పేగు జారడం (హెర్నియా ) 23-1-09.
ప్రేవులలో మల పదార్ధాలు ఎక్కువకాలం నిల్వ వుంటే వేడి ఉత్పత్తి అయి పేగులు పల్చబడి జారి బొడ్డు పెద్దదవుతుంది .గజ్జలలో గడ్డ లాగా జారుతుంది.
యోగాసనం :-- గోముఖాసనం లో కూర్చోవాలి.మోకాళ్ళు ఒకదాని మీద మరొకటి వేసుకొని పాదాలను వెనక్కి పెట్టాలి.కుడిచేతిని తల వెనక పెట్టుకొని, ఎడమ చేతిని వీపు వెనక్కి రానిచ్చి రెండు చేతులు కలుపుకోవాలి
2. వెల్లకిలా పడుకొని మోకాలుకు గడ్డాన్ని ఆనించాలి. ఈ విధంగా రెండు వైపులా చెయ్యాలి.మరలా రెండు మోకాళ్ళ మధ్యలోకి గడ్డాన్ని ఆనించి చెయ్యాలి. దీనిని పవన ముక్తాసనం అంటారు.
వేయించిన మిరియాల పొడి ------30 gr
తేనె ------40 gr
రెండింటిని బాగా గుజ్జు లాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. మూడు పూటలా ఆహారానికి గంట ముందు కుంకుడు గింజంత తీసుకొని చప్పరించాలి.దీని వలన పేగు జారడం నివారింప బడుతుంది. పేగు యదా స్థానానికి వస్తుంది.
2. కసివింద కాండము మీది తోలు 50 గ్రాములు తెచ్చి నలగ గొట్టి అర లీటరు నీటిలో వేసి 10-15 నిమిషాలు మరిగించాలి.దించి వడపోసి ఎనిమా డబ్బాలో పోసి ఆసనం లోకి పంపితే కషాయం లోపలికి చేరుతుంది 4,5 అడుగులు వేసిన తరువాత విరేచనం అవుతుంది . పేగులలోని పురుగులు మాడి పోతాయి పేగు యధాస్థానానికి వస్తుంది.
ప్రేవులలో క్యాన్సర్ లేదా ఆంత్రాశయపు క్యాన్సర్ 2-10-10.
ఒక గ్లాసు నీటిలో ఒక అంగుళం దాల్చిన చెక్కను వేసి కాచి సగానికి రానిచ్చి తాగితే ప్రేవులలోని సమస్యలునివారింప బడతాయి.
ఆహారం తోబాటు ప్రేవులలోనికి మట్టి, వెంట్రుకలు చేరితే --నివారణ 16-4-11.
అరటి దూట ను 15 రోజులకొకసారి కూర వండుకొని తింటే కడుపులో పేరుకున్న రాళ్ళు, వెంట్రుకలు తొలగించబడతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి