కీళ్లు/ఎముకలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కీళ్లు/ఎముకలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

భుజాలు

                                                  భుజబలము                                              21-1-09.

వ్యాయామం:--  పద్మాసనం వేసుకొని కూర్చుని భుజాలను పైకి, కిందికి కదిలించాలి. ముందుకు కదిలించడం,వెనక్కి కదిలించడం చెయ్యాలి. మోకాళ్ళ పై చేతులు వుంచుకొని చెయ్యాలి.
         రెండు చేతులను భుజాలపై పెట్టుకొని, చెవులకు తగిలేటట్లు చేతులను పైకెత్త కుండ గాలి పీలుస్తూ వదులుతూ కదిలించాలి. చేతులను మాత్రం పై కెత్త కూడదు. మరల చేతులను పూర్తిగా చాపి గాలిని పూర్తిగా పీల్చి నెమ్మదిగా వదలాలి.అంకెలను ఓంకార శబ్దం లాగా నెమ్మదిగా చాలా సేపు సాగదీసి పలకాలి.
        కుడిచేతిని ఎడమ చేతితో ఎడమ వైపుకు లాగాలి.అదే విధంగా రెండవ వైపు కూడా నిదానంగా చెయ్యాలి.ఇది తల వెనుక భాగం లో చెయ్యాలి. మరల కుడిచేత్తో ఎడమ భుజాన్ని పట్టుకొని కుడివైపుకు గుంజినట్లు పక్కకు లాగాలి.అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
                      బాహు వాతము--భుజము నొప్పి --- నివారణ                             28-9-10.

      భుజము  ఒత్తిడికి గురికావడం, పని భారం పడడం, దెబ్బ తగలడం, బరువులు మోయడం వలన మొదలైన కారణాల వలన భుజము నొప్పి వస్తుంది.  ఒక్కొక్కసారి వాపు కూడా వస్తుంది.

                                                    అజామోద తైలం:--

ఆజామోదం             ----- ఒక కిలో
నీళ్ళు                    ----- ఎనిమిది లీటర్లు
నువ్వుల నూనె        ----  ఒక కిలో
అశ్వగంధ చూర్ణం     ----   25 gr
తిప్ప తీగ చూర్ణం     ---

                              ఒకకిలో అజామోదం తీసుకుని నలగగొట్టి  ఎనిమిది లీటర్ల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి నాలుగు లీటర్ల కషాయం వచ్చే వరకు కాచాలి.   దానిని వడకట్టి ఆకషాయానికి నువ్వులనూనె, అశ్వగంధ చూర్ణాన్ని, తిప్ప తీగ చూర్ణాన్ని కలిపి స్టవ్ మీద పెట్టి కషాయం ఇంకి పోయి తైలం మాత్రమే మిగిలేట్లు సన్న మంట మీద కాచాలి.  చల్లార్చి
వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.

   ఈ తైలంతో మృదువుగా పైనుండి కిందికి  మర్దన చెయ్యాలి.   ఈ విధంగా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.నొప్పి వున్న ప్రాంతంలో ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి.

                                         భుజాల నొప్పులు--- నివారణ                                      7-4-11.

            లేత మునగాకు చిగుళ్ళు  లేదా వావిలాకు చిగుళ్ళు    --- 10
                                             నీళ్ళు                                --- ఒక గ్లాసు

     చిగుళ్ళను నీటిలో వేసి మరిగించి అర గ్లాసు కషాయం మిగిలే వరకు కాచాలి. తరువాత వడకట్టి
 గోరువెచ్చగా వున్నపుడు ఒక టీ స్పూను తేనె కలుపుకుని తాగాలి.

     దీని వలన  అన్ని రకాల ఒల్లునోప్పులు,  బిగుసుకున్న నొప్పులు తగ్గిపోతాయి.

      వ్యాయామం :--   పద్మాసనం వేసుకుని కూర్చొని రెండు చేతులను ఒళ్లో  పెట్టుకోవాలి. రెండు
 చేతుల వేళ్ళను కలిపి  సమాన దూరంలో కలపాలి.

      ఒక నిమిషం తరువాత మొదట ఉంగరపు వేళ్ళను  కిందికి వదిలెయ్యాలి. ఆ విధంగా ఒక్కొక్క
 జత వేళ్ళను  కిందికి వదుల్తూ వుండాలి.

      మొదట     ఉంగరపు వేళ్ళను  వదలాలి
      తరువాత   చిటికెన వేళ్ళను     వదలాలి
          "           బొటన వేళ్ళను ను      "
          "           చూపుడు వేళ్ళను       "
          "           మధ్య వేళ్ళను            "

                  తరువాత అన్ని వేళ్ళను  కలిపి 5 నిమిషాలు ఉంచాలి.

     ఈ విధంగా చేయడం వలన ఎలాంటి మందులు వాడకుండానే చాలా అద్భుతంగా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.

                                                          భుజం నొప్పి   --- నివారణ                           21-7-11.

           భుజానికి సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన చేయి  పైకెత్తలేకపోవడం ,  కిందికి డించలేకపోవడం జరుగుతుంది .

నేలతంగేడు  లేదా  ఈ మొక్క లభించని పక్షంలో  సునాముఖి వాద వాడవచ్చును .
           నేలతంగేడు ను సమూలంగా తెచ్చి ఎండబెట్టి , దంచి , జల్లించి  నిల్వ చేసుకోవాలి .
            ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటిలో కలిపి తాగవచ్చు  లేదా పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగావచ్చును .
దొరకని పక్షంలో :--
             సునాముఖి ఆకును దంచి , జల్లించి నిల్వ చేసుకోవాలి . దీని వంట చేసేటపుడు అర టీ స్పూను పొడిని రసం (చారు) లో వేసి అందరు వాడుకోవచ్చు . దీని వలన కూడా మంచి ఫలితం వుంటుంది .

2.   శుద్ధి చేసిన గుగ్గిలం                       ---   50 gr
              నెయ్యి                               --- 100 gr
       రెండింటిని కలిపి నూరి శనగ గింజంత మాత్రలు చేసి  నిల్వ చేసుకోవాలి .
        ప్రతి రోజు ఒక మాత్ర వేసుకోవాలి .

గుగ్గిలాన్ని శుద్ధి చేయడం :---
         ఒక గిన్నెలో త్రిఫల కషాయాన్ని పోసి గిన్నెకు గుడ్డ కట్టాలి . గుడ్డ మీద గుగ్గిలాన్ని ఉంచాలి  . తరువాత గిన్నెను
స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి .  తరువాత గుగ్గిలాన్ని చీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి

                                         
                .
      










కీళ్లలో గుజ్జు శక్తి పెరగడానికి

                          కీళ్లలో గుజ్జు  శక్తి పెరగడానికి                                             28-5-10.

           జువ్వి పండ్లు ( ప్లక్ష వృక్షము)  ఎన్ని దొరికితే అన్ని తెచ్చి వారిని రెండేసి ముక్కలుగా చేసి బాగా ఎండ బెట్టాలి. బాగా మందంగా వున్న కుండను శుద్ధి చేసి బాగా కడగాలి.  కుండను తేమ లేకుండా బాగా ఎండబెట్టాలి.
        ఆ కుండలో ఎండిన పండ్లను పోసి అవి  మునిగేంతవరకు  తేనె పొయ్యాలి.  ఎండిన జువ్వి పండ్లు  తేనెను పీల్చుకుంటాయి. మరలా మునిగే వరకు తేనె పోయాలి.
 కుండ మీద మూకుడు బోర్లించాలి. ఒక గుడ్డకు బంక మట్టిపూసి కుండలోకి గాలి చొరబడకుండా
 మూకుడు, కుండ కలిసే చోట సీల్ చేయాలి.   ఆ కుండను గాలి తగలని .చోట ఒక మూలగా 30 రోజులు ఉంచాలి.  అది బాగా మగ్గి హల్వా లాగా తయారవుతుంది.
       దీనిని ప్రతి రోజు ఒక అర టీ స్పూను తీసుకొని తింటూ వుంటే కీళ్లలో గుజ్జు పెరగడమే కాక వీర్య వృద్ధి, శక్తి 
వృద్ధి జరుగుతుంది.

                                            కీళ్లలో గుజ్జు అరిగిపోతే  --- పెరగడానికి                        22-8-11.

       తుమ్మ బంకను తెచ్చి రెండు చుక్కలు  నెయ్యి వేసి వేయించి , దంచాలి . దానికి సమానంగా కలకండ పొడిని కలపి
నిల్వ చేసుకోవాలి .

      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి
      ఈ విధంగా చేయడం వలన   కీళ్ళ మధ్య అరిగిపోయిన గుజ్జు బాగా పెరుగుతుంది .




   

కీళ్ళ నొప్పులు









                                  కీళ్ళ నొప్పులకు --- ఏరండ తైలం             3-1-09.

ఆముదపు చెట్ల వేర్ల పై బెరడు ----- అర కిలో
ఆముదం ----- అర కిలో
మంచి నీళ్ళు ----- రెండు లీటర్లు

  ఒక పాత్రలో ఆముదపు వేర్లను వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి అర కిలో కషాయం మిగిలే వరకు కాచాలి  దానిని వడకట్టి పాత్రలో పోసి దానిలో ఆముదం పొయ్యాలి. కషాయం ఆవిరై ఆముదం మిగిలే వరకు కాచాలి. స్టవ్ ఆపి వడకట్టాలి.,

మిరియాల పొడి                 ----10 gr
పిప్పళ్ల పొడి                      ----10 gr
కర్పూరం                          ----30 gr

    వడకట్టిన ఆముదం వేడిగా ఉండగానే పై మూడింటిని కలపాలి.తరువాత సీసా లో భద్రపరచాలి.

 తైలాన్ని వేడి చేసి నొప్పుల మీద మర్దన చేస్తే ఎటువంటి నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.స్నానికి గంట  ముందు చెయ్యాలి.

ఇది మడమశూల, సయాటికా, తుంటినొప్పి,మోకాలు, మోచేతి నొప్పులు అన్ని తగ్గుతాయి.మర్దన
తరువాత కాపడం పెట్టాలి.

కాపడం పెట్టె విధానం :-- పాత ఇటుక రాయిని పొడి చేసి,వేయించి గుడ్డలో వేసి కాపడంపెట్టాలి.ఇది తప్పనిసరి.. కాపడం పెట్టిన తరువాత వ్యాయామం చెయ్యాలి. ఆహార నియమాలు పాటించాలి.

                శరీరంలో వాత సమస్యలు -- నివారణ --కీళ్ళ వాతము               23-6-09.

మలిన రక్తం కీళ్లలో చేరడం వలన వాతం ఎక్కువై నొప్పులు వస్తాయి.

తైలంతో ప్రతి కీలు దగ్గర రుద్దాలి.

వ్యాయామం:-- కుర్చీలో కూర్చొని వేళ్ళను, చీలమండలను, మోకాళ్లను కదిలించడం, తిప్పడం చెయ్యాలి. గాలి  పీలుస్తూ మెడను తిప్పాలి. చేతులను ముందుకు చాపి వేళ్ళను, మణికట్లను వంచాలి, తిప్పాలి చేతులను బార్లా  చాపాలి, పైకేత్తాలి. పైవిధంగా చెయ్యడం వలన అన్ని కీళ్ళు కదులుతాయి.

తినదగిన పదార్ధాలు:-- మినుములు, గోధుమలు, ఉలవల గుగ్గిళ్ళు, చారు, ఉలవ కట్టు, లడ్లు పాతబియ్యం, లేతమునగాకు, తెల్ల గలిజేరు బూడిద గుమ్మడి కాయ, వంకాయ, లేత మునక్కాయలు, కాకరకాయలు, బొప్పాయి పండు, దానిమ్మ పండు.

  ఉలవలు వాతరోగాలను నివారించడంలో ప్రశస్తమైనవి. మునగాకు రెండు వారాలు గాని తింటే వాత నొప్పులు  చాల వరకు నివారింపబడతాయి.

తినకూడనివి:-- చల్లని అన్నం, చల్లని  కూరలు, చల్లని  నీరు,  చల్లని గాలి పనికిరావు చన్నీళ్ళ స్నానం పనికి రాదు
దోసకాయ, పెసరపప్పు, సొరకాయ, నక్కదోసకాయ, బీరకాయ, నేతిబీరకాయ పనికి రావు

చల్లని గాలిలో తిరగ కూడదు.

ఆహారం:--

సన్నరాష్ట్రం
తిప్పతీగ
శొంటి
తెల్లగలిజేరు వేళ్ళు
ఆముదపు చెట్టు వేళ్ళు

      అన్నింటిని సమాన భాగాలు తీసుకొని దంచి పొడి చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.

  పావు లీటరు నీళ్ళలో ఒక టీ స్పూను పొడి వేసుకొని ఒక కప్పు కషాయానికి దించి తాగితే వాత రోగాలు  నివారింపబడతాయి.

"వాయువే ఆయువు"

వాత రోగాలను పోగొట్టడంలో "ఓమ తైలం" చాలా శ్రేష్ఠ మైనది. దీనితో అన్ని కీళ్ళ మీద సున్నితంగా
మర్దన చేయాలి. వావిలాకును నీటిలో వేసి కాచి దానిలో గుడ్డను ముంచి తప్పకుండ కాపడం పెట్టాలి.వావిలాకు దొరకని పక్షంలో మునగాకు తో గాని, తక్కలాకుతో గాని కాపడం పెట్ట వచ్చు.

వ్యాధి శరీరంలో మలిన వాయువులు చేరడం వలన వస్తుంది కాబట్టి ప్రాణాయామం ద్వారా మంచి గాలిని  లోపలి పంపించి చెడు వాయువును బయటకు పంపించాలి.

                       కీళ్లనొప్పుల నివారణకు ---తైల మర్దనం                       4-7-09.

కీళ్ళ వాతానికి సందివాతము, ఆమవాతము అని పేర్లు .

ప్రకృతి విరుద్ధమైన ఆహార విధానము వలన వాత, పిత్త, కఫసమస్యలు, అగ్ని మాంద్యము ఏర్పడతాయి.

కృష్ణ తులసి ఆకుల రసం --- పావు కిలో
ఆవనూనె --- పావు కిలో

  రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. చల్లారిన

తరువాత వడకట్టి సీసాలో భద్ర పరచాలి.

    ఈ తైలంతో వాచివున్న కీళ్ళ కీళ్ళ మీద రుద్దాలి. ప్రతి కీలు మీద నెమ్మదిగా, గుండ్రంగా మర్దన చెయ్యాలి.    తరువాత కాపడం పెట్టాలి.

వాతాన్ని పెంచే పదార్ధాలు, చల్లని పదార్ధాలు, కొత్త బియ్యం, తినకూడదు. ఉడికీ వుడకని అన్నము తినకూడదు.

నీటిలో వాతాన్ని హరించే ఆకులను ఏవైనా కొన్నింటిని వేసి కాచి కీళ్ళ మీద ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టేటపుడు కొంత బాధగా భరించలేనట్లుగా వుంటుంది కాని భరించాలి. ఆకులు వేసి కాచిన నీటిలో గుడ్డను ముంచి,

         పిండి వాపుల మీద మెల్లగా కాపడం పెట్టాలి.

వ్యాయామం:-- చేతులను చాపి వేళ్ళను వంచడం, మడవడం తెరవడం, చెయ్యాలి. మణికట్టు, భుజం అలాగే   కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర గుండ్రంగా తిప్పుతూ మర్దన చెయ్యాలి.

సైంధవ లవణం
మిరియాల పొడి
శొంటి పొడి

     పై పదార్ధాలను ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒక విధంగా వాడాలి.

అగ్ని మాంద్యాన్ని తొలగించడానికి --వైశ్వానర చూర్ణము

శొంటి                            ----30 gr
వాము                           ----20 gr
కరక్కాయ పొడి             ---- 100 gr
సైంధవ లవణం                ---- 20 gr

 శొంటి, వాము, కరక్కాయలను వేయించాలి. అన్నింటి పొడులను కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

ఆహారానికి అర గంట ముందు అర టీ స్పూను పొడిని గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.

ఆమ వాతాన్ని హరించే శక్తి అతి ముఖ్యముగా వంటాముదానికి వున్నది . దీనిని ఏదో ఒక రూపంలో  విరేచానానికి వాడుతూ వింటే శరీరంలోని మలినాలు తొలగింపబడి నొప్పులు నివారించ బడతాయి.

                                   కీళ్ళ వాతము ---నివారణ                                    5-4-10.

కలబంద యొక్క మట్టను తొలగించి తీసిన గుజ్జుతో రసం తీయాలి.

కలబంద రసం                  ---- ఒక కిలో
గోధుమ పిండి                  ---- అరకిలో
ఆవు నెయ్యి                    ---- అరకిలో
కలకండ                         ---- రెండున్నర కిలో

     కలబంద గుజ్జు రసంలో ఆవునెయ్యి వేసి ఎర్రబడేట్లుగా వేయించాలి. గోధుమ పిండిని వేరేగా వేయించాలి. కలండను వేరే గిన్నెలో వేసి, తగినన్ని నీళ్ళు కలిపి పాకం పట్టాలి. దానిలో కలబంద గుజ్జు, గోధుమ పిండి వేసి  కలియబెట్టాలి. హల్వా లాగా తయారవుతుంది.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 30, 40 గ్రాములు చొప్పున తింటూ వుంటే పురాతనమైన, చాలా పాత నొప్పులు, కీళ్ళనొప్పులు, వాతం నివారింపబడతాయి.


                           ఆడ పిల్లలలో కీళ్ళ నొప్పులు --నివారణ                     26-5-10.

                                        (Junaival Orthritis )

  ఈ వ్యాధిలో కీళ్లలో వాపులు, నొప్పులు, ఎర్రటి వాపు, జ్వరం వుంటాయి. నడకలో కుంటి తనం వుంటుంది,

  పిల్లలు పని చేయలేక పోవడం, నీరసంగా వుండడం, కదలలేని పరిస్థితి మొదలగు లక్షణాలు వుంటాయి

   ఈ వ్యాధి మగపిల్లలలో తక్కువగా వుఉంతుంది.

                కీళ్ళు వాచి నొప్పిగా వున్నపుడు ---పై పూతకు:-- ( బాహ్య లక్షణాలకు )

వస
చెంగల్వకోష్టు

రెండింటిని సమానముగా సాన రాయి మీద రుద్ది గంధం తీయాలి. గంధాన్ని వాపుల మీద లేపనం  చెయ్యాలి.

సన్నటి ఇసుకను వేడి చేసి గుడ్డలో వేసి భరించ గలిగినంత వేడిగా శరీరమంతా కాపడం పెట్టాలి. విధంగా  15, 20 రోజులు చేయాలి.

(అంతరంగ లక్షణాలకు ):--

వాత విధ్వంసిని ;-- ఆయుర్వేద ఔషధాల షాపులలో దొరుకుతుంది.

5 సంవత్సరాల పిల్లలకు --- పావు మాత్ర
10 సంవత్శరాల పిల్లలకు --- సగం మాత్ర
16 సంవత్సరాల పిల్లలకు --- ఒక మాత్ర

     చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి .

మాత్రలను కొంచం అల్లం రసం కలిపి తీసుకోవచ్చు.

2. వైశ్వానస చూర్ణము :-- ఉదయం, సాయంత్రం అర టీ స్పూను పొడిని గోరువెచ్చని నీటితో ఇవ్వాలి.

3. గుగ్గులు, యోగరాజ గుగ్గులు, వాడుకోవచ్చు.

4. అమృతోత్తర కషాయం మూడు పూటలా ఒక్కొక్క స్పూను చొప్పున వాడాలి.

5. మహారాస్నాది  కషాయం

5 సంవత్సరాల పిల్లలకు --- 5 ml
5--10     "           "       --- 7.5 ml
10 --16  "           "       --- 10 ml

    దీనికి సమానంగా నీరు కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవాలి.

                        కీళ్ళ నొప్పులు, వాపులు --నివారణ                               4-6-10.

     శరీరంలో భాగంలో నైనా వాపులు వున్నపుడు లగంగాలను మెత్తగా నూరి పూస్తే నొప్పులు నివారింప బడతాయి.





                                వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు --నివారణ                          12-6-10.

   గడ్డి చేమంతి ఆకును నోట్లో వేసుకొని నమిలి రసం మింగి పిప్పిని ఉమ్మేయ్యాలి. దీనితో నొప్పులు నివారింప   బడతాయి.

                   అన్నిరకాల కీళ్ళ నొప్పుల నివారణకు ---పొగాకు తైలం                14-7-10.

      పొట్టలో చెడు పదార్ధాలు చేరడం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. పొట్టను తగ్గించాలి.

పచ్చి పొగాకును శుభ్రంగా కడిగి ముద్దగా దంచి పలుచని నూలు బట్టలో వేసి రసం పిండాలి నీళ్ళు

కలపకూడదు.

పొగాకు రసం        ---- ఒక లీటరు
నువ్వుల నూనె    ---- ఒక లీటరు

రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. చల్లారిన తరువాత వడపోసి నిల్వ   చేసుకోవాలి.

 నూనెను వేడి చేసి రెండు పూటలా నొప్పులున్న భాగాలలో గోరువెచ్చగా లేపనం చెయ్యాలి. దీనితో నీరుపట్టి   ఉబ్బిన వాపులు, నొప్పులు సులభంగా తగ్గి పోతాయి.

               అధిక కొవ్వు వలన వచ్చే కీళ్ళనొప్పులు ---నివారణ              17-12-10.

వావిలి చెట్టు వేర్ల పొడి
శొంటి పొడి
పిప్పళ్ళ పొడి
మిరియాల పొడి
పిప్పలి కట్టే పొడి

      అన్నింటిని సమాన భాగములుగా తీసుకుని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఆహారానికి అరగంట ముందు అర టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనెతో సేవిస్తే కొవ్వు , కీళ్ళ
నొప్పులు నివారించ బడతాయి.

                                                 కీళ్ళ వాతం--చికిత్స                             8-10-10'

ఆహారము సరిగా జీర్ణము కాక మిగిలిన పదార్ధము ఆమముగా మారి కీళ్లలో చేరడం వలన వాతం
ఏర్పడుతుంది.

అంతే కాక మానసిక సమస్యల వలన కూడా ఆహారం సరిగా జీర్ణం కాక వాత సమస్యలు ఏర్పడతాయి.

దీని ప్రభావం ప్రతి అవయవం మీద వుంటుంది. ఆహారం సరిగా తినాలనిపించదు

కీళ్ళనొప్పులు తగ్గాలంటే పేరుకు పోయిన ఆమమును తొలగించాలి

1. విరేచనం ద్వారా తొలగించాలి.
2. అజీర్ణ సమస్యలు లేకుండా చేసుకోవాలి.

శొంటి
పిప్పళ్ళు
మిరియాలు

సమాన భాగాలుగా తీసుకుని చూర్నాలు చేసి నీటితో గాని మజ్జిగతో గాని అర టీ స్పూను నుండి ఒక  టీ స్పూను పొడిని తీసుకోవాలి.

3. అర కిలో ఇసుకను వేడి చేసి వాపుల మీద కాపడం పెట్టడం వలన ఆమము కరుగుతుంది.

4. జిల్లేడు, వావిలి ఆకులను చిన్న ముక్కలుగా చేసి వేయించి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.

5. కరక్కాయ పెచ్చులు                 ---100 gr
                         శొంటి                ---100 gr
                    ఆవాలు                 --- 100 gr
                    వాము                  ---- 100 gr
              ధనియాలు                   ----100 gr

అన్నింటిని దంచి చూర్ణాలు చేసి కల్వంలో వేసి తగినంత బెల్లం వేసి మెత్తగా నూరి బటాణి గిన్జలంత
మాత్రలు చేసి ఆరబెట్టాలి.

ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు రెండేసి మాత్రలు వేసుకోవాలి.
కరక్కాయల పెచ్చులను మాత్రం ఆముదం వేసి వేయించాలి. మిగిలిన వాటిని నూనె లేకుండా వేయించాలి.

సూచనలు:--

పాతబియ్యం, పాత గోధుమలు, పాత యవలు లాంటివి మాత్రమే వాడాలి. కొత్తవి వాడకూడదు.
కాకర, బెండ, తోటకూర, పొన్నగంటి ఆకు కూరలు మాత్రమే తినాలి.

కొత్తబియ్యం, పప్పులు, ధాన్యాలు మినప పప్పు చేమ దుంపలు లాంటివి వాడకూడదు.
బరువులు ఎత్తకూడదు. విశ్రాంతి తీసుకోవాలి.

                     కీళ్ళ నొప్పుల నివారణకు ---చంద్ర కళా లేపనం                     25-12-10.

     ఇది బాహ్య ప్రయోగానికి ఉపయోగించే అద్భుత ఔషధం

జలుబు వలన వచ్చే రెండు కనతల మధ్య నొప్పి, కీళ్ళ నొప్పి, వాపు నివారణకుఉపయోగ పడుతుంది.

తేనేమైనం                     ----125 gr
తెల్ల మిరియాల పొడి       ---- 50 gr
కొబ్బరి నూనె              - --- 400 gr
హారతి కర్పూరం           ---- 100 gr

 ఒక పాత్రలో కొబ్బరి నూనె పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద వేడిచేయాలి. దానిలో తేనేమైనం కొద్దికొద్దిగా వేయాలి తరువాత దీనికి మిర్యాల పొడి, హారతి కర్పూరం కలపాలి. . అన్నికలిసే విధంగా బాగా కలపాలిచల్లారిన తరువాత ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. దీనిని వెడల్పు మూత వున్నసీసాలో నిల్వ  చేసుకోవాలి. దీనిని నొప్పులకు వాడుకోవాలి.

కీళ్ళ వాపులు, మెడ, భుజాలు, వెన్ను, వేళ్ళ  కణుపులు మొదలైన  చోట్ల నొప్పి వున్నపుడు లేపనంతో  మెల్లగా మర్దన చేయాలి. పిక్కల కండరాలు పట్టేసినపుడు దీనిని రాస్తే తగ్గుతుంది. కొంతమందికి నిద్రలో పిక్కలు పట్టేయడం జరుగుతుంది. అలాంటపుడు రాత్రి పడుకునే ముందు పిక్కలకు పూసుకోవాలి. దీనితో కండరాల నొప్పులు కూడా నివారింప బడతాయి.

దీనితో జలుబు కూడా నివారింప బడుతుంది.

                                కీళ్ళ నొప్పులు -- నివారణ                              12-2-11.

       కీళ్ళ మధ్య ఘర్షణ తగ్గించడానికి మధ్య ఒక ద్రవ పదార్ధపు సంచులు వుంటాయి. వాటిలో ఇన్ఫెక్షన్ చేరినపుడు అవి వాస్తాయి. వాటి మీద ఒత్తిడి జరిగినపుడు, ఒరిపిడి కలిగినపుడు నొప్పి ఏర్పడుతుంది
 మోచేతుల దగ్గర,  మోకాళ్ళ దగ్గ్గర  ఏర్పడతాయి.

        దీనికి బాహ్య చికిత్స,  అంతర చికిత్స చేయాలి.

  బాహ్య చికిత్స :-- ( స్వేదకర్మ ) :--  నొప్పి వున్నదగ్గర తాకినపుడు వేడిగా వుంటుంది.అందువలన
  పొడి కాపడం పెట్టాలి.  గుడ్డలో వేడి ఉలవ పొట్టు వేసి కాపడం పెట్టాలి,  తరువాత పిండ తైలం
  పూయాలి.

                వస ను గంధంలాగా చాది  వాపు మీద పూస్తే తగ్గుతుంది.

                యోగరాజ గుగ్గులు  అను మాత్రలను  పూటకు రెండు చొప్పున ఉదయం,  సాయంత్రం
   గోరువెచ్చని నీటితో సేవిస్తూ వుంటే చక్కటి ఫలితం వుంటుంది.

                దశమూలారిష్ట  ను పూటకు  15 ml చొప్పున ఉదయం, సాయంత్రం మంచి నీటిలో
   కలిపి తాగాలి.

                పడుకునేటపుడు  కాళ్ళను శరీరానికంటే ఎత్తుగా ఉండేట్లు  కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని
   పడుకోవాలి.    కాళ్ళకు ఎక్కువ శ్రమను ఇవ్వకూడదు.

                                               మహిళల్లో  కీళ్ళ నొప్పులు                                  17-3-11.

                మహిళల్లో  మెనోపాజ్ తరువాత,  ప్రసవానంతరం,  బహిష్టు సమస్యల వలన కాల్చియం
    తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి.

      1.         రాస్నా ఆకులు            
                       నీళ్ళు

                నీటిలో ఆకులను వేసి కషాయం కాచి తాగాలి. లేదా షాపు నుండి మహారాస్నాది
     కషాయం తెచ్చి వాడుకోవచ్చు.

       2.            ఇసుక            --- పావుకిలో
                        నీళ్ళు         

                ఇసుకను నీళ్ళలో వేసి కాచి దానితో నొప్పుల మీద కాపడం పెట్టాలి.

       3.             శొంటి పొడి       ---- 25 gr
                       తిప్ప తీగ       ---- 25 gr

                రెండింటితో  కషాయం కాచి తాగాలి.

                ఉదయం   +   సాయంత్రం    == అరకప్పు   +  అరకప్పు

                                కీళ్ళ నొప్పుల నివారణకు --లసున  క్షీరపాకం                      29-3-11.

               లసున = వెల్లుల్లి

       ఫ్లూ జ్వరం,  దెబ్బలు మొదలైన వాటి వలన కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం  కలదు.

             పాలు                          ----ఒక కప్పు
             నీళ్ళు                         ---- ఒక కప్పు
             వెల్లుల్లి గర్భాలు           ---- 10  --12

       ఒక పాత్రలో పాలు,  నీళ్ళు కలిపి పోసి  స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి.  వెల్లుల్లి గర్భాలను
  ఒక మందమైన గుడ్డలో మూటగట్టి  ఆ పాలలో వేయాలి.  చిన్న మంట మీద మరిగించాలి.
  నీరు ఆవిరై పాలు మాత్రమే మిగిలేట్లు కాచాలి.

       తరువాత వెల్లుల్లి మూటను బయటకు తీసి దానిలోని రసం పూర్తిగా వచ్చేట్లు గా బలంగా
 గట్టిగా పిండాలి.

       దీనిని ఖాళీ కడుపుతో గాని,  ఆహారం  తిన్న తరువాత గాని తీసుకోవచ్చు.

       ప్రతి రోజు పడుకునే ముందు ఒక కప్పు తాజాగా తయారు చేసుకుని తాగాలి.  ఈ విధంగా
 40 రోజులు చేస్తే నొప్పులు తగ్గుతాయి.

       దీనికి చక్కెర  కలపాల్సిన అవసరం  లేదు.  ఘాటుగా వుండదు.

 ఉపయోగాలు :--    కీళ్ళనొప్పులు,  కీళ్ళ వాతం,  సయాటికా  నొప్పి, నడుమునొప్పి  పొట్ట పెరగడం
 పక్షవాత, గుండె జబ్బుల  నివారణ లకు దీనిని వాడుకోవచ్చు.

                                             కీళ్ళ నొప్పులు ---నివారణ                                     24-2-11.

       ప్రతి రోజు నువ్వుల నూనెతో శరీరమంతా మర్దన చేస్తే  40 రోజులలో నొప్పులు పూర్తిగా
 నివారింపబడతాయి.

                మర్రి చెట్టు బెరడు                 --- 100 gr
                రావి   "        "                     --- 100 gr
                అశ్వగంధ                            --- 100 gr

     అన్నింటిని విడివిడిగా ముక్కలు చేసి దంచి  బరక  చూర్ణం తయారు చేయాలి.  దీనిని  800 గ్రాముల  నీటిలో వేసి  48 గంటలు నానబెట్టాలి.  తరువాత స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద
200  గ్రాముల కషాయం మిగిలే వరకు కాచాలి. వడకట్టి  దానికి 200 గ్రాముల  కలిపి స్టవ్ మీద
పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.  చల్లారిన తరువాత గాజు సీసాలో భద్రపరచాలి.

      దీనిని  స్నానానికి గంట ముందు శరీరానికి మర్దన చేసుకోవాలి.
      ఈ విధంగా 40 రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు నివారింపబడి  శరీరం మీది నలుపు తొలగించ
బడుతుంది.

                          మహిళలలో కీళ్ళ నొప్పులు --నివారణ  ---   గౌట్                      3-4-11.

       ఇది హఠాత్తుగా దాడి చేసే కీళ్ళ వ్యాధి.  మూత్రంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది కీళ్ళ మధ్య చేరి నొప్పులు రావడం జరుగుతుంది. మాంసంలో ఈ వ్యాధికి సంబంచించిన  పదార్ధాలు 
వుండడం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులకుఈ వ్యాధి వచ్చే అవకాశాలు
ఎక్కువ.
                                                      త్రిఫలాది కషాయం
 
                       ఉసిరిపెచ్చుల చూర్ణం                                  (Antacid)
                       తానికాయల పెచ్చుల చూర్ణం
                       కరక్కాయ పెచ్చుల చూర్ణం
                       తిప్పతీగ కాండం        "
                       మానిపసుపు            "
                       వేపచెక్క బెరడు         "
                       కటుక రోహిణి            "
                       మంజిష్ఠ  వేరు           "
                       వస ( ఉగ్రగంద)         "
                               నీళ్ళు                        --- నాలుగు కప్పులు

        అన్ని చూర్ణాలను  ఒక్కొక్కటి  3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.

      ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టిపెట్టాలి.  దానిలో అన్ని చూర్ణాలను  వేసి బాగా కలిపి
  మరిగించి  ఒక కప్పు కషాయం రానివ్వాలి. గుడ్డలో వడకట్టాలి.

      దీనిని రెండు భాగాలు చేసి రెండు పూతలు వాడాలి.

      ఈ విధంగా క్రమం తప్పకుండా 40 రోజులు పాటిస్తే నొప్పులు చాలా బాగా తగ్గుతాయి.

      నీళ్ళు బాగా తాగితే యూరిక్ యాసిడ్ పలుచబడుతుంది.

                           మహిళలలో కీళ్ళ నొప్పుల నివారణ  2 వ భాగం                           6-4-11.

            పునర్నవ వేర్ల పొడి            --- 5 gr
            రాస్నా వేర్ల పొడి               ---  5 gr
            శొంటి పొడి                      ---  5 gr
            తిప్ప తీగ పొడి                ---  5 gr
            ఆముదపు వేర్ల పొడి          ---  5 gr
                      నీళ్ళు                  ---  4 కప్పులు

       ఒక పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కాచాలి. మరగడం ప్రారంభమైన తరువాత  చూర్ణాలను
ఒకదాని తరువాత మరొకటి వేస్తూ నెమ్మదిగా కలియబెడుతూ వుండాలి,  ఒక గ్లాసు కషాయం
మిగిలేవరకు కాచాలి.

      దీనిని రెండు భాగాలుగా చేసి నేరుగా గోరువెచ్చగా  తాగాలి,

      40 రోజులలో ఆశ్చర్యకరమైన  ఫలితం కనిపిస్తుంది.

సూచనలు :--  వ్యాయామం చేసే సమయంలో పూర్తి స్థాయిలో ప్రాణ వాయువు అందకపోతే  ఒళ్ళు
నొప్పులు  అందువలన జాగ్రత్త వహించాలి. 

                                           కీళ్ళ నొప్పులు    --- నివారణ                                   10-7-11

కారణాలు :--- వ్యాధి నిరోధక శక్తి వికతిన్చినపుడు వచ్చే అవకాశం కలదు .
మనం తిన్న ఆహారంలో యూరిక్  ఆసిడ్ ఎక్కువగా వుంటే అది క్రిస్టల్స్ గా మారి కీళ్లలో చేరినపుడు  నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా కలదు .

సన్నరాష్ట్రము   ఆకులు            --- గుప్పెడు
                       నీళ్ళు             --- 4 కప్పులు

రెండింటిని కలిపి కాచి  ఒక కప్పుకు రానిచి వడకట్టి తాగాలి . ఈ విధంగా 40  రోజులు వాడాలి  

ఇసుక              ---- పావు కిలో
దశమూలం       ---- పావు కిలో

       ఇసుకను నీళ్ళు చల్లి వేడి చేసి నొప్పుల మీద కాపడం పెట్టాలి .
       దశామూలాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని నొప్పుల మీద ధారగా పోస్తూవుంటే  మంచి రిలీఫ్ వుంటుంది .

శొంటి పొడి        ---- పావు కిలో
తిప్ప తీగ  పొడి  --- పావు కిలో

    రెండింటిని  నాలుగు కప్పుల నీటిలో వేసి కాచి ఒక కప్పుకు రానివ్వాలి . ఈ నీటిలో గుడ్డను ముంచి నొప్పులపై కాపడం పెట్టాలి .

     కీళ్లలో వాపు వున్నపుడు కాళ్ళ కింద ఎత్తుగా దిండు పెట్టుకోవాలి . పాదాలను ముందుకు , వెనక్కు కదిలించాలి .        

                                                     కీళ్ళ నొప్పులు  --- నివారణ                        30-8-11.

శొంటి                                      ---- 50 gr
కరక్కాయ పెచ్చులు                  ---- 50 gr
వాము                                    ---- 50 gr 
పటికబెల్లం                              ---- 50 gr

         అన్ని పదార్ధాలను విడివిడిగా చూర్ణాలు చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి . 
         ఉదయం , సాయంత్రం  పూటకు అర టీ స్పూను చొప్పున గోరువెచ్చని  నీటితో గాని లేదా చల్లని నీటితో గాని
సేవించాలి .
ప్రయోజనాలు :--- ఇది సుఖ విరేచానాన్ని కలిగిస్తుంది . జలుబును తగ్గిస్తుంది . కీళ్లలో గుజ్జును పెంచుతుంది .

                                                           బాహ్య నొప్పుల నివారణకు                  31-8-11.

          జిల్లేడు ఆకు   మీద గాని , ఆముదపు ఆకు మీద గాని , గుర్రపు డెక్క ఆకు మీద గాని ఆముదం పోసి వేడిగా
ఉండగానే కీళ్ళ మీద అద్దాలి . దీనివలన  ఎంతో రిలీఫ్ వుంటుంది .

                                                          కీళ్ల నొప్పులు --- నివారణ                     13-9-11

లక్షణాలు :--- కీళ్లు అరిగి పోవడం , సందులలో వచ్చే  వాతం , నొక్కి చూసినపుడు నొప్పి , వాపు వుంటాయిమ్ .  కదలిక
తో నొప్పి ఎక్కువగా ఉంటుంది , విశ్రాంతి తో తగ్గుతుంది . చలి కాలం లో నొప్పులు ఎక్కువగా ఉంటాయి .

 పై పూతకు:---

ఆవ నూనె                   --- ఒక కప్పు
పసుపు                       --- ఒక టీ స్పూను
వెల్లుల్లి                       --- ఒక టీ స్పూను
ముద్దకర్పూరం             --- అర టీ స్పూను

     ఆవనూనెను పరోక్షంగా వేడి చేసి దానికి మిగిలిన పదార్ధాలను కలిపి వడపోసి  సీసాలో నిల్వ చేసుకోవాలి .
     దీనిని గోరువెచ్చగా చేసి కీళ్ల మీద పూయాలి .జాయింట్స్ ను కదిలిస్తూ వ్యాయామం చేయాలి .  వేడి ఇసుకతో
కాపడం పెట్టాలి .

కడుపులోకి :---

నల్ల నువ్వులు             ---- ఒక టేబుల్ స్పూను
వేడి నీళ్లు                    ---- ఒక కప్పు

     రాత్రి పూట  నువ్వులను  వేడి నీళ్లలో నానబెట్టాలి . ఉదయం ఆ నీళ్లను తాగి నువ్వులను తినాలి .దీనితో శరీరంలో
క్యాల్షియం పెరుగుతుంది .


  
              
                 
       

                                  
    
            




















































































































































































.