భుజబలము 21-1-09.
వ్యాయామం:-- పద్మాసనం వేసుకొని కూర్చుని భుజాలను పైకి, కిందికి కదిలించాలి. ముందుకు కదిలించడం,వెనక్కి కదిలించడం చెయ్యాలి. మోకాళ్ళ పై చేతులు వుంచుకొని చెయ్యాలి.
రెండు చేతులను భుజాలపై పెట్టుకొని, చెవులకు తగిలేటట్లు చేతులను పైకెత్త కుండ గాలి పీలుస్తూ వదులుతూ కదిలించాలి. చేతులను మాత్రం పై కెత్త కూడదు. మరల చేతులను పూర్తిగా చాపి గాలిని పూర్తిగా పీల్చి నెమ్మదిగా వదలాలి.అంకెలను ఓంకార శబ్దం లాగా నెమ్మదిగా చాలా సేపు సాగదీసి పలకాలి.
కుడిచేతిని ఎడమ చేతితో ఎడమ వైపుకు లాగాలి.అదే విధంగా రెండవ వైపు కూడా నిదానంగా చెయ్యాలి.ఇది తల వెనుక భాగం లో చెయ్యాలి. మరల కుడిచేత్తో ఎడమ భుజాన్ని పట్టుకొని కుడివైపుకు గుంజినట్లు పక్కకు లాగాలి.అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
బాహు వాతము--భుజము నొప్పి --- నివారణ 28-9-10.
భుజము ఒత్తిడికి గురికావడం, పని భారం పడడం, దెబ్బ తగలడం, బరువులు మోయడం వలన మొదలైన కారణాల వలన భుజము నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి వాపు కూడా వస్తుంది.
అజామోద తైలం:--
ఆజామోదం ----- ఒక కిలో
నీళ్ళు ----- ఎనిమిది లీటర్లు
నువ్వుల నూనె ---- ఒక కిలో
అశ్వగంధ చూర్ణం ---- 25 gr
తిప్ప తీగ చూర్ణం ---
ఒకకిలో అజామోదం తీసుకుని నలగగొట్టి ఎనిమిది లీటర్ల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి నాలుగు లీటర్ల కషాయం వచ్చే వరకు కాచాలి. దానిని వడకట్టి ఆకషాయానికి నువ్వులనూనె, అశ్వగంధ చూర్ణాన్ని, తిప్ప తీగ చూర్ణాన్ని కలిపి స్టవ్ మీద పెట్టి కషాయం ఇంకి పోయి తైలం మాత్రమే మిగిలేట్లు సన్న మంట మీద కాచాలి. చల్లార్చి
వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ తైలంతో మృదువుగా పైనుండి కిందికి మర్దన చెయ్యాలి. ఈ విధంగా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.నొప్పి వున్న ప్రాంతంలో ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి.
భుజాల నొప్పులు--- నివారణ 7-4-11.
లేత మునగాకు చిగుళ్ళు లేదా వావిలాకు చిగుళ్ళు --- 10
నీళ్ళు --- ఒక గ్లాసు
చిగుళ్ళను నీటిలో వేసి మరిగించి అర గ్లాసు కషాయం మిగిలే వరకు కాచాలి. తరువాత వడకట్టి
గోరువెచ్చగా వున్నపుడు ఒక టీ స్పూను తేనె కలుపుకుని తాగాలి.
దీని వలన అన్ని రకాల ఒల్లునోప్పులు, బిగుసుకున్న నొప్పులు తగ్గిపోతాయి.
వ్యాయామం :-- పద్మాసనం వేసుకుని కూర్చొని రెండు చేతులను ఒళ్లో పెట్టుకోవాలి. రెండు
చేతుల వేళ్ళను కలిపి సమాన దూరంలో కలపాలి.
ఒక నిమిషం తరువాత మొదట ఉంగరపు వేళ్ళను కిందికి వదిలెయ్యాలి. ఆ విధంగా ఒక్కొక్క
జత వేళ్ళను కిందికి వదుల్తూ వుండాలి.
మొదట ఉంగరపు వేళ్ళను వదలాలి
తరువాత చిటికెన వేళ్ళను వదలాలి
" బొటన వేళ్ళను ను "
" చూపుడు వేళ్ళను "
" మధ్య వేళ్ళను "
తరువాత అన్ని వేళ్ళను కలిపి 5 నిమిషాలు ఉంచాలి.
ఈ విధంగా చేయడం వలన ఎలాంటి మందులు వాడకుండానే చాలా అద్భుతంగా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
భుజం నొప్పి --- నివారణ 21-7-11.
భుజానికి సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన చేయి పైకెత్తలేకపోవడం , కిందికి డించలేకపోవడం జరుగుతుంది .
నేలతంగేడు లేదా ఈ మొక్క లభించని పక్షంలో సునాముఖి వాద వాడవచ్చును .
నేలతంగేడు ను సమూలంగా తెచ్చి ఎండబెట్టి , దంచి , జల్లించి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటిలో కలిపి తాగవచ్చు లేదా పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగావచ్చును .
దొరకని పక్షంలో :--
సునాముఖి ఆకును దంచి , జల్లించి నిల్వ చేసుకోవాలి . దీని వంట చేసేటపుడు అర టీ స్పూను పొడిని రసం (చారు) లో వేసి అందరు వాడుకోవచ్చు . దీని వలన కూడా మంచి ఫలితం వుంటుంది .
2. శుద్ధి చేసిన గుగ్గిలం --- 50 gr
నెయ్యి --- 100 gr
రెండింటిని కలిపి నూరి శనగ గింజంత మాత్రలు చేసి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు ఒక మాత్ర వేసుకోవాలి .
గుగ్గిలాన్ని శుద్ధి చేయడం :---
ఒక గిన్నెలో త్రిఫల కషాయాన్ని పోసి గిన్నెకు గుడ్డ కట్టాలి . గుడ్డ మీద గుగ్గిలాన్ని ఉంచాలి . తరువాత గిన్నెను
స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి . తరువాత గుగ్గిలాన్ని చీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి
.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి