ఒళ్ళు పేలడం ----నివారణ 20-4-09.
250 గ్రాముల వెలిగారాన్ని దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
కొన్ని నీళ్ళలో 10 గ్రాముల పొడిని కలిపి దానిలో ఒక నూలు బట్టను ముంచి పేలిన చోట డ్రైగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా చేయడం వలన శరీరం చల్లగా అయి పేలినది తగ్గి పోతుంది.
చెమట కాయల నివారణకు 25-2-11.
ఉక్క పోత వలన చెమట స్రవించి శరీరం పైన జిడ్డు పేరుకుపోతుంది. చర్మం లో నుండి పొంగినపుడు దారి లేక బుడిపెల లాగా ( చెమట కాయలు ) ఏర్పడతాయి.
ఇవి ముఖ్యంగా బిగుతుగా వున్న దుస్తులను ధరించడం వలన, చెమట ఆరడం వంటి కారణాల వలన ఏర్పడతాయి.
1. పచ్చి పసుపు కొమ్ములు --- 5 gr
చేదు పొట్ల ఆకులు --- 5 gr
వేప ఆకులు --- 5 gr
అన్నింటిని ముద్దగా నూరి ప్రతి రోజు పరగడుపున తీసుకోవాలి.
2. చందనం చెక్క ---- 10 gr
మాని పసుపు --- 10 gr
పాల మీగడ --- 10 gr
చందనం, మాని పసుపులతో విడివిడిగా గంధం తీసి పాల మీగడకు కలిపి పూయాలి.
సూచన :-- ఎక్కువ ఎండలో, వేడి ప్రదేశంలో నడవకూడదు. ఆహారంలో మసాలాలు, కాఫీ వంటివి తగ్గించాలి. చల్లని పదార్ధాలు తీసుకోవాలి.
చెమట కాయల నివారణకు --- మేధికా చూర్ణం 26-3-11.
మేధిక = మెంతులు
చెమట ఆరిపోవడం వలన, చెమట రంధ్రాలు మూసుకుపోవడం వలన పక్కన వచ్చే గుల్లలను
చెమట కాయలు అంటారు. వాతావరణం లో ఉష్ణోగ్రత పెరగడం కూడా ఒక కారణం
మొక్కజొన్న పిండి --- 90 gr
మెంతి పొడి --- 10 gr
రెండింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచాలి.
దూదిని పఫ్ లాగా చేసి దాని మీద ఈ పొడిని వేసి దానితో చెమట కాయలపై అద్ది పూయాలి.
దీనిని స్నానానికి ముందు, స్నానం తరువాత వాడాలి.
సూచనలు :-- వేడి వాతావరణం లో గడపకూడదు. మసాలాలు, ఘాటు పదార్ధాలు,
వాడకూడదు. చాలా బిగుతుగా వున్న దుస్తులు ధరించరాదు. సహజమైన పానీయాలు
( కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పండ్లరసాలు ) తీసుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి