మానసిక రుగ్మతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మానసిక రుగ్మతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

జ్ఞాపక శక్తి





                                         జ్ఞాపక శక్తి పెరగడానికి


వస్త్రగాయం పట్టిన సోంపు గింజల పొడి                     ------- 100 gr
పటిక బెల్లం పొడి                                                 ------- 100 gr

రెండింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

పెద్దలకు                    ------- అర స్పూను
పిల్లలకు                   ------- పావు స్పూను
చిన్న పిల్లలకు          ------- అర పావు స్పూను


  ఆహారానికి గంట ముందుగాని, గంట తరువాత గాని వాడాలి.దీనివలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
మానసిక రుగ్మతలను నివారించవచ్చు. శిరస్సు కు ఆహారాన్ని యిస్తుంది.ఆహారం బాగా జీర్ణమవుతుంది.

                               మతి మరుపు రాకుండా నివారణ                               22-3-09.

                 బుద్ధి మాంద్యాన్ని అరికట్టడానికి ---సరస్వతి చూర్ణం

సరస్వతి చూర్ణం            ---- 50 gr
బోడతరం పొడి              ---- 50 gr
శొంటి పొడి                    ---- 50 gr
వస పొడి                      ---- 50 gr
పిప్పళ్ళ పొడి                 ----50 gr
తేనె                            -----తగినంత

బోడతరం పొడి మానసిక శక్తిని ఇవ్వడంలో చాలా శ్రేష్ఠమైనది .

శొంటి ని విశ్వ భేషజము అంటారు.దీనిని దోరగా వేయించి పొడి చేయాలి.

వస కొమ్ములను 24 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. తరువాత నీటినుండి కొమ్ములను తీసి పొడి గుడ్డతోతుడిచి చిన్న ముక్కలుగా నలగగొట్టి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.

పిప్పళ్ళను కూడా దోరగా వేయించి పొడి చేసుకోవాలి.

అన్ని చూర్ణాలను కల్వం లో వేసి తగినంత తేనె కలిపి బాగా మెత్తగా నూరాలి. దీనితో ఒక మంచి లేహ్యం  తయారవుతుంది.

దీనిని బుద్ధి మాంద్యం వున్నవాళ్లకు వాడితే ఎంతో ఉపయోగపడుతుంది.

చిన్న పిల్లలకు                    ---- ఒక గ్రాము
పెద్ద పిల్లలకు                      ---- బటాణి గింజంత
పెద్దలకు                            ---- కుంకుడు గింజంత

దీనిని ఉదయం, సాయంత్రం పరగడుపున వాడాలి.
ఇది మెదడుకు శక్తి ని ఇస్తుంది. ఎదుటి వ్యక్తులను గుర్తించ లేని సమస్యను నివారిస్తుంది. కీచుగొంతు ,బొంగురు గొంతు మరియు ఊపిరి తిత్తుల సమస్యలు నివారింప బడతాయి

                               మతిమరుపు ----నివారణ                              4-5-09.

ఏకాగ్రత కొరకు వ్యాయామం:-- పద్మాసనం లో కూర్చొని చిరుముద్ర వేసుకొని ఎదురుగా ప్రమిదలో ఒత్తి గాని ,కొవ్వొత్తి గాని వెలిగించి పెట్టుకొని దానినే దీక్షగా 5 నిమిషాలు చూడాలి. ఆసనంలో మోచేతులు, మెడ, వెన్నుపూస నిటారుగా వుండాలి. ఇదే విధంగా కూర్చొని ఓంకారాన్ని పలకాలి.

భ్రామరీ ప్రాణాయామం:-- ఓంకారం లోని మకారాన్ని మాత్రమే పలకాలి. దీనిని పద్మాసనం వేసుకొని రెండు చెవులలో రెండు చూపుడు వేళ్ళను పెట్టుకొని పలకాలి.

ఆహారం:-- రాత్రి పడుకునే ముందు బాదం పాలు తాగితే మంచిది. బాదం పప్పులను రాత్రి పూట నానబెట్టి   ఉదయం తొక్క తీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా సోంపు గింజలపొడి, సమానంగా కలకండ కలిపి నిల్వ చేసుకోవాలి. పొడిని పాలల్లో కలుపుకొని తాగితే చాలా గొప్పగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బాదం పప్పుల పొడి               ---- 50 gr
సోంపు గింజల పొడి                 ---- 50 gr
కలకండ పొడి                         ---- 50 gr

చిన్న పిల్లలకు             ----ఒక  టీ స్పూను
పెద్దలకు, పెద్ద పిల్లలకు  -- రెండు టీ స్పూన్లు

                                                      సరస్వతి చూర్ణం

సరస్వతి ఆకుల చూర్ణం              ---- 100 gr
అశ్వగంధ             "                  ---- 100 gr
అతిమధురం         "                  ---- 100 gr
కలకండ               "                   ---- 100 gr

అన్నింటిని కలిపి జల్లించి సీసాలో భద్రపరచు కోవాలి.

ఉదయం, సాయంత్రం పరగడుపున ఒక టీ స్పూను పొడి పాలల్లో కలుపుకొని తాగాలి. పాలు ఇష్టం లేని  వాళ్ళు నీటిలో కలుపుకొని తాగవచ్చు. లేదా నాలుకతో అడ్డుకొని తిన వచ్చు.

                                       బుద్ధి మాంద్యము --- నివారణ                             9-7-09.

           శిరస్సులో కఫం మితిమీరి చేరడం వలన బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. తలలో వున్న
అధికమైన కొవ్వును తీసి వెయ్యడం ద్వారా దీనిని నివారించ వచ్చును.

నువ్వుల నూనె గాని ఆవాల నూనె గాని వెచ్చ జేసి ముక్కుల్లో, చెవుల్లో రెండేసి చుక్కల చొప్పున వెయ్యాలి         ఇది తప్పనిసరి.

తలను బాగా మునివేళ్ళతో గోరువెచ్చని నువ్వుల నూనె రాసి నెమ్మదిగా మర్దన చెయ్యాలి. నరాలన్నీ చురుకుదనం పొందాలంటే శరీరమంతా తైల మర్దనం చెయ్యాలి.

కపాల భాతి:-- పద్మాసనం వేసుకొని పొట్టను బయటకు లోపలి కదిలించాలి. గాలిని కుడి ముక్కు నుండి గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. అదే విధంగా రెండవ వైపు చెయ్యాలి. ఓంకారాన్ని పలకాలి.

దోరగా వేయించి దంచిన ధనియాల పొడి  --- 50 gr
 "  కరక్కాయల పొడి                          ---- 20 gr
కలకండ పొడి                                     ---- 70 gr

అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.

పిల్లలకు              --- అర టీ స్పూను
పెద్దలకు              --- ఒక టీ స్పూను

పొడిని మంచినీటితో రెండు పూటలా తీసుకోవాలి.

             "మానవుడికి జ్ఞానమే సౌందర్యము"

తేనె                   ---- ఒక టీ స్పూను
పాలమీది మీగడ     --రెండు టీ స్పూన్లు

రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం సేవిస్తే మేదస్సు అద్భుతంగాపెరుగుతుంది.
దీని వలన అధికమైన కఫం తొలగి పోతుంది.


                           విద్యార్ధుల యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి                          25-11-10.

       ప్రతిరోజు  రెండు లేక మూడు సరస్వతి ఆకులను మెత్తగా నూరి తేనె కలిపి తింటే మెదడుకు ఎంతో శక్తి కలుగుతుంది .

ధనియాలు                   --- 50 gr
కరక్కాయ పెచ్చులు       --- 20 gr
కలకండ                        --- 70 gr

       అన్నింటి యొక్క చూర్ణాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                      --- పావు టీ స్పూను
పెద్దలకు                      --- అర టీ స్పూను

      ప్రతి రోజు వాడితే మెదడు కు ఎంతో శక్తి కలుగుతుంది . 


ప్రతి రోజు రాత్రి నాలుగైదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి మెత్తగా నూరి తేనెతో  గాని, నీటితో గాని సేవిస్తే విద్యార్ధులలో జ్ఞాపక శక్తి పెరుతుంది. నరాలు బలంగా తయారవుతాయి 

                                          పదునైన ఆలోచనా శక్తికి                                   11-11-10.

బూడిద గుమ్మడి యొక్క ఒక ముక్కను గాని రసం గాని ప్రతి రోజు తీసుకుంటూ వుంటే ఆలోచనా శక్తిమెరుగవుతుంది.

                                          మతిమరుపు --- నివారణ                                  26-2-11.


కారణాలు :-- వయసు పైబడడం, పోషకాహార లోపం, దీర్ఘ కాలపు వ్యాధులు, హైపో థైరాయిడ్
ఫిట్స్, మధుమేహం, గుండెపోటు, మద్యపానం, క్రొవ్వుపదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన,
మతి మరుపు ఏర్పడుతుంది.

1. ఉసిరి పెచ్చుల చూర్ణం --- అర టీ స్పూను
                             తేనె --- ఒక టీ స్పూను

     రెండింటిని కలిపి నాకాలి. విధంగా ప్రతి రోజు రెండు పూటలా తీసుకోవాలి. 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

2. అతిమధురం పొడి   --- ఒక గ్రాము
                        తేనె --- ఐదు గ్రాములు

దీనిని కూడా పై విధంగానే రోజుకు రెండు పూటలా చొప్పున 40 రోజులు వాడాలి.

3. ఆవు నెయ్యి --- ఒక టీ స్పూను
             పాలు --- అర కప్పు

  గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీనిని 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో మేధో రసాయనం అంటారు

           ప్రతి రోజూ చదువుతూ వుండడం  , గురుముఖత నేర్చుకోవడం, ఆరు రుచుల యొక్క సమతులాహారం భుజించడం మొదలైనవి . 

ఒత్తిడి తగ్గించుకోవడం, అర్ధ శక్తిగా వ్యాయామం చేయడం, ఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకోవడం

మెడిటేషన్ ( ధ్యానం -- ప్రతి రోజు కొద్ది సేపు ) చేయడం వలన జ్ఞాపక శక్తి నీ పెంచుకోవచ్చు.

                                        జ్ఞాపక శక్తి ని పెంచడానికి  , మెదడు యొక్క బలానికి            18-4-11

        ప్రతిరోజు రెండు , మూడు సరస్వతి ఆకులను నూరి తేనె కలిపి తినాలి . ఇది మెదడుకు ఎంతో శక్తిని ఇస్తుంది . నరాలు
బలంగా తయారవుతాయి .

ధనియాలు                   ----50 gr
కరక్కాయ పెచ్చులు       --- 20 gr
కలకండ                        --- 70 gr

       అన్నింటిని  చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                   ---- పావు  టీ స్పూను
పెద్దలకు                   ---- అర టీ స్పూను

      మోతాదుగా ప్రతి రోజు వాడితే మెదడుకు ఎంతో శక్తి కలిపి జ్ఞాపక శక్తి పెరుగుతుంది

                                                         మతిమరుపు  ---  నివారణ                            28-6-11.

కారణాలు :-- ఆహార, విహార కారణాలు వుంటాయి . ఆందోళన ఎక్కువ వున్నవాళ్ళకు  వుంటుంది .

సరస్వతి ఆకుల చూర్ణము                           ---100 gr
అశ్వగంధ చూర్ణము                                   --- 100 gr
తులసి గింజల చూర్ణము                             --- 100 gr  ( రోగనిరోధక శక్తిని , జ్ఞాపక శక్తిని పెంచుతుంది .)
జటామాంసి    చూర్ణము                              ---  50 gr
దాల్చిన చెక్క చూర్ణము                              ---  50 gr
యాలకుల గింజల చూర్ణము                        ---  50 gr

      అన్ని చూర్ణాలను  బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
      ఒక టీ స్పూను చూర్ణాన్ని  ఆవు నెయ్యి కలిపి వుండ  చేసుకొని ఆహారానికి ముందు తీసుకోవాలి

                                                          12-9-11

తిప్పతీగ చూర్ణం                          ----50 gr
ఉత్తరేణి వేర్ల చూర్ణం                      ---- 50 gr
వసకొమ్ముల చూర్ణం                     ---- 50 gr
వాయు విడంగాల చూర్ణం               ---- 50 gr
సరస్వతి ఆకు చూర్ణం                   ---- 50 gr
బోడసరం పూల చూర్ణం                  ---- 50 gr

        అన్నింటిని కలిపి వస్త్ర ఘాలితము చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .

        దీనిని ఉదయం పరగడుపున గాని లేదా రాత్రి ఆహారానికి ముందు గాని వాడాలి

చిన్న పిల్లలకు                   --- 3 చిటికెల చూర్ణము + తేనె
పెద్ద పిల్లలకు                      --- పావు టీ స్పూను చూర్ణము + తేనె
పెద్దలకు                            --- అర టీ స్పూను చూర్ణము  +తేనె


      

      








.




















మానసిక రుగ్మతలు

                                                        మానసిక రుగ్మతలు                  

                                   మహిళల్లో మానసిక ఒత్తిడి నివారణకు నవోదయ చూర్ణం                      28-7-11.

లక్షణాలు :--  రోజువారీ పనులలో ఒత్తిడి ,  అర్ధం లేని భయాలు, దుఖం , అనారోగ్య కారణాలు , మానసిక ఉద్వేగం మొదలైనవి  వుంటాయి .

ఇంగువ                      --- 5 gr
వసకొమ్ము                 --- 5 gr
జటామాంసి                --- 5 gr
చెంగల్వ కోష్టు             --- 5 gr
నల్ల ఉప్పు                 ---10 gr
వాయువిదంగాలు        ---40 gr

         అన్నింటి యొక్క చూర్ణాలను  విడివిడిగా తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి .
         సూర్య కిరణాలలో ఎంత శక్తి ఉన్నదో ఈ ఔషధానికి అంత శక్తి వున్నది .
        
         3  గ్రాముల చూర్ణాన్ని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి . ఈ విధంగా రెండు పూటలా తీసుకోవాలి . అవసరమైతే
రోజుకు మూడు సార్లు కూడా వాడవచ్చు .

ఉపయోగం :---  దీనిని వాడడం వలన రాత్రి పూట ఎంత వ్యాకులతతో పడుకున్నా ఉదయం లేచేసరికి  ఫ్రెష్ గా
అయిపోతారు

         దీనితోపాటు సాత్వికాహారం తీసుకోవాలి

అపస్మారకం --స్పృహ తప్పడం





                                        అపస్మారకం --స్పృహ తప్పడం                      17-12-08.


యోగాసనం:-- పద్మాసనం వేసుకొని, నిటారుగా కూర్చొని, చిన్ముద్ర వేసి దీర్ఘంగా శ్వాస పీల్చి వదలాలి.తరువాత వేగంగా గాలి పీలుస్తూ వదలాలి. విధంగా కొంచం సేపు అయిన తరువాత నాభితో గాలి పీల్చుకొని నోటితో గాలి వదలాలి.

స్పృహ తప్పే వ్యాధి వున్న వాళ్ళను బోర్లా పడుకోబెట్టి ఒక నూలు బట్టను నిలువుగా నాలుగు మడతలు వేసి, గోరువెచ్చని నీటిలో తడిపి, పిండి వెన్నెముక పైనుండి కింద వరకు పొడవుగా వేసి అద్దాలి.

ఆవునెయ్యి                  ------- 50 gr
ఆవు మూత్రం             ------- 200 gr (7 సార్లు వడకట్టాలి)
ఇంగువ పొడి                ------- 15 gr (పొంగించినది)
సైంధవ లవణం              ------ 15 gr

      అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వారు కాచాలి.

ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూన్ చొప్పున కడుపులోకి తీసుకుంటూ వుంటే అపస్మారక సమస్య  నివారింప బడుతుంది.


                                    స్పృహ తప్పడం -- నివారణ                           26-1-11.

        కొన్ని వ్యాధుల కారణంగా కూడా స్పృహ తప్పడం జరుగుతుంటుంది.

కారణాలు :-- అధిక రక్తపోటు, అల్పరక్తపోటు, నిద్రలేమి, రక్తహీనత, ఆకలి ఎక్కువగా వున్నా కూడా ఆహారం తీసుకోకపోవడం, దాహం ఎక్కువగా వున్నా నీళ్ళు తాగాక పోవడం ఆనందం, దుఖం ఎక్కువగా వున్నపుడు, స్పృహ తప్పడం జరుగుతూ వుంటుంది.

దాహం కారణంగా స్పృహ తప్పితే  స్పృహలో కి  వచ్చిన   తరువాత మాత్రమే నీళ్ళు తాగించాలి.

సాధారణ సమస్య అయితే :--

1. వెల్లుల్లి పాయలను బాగా నలిపి వాసన చూపించాలి.

2. వసకొమ్ము పొడిని వాసన చూపించాలి.

3. అర కప్పు శతావరి వేర్ల రసాన్ని ఒక గ్లాసు పాలలో కలుపుకుని , చక్కర కలుపుకుని
తాగాలి లేదా అర టీ స్పూను శతావరి వేర్ల పొడిని అరకప్పు పాలలో కలిపి చక్కర కలిపి తాగాలి.

4. వెల్లుల్లి తైలాన్ని పూయాలి, వెల్లుల్లిని నూరి ముద్దను మింగించాలి.

5. అర టీ స్పూను సరస్వతి ఆకు చూర్నానికి తగినంత తేనె కలిపి నాకించాలి.

  ఈ సమస్య వున్నవాళ్ళు ఒంటరిగా వుండకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
































































నరాల బలహీనత

                                  నరాల బలహీనత                                             25-11-08.

వెన్నుపూసకు మర్దన, వ్యాయామం :--
          నువ్వుల నూనెతో వెన్నుపూసకు ముచ్చెన గుంట నుండి నడుము వరకు రుద్దాలి. రెండు బొటన వేళ్ళతో అంటే రెండు బొటన వేళ్ళు వెన్ను పూస మీద కలిసే విధంగా పేషంట్ ను పడుకోబెట్టి ఎదురుగా నిలబడి వెనక పైనుండి కిందకు రుద్దాలి.ముందు వెన్నుపై, తరువాత వెన్నుపాము కు రెండు వైపులా అంటే వెన్నుపాముకు అటు ఇటు నూనెతో రుద్దాలి.
          వెన్నెముక స్నానానికి తొట్టె ఉంటుంది, లేక పోతే ఒక నూలు గుడ్డను తీసుకొని చన్నీటితో తడిపి కొద్దిగా నీటిని పిండి పూర్తిగా వెన్నుపూస మీద పరచి 10 నుండి 20 నిమిషాలు ఉంచాలి.తరువాత వెన్నుపూసకు సంబంధించిన వ్యాయామం చెయ్యాలి .ఎడమ కాలును పైకెత్తి (వెనక్కి మడిచి ) కుడి చెయ్యి పైకేత్తాలి.రెండవ  వైపు కూడా అదే విధంగా చెయ్యాలి.
ఆహారం :-- వారానికి ఒకటి లేదా రెండు సార్లు లేదా (ప్రతి రోజు అయితే మరీ మంచిది) నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేస్తూ నానబెట్టాలి.
       నువ్వుల నూనెను కూరల్లో తాలింపుకు,తలకు నూనెగా వాడాలి. నువ్వుల పచ్చడి,చిమ్మిరి తింటూ ఉండాలి

 కాళ్ళు పగలడం, నరాల బలహీనత తగ్గుతాయి.
                                                        
                 నరాల బలహీనత, వాత నొప్పుల నివారణకు ---బసవరాజ గుళికలు             14-4-09
వాము పొడి                  ---- 50 gr ( దోరగా వేయించి దంచి జల్లించిన పొడి)
మాల్ కంగని గింజల పొడి    --50 gr  (ఎండబెట్టి దంచినది)
గుగ్గిలం                        ----50 gr ( శుద్ధి చేసిన పొడి)
త్రిఫలాలు                  ---- 250 gr
నీళ్ళు                       ---- ఒక లీటరు
       ఒక లీటరు నీటిలో త్రిఫలాలను వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు మరిగించాలి.  ఈ కషాయాన్ని  ఒక గిన్నెలో పోసి దాని మూతికి ఒక నూలు బట్టను కట్టి ఆ బట్ట మీద గుగ్గిలం ముక్కలను వేసి స్టవ్ మీద  పెట్టాలి. ఆవిరికి గుగ్గిలం కరిగి డస్ట్ బట్ట పైన మిగులుతుంది.  మిగతాది కరిగి కషాయంలో పడుతుంది. దీనిని బాగా ఎండబెట్టి పొడి చేసి  50  గ్రాములు  తీసుకోవాలి.  దీనిలో వాము పొడి, మాల్ కంగని పొడి, గుగ్గిలం పొడి  కలిపి పేస్ట్ లాగా చేసి శనగ గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి.
    ప్రతి రోజు ఉదయం ఒక మాత్ర వేసుకోవాలి.

                          నరాల బలహీనత  --నివారణ                                                      11-4-11.
   
     అశ్వగంధ చూర్ణం               --- 10 gr
     శతావరి వేర్ల చూర్ణం            --- 10 gr
                  పాలు                  ---  పావు లీటరు
              మంచి నీళ్ళు            --- పావు లీటరు

     అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు ఇంకి పోయి పావు లీటరు పాలు మాత్రమే
మిగిలే వరకు కాచాలి.      దానికి తగినంత కలకండ కలపాలి.  వడపోసుకుని   తాగాలి. 

     ఇది నరాలకు ఎంతో శక్తిని ఇస్తుంది.  దేనిని ప్రతి రోజు తాగితే ఎంతో మంచిది.

      ఇది నరాల బలహీనతను నివారించడమే కాక అపస్మారకం, మూర్చ, మతిమరుపు వంటి
 రోగాలను కూడా పోగొడుతుంది.   






          


సారాయి మాన్పించడానికి

                                సారాయి  మాన్పించడానికి                                   3-12-10.
      రెండు స్పూన్ల జామ ఆకుల రసాన్ని సారాయితో కలిపి తాగించాలి. వాంతి అవుతుంది. దీనితో అసహ్యం కలిగి మానేస్తారు.
                           ఆల్కహాలిజం నుండి ఉపశమనానికి                            2-12-10.

      ఒక గ్లాసు మజ్జిగలో మూడు స్పూన్ల కాకర ఆకు రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.

                                     మద్యపానం   --- నివారణ                              22-8-11

    ఆదివారం ఉదయం సూర్యోదయం తో కూడా  ఆముదపు ఆకును తెచ్చి రసం వచేట్లు నలపాలి . రోగిని పడుకోబెట్టి కుడి ముక్కులో రెండు చుక్కలు ,ఎడమముక్కులో రెండు చుక్కలు వేయాలి .
 10 నిమిషాలు అలాగే వుంచాలి . ముక్కును అటు ఇటు కాసేపు కదిలించాలి . 

      ఈ విధంగా నాలుగు ఆదివారాలు చేయాలి .

ముఖ్య గమనిక :--- ముఖ్యంగా  మద్యాన్ని మానేయ్యాలనే అభిప్రాయం గట్టిగా ఉంటేనే  మందు పని చేస్తుంది

     ఈ విధంగా 4 , 5 వారాలు చేయాలి . వారానికి ఒక్క రోజు మాత్రమె చేయాలి .

     ఈ విధంగా చేస్తే తప్పక మానేస్తారు .        జ్ఞానముద్ర వేస్తూ వుండాలి

ఆహారంలో తీసుకోవడం లో చేయవలసిన మార్పులు :---

     చికిత్స ప్రారంభించిన రోజునుండి దీనిని పాటించాలి . సాయంకాలం అయ్యేటప్పటికి తాగాలనే కోరిక ఎక్కువవుతుంది .
ఆ సమయం లో ఒకటి గాని రెండు గాని ఆపిల్ పండ్లను తినాలి . వాము వాటర్ ( ఒమ అర్కము ) అరా కప్పు నీళ్ళలో
కలుపుకొని తాగాలి . ఇది కూడా మద్యం తాగాలనే కోరికను వెనక్కు లాగుతుంది .

    మాద్యం సేవించే వారిలో నాడీ  వ్యవస్థ బలహీనంగా వుంటుంది .---- దీని నివారణకు

అశ్వగంధ
అతిమధురం
నేలతాది దుంపలు
నేలగుమ్మడి

         అన్ని దుంపలను  సమానంగా తీసుకోవాలి  రాత్రి అన్నింటిని ఒక పాత్రలో వేసి అవి పూర్తిగా మునిగే వరకు ఆవుపాలు
పోసి నానబెట్టాలి . ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత దంచి జల్లించి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి .

         ప్రతి రోజు అర టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని తాగాలి .
         ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో గాని , లేదా మజ్జిగలో గాని కలిపి రాత్రి పూట తాగించాలి .

         ఈ విధంగా పైన చెప్పబడిన విధంగా ఆచరిస్తూ నాలుగు ఆదివారాలు మందును నియమంగా వుంటే తప్పక మానేస్తారు

       

మూర్చ వ్యాధి ----- నివారణ

                          మూర్చ వ్యాధి ---- నివారణ                                   14-6-09.
 
వెల్లుల్లి రేకల ముద్ద ---- 20 gr
నల్ల నువ్వుల పొడి  ---- 20 gr

  రెండింటిని కల్వంలో వేసి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చేట్లు నూరాలి.

చిన్న పిల్లలకు ---- జొన్న గింజంత
పెద్ద పిల్లలకు   ---- శనగ గింజంత
పెద్దలకు         ---- బటాణి గింజంత

    ఇవి ఎంత కాలమైనా నిల్వ వుంటాయి. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడాలి

     సమస్య ఎక్కువగా వుంటే పూటకు రెండు మాత్రలు వాడవచ్చు. ఎండా కాలంలో ఒకటి, వర్షా కాలంలో రెండు చొప్పున వాడవచ్చు.

    21 జాజి కాయలు తెచ్చి మధ్యలో రంధ్రం చేసి దారం గుచ్చి రోగి మేడలో వేయాలి. వాసన పీలుస్తూ వుంటే మూర్చ వ్యాధి రాదు.

      ఉత్తరేణి గింజల పొడిని నశ్యం లాగా పీల్చాలి. బొటన వేళ్ళను నొక్కి ఉంచాలి.

    కఫం పెంచే పదార్ధాలు,, ఫ్రిజ్లోని పదార్ధాలు, పాలు,పెరుగు అసలే పనికి రావు.పాలు తాగవలసిన తప్పని పరిస్థితులలో పాలలో అల్లం, కలకండ కలుపుకొని తాగాలి. మజ్జిగలో అల్లం వేసి వాడుకోవచ్చు.

నువ్వుల నూనె మర్దన ముఖ్యముగా అరికాళ్ళకు ప్రతి రోజు తప్పనిసరి.

                                 మూర్చ --Fits -- నివారణ                      28-7-10.

      ప్రతి రోజు రెండు గ్రాముల వస పొడిని పాలల్తో గాని, తేనెతో గాని , నెయ్యితో గాని ఇస్తే రెండు నెలలలో మంచి అద్భుతమైన ఫలితం కనిపిస్తుది.

కూష్మాండ స్వరాసాన్ని తాగించాలి. శరీరం మీద వాపుల మీద గంధం పూస్తే తగ్గుతాయి.

                                                            చిట్కా                                                  28-9-10.

  నాలుగైదు చుక్కల మునగాకు రసాన్ని ముక్కులో వేస్తే వెంటనే కోలుకుంటారు.

                                                       16-10-10

మీగడ తీసిన నాటు ఆవు పెరుగు
చిక్కని ఆవు పాలు
గోమూత్రం
గోమయ రసం
ఆవు నెయ్యి

  ఒక్కొక్క పదార్ధాన్ని ఐదేసి గ్రాముల చొప్పున తీసుకుని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు సేవించాలి. ప్రతి రోజు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :-- నిప్పుకు నీటికి దూరంగా వుండాలి. ప్రక్కన ఎవరో ఒకరు తోడుండాలి. నిప్పును, నీటిని చూచినపుడు వాళ్ళ మెదడులో నాడులు ప్రకోపించి ప్రమాదాలు జరగవచ్చు.

                                                 చిట్కా                                                     8-1-11.
  
   ప్రతి రోజు వస చూర్ణాన్ని తేనెతో తింటూ పాలు, పెరుగు ఎక్కువగా వాడుకుంటూ వుంటే క్రమేపి తగ్గిపోతుంది.

                      మూర్చ వచ్చి పడిపోతే వెంటనే స్పృహ రావాలంటే                   26-3-11.

     రెండేసి చుక్కల ఉల్లిపాయల రసాన్ని ముక్కుల్లో వేయాలి.

                                             మూర్చ వ్యాధి --- నివారణ                            26-5-11.

     దోరగా వేయించిన శొంటి పొడి              ---- చిటికెడు
        "           "      జిలకర పొడి              ----     "
                            నిమ్మ రసం               ---- 5 టీ స్పూన్లు

                 కలిపి తీ సుకొవాలి.

   2.  పది,  పదిహేను తులసి ఆకుల తో రసం తీయాలి.  దానికి చిటికెడు సైంధవ లవణం కలపాలి.
        దీనిని రెండు చుక్కలు ముక్కులో వేస్తే  వెంటనే లేచి కూర్చుంటారు

   3.  ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని కలిపి కషాయం కాచి
       దానికి బెల్లం కలుపుకొని తాగాలి .
  
   4. త్రిఫల చూర్ణం             --- అర టీ స్పూను
       అతి మధురం చూర్ణం  --- అర టీ స్పూను
                   తేనె              --- ఒక టీ స్పూను
     
        పై మోతాదు చొప్పున  ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు సేవించాలి .

   5.  సర్వాంగాసనం,  మత్స్యాసనం  వేయాలి. 

                                     మూర్చ రోగాలు ---నివారణ                                       16-7-11

  ఉత్తరేణి గింజల బియ్యం                ---- 100 gr

       ఈ బియ్యాన్ని గోమూత్రం లో నానబెట్టాలి .  ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత దంచి వస్త్రగాయం
పట్టి నిల్వ చేసుకోవాలి . దీనిని  చిటికెడు పొడిని ముక్కు పొడి  ( నశ్యం ) లాగా పీల్చాలి . తరువాత రెండవ ముక్కుతో
కూడా పీల్చాలి .

ఉపయోగాలు :-- ఉన్మాదం , పిచ్చి , పళ్ళు కొరకడం , వస్తువులు విసిరికోట్టడం వంటివి నివారింపబడతాయి .

                                                             27-7-11
వసకోమ్ముల పొడి                --- 100 gr
      దీనిని బాణలి లో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా , బూడిదలాగా మారేవరకు వేయించాలి . చల్లారిన తరువాత జల్లించి
పొడిగా వున్న సీసాలో నిల్వ చేసుకోవాలి .

వయసును బట్టి

పిల్లలకు                       ----  ఒకటి నుండి నాలుగైదు చిటికెలు
పెద్దలకు                       ----  ఐదు చిటికెల నుండి ఒక టీ స్పూను 
వరకు వాడాలి . దీనిని నీటిలో కలుపుకొని తాగావచ్చును లేదా తేనెతో కలిపి సేవించవచ్చును .

ఉపయోగాలు :--- దీనివలన సడన్ గా పడిపోవడం ,  పళ్ళు కొరకడం వంటి మూర్చ లక్షణాలు నివారింపబడతాయి .

                                             మూర్ఛ వ్యాధి నివారణకు                                16-9-11
.      ఫిట్సు   వచ్చి పడిపోయి ,  నోటినుండి నురుగు కారుతూ , పళ్ళు కోరుకుతూ , కింద పది గిలగిలా కొట్టుకుంటూ ఉంటే
సీతాఫలం చెట్టు యొక్క ఆకులను నలిపి వాసన చూపిస్తే  సమస్య నివారింపబడుతుంది .

         వాత ప్రభావం వలన అవయవాలు పట్టుకు పోవడం నరాలు బలహీన పడినపుడు

      మిరియాలను నానబెట్టి బాగా మెత్తగా నూరి చచ్చుబడిన భాగం పై రుద్దితే యధాప్రకారము తయారవుతుంది . ఈ
విధంగా కొంతకాలం చేయాలి .