జుట్టు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జుట్టు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

జుట్టు సమస్యలు --- నివారణ ---PART ----2


                                         జుట్టు సమస్యలు ----నివారణ

                           జుట్టు యొక్క కొమలత్వానికి ---హెయిర్ కండిషనర్                   13-6-11.

కోడిగుడ్డు                      ---ఒకటి
ఆముదం                      ---2 టేబుల్ స్పూన్లు
వెనిగర్                        --- ఒక టీ స్పూను
గ్లిజరిన్                        --- ఒక టీ స్పూను
     
       ఒక గుడ్డును కొట్టి పోసి బాగా గిలక్కొట్టాలి. దీనిలో మూడు ద్రవాలను వేసి బాగా కలిసేట్లు
గిలక్కొట్టాలి.

      దీనిని జుట్టు యొక్క పాయలకు బాగా పట్టించాలి. తరువాత మర్దన చేయాలి. కొంత వాసన వుంటుంది. తరువాత గుడ్డను వేడి నీటిలో ముంచి, నీటిని పిండి గుడ్డను తలకు కట్టాలి.  అరగంట తరువాత జిడ్డు, వాసన వదిలే వరకు స్నానం చేయాలి.

సూచనలు :-- జుట్టును ఆయిలీ గా ( తైల యుతంగా)  వుంచుకోవాలి. క్షార గుణం రానివ్వకూడదు.
స్నానానికి ఏ నీళ్ళంటే ఆ నీళ్ళు వాడకూడదు.  జుట్టుకు గిట్టే నీటిని మాత్రమె వాడాలి.

                                       జుట్టు రాలే సమస్య    --- నివారణ                                27-7-11.

1. ఉసిరిక పొడి                    ---- 20 gr
       పాలు                         ---- పావు లీటరు

       ఉసిరిక పొడిని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం ఆ పాలను తలకు పట్టించాలి . కొంతసేపు వుంచి తరువాత
తలస్నానం చేయాలి

2. ముళ్ళ తోటకూర           ---- 50 gr
             నీళ్ళు                  ---- తగినన్ని

        నీళ్ళను స్టవ్ మీద పెట్టి తోటకూరను వేయాలి . బాగా మరగనిచ్చి దించాలి . గోరువెచ్చగా వున్నపుడు ఆ
నీటిని తలకు పట్టించాలి .   కొంతసేపు వుంచి తలస్నానం చేయాలి .
         ఈ విధంగా చేస్తూ వుంటే క్రమేపి జుట్టు  రాలే సమస్య నివారింపబడుతుంది

                                       మెదడును చల్లబరచే హిమ కేశ తైలం                                   29-8-11.

జుట్టు రాలదానికి కారణాలు :--- తల ఎప్పుడు వేడిగా వుండడం , తలలో దురదగా వుండడం , చిన్న చీము పొక్కులు
వుండడం  మొదలైనవి .

బాదం నూనె                      ---- ఒక టీ స్పూను
సోయా చిక్కుడు నూనె        ---- పావు కప్పు
ఆముదము                       ---- రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె                    ---- అర కప్పు
సొరకాయ రసం                  ---- అర కప్పు
ఉసిరి రసం                       ---- పావు కప్పు

      ఒక పాత్రను తీసుకొని అన్ని పదార్ధాలను దానిలో పోసి స్టవ్ మీద పెట్టాలి . పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చే వరకు
కాచాలి . తరువాత  మంట తగ్గించి సన్న మంట మీద   తైలం మాత్రమె మిగిలే వరకు కాచాలి .  వడకట్టి చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .

       ఈ తైలంతో తలకు మర్దన చేయాలి .

ఉపయోగాలు:---   తలలోని వేడిని తగ్గించి తలను చల్లబరుస్తుంది .  దురద , చిన్న పొక్కులు నివారిన్చాబడతాయి . జుట్టు రాలడం తగ్గుతుంది . చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది . నిద్ర బాగా పడుతుంది .

       ఉద్యోగులకు ,  విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం .

                                                          తెల్ల జుట్టుకు రంగు                                  7-9-11.

గోరింటాకు పేస్టు                    --- ఒక కప్పు
వాల్ నట్స్ పేస్టు                  --- ఒక కప్పు

     ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 3 గంటల సేపు గాని లేదా రాత్రంతా గాని నానబెట్టాలి .
      తరువాత  ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . కొంత ఎండడం ప్రారంభం అవుతుంది . తరువాత మామూలు నీటితో
స్నానం చేయాలి . రెండవ రోజు షాంపూతో స్నానం చేయాలి

                                                         ఎర్ర జుట్టు కోసం

గోరింటాకు ముద్ద                 --- ఒక కప్పు
యూకలిప్టస్ నూనె               --- అర టీ స్పూను

     రెండింటిని బాగా కలిపి తలకు పట్టించాలి . 3 గంటల తరువాత స్నానం చేయాలి .
     తైలం కలపడం వలన  జుట్టు కు మంచి కాపర్ కలర్ వస్తుంది .

                                                        Dark Brown Colour

తుప్పు పట్టిన మేకులు            --- 5, 6
చిన్న ఇనుప బాణలి               --- ఒకటి
త్రిఫల పేస్టు                           --- రెండు టీ స్పూన్లు

     ఇనుప బాణలిలో కొద్దిగా నీళ్ళు తీసుకొని  మేకులను నానబెట్టాలి . 2 , 3 గంటల తరువాత వాటిని తీసి దానిలో త్రిఫల
చూర్ణాన్ని వేసి కలపాలి . గంటసేపు నానబెట్టి తరువాత  తలకు పట్టించాలి  2, 3 గంటల తరువాత స్నానం చేయాలి .

                                                     జుట్టు రాలడం --- నివారణ

ఎండిన వేపాకుల చూర్ణం          --- 25 gr
బిర్యాని ఆకు చూర్ణం               --- 25 gr
తులసి ఆకుల చూర్ణం             --- 25 gr

      అన్నింటిని కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి .
      రెండు టీ స్పూన్ల పొడిని తీసుకొని నీటితో కలిపి తలకు పట్టించాలి .

ఎండిన నిమ్మ తొక్కల చూర్ణం      --- ఒక కప్పు
గులాబి రేకుల చూర్ణం                --- ఒక కప్పు
ఎండిన మందార పూల చూర్ణం     --- ఒక కప్పు
ఎండిన కరివేపాకు చూర్ణం            --- ఒక కప్పు
సీకాయ పొడి                             --- ఒక కప్పు

      అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి . అవసరమైనపుడు ఒక టేబుల్ స్పూను పొడిని తీసుకొని దానిలో కోడిగుడ్డు
తెల్ల సొనను కలిపి తలకు పట్టించాలి .  అరగంట తరువాత స్నానం చేయాలి                                      

మెంతుల పేస్టు                          --- రెండు టీ స్పూన్లు
గోరింటాకు పేస్టు                        --- ఒక కప్పు
పెరుగు                                    --- ఒక కప్పు

     ఒక గిన్నెలో అన్నింటిని బాగా  కలిపి  తరువాత తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి .

                                         

                                       జుట్టు సమస్యలు  --- నివారణ  ---PART   ----2

                                         వెంట్రుకలు చిట్లకుండా ఉండడానికి    --- కండిషనర్                8-8-11.

సూచన :--- వెంట్రుకలను  కట్టిరించ కూడదు.

నిమ్మ రసం                ---- అర టీ స్పూను
 ద్రాక్ష రసం                 ---- ఒక టేబుల్ స్పూన్
కమలాపండ్ల రసం        ----   "     "         "
       తేనె                   ----   "     "         "
మందార పూల రసం     ----   "     "        "

          ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి .
          తల స్నానం చేసిన తరువాత  పై మిశ్రమాన్ని  జుట్టు యొక్క కుదుళ్ళ కు పట్టించాలి . 2, 3 గంటల సేపు వుంచి
తరువాత మంచి నీళ్ళతో కడగాలి .

          దీని వలన వెంట్రుకలు చిట్లకుండా ఉండడమే కాక జిడ్డు తొలగించ బదుథున్ది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- హెయిర్ డ్రయ్యర్ , మెటల్ రబ్బర్ బ్యాండ్స్  వాడకూడదు .పవర్ ఫుల్ షాంపూలు
వాడకూడదు . స్నానానికి సాఫ్ట్ వాటర్ వాడాలి .

                                    జుట్టు చిట్లిపోవడం ,  పొడిబారడం  ---- నివారణ                           10-8-11.

కారణాలు :--- షాంపూ లను ఎక్కువగా వాడడం , డ్రయ్యర్ తో తలను ఆరబెట్టడం , ప్రతికూల వాతావరణం , క్లోరిన్ కలిసిన
నీటితో స్నానం చేయడం , రాగి ధాతు లోపం , బి --విటమిన్ లోపం , హైపెర్ థైరాయిడ్  మొదలైన కారణాల వలన జుట్టు
పొడిబారుతుంది .
                                            HAIR CONDITIONER                      

తొక్క తీసిన బాదం పప్పులు              ---- 4
తాజా కొబ్బరి తురుము                     ---- పావు కప్పు
నువ్వులు                                        ---- ఒక టేబుల్ స్పూను
నీళ్ళు                                             ---- అర కప్పు

        అన్ని పదార్ధాలను  మిక్సి లో వేసి తిప్పాలి . తరువాత నీళ్ళు కాలిపి తిప్పాలి .  దీనిని పేస్ట్ లాగా మెత్తగా రుబ్బాలి . తరువాత వడపోసి పిప్పి ని తీసేయ్యాలి . ఆ ద్రవ పదార్ధాన్ని జుట్టు కుదుళ్ళకు పట్టించాలి . ఐదు నిమిషాలు అలాగే వుంచి
మంచి నీటితో కడగాలి .
        జుట్టు చిట్లుతూ ఉంటే  ఈ ద్రవ పదార్ధాన్ని తల స్నానాకి ముందు  తలకు పట్టించి 3, 4  గంటలు వుంచి తరువాత
తల స్నానం చేయాలి . లేదా రాత్రి జుట్టుకు పట్టించి ఉదయం తల స్నానం చేయాలి .

సూచనలు :---  తక్కువ రకం షాంపూ లను వాడకూడదు . ద్రయ్యర్ తో తలను ఆరబెట్ట కూడదు . తలను ఎండలో ఆరబెట్టాలి .నీళ్ళు బాగా తాగాలి . ఎండలో తిరగాకూడదు ంఅంచి పోశాకాహాం ( పాలు , పండ్లు , ఎండు  ఫలాలు )
తీసుకుంటూ వుండాలి .    తడిగా వున్న జుట్టును దువ్వ కూడదు

                                                  తెల్ల వెంట్రుకలు నల్లబడడానికి                          11-8-11.

తుంగ గడ్డల చూర్ణం                           ---- 100 gr
వట్టి వేర్ల చూర్ణం                                ---- 100 gr
ఉసిరిక  చూర్ణం                                 ---- 100 gr
కరక్కాయ చూర్ణం                             ---- 100 gr
ఆవాల చూర్ణం                                 ---- 100 gr

       అన్ని పదార్ధాలను బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి .

        అవసరమైన రోజు ఒక పెద్ద గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూను పొడిని వేసి రాత్రంతా నానబెట్టాలి
ఉదయం ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించి  ఎనిమిదో వంతుకు రానివ్వాలి . ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నపుడే జుట్టు కుదుళ్ళకు పట్టించాలి   వెంటనే తల స్నానం చేయవలసిన అవసరం లేదు . రాత్రి తలకు పట్టించి
ఉదయం స్నానం చేయవచ్చు లేదా ఉదయం పట్టించి  సాయంకాలం తల స్నానం చేయవచ్చు .

                                                          కేశపోషణ తైలం                                 11-8-11.

ఆముదం                          ---- 4 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె                    ---- దాదాపు అర లీటరు
బ్రాహ్మి మొక్క చూర్ణం         ---- 4 టేబుల్ స్పూన్లు
ఉసిరి చూర్ణం                     ---- 4 టేబుల్ స్పూన్లు
       నీళ్ళు                       ---- అర లీటరు

       రెండు తైలాలను , రెండు చూర్ణాలను  ఒక గిన్నెలో వేసి  బాగా కలిపి స్టవ్ మీద సన్న మంట మీద వేడి చెయ్యాలి .
ఉదయం ఆ మిశ్రమానికి నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి .  ఒక పొంగు వచ్చే వరకు పెద్ద మంట తో  తరువాత
మంట తగ్గించి సన్న మంటతో కాచాలి.  నీరంతా ఇగిరిపోయి  నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి . బాగా చల్లార్చి
గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .

       దీనిని ప్రతిరోజు జుట్టు కుదుళ్ళ కు పట్టించి ,  మసాజ్ చేసి అలాగే వదేలియాలి . కొంత సేపటి తరువాత తలస్నానం
చేయాలి . ఈ తైలాన్ని గోరువెచ్చగా వేడి చేసి కూడా జుట్టుకు పట్టించవచ్చు . ఈ విధంగా పట్టించిన తరువాత  తలకు
వేడి నీటిలో ముంచి , పిండిన టవల్ ను  చుట్టుకుంటే మంచిది .

                                                       జుట్టు రాలకుండా ఉండాలంటే                                25-8-11.

       దేశీయ ఆవు పాలను రాగి పాత్రలో కాచి తోడు పెట్టాలి . ఈ పెరుగును జుట్టుకు పట్టించాలి . ఈ విధంగా    2, 3
రోజులకొకసారి  చేయాలి .  7 సార్లు పట్టించే లోపల జుట్టు రాలడం ఆగిపోతుంది

                                                       జుట్టు రాలకుండా ఉండాలంటే                               26-8-11.

ఉసిరిక ముక్కలు             ---- రెండు టీ స్పూన్లు
మెంతులు                      ---- ఒక టీ స్పూను
మినుములు                   ---- ఒక టీ స్పూను

      అన్నింటిని రాత్రి నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బాలి . దీనిని జుట్టు కుదుళ్ళ కు పట్టించాలి  . గంట సేపు వుంచి
స్నానం చేయాలి . ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది .

                                                    జుట్టు సహజంగా నల్లగా మారడానికి                            8-9-11.
ఉసిరి పెచ్చులు                --- 10
సీకాయలు                       ---   3
కరక్కాయ పెచ్చులు          --- 25 gr
తానికాయల పెచ్చులు       --- 25 gr
గోరింటాకు పొడి                --- ఒక కప్పు

       ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగే సమయంలో అన్ని కాయల పెచ్చులను నలగ గొట్టి వేయాలి బాగా కాచాలి . ఈ
కషాయాన్ని పెచ్చులతో సహా ఒక ఇనుప బాణలిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి . ఉదయం ఆ కషాయాన్ని వడకట్టి
దానిలో గోరింటాకు పొడిని కలపాలి .  ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి  తరువాత తల స్నానం చేయాలి .

టీ డికాషన్                       --- ఒక కప్పు
గోరింటాకు పొడి                --- ఒక కప్పు
కోడి గుడ్డు                       --- ఒకటి
ఆముదం                        --- ఒక టేబుల్ స్పూను
కాఫీ పొడి                         --- ఒక టీ స్పూను
ఉసిరిక పొడి                     --- ఒక టీ స్పూను

     టీ డికాషన్ ను ఒక ఇనుప బాణలిలో పోసి దానిలో గోరింటాకు పొడి , కోడిగుడ్డు , ఆముదం , కాఫీపొడి , ఉసిరిక పొడి
అన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి . దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం జుట్టుకు పట్టించాలి . తరువాత
రెండు , మూడు గంటల సేపు వుంచి మామూలు నీళ్ళతో తలస్నానం చేయాలి . మరుసటి రోజు షాంపూ తో స్నానం చేయాలి .
      ఈ విధంగా వారానికి రెండు సార్ల చొప్పున చేస్తూ వుంటే కొద్ది రోజులకే జుట్టుకు సహజంగానే రంగు వేసినట్లు నల్లగా
మారుతుంది

                                 జుట్టుకు  బంగారు రంగునిచ్చే హేమ సుందర లేపనం                          8-9-11.

కారణాలు :--- హైపర్ థైరాయిడ్  సమస్య వలన జుట్టు తెల్లబడుతుంది . అకాల వార్ధక్యం తెల్ల జుట్టు ఏర్పడుతుంది  , విదాహక ఆహార పదార్ధాలు టీ , కాఫీ , ఆల్కహాల్ , ఘాటైన పదార్ధాలు , మసాలా పదార్ధాలు  మొదలైన వాటిని ఎక్కువగా వాడడం వలన జుట్టు తెల్లబడుతుంది

      దీనిని సగం నెరసిన జుట్టుకు , వూడుతున్న, పలచాబడుతున్న  కేశాలకు  దీనీ వాడుకోవచ్చు .

బీట్ రూట్  తురుము                 --- ఒక కప్పు
కాచుపొడి  ( ఖదిర  సారం )          --- అర టీ స్పూను
మెంతి పిండి                             --- ఒక టీ స్పూను
గోరింటాకు పొడి                        --- ఒక టేబుల్ స్పూను
కాఫీ పొడి                                 --- ఒక టీ స్పూను
పెరుగు                                   --- ఒక కప్పు
నీళ్ళు                                     --- రెండు కప్పులు

      ఒక పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి . మరగడం ప్రారంభమైన తరువాత కాఫీపొడి , గోరింటాకు పొడి  పెరుగు తప్ప మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి . తరువాత ఈ మిశ్రమాన్ని ఇనుప బాణలి లోకి వంపుకోవాలి . తరువాత దీనికి కాఫీ పొడి , గోరింటాకు పొడి కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేయాలి . దీనిని రాత్రంతా
అలాగే వుంచి ఉదయం దీనికి పెరుగు కలపాలి .

     ఉదయం జుట్టును పాయలుగా విడదీసి  ఈ మిశ్రమాన్ని పట్టించాలి. 3 గంటల సేపు అలాగే ఉంచాలి . షాంపూ క్యాప్
పెట్టుకోవచ్చు .తరువాత మామూలు నీటితో  తల స్నానం చేయాలి . మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి
ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి   ఈ విధంగా 2, 3 నెలలు చేస్తే సహజమైన బంగారు వర్ణం ఏర్పడుతుంది .

     తరువాత నెలకు  1, 2 సార్లు  ఈ విధంగా చేయ వచ్చు .

బీట్ రూట్  సహజమైన రంగునిస్తుంది .  మరియు కాచు రంగును జుట్టుకు పట్టి ఉంచుతుంది .

                                                         జుట్టు రాలడం  --- నివారణ                                 8-9-11.

వేప ఆకు
రేగు ఆకు
     రెండింటిని కలిపి నూరి తలకు పట్టించాలి . అరగంట తరువాత కుంకుడు కాయల తో గాని , సీకాయతో గాని తల
స్నానం చేయాలి . ఈ విధంగా 4, 5 రోజుల కోక సారి చేస్తూ వుంటే జుట్టు రాలదు .

                                                                 కేశ వృద్ధి తైలం                                        8-9-11.

నీడలో ఆరబెట్టిన మర్రి వూడల చూర్ణం        --- 25 gr
   "         "        గుంటగలగర చూర్ణం        --- 25 gr
                       నువ్వుల నూనె              --- 150 gr

      రెండు చూర్ణాలను నీళ్ళతో గుజ్జుగా కలపాలి . దీనిని నువ్వుల నూనెలో కలిపి స్టవ్ మీద పెట్టి కాచాలి .సన్న మంట మీద
తేమ ఇంకి పోయి నూనె మాత్రమె మిగిలేట్లు కాచాలి .  వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .

     దీనిని ప్రతిరోజు రాత్రి పూట తలకు  పట్టించాలి .

సూచన :--- ఈ విధంగా చేస్తూ ఆహారంలో  నువ్వులయొక్క , కొబ్బరి యొక్క , మినప లడ్డూలను  తీసుకుంటూ వుండాలి .

                                                         జుట్టు రాలడం --- నివారణ                                9-9-11.

     ఇది చాలా పెద్ద సమస్య . ప్రధాన కారణం రక్త హీనత ,  ముఖ్య కారణం వాతావరణ కాలుష్యం

ఎండిన నిమ్మతోక్కల పొడి               --- ఒక టీ స్పూను
కమలా లేదా నారింజ తొక్కల పొడి    --- ఒక టీ స్పూను
దానిమ్మ పండు తొక్కల పొడి           --- ఒక టీ స్పూను
కొబ్బరి నూనె                                --- ఒక గిన్నెడు

          కొబ్బరినూనెలో పై పోడులన్నింటిని వేసి బాగా కలియబెట్టి రెండు రోజులు ఎండబెట్టాలి ( ఆదిత్య పక్వం ). తరువాత
వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి .

        ఈ నూనెను బాగా తలకు పట్టించాలి . దీనితో రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది .

ఉసిరిక పొడి                     ---- ఒక టీ స్పూను
వేపాకు పొడి                     ---- ఒక టీ స్పూను
కొబ్బరి పాలు                  ---- తగినన్ని

       ఒక గిన్నెలో ఆ పొడులను వేసి కొబ్బరి పాలను కొద్ది కొద్దిగా కలుపుతూ బాగా మిశ్రమం లాగా కలపాలి .
       దీనిని బాగా తలకు పట్టించి మసాజ్  చేయాలి . ఒక గంట తరువాత తలస్నానం చేయాలి .

సూచన :--- తగినంత నిద్ర , మంచి ఆహారం  అవసరం . కాలుష్యం లో తిరగాకూడదు .  ఘాటైన షాంపూ లను వాడకూడదు .

                                                  పెను కొరుకుడు --- నివారణ                                   10-9-11.

       బొప్పాయి పాలను గాని  నూరిన ఆకును గాని  పేను కొరుకుడు మీద రుద్దుతూ ఉంటే కొద్దీ రోజులకు జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది

                                     తలలో దురదల నివారణకు       కేశ రక్షణ తైలం                       10-9-11
       SHAAMPOO లను  ఎక్కువగా  వాడడం వలన , శరీరంలో కఫము  ఎక్కువగా చేరడం వలన  తలలో దురదలు
ఏర్పడతాయి .

పసుపు  పొడి                 ---- 25 gr
మానిపసుపు పొడి           ---- 25 gr
నువ్వుల నూనె              ----100 gr

       రెండు పొడులను కొద్దిగా నీళ్లు కలిపి కొద్దిగా  నువ్వుల నూనెలో వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టాలి . తైలం మాత్రం
మిగిలేవరకు సన్న మంట మీద కాచాలి . చల్లారిన తరువాత సీసాలో భద్రపరుచుకోవాలి

       ప్రతి రోజు దీనిని తలకు పట్టించాలి . దీనితో తలలో దురదలు , చుండ్రు నివారింపబడతాయి.



                                           తలలో పేలు ---నివారణ                            18-12-08.

          సుగంధపాల వేళ్ళను పగులగొట్టి లోపలి భాగాన్ని తీసేసి బెరడును ఒక గిన్నెలో వేసి
ఆవు మూత్రం పోసి   నానబెట్టాలి. బెరడు మెత్తగా నానిన తరువాత కల్వంలో వేసి మెత్తగా నూరాలి.దానిని జుట్టు యొక్క ప్రతి పాయకు  పట్టించాలి తరువాత తలకు గుడ్డ కట్టాలి. రెండు, మూడు గంటలు వుంచి తరువాత కుంకుడు రసంతో తల స్నానం చెయ్యాలి. విధంగా వారానికొకసారి చెయ్యాలి. ఎవరి దువ్వెన వాళ్ళే వాడుకోవాలి. విధంగావారానికి
ఒక సారి చెయ్యాలి.

                                            తలలో పేలు --నివారణ                             24-2-09.

వేప చెట్టు బెరడును ఎండ బెట్టి దంచిన పొడి       ------- 100 gr
సీతాఫలం ఆకులను నల్లగా మాడ్చి దంచిన పొడి   ------ 100 gr

      పై రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి కళ్ళలో పడకుండా జుట్టు యొక్క పాయలకు పట్టించాలి.తరువాత  తలకు గుడ్డ కట్టి ఒక గంట సేపు వుంచి తల స్నానం చెయ్యాలి. దువ్వెన ను శుభ్రంగా కడిగి తల దువ్వాలి. తలస్నానం చేసేటపుడు నీళ్ళు కళ్ళలో పడకుండా జాగ్రత్త పడాలి.

                    దీని వలన తలలో పేలు మాత్రమే కాక పుండ్లు కూడా నివారింప బడతాయి.

                                                         7-12-10

    శీతా ఫలం గింజలను నీటితో నూరి జుట్టును పాయలుగా విడదీసి కుదుళ్ళకు రాత్రి వేళ పట్టించి ఉదయం స్నానం చేయాలి.
                                                        8-12-10

పేల వలన ఇన్ఫెక్షన్, పుండ్లు పడడం, మెడ గ్రంధులు వాయడం జరగుతాయి.

1. అర టీ స్పూను పటికను తీసుకొని అర బకెట్ నీళ్ళలో కలిపి కరిగించాలి. నీటిని జుట్టు కుదుళ్ళకు పట్టించి  అరగంట తరువాత తల స్నానం చేస్తే పేలు చచ్చి పోతాయి.

2. వెల్లుల్లి ని ముద్దగా నూరి తలకు పట్టించి తల స్నానం చేస్తే నశిస్తాయి.

3. వేప నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకుని, వేడి నీటిలో ముంచిన టవల్ ను చుట్టి అర గంట తరువాతస్నానం చేయాలి.

4. వాయు విడంగాలు             --- రెండు టీ స్పూన్లు
                ఆవ నూనె            --- ఎనిమిది టీ స్పూన్లు
                       నీళ్ళు            --- ఒక కప్పు

అన్నింటిని కలిపి నూనె మిగిలే వరకు మరిగించాలి.
నూనెను ( విడంగాది తైలం ) తలకు రాసుకుంటే పేలు పోతాయి. .

                                              3-11-10

           కొబ్బరి నూనెలో హారతి కర్పూరం వేసి కాచి పెట్టుకుంటూ వుంటే పేలు రాలి పోతాయి.
తరువాత తల స్నానానికి కుంకుళ్లు, శీకాయలతో వాడితే మంచిది.


                                    లలో పేలు -- నివారణ
ేపాకుల చూర్ణం                 --- 50 gr
శీతా ఫలం గింజల చూర్ణం     --- 50 gr ( కళ్ళకు తగల కూడదు )
బావంచాల గింజల పొడి       --- 50 gr
తులసి ఆకుల చూర్ణం        ---- 50 gr ( క్రిమి సంహారకం )
కచ్చూరాలు                    ---- 50 gr
పొత్తి దుంప                      ---- 50 gr
ముల్తానీ మట్టి                 ---- 50 gr ( దీనిలో మినరల్స్ వుంటాయి) ఇది డ్రై షాంపూలాగ             పనిచేస్తుంది
కలబంద గుజ్జు                ----100 gr ( తలకు చల్లదనాన్ని ఇస్తుంది).

      అన్నింటిని విడివిడి గా దంచి జల్లించి  చేసి కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

దీని నుండి మూడు టీ స్పూన్ల పొడిని తీసుకుని దానికి కలబంద గుజ్జు కలిపి నూరి తలకు పట్టించాలి.

విధంగా వారానికి రెండు సార్లు చేస్తే తలలో పేలు పూర్తిగా నివారింప బడతాయి.


                             పేలు --నివారణ -- సర్శపాది తైలం                             18-1-11.


       తలలో పెరిగే పెలను, వేరే జీవులను, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి వాణ్ణి కూడా దీనితో నివారింప బడతాయి.

ఆవనూనె                   --- 55 ml
వేపనూనె                  ---- 40 ml
దేవదారు నూనె           ---- 5 ml
కర్పూరం                    --- చిటికెడు

   అన్ని నూనెలను ఒక చిన్న పాత్రలో పోసి బాగా కలిపి తరువాత కర్పూరం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

       జుట్టును పాయలుగా విడదీసి ఒకటి రెండు స్పూన్ల తైలాన్ని కుదుళ్ళకు  పట్ట్టించాలి. రెండు
గంటల పాటు అలాగే  ఉంచాలి. పేలు చనిపోతాయి. మొదట పేలు అపస్మారక స్థితిలో వుంటాయి చెక్క దువ్వెనతో దువ్వి తొలగించాలి.

                                పేల నివారణకు  -- కర్పూరాది తైలం                                     1-4-11.

        ముద్దకర్పూరం                    --- ఒక గ్రాము
        వేప నూనె                           ---99 gr

                  వేపనూనేలో కర్పూరం కలిపి  సీసాలో నిల్వ చేసుకోవాలి.

                  ఈ నూనెను ముని వేళ్ళతో తీసుకుని తల మీద మర్దన చేస్తూ పట్టించాలి. ఈ విధంగా
    మునివేళ్ళతో ఐదు  మర్దన చేయాలి  తరువాత హెయిర్ వాష్ పౌడర్ తో గాని కుంకుళ్ళ పొడితో
    గాని తల స్నానం చేయాలి.

                              పేను కొరుకుడు--నివారణ                                 27-2-09.
      ఈ వ్యాధి ముదిరితే కనుబొమలు, కంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి.
      నేల ములక (నేల వంకాయ లేదా వాకుడు లేదా ముళ్ళ వంకాయ) యొక్క కాయలు, వ్రేళ్ళు తెచుకోవాలి. పచ్చి కాయలు దొరికితే తెచ్చి నూరి గుజ్జును  వెంట్రుకలు రాలిన చోటపూయాలి.  ఎండిన కాయలైతే  దంచి జల్లించి తేనె కలిపి పూయాలి.  ఈ విధంగా 8 రోజులు పూయాలి, ఎనిమిదవ రోజు తల స్నానం చెయ్యాలి.

                                                  4-3-09.

                          గురివింద గింజలు
                          తేనె

     గురివింద గింజలను నలగగొట్టి  దంచి పొడి చెయ్యాలి. సరిపడినంత పొడిని తీసుకొని దానికి తగినంత తేనె కలిపి పేస్టూ లాగ చెయ్యాలి. రెండు వేళ్ళకు నూలు గుడ్డను చుట్టుకొని ఈ లేపనాన్ని తీసుకొని తల మీద జుట్టు లేని చోట నెమ్మదిగా మర్దన చెయ్యాలి. దాని చుట్టుకూడా వెంట్రుకల మీద రుద్దాలి.    ;లేదా

     గురివింద గింజలను నానబెట్టి మెత్తగా నూరి తేనె కలిపి పై విధంగా మర్దన చెయ్యాలి.

                                                              21-6-09.

కుంకుడు కాయలు
కళ్ళు ఉప్పు

             ఒక గిన్నెలో చాలా కొద్దిగా నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు వేసి కరిగించాలి.

             సాన రాయి తీసుకొని దాని మీద ఉప్పునీటి చుక్కలు వేసి దాని మీద కుంకుడు కాయతో చాది గంధం తీయాలి.

             గరుకుగా వున్న నూలు గుడ్డను తీసుకొని రెండు వేళ్ళకు చుట్టుకొని గందంలో ముంచి పెనుకోరుకుడు  మీద రుద్దాలి.  ఈ విధంగా ప్రతిరోజు రెండు పూటలా పది రోజులు రుద్దాలి. తరువాత వెంట్రుకలు మొలవడం  ప్రారంభమవుతుంది.

          పుండుగా లేక మెత్తగా అయితే కొబ్బెరనూనే పూయాలి. వారం తరువాత  కుంకుడు కాయలతో తో తల  స్నానం చెయ్యాలి.

. గుంటగలగర ఆకు పొడి                        ---20 gr
 ఉసిరికాయల పొడి                                ---20 gr
దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి        ---20 gr
అతి మధురం పొడి                               --- 20 gr
పటికబెల్లం పొడి                                   --- 80 gr

      అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

   చిన్న పిల్లలకైతే        ---- మూడు చిటికెలు
   పెద్ద         "              ---- అర టీ స్పూను

         ఒక కప్పు వేడి పాలలో కలుపుకొని తాగాలి.

      దీని వలన రక్త వృద్ధి జరుగుతుంది. వాత, పిత్త, కఫ దోషాలు తొలగించవ్బడతాయి.జుట్టు యొక్క కుదుళ్ళు  గట్టి పడతాయి.

                                              3-5-10

          ఆముదపు ఆకులను సముద్రపు  నురుగు  ( షాపు లో కూడా దొరుకుతుంది ) తో కలిపి నూరి వెంట్రుకలు  ఊడిన చోట రుద్దుతూ వుంటే మొలుస్తాయి. చేతి గుడ్డను వెలికి చుట్టుకొని ఆ రసాన్ని తలకు పూయాలి. మంటగా వుంటే రెండు రోజులు ఆపి కొబ్బరి నూనె పూయాలి. మళ్లీ Continue  చెయ్యాలి.

                                          పేను  కొరుకుడు --నివారణ
           పిప్పింటాకును  మెత్తగా దంచి జుట్టు లేని ప్రదేశంలో రసాన్ని పిండి ఆకుతో రుద్దాలి.  ఈ విధంగా ఉదయం, సాయంత్రం చెయ్యాలి. మూడు రోజులు చెయ్యాలి. తరువాత తల స్నానం చేసి మరలా 7 వ రోజు ప్రారంభించి మరలా మూడు రోజులు  ఉదయం, సాయంత్రం చెయ్యాలి.

 ఈ విధంగా 4, 5 సార్లు చేస్తే వెంట్రుకలు వస్తాయి.
                                                    9-12-10

          బూడిద గింజల తొక్కను నూరి పూస్తూ వుంటే  పెను కొరుకుడు వలన జుట్టు రాలిపోయిన చోట మరలా  వెంట్రుకలు పెరుగుతాయి.

                        బట్ట తల ---నివారణ                                 24-7-09.
       ముక్కులో తైలం వేసుకొని ముద్రవేసుకొని గాలి పీలుస్తూ వదులుతూ " ఓం" అని ఐదు సార్లు పలకాలి.
       తలకు వేడి నీటిలో ముంచిన బట్టను  చుట్టాలి. దాని పై పొడి బట్టను చుట్టాలి, దాని మీద మందమైన గుడ్డను లేదా టవల్ ను చుట్టాలి.
సర్వాంగాసనం, ఉష్ట్రాసనం, శుక్రవజ్రాసనం వెయ్యాలి.
                 జుట్టు వస్తూ వున్న దశలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు:--
      వారానికి రెండు సార్లు తలకు నిండుగా నూనె పెట్టాలి. ఏదో ఒక తైలంగాని లేదా స్వచ్చమైన కొబ్బరినూనె  గాని వాడాలి. అర చేతులతో రుద్ద రాదు. వేళ్ళతో పాయలకు పట్టించాలి.
      కుంకుడు కాయలతో గాని, సీకాయతో గాని తల స్నానం చెయ్యాలి. త్రిఫలాలు నానబెట్టిన నీళ్ళు తలకు పూయాలి. ఈ విధంగా చెయ్యడం వలన జుట్టు తప్పకుండా వస్తుంది.
బూరుగు జిగురు
నేలతాడి దుంపల పొడి
తామర గింజల పొడి
    అన్నింటిని సమ భాగాలుగా తీసుకొని దంచి పొడి చేసి  పొడిలో నీరు కలిపి నూరి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి
  ఉల్లి పాయలను దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. గుడ్డను వెలికి చుట్టి రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట   లేపనం చేయాలి.
   ఉల్లి గడ్డ గింజలను నూరి తలకు పట్టిస్తే జుట్టు అసలు వూడదు.
జటామాంసి                   ---100 gr
చెంగల్వ కోష్టు               --- 100 gr
నల్ల నువ్వులు              --- 100 gr
సుగంధ పాల వేర్ల బెరడు  -- 100 gr
తామర గింజలు            --- 100 gr
ఆవు నెయ్యి                 --- 500 gr
  అన్ని పదార్ధాలను దంచి పొడులు చేసి మంచి నీటితో కలిపి గుజ్జుగా చెయ్యాలి. దానిలో అర కిలో ఆవు నెయ్యి పోసి  స్టవ్ మీద పెట్టి పదార్ధములోని తేమ ఇంకి పోయి నెయ్యి మాత్రం మిగిలేవరకు కాచాలి. వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి
       దీనిని వాడడం వలన జుట్టు పీకినా రాదు. తలనొప్పి కూడా తగ్గుతుంది.

                                                         7-12-10
       గుప్పెడు శీతా ఫలం గింజలను కల్వంలో వేసి మేక పాలు పోసి మెత్తగా నూరాలి, దీనిని తలకు పూయాలి.
ఈ విధంగా చేయడం వలన నిద్రాణంగా వున్నజుట్టు స్టిమ్యులేట్ (ఉత్తేజితం ) అవుతాయి. నూరిన ముద్దను
తలను  గీరుతూ తల మీద పూయాలి.  క్రమేపి వెంట్రుకలు మొలుస్తాయి.

                                                        16-7-11
 1. దవనం                  --- పిడికెడు
     గోరింటాకు             ---     "
     కొత్తిమీర                ---     "
     మెంతులు              ---     "
     పెరుగు                  --- ఒక టేబుల్ స్పూను

           అన్ని పదార్ధాలను మెత్తగా పెరుగుతో కలిపి నూరాలి . దీనిని తలకు పట్టించాలి . అరగంట తరువాత తల
స్నానం చేయాలి .

2. మందార ఆకులు       --- 50 gr
    మందార  పూలు        --- 50 gr
    కొబ్బరి నూనె            --- 400 ml

          మందార ఆకులను ,  పూలను  మెత్తగా నూరి కొబ్బెరనూనేలో కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె
మాత్రమె మిగేలే విధంగా కాచాలి . చల్లారిన తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .
          ఈ తైలాన్ని ప్రతి రోజు రాత్రి  వెంట్రుకలు లేని చోట పోసి బాగా రుద్దాలి . వెంట్రుకలున్న చోట కూడా పూయాలి
     
                                                 హెర్బల్ షాంపూ                                      8-11-10

కుంకుడు పెచ్చులు                --- 10 gr
సీకాయ       "                       --- 10 gr
ఉసిరిక ముక్కలు                  ----10 gr
మెంతులు                           ----10 gr

   అన్నింటిని రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం పిసికి రసం తీస్తే షాంపూ లాగా తయారవుతుంది. దీనితో  తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా వుంటుంది.


                                             ఆయుర్వేద షాంపూ                                     17-1-11.

కుంకుళ్ళ పొడి            ---- 60 gr
బ్రాహ్మి పొడి               ---- 10 gr
సీకాయ పొడి              ---- 10 gr
గోరింటాకు పొడి          ---- 10 gr

   ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేటపుడు ఒక్కొక్క పొడిని దానిలో వేసి బాగా  కలియబెట్టాలి. 100 ml కషాయం మిగిలే వరకు కాచి వదపోసుకోవాలి.

ఉపయోగాలు :--

చుండ్రు :-- దీని నివారణకు వారానికి రెండు మూడు సార్ల చొప్పున రెండు, మూడు నెలలు వాడాలి

తెల్ల జుట్టు :-- దీనిని వాడుతూ తలకు నీలి భ్రున్గాడి తైలం వాడుకోవాలి.

 దీనిని వాడడం వలన చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి. వెంట్రుకలు చిట్లవు. వెంట్రుకలు ఎండి  పోయినట్లుగా వుంటే దీనిని వాడడం వలన జుట్టుకు జీవం వచ్చి నిగనిగ లాడుతుంది.

                        కేశాల సమస్య నివారణకు --ఆయుర్వేద షాంపూ                        23-1-11.

   వెంట్రుకలు, గోళ్ళు కెరోటిన్ అనే పదార్ధంతో తయారవుతాయి. కెరోటిన్ బలహీనపడినపుడు అవి రెండు దెబ్బ తింటాయి. కృత్రిమ పదార్ధాలను ఉపయోగించడం వలన కూడా దెబ్బ తింటాయి.

గుంటగలగర సమూల చూర్ణం               ---- ఒక టీ స్పూను
వేపాకుల చూర్ణం                                 ---- ఒక టీ స్పూను
బ్రాహ్మి చూర్ణం                                   ---- అర టీ స్పూను
ఉసిరి పొడి                                        ---- అర టీ స్పూను
సీకాయ పొడి                                     ---- పావు టీ స్పూను
తెల్ల వాము (అజామోదం) పొడి             ---- పావు టీ స్పూను
షాంపూ బేస్                                      ---- తగినంత

  ఒక గిన్నెలో 200 మిల్లి లీటర్ల నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో అన్ని చూర్ణాలను  ఒక్కొక్కటిగా అన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత అది 100 ml నీళ్ళు
అయ్యే వరకు కాచాలి. తరువాత వదపోసుకోవాలి. తరువాత దీనికి షాంపూ ను కలపాలి. దీనితో
తల స్నానం చెయ్యాలి.

      ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
తెల్ల జుట్టు,   జుట్టు చిట్లడం,   వెంట్రుకల జీవ రహితంగా కనిపించడం వంటివి కూడా నివారింప బడతాయి.

దీనిని రోజుకారోజు తయారు చేసుకోవాలి.