసే రసం )
దీనికి సమానముగా నువ్వుల నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలే విధంగా కాచాలి .  చల్లారిన తరువాత వడకట్టి
నిల్వ చేసుకోవాలి .

    ఇది అన్ని రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది
                                                 






స్నాన జలము

                                   

                                            స్నానజలము  తయారు చేయడం        1-3-11

        1. చిన్న పిల్లల స్నానానికి :


                    నలగ  గొట్టబడిన అతిబల వేర్లు
                       "           "        వసకోమ్ములు
                       "           "        వేపాకులు
                           చిటికెడు      కర్పూరం

        ఒక చెంబు నీటిలో అన్నింటిని వేసి  నానబెట్టాలి.
        ఆ నీటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయించాలి.

        2. ఆడపిల్లల స్నానానికి :--

                     వేపాకులు
                     తులసి ఆకులు లేదా పొడి
                     మారేడు ఆకుల పొడి లేదా పండు గుజ్జు పొడి

            వీటిని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి.
   
        3.  జటామాంసి
             వట్టి వేర్లు
             ఆకుపత్రి
             గంధకచ్చూరాలు  
             తుంగ గడ్డలు
             కర్పూరం           -- చిటికెడు

                  అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని నలగగొట్టి  రాత్రి పూట బిందెడు నీళ్ళలోవేసి
      కలియబెట్టి ఉంచాలి.  ఉదయం వడపోసి ఆ నీటితో స్నానం చేయాలి.





బెడ్ సోర్స్

                                  బెడ్ సోర్స్ --- నివారణ                                22-5-10.
     దీర్ఘ కాలంగా మంచంలో వున్న రోగికి పుండ్లు పడితే  :--

 వావిలాకును ఎండబెట్టి దంచి వస్త్ర ఘాలితం చేసిన మెత్తటి పొడిని పుండ్ల  పై  చల్లి గుడ్డను కప్పాలి. ఈ విధంగా చేస్తూ వుంటే పుండ్లు త్వరగా మాని పోతాయి.

ఒళ్ళు పేలడం





                                           ఒళ్ళు పేలడం ----నివారణ                                   20-4-09.

250 గ్రాముల వెలిగారాన్ని దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

     కొన్ని నీళ్ళలో 10 గ్రాముల పొడిని కలిపి దానిలో ఒక నూలు బట్టను ముంచి పేలిన చోట డ్రైగా అయ్యేంత   వరకు ఉంచాలి. ఇలా చేయడం వలన శరీరం చల్లగా అయి పేలినది తగ్గి పోతుంది.


                                       చెమట కాయల నివారణకు                                       25-2-11.

 ఉక్క పోత వలన చెమట స్రవించి శరీరం పైన జిడ్డు పేరుకుపోతుంది. చర్మం లో నుండి పొంగినపుడు దారి లేక బుడిపెల లాగా ( చెమట కాయలు ) ఏర్పడతాయి.

ఇవి ముఖ్యంగా బిగుతుగా వున్న దుస్తులను ధరించడం వలన, చెమట ఆరడం వంటి కారణాల వలన ఏర్పడతాయి.

1. పచ్చి పసుపు కొమ్ములు        --- 5 gr
   చేదు పొట్ల ఆకులు                --- 5 gr
   వేప ఆకులు                        --- 5 gr

       అన్నింటిని ముద్దగా నూరి ప్రతి రోజు పరగడుపు తీసుకోవాలి.

2. చందనం చెక్క     ---- 10 gr
మాని పసుపు          --- 10 gr
పాల మీగడ             --- 10 gr

     చందనం, మాని పసుపులతో విడివిడిగా గంధం తీసి పాల మీగడకు కలిపి పూయాలి.

సూచన :-- ఎక్కువ ఎండలో, వేడి ప్రదేశంలో నడవకూడదు. ఆహారంలో మసాలాలు, కాఫీ వంటివి తగ్గించాలి. చల్లని పదార్ధాలు తీసుకోవాలి.

                           చెమట కాయల నివారణకు --- మేధికా చూర్ణం                   26-3-11.

                                                  మేధిక  = మెంతులు

     చెమట ఆరిపోవడం వలన,  చెమట రంధ్రాలు మూసుకుపోవడం వలన పక్కన వచ్చే గుల్లలను
 చెమట కాయలు అంటారు.    వాతావరణం లో ఉష్ణోగ్రత పెరగడం కూడా ఒక కారణం

                                మొక్కజొన్న పిండి            --- 90 gr
                                         మెంతి పొడి             --- 10 gr

      రెండింటిని బాగా  కలిపి సీసాలో భద్ర పరచాలి.

      దూదిని  పఫ్ లాగా చేసి దాని మీద  ఈ పొడిని వేసి  దానితో చెమట కాయలపై అద్ది పూయాలి.
   దీనిని స్నానానికి ముందు,  స్నానం తరువాత వాడాలి.

  సూచనలు :--    వేడి వాతావరణం లో గడపకూడదు.  మసాలాలు,   ఘాటు పదార్ధాలు, 
   వాడకూడదు. చాలా బిగుతుగా వున్న దుస్తులు ధరించరాదు.  సహజమైన పానీయాలు
   ( కొబ్బరి నీళ్ళు,  మజ్జిగ, పండ్లరసాలు )  తీసుకోవాలి.








శరీరం పై కంతులు

                               శరీరం పై కంతుల నివారణ                           31-3-09.
          శరీరంలో మలినాలు అక్కడక్కడ చేరడం వలన కంతులు ఏర్పడతాయి.
   ఆవు నేతిని ప్రతి రోజు అన్నం లో తప్పక వాడాలి.
    ఆవు మూత్రం పరగడుపున నీళ్ళు  తేనె కలుపుకొని తాగాలి.
    మునగ చెట్టు బెరడును చిన్న ముక్కలుగా కొట్టి కంతుల పైన కట్టు కట్టాలి. ఆ విధంగా కట్టినపుడు కంతులు  ఎర్రబడతాయి.  దురద పుడుతుంది.  సరిపడక పోతే మానెయ్యవచ్చు.
    మునగాకు కాన్సర్ గడ్డలను కూడా  కరిగిస్తుంది.

                    కొవ్వు కంతులు -- నివారణకు --సురదారు లేపనం                       24-8-10.

    ఇవి ఎక్కువగా  30 -- 40  సంవత్సరాలు దాటినా  పురుషులలో వస్తాయి.

     ముంజేతి భాగాలు, చాతీ భాగాలు, తోడలలో కొవ్వు చేరి ఉబ్బెత్తుగా ఏర్పడతాయి.

     వీటిలో సాధారణంగా నొప్పి వుండదు.

దేవదారు చెక్క
శొంటి
నవాసారం

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.

     ఈ పొడికి తగినంత నిమ్మరసం కలిపి కంతులపై లేపనం చెయ్యాలి.  తరువాత  ఉప్పును వేడి చేసి ఒక గుడ్డలో   వేసి కంతుల మీద కాపడం పెట్టాలి.














అధిక చెమట

                                 అధిక చెమట సమస్య --నివారణ                                     10-3-09.
                     50, 60 సంవత్సరాల వయసు దాటిన  వారిలో  అధిక చెమట సమస్య వుంటుంది.
                                               నాగకేసరాలు
                                               వట్టి వేళ్ళు
                                               దిరిసెన చెట్టు బెరడు (చర్మ సౌందర్య విష హరిణి)
                                               ఆకు పత్రి
                                               పచ్చ కర్పూరం
                                               నల్ల ఉలవలు
         అన్నింటిని నానబెట్టి రుబ్బి ముద్దలాగా చేసి శరీరం పై రుద్దితే అతి చెమట సమస్య నివారింప బడుతుంది.
ఇది అన్ని వయసుల వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది పూసుకున్న తరువాత గంట ఆగి స్నానం చెయ్యాలి.

                           అధికంగా చెమట పట్టుట --నివారణ                         24-3-09.

లక్షణాలు:-- ఎండలో తిరగక పోయినా, ఇంట్లో వున్నా, ఫ్యాన్ కింద వున్నా అరికాళ్ళకు, అరిచేతులకు ఎక్కువగా చెమట పట్టడం.

కారణాలు:-- కాలేయంలో ఎక్కువగా వేడి చేరడం వలన ఇది వస్తుంది.  కారం, చెడు, మాంసం, మద్యం ఎక్కువగా  సేవించడం వలన వస్తుంది.

       పొట్ట మీద కాలేయం వున్నచోట నువ్వుల నూనెతోమృదువుగా  మర్దన చెయ్యాలి.

ఆసనాలు:--

1. జానుశిరాసనం :-- కాళ్ళు చాపి కూర్చొని ఒక కాలును గుదమునకు ఆనుకునేట్లు పెట్టి కుడి చేతిని నడుము  మీదపెట్టి, ఎడమ చేతితో ఎడమ కాలి బొటన వ్రేలును పట్టుకొని వంగాలి.  ఈ విధంగా రెండవ వైపు కూడా  చెయ్యాలి.

2. నౌకాసనం:-- వెల్లకిలా పడుకొని రెండు చేతులను బాగా  చాపి రెండు కాళ్ళను కదలకుండా లేపాలి.

ఆహారం:-- వామును శుభ్రం చేసి దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి. అది మునిగే వరకు నువ్వుల నూనె పోసి  రాత్రంతా నానబెట్టాలి.  ఉదయం దంతధావనం తరువాత కొంచం కొంచం గా తినాలి. ఒక గంట వరకు ఏమి తిన కూడదు .

                              చిన్న పిల్లలకు           ----- పావు టీ స్పూను
                              పెద్ద పిల్లలకు             ----- అర టీ స్పూను
                              పెద్దలకు                    ----- ఒక టీ స్పూను

     సునాముఖి ఆకును ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో భద్రపరచాలి.
 
     పావు టీ స్పూను సునాముఖి పొడిని అర కప్పు ఆవు మజ్జిగ లో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి.
 చారెడు ఉలవలను చాలా మెత్తగా పప్పులాగా ఉడకబెట్టాలి. రెండు పూటలా స్నానానికి ముందు ఈ పప్పు ముద్దను అర చేతుల్లో వేసుకొని అరి కాళ్ళ మీద, అరి చేతుల్లో  రుద్దాలి.

                         అధిక చెమట వలన శరీర దుర్గంధం --నివారణ                     24-11-10.
        గాలిని బాగా తగలనివ్వాలి.
        కొన్ని గ్రంధుల పని తీరు,  వంశ పారంపర్యం ముఖ్యమైన  కారణాలు.
        గోధుమ పిండి నుండి, యాపిల్ నుండి తయారైన వెనిగర్ ను డియోడరెంట్ గా దూదితో అడ్డుకోవాలి.
       పటిక పొడిని చెమట పట్టిన చోట చల్లాలి.
 మొక్క జొన్నల పిండి               --- 10 gr
వంట సోడా                              --- 10 gr
మంచి గంధం నూనె                   ---  రెండు చుక్కలు
     అన్నింటిని కలిపి పౌడర్ లాగా పూసుకోవాలి.
2. స్నానపు నీళ్ళలో రెండు కప్పుల టొమాట రసం కలిపి స్నానం చేస్తే ఎంతో ఫ్రెష్ గా వుంటుంది.
3. స్నానం చేసే నీటిలో రెండు టీ స్పూన్ల వంట సోడా కలిపి చేస్తే ఎంతో మంచిది.
4. టాల్కం పౌడర్, వంట సోడా కలిపి పోసుకుంటే ఫ్రెష్ గా వుంటుంది.

               అతి క్తోవ్వు వలన శరీరంలో వచ్చే దుర్గంధం-- నివారణ              14-12-10.

ఎర్రని లేదా తెల్ల చందనం         ----10 gr
          లొద్దుగ చెక్క పొడి        ---- 10 gr
          నాగ కేసరాల పొడి        ---- 10 gr
                 వట్టి వేర్ల పొడి       ---- 10 gr
                పచ్చ కర్పూరం     ---- 10 gr ( భీమసేని కర్పూరం మంచిది )

       అన్నింటిని కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

       దీనితో స్నానం చెయ్యడం వలన దుర్గంధం తొలగింప బడుతుంది. అధికంగా చెమట పట్టడం తగ్గుతుంది.

       శరీరంలోని వేడి తగ్గుతుంది. స్నానానికి ఒక గంట ముందుగా ఈ పొడి తో లేపనం చేయాలి,
 మర్మ భాగాల  లోని చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి.

                             అధిక స్వేదం ---నివారణ                             31-7-10.

త్రిఫలాలు      (1 : 1 :  1 )
శొంటి
తుంగ ముస్తలు
అతిమధురం

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని  దంచి పోడులుగా చేసి జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి.

పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా నీటితో సేవిస్తే అతి స్వేదం సమస్య  నివారింప బడుతుంది.

      దీనితోబాటు జటామాంసి పొడిని కూడా కలుపుకోవచ్చు.

                              చెమట వాసన నివారణకు చిట్కా                   16-11-10.

    నేరేడు ఆకులను నీటిలో కలిపి ఉడికించి  వడకట్టి ఆ నీటిని స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుంది.




రాచపుండు

                                                           రాచ పుండు -- నివారణ                                      10-4-10.
                                             రాచ పుండును పుట్ట కురుపు అని కూడా అంటారు.
          ఇది తొడలు, మోకాళ్ళ ప్రాంతంలో వస్తుంది.  విష రసాయనిక పదార్ధాల వలన వస్తుంది. 
కలబంద వేళ్ళను కడిగి ఎండబెట్టి పొడి చెయ్యాలి.
కలబంద వేర్ల పొడి          
తిప్ప తీగ పొడి
       రెండింటిని సమాన భాగాలు తీసుకోవాలి. కలిపి సీసాలో భద్రపరచాలి. పుట్ట కురుపు వున్నవాళ్ళు  మూడు గ్రాముల నుండి ఐదు గ్రాముల వరకు పెంచాలి.  దీనిని తేనెతో గాని, ఆవు నేతితో గాని, నీటితో గాని సేవించాలి.
ఇది వాడడం ప్రారంభించిన ఇరవై రోజుల తరువాత గడ్డలు కరగడం ప్రారభమవుతాయి.

జంధ్యాల సర్పి

                              జంధ్యాల  సర్పి  --- నివారణ                           7-9-10.

     ఇది వైరస్ వలన వ్యాధి నిరోధక శక్తిలేని వాళ్లకు వస్తుంది. దీర్ఘ కాలంగా మందులు వాడుతున్న వాళ్లకు   త్వరగా సంక్రమిస్తుంది.

లక్షణాలు:-    మొదట ముదురు గులాబి రంగులో వుండి తరువాత చీము చేరి నొప్పి, జ్వరము, శరీరమంతా  మంటలు  వంటి లక్షణాలు వుంటాయి.

1.  పైత్య ( వేడి)  ప్రభావం వలన  వస్తే తప్పనిసరిగా విరేచనా కర్మ చేయాలి.  దీని వలన శరీరంలోని టాక్సిన్స్  తొలగి వాడే మందులు త్వరగా శరీరానికి పడతాయి
.
2.  చందనాది తైలం రోజుకు మూడు నుండి ఆరు సార్లు పూయాలి.

3. శత దౌత ఘ్రుతము --దీనిని వాడితే చల్లబడుతుంది.

4. పంచ తిక్త  ఘ్రుత గుగ్గులు  --- దీనిని తీసుకున్న తరువాత అర గంట వరకు ఏమి తినకూడదు.

5. నిమ్బామ్రుత  కషాయము  +   అమ్రుతాది గుగ్గులు    2 +  2    ( లేదా)  పటోలాది  కషాయము    ( లేదా )
తిప్ప తీగ యొక్క ఆకుల కషాయం --- దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

6. కరంజి తైలం  ( కానుగ తైలం )

7. పచ్చి తామర ఆకులను,  వేపాకులను కలిపి నూరి పూస్తే తగ్గుతుంది.
       ఈ వ్యాధి వలన చర్మం కింద వున్న నరాలు దెబ్బ తింటాయి. దీనికి అశ్వగంధ చూర్ణాన్ని కడుపులోకి వాడి  అశ్వగంధ ఘ్రుతమును పై పూతకు వాడితే మంచిది.

8. మునగ ఆకులు తెచ్చి నూరి పోక్కులపై రాస్తే త్వరగా నయమవుతుంది. 

9. దశాంగ లేపము పై పోక్కులను నివారిస్తుంది.

10. నిశాది లేప చూర్ణము ( పసుపు)  లో తగినంత నీరు కలిపి పై పూతగా వాడితే పొక్కులు నివారింప బడతాయి.
 
 

బొట్టు పెట్టుకునే చోట పడిన మచ్చ

                       బొట్టు పెట్టుకునే చోట మచ్చ పడితే --నివారణ                               12-2-10.

మారేడు ఆకులు                  ---- ఒకటి లేక రెండు
పసుపు                              ----- రెండు మూడు చిటికెలు

    రెండింటిని కల్వంలో వేసి కొద్దిగా నీటి చుక్కలు కలిపి నూరి రాత్రి పూట మచ్చాపై పూస్తూ వుంటే కొద్ది రోజులకు మచ్చ నివారింప బడుతుంది.

చర్మం మీద ముడుతలు

                           చర్మం మీద ముడుతలు --నివారణ                              1-12-10.
 
        దీనికి బాహ్య, అంతర్గత కారణాలు కలవు.
 
బాహ్య కారణాలు:--     అతి నీల లోహిత కిరణాల ప్రభావం వలన, ఎండా, గాలి, వాతావరణ ప్రభావాల వలన
 
అంతర్గత కారణాలు :--   జన్యులోపం, పోషకాహార లోపం
 
జాగ్రత్తలు :-- బోర్లా పడుకో కూడదు. విటమిన్లు సమృద్ధిగా వున్న ఆహారం తీసుకోవాలి.  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3  గంటల వరకు ఎండలో తిరగకూడదు సిగరెట్లు తాగకూడదు.
 
     కలబంద గుజ్జును గాని, టమేటా గుజ్జును గాని బంగాళాదుంప గుజ్జును గాని పేస్ ప్యాక్ గా వాడాలి చర్మం   మీద కూడా ప్రయోగించాలి. బాదం పేస్ట్ కూడా బాగా పని చేస్తుంది
.
పసుపు           ---- ఒక టీ స్పూను
నిమ్మ రసం      ---- సగం కాయ రసం
 
      రెండింటిని కలిపి పూస్తే ముడుతలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.
 
దోసకాయ రసం
నిమ్మ రసం
 
   కలిపి పూస్తీ కూడా తగ్గుతుంది.
 
 తేనె మైనం                    --- 30 gr
 బాదం నూనె                --- 250 ml ( లేదా ఆలివ్ నూనె కూడా వాడవచ్చు.)
తేనె                           ----  75 gr
గులాబి నూనె               ---- కొన్ని చుక్కలు
 
       తేనె మైనాన్ని పరోక్షంగా వేడి చేసి వడకట్టాలి. అన్ని కలిపి చివర్లో తేనె, ఆ తరువాత గులాబి నూనె కలపాలి.
 
దీనితో చర్మం పై వున్న ముడతల పై పూసి మసాజ్ చేసి తరువాత సున్ని పిండి తో కడగాలి. రెగ్యులర్ గా వాడితే ముడతలు పూర్తిగా నివారింప బడతాయి. 
 
                   చర్మం మీద ముడతలు --- రంగు తగ్గడం --నివారణ             2-10-10.

దాల్చిన చెక్క పొడి
గంధం పొడి
 రోజే వాటర్

      అన్నింటిని లేపనం లాగా చేసి శరీరానికి పూసుకోవాలి

       మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని  ఒక టీ స్పూను తేనెతో కలిపి ప్రతి రోజు రాత్రి పూట కడుపులోకి తీసుకుంటూ వుంటే క్రమేపి ముడతలు నివారింప బడతాయి. చర్మము కాంతి వంతమవుతుంది.
    











బొల్లి

                                            తెల్లమచ్చలు --బొల్లి                       20-2-09 .
 
     ఇది అంటువ్యాధి కాదు.చూడడానికి అసహ్యంగా వుంటుంది. పర్యావరణ కాలుష్యము వలన వస్తుంది.
 
      వేప చెట్టు బెరడును పైచెక్క ముక్కను తీసుకోవాలిబెరడు లోపలి తెల్ల చెక్క కూడా తీయాలి
.దీనిని ఎండెట్టాలి. తెలుపు వున్న వైపు సాన రాయి మీద చాది  గంధం తీయాలి. గంధాన్ని
తెల్ల మచ్చలపై నెమ్మదిగా ఇంకేటట్లురుద్దాలి.గుడ్డను వేలికి చుట్టి గందంలో ముంచి కూడా రుద్ద వచ్చు

.                                     తెల్ల బొల్లి మచ్చల నివారణ                      16-7-09.

                   పట్టుదల, ధైర్యము, నమ్మకం వుండాలి.

ఉసిరికాయల బెరడు ---- 10 gr
కాచు ---- 10 gr
నీళ్ళు ---- ఒక లీటరు
బావంచాల పొడి ---- పావు టీ స్పూను

      నీళ్ళలో ఉసిరికాయల బెరడు, కాచు వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి.
దానిలో బావంచాల పొడి కలిపి ఉదయం, సాయంత్రం ఆహారానికి అర గంట ముందు సేవించాలి.

మాంసాహారం, పాల పదార్ధాలు కలిపి సేవించకూడదు. అతి పులుపు పనికిరాదు

.                                                      20-2-10

  మూడు వేళకు వచ్చినంత తులసి దళాల పొడిని వేడి నీటితో సేవించాలి. తులసి మొక్క యొక్క వేళ్ళకు వున్నబెరడును చనుబాలతో నూరి మచ్చలపై పూయాలి

. కృష్ణ తులసి పొడి నల్ల జిలకర పొడి రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని వేడి నీటితో సేవించాలి. దీనినే నీటితో నూరి మచ్చలపై పూయాలి.

కృష్ణ తులసి వేళ్ళు
నల్ల వావిలి వేళ్ళు
దోరగా వేయించిన శొంటి
" " పిప్పళ్ళు
" " మిరియాలు

అన్నింటిని సమాన భాగాలు తీసుకొని దంచి పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని వేడి నీటితో సేవిస్తూ వుంటే త్వరగా నయమవుతాయి. త్వరగా చర్మపు రంగులో కలిసి పోతాయి

                                                  . 18-5-10

                          బొల్లి అంటువ్యాధి కాదు

తెల్ల గలిజేరు ఆకు రసం               ---- 100 gr
దిరిసెన చెట్టు ఆకు రసం              ---- 100 gr
నువ్వుల నూనె                          ---- 200 gr

      ఒక పాత్రలో అన్నింటిని పోసి స్టవ్ మీద పెట్టి తేమ ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. వడపోసి చల్లారిన తరువాత సీసాలో భద్ర పరచాలి.

      తైలంతో మచ్చల మీద మర్దన చేస్తుంటే మ్రామేపి మచ్చలు పోతాయి.

                                       తెల్ల మచ్చలు ( బొల్లి )                               7-9-10.

     కెమికల్స్ వలన, ప్యాంట్లు బిగుతుగా వేసుకుని ఎండ తగలక పోవడం,
 ముఖానికి వాడే చర్మ లేపనాల వలన లేదా విధంగా నైనా రావచ్చు.

వాము పొడి
వేప గింజల పొడి

రెండు పొడులను కలిపి తేనెతో తీసుకోవాలి. వాయు విడంగాల పొడిని ఒక్కొక్క టీ స్పూను
 చొప్పున ఉదయం, సాయంత్రం తేనెతో తీసుకోవాలి.

                                                 27-11-10

           వ్యాధి వారసత్వం వలన, విరుద్ధ ఆహారం వలన, రోగ నిరోధక వ్యవస్థ సరిగా పని
చెయ్యక పోవడం వలన వస్తుంది.

లక్షణాలు :-- శరీరం తెల్లబడడం, శరీరానికి గిట్టని మందుల వలన పుండ్లు పడడం,

ఆహారంలో, కాలేయంలో, పొట్టలో, పేగులలో సమస్యలు ఏర్పడతాయి.మానసిక వేదన కలిగిస్తాయి.

  శ్వేత కుష్టు లేహ్యం బావంచాది లేహ్యం రెండింటిలో ఏదో ఒక ఔషధాన్ని వాడుకోవచ్చు.

చండ్ర చెక్క                       --- 200 gr (ఖదీరా )
బావంచాలు                     --- 200 gr
నేలవేము                        --- 100 gr ( గోమూత్రం తో శుద్ధి చేయాలి )
అశ్వగంధ                       --- 100 gr
వేపాకు                           --- 100 gr
త్రిఫల చూర్ణం                  --- 200 gr
చిత్రమూలం పొడి             --- 100 gr

  అన్నింటి చూర్నాలను కలిపి కల్వంలో వేసి తగినన్ని ఆవు పాలు కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

         ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆహారానికి రెండుకంట ముందు వాడాలి. మాత్రలను
వేసుకున్న తరువాత రెండు గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

పులిపిర్లు

                                              పులిపిర్లు ---నివారణ

       పులిపిర్ల మీద బాగా గీరి వాటి మీద ఉత్తరేణి రసం పూయాలి. కొద్ది రోజులు ఈ విధంగా చేస్తే నివారింప బడతాయి.

                                                      10-6-10
 
పుదీనా ఆకులు           --- 5
తులసి రసం                --- 5
నిమ్మ రసం                 --- 2, 3  చుక్కలు
 
     అన్నింటిని కలిపి నూరి పులిపిర్ల మీద పెడుతూ వుంటే రాలి పోతాయి.
 
                                                      11-6-10
 
           ఇది ఒక సాధారణ చర్మ సమస్య .
 
1. ఆలు గడ్డను మధ్యకు కోసి 15, 20 సార్లు  రుద్దుతూ వుంటే చిన్న సైజు పులిపిర్లు తగ్గి పోతాయి.
 
2. వెల్లుల్లిని నలగగొట్టి పులిపిర్ల మీద మాత్రమే  ఉండేటట్లు పెడితే గుడ్డ కప్పితే వారం రోజుల్లో రాలి పోతాయి.
 
3. పచ్చి ఉసిరి ముక్క తో రుద్దితే కూడా ఎండి రాలి పోతాయి.
 
4. ఆశ్వద్ద త్వచ భస్మం :--   రావి చెట్టు యొక్క బెరడును తెచ్చి బాగా ఎండబెట్టి కాల్చి భస్మం చెయ్యాలి.
దానికి సమానంగా తడి సున్నం, వెన్న కలిపి పులిపిర్ల మీద పెట్టి ఆరి పోయఎత వరకు వుంచి తరువాత   తుడిచేయ్యాలి.  వారం రోజులలో రాలి పోతాయి.
 
5. ఉత్తరేణి తో కూడా పై విధంగా చేస్తే తగ్గి పోతాయి.
 
6. రెడ్డివారి నానబాలు ( దుడ్డిక ) మొక్కను తున్చితే పాలు వస్తాయి. ఆ పాలతో పులిపిర్ల మీద అద్దాలి.
7. పులిచింతాకు సమూలం తెచ్చి నూరి పెట్ట వచ్చు.
 
8. కాశీసాది తైలం పూయాలి.
 
9. కేశ్వర గుగ్గులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి  పూటకు రెండు మాత్రల చొప్పున వాడాలి.
 
10. త్రిఫల గుగ్గులు

                                                 18-11-10.
 
                        ప్రధాన కారణం వైరస్
 
1.వెల్లుల్లి పాయలను ఒలిచి పులిపిర్ల పైన రుద్దుతూ వుండాలి.
 
2. ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని తొలగించి మధ్యలో ఉప్పు నింపాలి. దీని నుండి వచ్చే రసంతో   నెల రోజుల పాటు రుద్దాలి.
 
3. ఉత్తరేణి మొక్కను కాల్చి బూడిద చేసి దానికి ఆరు రెట్లు నీళ్ళు కలిపి కాచాలి, చివరకు  ఉత్తరేణి క్షారం  అనే పొడి మిగులుతుంది.దీనికి తులసి ఆకు రసం కలపాలి. తరువాత ఆవ నూనె గాని, ఆముదం గాని    పులిపిర్ల మీద రుద్దాలి.

                                                                19-6-11.

      ఇవి ముఖ్యముగా   ముఖము, మెడ, మోచేతులు, పాదాల మీద వస్తాయి . ఇవి వైరస్ ద్వారా వ్యాపిస్తాయి .

చిత్రమూలము  వేరు పొడి                  --- 5 gr
ఆముదం  లేక  వంటనూనె                 --- 5 ml
    
      రెండింటిని బాగా పేస్ట్ లాగా కలపాలి .దీనిని  గాజు కడ్డీతో గాని ,  చెంచా మొనతో గాని నెమ్మదిగా పూయాలి .
ప్రక్కన ఎక్కడా ఎంతమాత్రం తగలకూడదు . కాలుతుంది .

      ఈ విధంగా నలభై రోజులు చేస్తే రాలిపోతాయి . ఇది వైరస్ ను నివారిస్తుంది .

2. కొత్త సున్నాన్ని పులిపిర్ల మీద పెడితే రాలిపోతాయి .

3. అల్లం ముక్కను సన్నగా పెన్సిల్ ముక్క లాగా చెక్కి సున్నంలో అద్ది పెడితే కూడా రాలిపోతాయి .  ప్రక్కన
    తగలకూడదు . తగిలితే పుండు పడుతుంది .

సూచన :---  పులిపిర్లు  అంటువ్యాధి  .  దానిమీ మీద రుద్ది ,  గిల్లి ఆ చేత్తో వేరే చోట తాకితే కొత్త పిలిపిర్లు ఏర్పడతాయి

                                                               22-811

నిమ్మ పండ్ల ముక్కలు             --- రెండు
వెనిగర్                                 --- ఒక కప్పు
ఉప్పు                                  --- పావు టీ స్పూను
వెల్లుల్లి పాయ                        --- ఒకటి
  
      వెనిగర్ లో ఉప్పును వేసి కరగాబెట్టాలి . దానిలో నిమ్మ పండ్ల ముక్కలను వారం రోజులు నానబెట్టాలి . తరువాత
పులిపిర్ల మీద రుద్దాలి , తరువాత వెల్లుల్లి పాయతో రుద్దాలి .

                                                      ----
    పులిపిర్ల మీద గీరి  పుల్లతో పిందతైలాన్ని వాటి మీద పెట్టాలి .  ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే పులిపిర్లు కరిగి రాలిపోతాయి .   ఇది స్వానుభవం .  చాలా మంది  ఉపయోగించి  నివారించుకున్నారు .

                                                       5-9-11

      పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం వైరస్.      ఇవి  చేతి వేళ్ళ  చుట్టూ , కాళ్ళ చుట్టూ , ముఖం మీద , మెడమీద ,
జననాంగాల మీద వస్తుంటాయి           ఇది అంటువ్యాధి . జాగ్రత్త పడాలి .

పులిచింతాకు రసం                       ---- అర  టీ స్పూను
చాకలి సోడా                                ---- అర  టీ స్పూను
సున్నం                                      ---- అర  టీ స్పూను

    అన్నింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చెయ్యాలి . దీనిని పుల్లతో పులిపిర్ల మీద మాత్రమె పెట్టాలి . పక్కన తగలకూడదు
మచ్చ ఏర్పడితే  తేనె , నెయ్యి  సమానం గా తీసుకొని కలిపి మచ్చ మీద పోయాలి .

తమలపాకు రసం                         ---- అర  టీ స్పూను
సున్నం                                      ---- అర  టీ స్పూను

    రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేయాలి .  దీనిని పుల్లతో పులిపిర్ల మీద మాత్రమె పెట్టాలి .  



.