స్త్రీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్త్రీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ప్రసవానంతర సమస్యలు

          ప్రసవానంతర సమస్యలు -- బాలెంత జ్వరము                                       23-6-10.
      ప్రసవించిన తరువాత వారంలోపల జ్వరం రావడం  ఇది శ్వాస సంబంధ, మూత్ర సంబంధ, గర్భ సంబంధ,ఫిజియో తెరపి సంబంధ  మైనది కావచ్చు.
త్రిపల చూర్ణము
అతి మధురం చూర్ణము
తిప్పతీగ చూర్ణము
వస చూర్ణము
   అన్ని చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేఉకోవాలి.  ఒక టీ స్పూను పొడిని నీటిలో వేసి కషాయం కాచి వడకట్టి  గోరువెచ్చగా అయిన తరువాత దానిలో తేనె గాని చక్కెర గాని కలుపుకొని తాగాలి.
ఈ విధంగా మూడు పూటలా తాగితే బాలెంత జ్వరం త్వరగా తగ్గుతుంది.
     పై కషాయంలో పసుపు, బెల్లం కూడా కలుపుకొని తాగ వచ్చు.

                   ప్రసవానంతరం ఏర్పడే మానసిక రుగ్మతలు -- నివారణ                         1-9-10
.
     ఆత్మ న్యూనత, చికాకు, కోపం, పిల్లలేడుస్తున్నా పట్టించుకోక పోవడం  మొదలైన లక్షణాలు వుంటాయి.

      ఒకటిన్నర టీ స్పూను జటామాంసి వేర్ల చూర్ణాన్ని గ్లాసు నీళ్ళలో వేసి కాచి అరగ్లాసుకు రానివ్వాలి.  దించివడకట్టి కలకండ కలుపుకొని తాగాలి.

క్షీరబల తైలం
బ్రాహ్మి తైలం

      ఏదో ఒక తైలాన్ని వేడి చేసి దానిలో గుడ్డను ముంచి తలపై పట్టు వేస్తూ వుండాలి. ఆరితే మరలా మరలా  వేస్తూ వుండాలి.  ఈ విధంగా చెయ్యడం వలన డిప్రెషన్ తగ్గి పోతుంది.

                                 ప్రసవం తరువాత  వచ్చే ఒళ్ళు నొప్పులు                   16-12-10.

                                                      సూతికా వాతం

       ఇంగువను నేతిలో వేయించి పొడి చేసి నిల్వ చేసి చిటికెడు పొడిని అన్నంలో వేసుకుని తింటూ ఉండాలి.

                 ప్రసవానంతరం పొట్టను తగ్గించే ఆయుర్వేద సూతికా కల్పం        30-5-11.

                ప్రసవానికి సంబంధించిన ఆందోళన లో ఎక్కువగా తినడం వలన కొవ్వు చేరి పొట్ట లావెక్కుతుంది  ప్రసవం తరువాత లావెక్కిన శరీరాన్ని తగ్గించడానికి తినకపోవడం వంటి కారణాల వలన శరీరాకృతి లో మార్పులు వస్తాయి .

గోధుమ పిండి            --- 20 gr
నెయ్యి                     --- తగినంత
శొంటి పొడి                --- ఒక గ్రాము
మోదుగ బంక            --- ఒక గ్రాము
తుమ్మ బంక             --- రెండు గ్రాములు
డ్రై  ఫ్రూట్స్             --- చారెడు  ( అన్ని రకాలు)
పంచదార                 --- తగినంత

      ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి రెండు టీ స్పూన్ల నేతిని వేసి వేడి చెయాలి. దానిలో గోధుమ పిండిని
వేసి వేయించాలి . తరువాత గిన్నెను దించి దానికి శొంటి పొడిని కలపాలి . తరువాత మోదుగ బంక
మరియు తుమ్మ బంకలను కలపాలి .  తరువాత దీనిలో పంచదార ,  డ్రై ఫ్రూట్స్ కలపాలి

     రెండు టీ స్పూన్ల పొడిని పాలలో కలుపుకొని తాగాలి . 

సూచనలు :-- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి , సాత్వికాహారం భుజించాలి

శొంటి        ---- వాతాన్ని తగ్గిస్తుంది ,  శరీరాన్ని నాజూకుగా తయారు చేస్తుంది .
మోదుగ బంక  ---- ప్రసవం తరువాత గర్భాశయం లో మిగిలిన రక్తాన్ని తొలగిస్తుంది . పొట్ట యొక్క
                             కండరాలు గట్టి పడేట్లు   చేస్తుంది .
తుమ్మ బంక   ---- పొట్ట యొక్క కండరాలు బిగుసుకునేట్లు  చేస్తుంది .

                                       గర్భధారణ సమయం లో వచ్చే స్ట్రెచ్ మార్క్స్                 7-9-11

      ఈ చారలు  పొట్ట మీద , తొడల మీద , స్థనాల మీద ఏర్పడి జీవితాంతం అలాగే వుంటాయి ,

కలబంద గుజ్జు                  --- అర టీ స్పూను
బొప్పాయి లోపలి గుజ్జు      --- అర టీ స్పూను
రోజ్ వాటర్                     --- ఒక టీ స్పూను      
మంచి గంధం పేస్టు            --- ఒక టీ స్పూను
బాదం నూనె                    --- 10 చుక్కలు
లావెండర్ నూనె                ---  2 చుక్కలు
పాల మీగడ                      --- రెండు టీ స్పూన్లు

      అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తరువాత పాల మీగడ కొంచం , కొంచంగా కలుపుతూ బాగా కలియ
తిప్పాలి . స్నానానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని చారల మీద పూయాలి . తరువాత సున్నితంగా మర్దన చేయాలి .
తరువాత స్నానం చేయాలి .

     ఈ విధంగా వారానికి రెండు ,  సార్లు చొప్పున రెండు , మూడు నెలలు వాడితే చారలు తగ్గుతాయి .
      ప్రసవం అయిన తరువాత నువ్వుల నూనెతో శరీరాన్ని రుద్దుతూ వుంటే అలాంటి మచ్చలు ఏర్పడవు

    

      

     









      

వేవిళ్ళు

                 


                                                            
                                                        వేవిళ్ళు
          

           గర్భం ధరించిన రోజునుండి ప్రసవించే వరకు వాంతులు కాకుండా ఉండాలంటే

శొంటి                ----- 100 gr
సోంపు గింజలు   ------ 100 gr
సరస్వతి ఆకు   ------ 100 gr (పొడి)

  శొంటి, సోంపు గింజలను విడివిడిగా దోరగా వేయించి, జల్లించి, వస్త్రగాయం పట్టాలి.సరస్వతి ఆకుపొడినికూడా వస్త్రగాయం పట్టాలి.అన్నింటిని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలి.

     ప్రతి రోజు అర స్పూను పొడి, అర స్పూను కలకండ పాలల్లో కలుపుకొని తాగాలి .

ఉపయోగాలు :-- వాంతులు కావు,మలబద్ధకం ఉండదు ,ఆకలి అవుతుంది.

                                     వేవిళ్ళ నివారణ                                 4-6-10.

    వేవిళ్ళు వున్నవాళ్ళు ఒక లవంగాన్ని చప్పరిస్తూ వుంటే తగ్గి పోతాయి లేదా సైంధవ లవణంతో కలిపి కూడాతీసుకోవచ్చు.

    మర్రి వూడల నిజ రసం లేక కషాయం తాగితే మందులకు తగ్గని వేవిళ్ళు తగ్గి పోతాయిపాలు అభివృద్ధిచెందుతాయి.
                                                19-11-10

పుదీనా రసం
నిమ్మ రసం
తేనె

   అన్నింటిని కలిపి చప్పరించి మింగుతూ వుంటే వేవిళ్ళ వలన వచ్చే వాంతులు తగ్గుతాయి.

                                                  6-12-10

దానిమ్మ గింజల రసాన్ని తేనె కలిపి తీసుకుంటే తగ్గుతాయి.

                                                   7-7-10

మర్రి వూడల స్వరసం గాని, లేదా కషాయం రూపంలో గాని తాగితే వేవిళ్ళు తాగుతాయి.


                        గర్భిణి స్త్రీల లో వాంతుల సమస్య -- నివారణ                 13-1-11.


      అతిగా వాంతులైతేనే ప్రమాదం. రెండు, మూడు నెలల వరకు వుంటాయి. ఇవి ఐదు నెలల
వరకు కొనసాగవచ్చు .  మరికొంత మందిలో ప్రసవించే వరకు చాలా ఎక్కువగా అవుతుతాయి. ఇవి పిండం మీద ప్రభావం చూపే అవకాశం  కలదు. నిర్లక్ష్యం చేయకూడదు.

      ఈ సమస్యను నివారించడానికి మాదీఫల రసాయనం బాగా పని చేస్తుంది.


1. నిమ్మ కాయ రసం ప్రధమ చికిత్సగా అతి ప్రధానమైనది. నిమ్మరసాన్ని తేనెతో గాని, ఉప్పుతో గాని సేవిస్తే మంచది.

2. మారేడు పండు గుజ్జు పొడి --- ఒక టీ స్పూను
           అన్నం వార్చిన గంజి --- ఒక గ్లాసు

           గంజిలో పొడిని కలిపి తాగితే మంచి ఫలితం వుంటుంది.

3. మారేడు పండు గుజ్జు పొడి     --- 100 gr
                           అల్లం పేస్ట్ --- 100 gr
                     ధనియాల పొడి --- 50 gr
                                   బెల్లం --- తగినంత

      అన్నింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి బటాని గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలిదీనిని అన్నం యొక్క మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. వాంతులు ఎక్కువగా వుంటే మాత్రను నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి.

నియమాలు :-- వికారాన్ని ప్రేరేపించే ( కారం, తీపి, వగరు, చేదు ) పదార్ధాలను నివారించాలి. పుల్లని పదార్ధాలు ఎక్కువగా వాడితే అజీర్ణం చేస్తాయి. కాబట్టి తక్కువగా వాడుకోవాలి.

                                                        15-2-11.

      దానిమ్మ గింజల రసానికి నిమ్మ రసం కలిపి తాగాలి.
                                 
                                                         9-3-11

       హార్మోన్ల లో  తేడాల వలన  గర్భిణి సమయంలో  వాంతులు,  వికారాలు, ఆహార పదార్ధాల పై
 విముఖత ఏర్పడతాయి.

   అల్లం రసం               ---అర స్పూను   
   నిమ్మ రసం             --- ఒక టీ స్పూను
   పుదీనా రసం           --- ఒక టీ స్పూను 
          తేనె                 --- ఒక పెద్ద స్పూను

    అన్నింటిని కలిపి తీసుకోవాలి.

 2  లవంగాల పొడి       ---  ఒక గ్రాము   
     దానిమ్మ రసం       ---  అర కప్పు 

     రెండింటిని కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి.

 3. ఉసిరిక రసం          --- ఒక టీ స్పూను  
     జాజి కాయ  పొడి   ---  చిటికెడు 

                 రెండింటిని కలిపి తీసుకోవాలి.

     సూచనలు :--  శరీరానికి సరిపడని  అరగని ( నూనె) పదార్ధాలను వాడకూడదు.             
    వాంతి వచ్చే  ఫీలింగ్  ని  రానివ్వకూడదు.

    తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకోవాలి.

    అర గంట తరువాత కూడా తిన్న పదార్ధాల త్రేన్పులు  రాకూడదు.

                                                         వేవిళ్ళ నివారణకు  --- గర్భ మిత్ర                            2-9-11.
ఎండుద్రాక్ష                  ----50 gr
వట్టి వేర్ల చూర్ణం            ----50 gr
అతిమధురం  చూర్ణం     ----50 gr
పంచదార                    ----50 gr
తేనె                            ----50 gr   ( 5 టీ స్పూన్లు )

      అన్నింటిని కలిపి , ముద్దగా దంచి నిల్వ చేసుకోవాలి .

      ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం  పూటకు  10 గ్రాముల చొప్పున నోట్లో వేసుకొని చప్పరిస్తూ రసాన్ని మింగాలి .
దీనివలన గర్భిణి వేవిళ్ళ వలన కలిగే వాంతులు , మరియు పైత్యం వలన కలిగే వాంతులు కూడా నివారింపబడతాయి .
     
  
     












తల్లి పాల దోషం

                                    స్తన్య దృష్టి -- తల్లి పాల దోషం --నివారణ                                15-9-10

       పాల యొక్క రంగు, రుచి, స్పర్శ, వాసన పరీక్ష చెయ్యాలి.

        పాలను నీటిలో వేసినపుడు పూర్తిగానీటిలో కలిసి పోతే మంచిది.  శంఖం లాంటి తెలుపు   వుంటే   మంచిది
       తీగలు పాకుతూ, నీటిలో   పాలల్లో పూర్తిగా కలవకుండా, దుర్వాసన వంటి లక్షణాలువుంటే
మంచిది  కాదు.

        కఫలక్షణాలు వున్నపుడు  పాలల్లో జిడ్డుతనం, పాలు అడుగుకి చేరడం,పాలు తీగలుగా సాగడం,  నూనె         వాసనలు వుంటాయి.  పాలలో అధికమైన తీపి వుంటుంది.
పాలలో కొవ్వు, నూనె, నెయ్యి వాసనలు వుంటాయి. అధికమైన తీపి వుంటుంది.

       పై విధంగా వుంటే పిల్లలు ఎపుడు మత్తుగా, నిద్రపోతూ వుండడం, వాళ్లకి కూడా శ్వాస కోశ,
 మలబద్ధకసమస్యలు రావడం, చర్మం ఎక్కువ నునుపుగా, మెత్తగా వుండడం, వ్యాధి నిరోధక శక్తి
- తక్కువగా  వుండడం జరుగుతుంది.  పాలు పుష్టిగా వుండవు.

దీని నివారణకు తల్లి తీసుకోవలసిన ఔషధం :--
                        
అతిమధురం                  --- అర టీ స్పూను
సైంధవ లవణం              ---  అర టీ స్పూను
ఆవు నెయ్యి                  ---  ఒక టీ స్పూను

     అన్నింటిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా పాలల్లో మార్పు వచ్చే వరకు సేవించాలి.

బిడ్డకు ఇవ్వవలసిన ఔషధం :--

పిప్పళ్ళ పొడి          -- చిటికెడు
సైంధవ లవణం       ---    "
   రెండింటిని కలిపి నాకించాలి.

                      పిత్త, దుష్ట  స్తన్య దోషం -- చికిత్శ                                                      15-9-10.

      పాలిచ్చే తల్లులు ఘాటుగా వున్న ఆహార పదార్ధాలు భుజించరాదు. మసాలాలు, పచ్చళ్ళు వాడకూడదు.

వేడి ఎక్కువ ఉన్నప్రదేశాలలో  తిరగకూడదు. ఎక్కువగా ఎండబెట్టిన ( వడియాలు, అప్పడాలు) తినకూడదు

      తల్లి పాలు స్వచ్చంగా వాసన లేకుండా, తీగలు లేకుండా వుండాలి.

       పిత్త (వేడి) దోషాల వలన పాలు  పసుపు రంగుకు మారతాయి.
 
      ఈపాలను నీటిలో వేస్తే రేకులు రేకులుగా విడిపోవడం  జరుగుతుంది. 
పాలు వేడిగా వుంటాయి. రాగి రంగులో వుంటాయి.

      ఈ  లక్షణాలు కలిగిన పాలు తాగితే  ఆ పిల్లల శరీరం కూడా వేడిగా వుంటుంది. నోటిలో,
 మూత్రమార్గంలోగుదమార్గంలో పుండ్లు ఏర్పడతాయి. మూత్రము వేడిగా వుంటుంది.

త్రిఫలాలు
తుంగ ముస్థలు
కటుక రోహిణి
నేలవేము
నీళ్ళు

     అన్నింటిని దంచి నీటిలో వేసి కషాయం కాచి కలకండ కలుపుకొని తల్లి తాగాలి.

                     తల్లి పాలు శ్రేష్టంగా ఉండాలంటే                                                  25-10-10.

      తల్లి తాను తాగే పాలల్లో చిటికెడు కటుకరోహిణి  పొడిని కలుపుకొని తాగితే తల్లి నుండి వచ్చే బిడ్డ పాలు ఆరోగ్య కరంగా వుంటాయి.

                    బిడ్డకు తల్లి పాలు మాన్పించడానికి                                             28-12-10.
      ముసాంబరాన్ని  చాది   చను మొనల చుట్టూ పూస్తే  దాని చెడుకు మానేస్తారు. 
                                                      





అధిక రుతుస్రావము

                  అధిక  ఋతు రక్త స్రావం  ---నివారణ                                                   4-11-08.
1.       4 వ రోజు ఉదయం రక్త స్రావం ఆగకపోతే మెత్తగా మగ్గిన అరటి పండు ఒకటి,నాటు ఆవు లేదా గేదె నెయ్యి50 గ్రాములు కలిపి బాగా పిసికి బహిష్టు అయిన యువతిని  పడుకోబెట్టి తలను  పైకి లేపి కొంచెం  కొంచెం గా మెల్లగా తినిపించాలి.ఆ విధంగా మూడు పూటలా భోజనానికి
 ఒక గంట ముందు ఇవ్వాలి.
2. రెండు కప్పుల నీటిలో ఒక స్పూను దంచిన ధనియాలను వేసి మరిగించి అరకప్పుకు తగ్గించి ఆహారానికి ముందు మూడు పూటలా ఇవ్వాలి.
3. పిరుదుల కింద దిండు పెట్టుకొని కాళ్ళు కొంచం పైకి ఉండేట్లు పడుకో బెట్టాలి.
4.పలుచని నూలు గుడ్డ నీళ్ళలో పిండి నాలుగు మడతలు వేసి పొత్తి కడుపు మీద వెయ్యాలి..తడి గుడ్డను  గోచీగా పెట్టాలి.15 నిమిషాలు మాత్రమే ఉంచాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చెయ్యాలి.ఆ విధంగా చేసినపుడు దుప్పటి కప్పాలి.
                            అల్ప ఋతు రక్త స్రావం -- నివారణ                                       30-4-09.

  1.  TableLampకుబ్లూకలర్ పలుచని కాగితాన్నిచుట్టి లైట్ వెలిగించాలి. ఆ నీలి రంగు కిరణాలు
 పొట్ట మీద   పడేటట్లు చేయాలి.

2.  ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి దానికి నీలి రంగు కాగితాన్ని చుట్టి ఎండలో పెట్టాలి. కొంతసేపు అలాగే వుంచి  ఆ నీటిని తాగాలి.  ఈ విధంగా 4,5 గ్లాసుల నీటిని తాగాలి.

3. ఉదరాకర్షణ ఆసనం వెయ్యాలి.

                                                    సక్రమమైన ఋతు స్రావానికి

1. నాలుగైదు కిలోల పాత బియ్యాన్ని రాత్రి నానబెట్టి ఉదయం నీళ్ళు వంచేసి  బాగా ఎండబెట్టాలి.బాణలి స్టవ్ మీద పెట్టి కొంచం కొంచంగా బియ్యం వేస్తూ వేయించాలి . తరువాత రవ్వ పట్టించాలి. ఆ రవ్వతో ఉప్మా గాని అన్నం గాని వండుకొని తినాలి.

2. 32 ఎండు ద్రాక్ష పండ్లను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయం వాటిని తిని ఆ నీళ్ళు తాగాలి.   లేదా
3. ఎండుద్రాక్షను పేస్ట్ చేసి ప్రతి రోజు ఉదయం పది గ్రాముల ముద్ద తినాలి.

                        అధిక ఋతుస్రావం సమస్య --నివారణ                                      8-6-09.

1. అరటి పువ్వు దంచి తీసిన రసం        --- 5 gr
                                        పెరుగు    --- తగినంత

     రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి.  తప్పకుండ ఆగిపోతుంది.

2. బూడిదగుమ్మడి రసం    --- 100 gr
                     పచ్చి పాలు --- 100 gr

     రెండింటిని కలిపి  ఉదయం, సాయంత్రం తాగితే తగ్గుతుంది.

3.  రాత్రి పూట చంద్రుడు ఉదయించిన తరువాత   వికసించిన కలువపూలను తెచ్చి  ఎండబెట్టి దంచి పొడితయారు చేసుకోవాలి.

                          కలువపూల పొడి           ---- 100 gr
                              జిలకర పొడి             ---- 100 gr

     రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

     ఒక టీ స్పూను పొడిని 50 గ్రాముల వెన్నతో కలిపి సేవించాలి.  ఇది అతివేదిని అణచివేస్తుంది.

    అధిక ఋతు శ్రావ సమయంలోఎక్కువగా  నడవ కూడదు  తూర్పుకు ఎదురుగా కూర్చోవాలి. కుడిముక్కుమూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి  తరువాత  ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతోవాలి వదలాలి.

    శీతలీ ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, శాంతిశయనాసనం  చెయ్యాలి.

                     అధిక ఋతు రక్త స్రావం --- నివారణ                                         2-6-10.
     మూడు రోజులకు మించి  అదియు అధికంగా రక్త స్రావం జరుగుతుంటే దానిని అధిక ఋతు స్రావం అంటారు.
 కారణాలు;--  మానసిక మైన కారణాలు,   బహిష్టు ముందుగా రావడానికి, ఆలస్యంగా రావడానికి ముందుగా  మాత్రలు  వాడడం  మొదలైనవి.   దీని వలన అధిక ఋతు స్రావం, నడుము నొప్పి, మొదలైన సమస్యలు ఏర్పడతాయి.
బోలా ( రక్త bolaa ) :--- దీని కాండం మీద గాటు పెడితే వచ్చే రసాన్ని ఎండబెట్టి చూర్ణం చేయాలి.
      ప్రతి రోజు రెండు, మూడు గ్రాముల పొడిని మజ్జిగతో తీసుకోవాలి.
      దీనిని వాడడం వలన 35,  40 సంవత్సరాల వాళ్లకు ఎలాంటి సమస్యలు రావు. ప్రతి నిత్యం వాడుకోవచ్చు.   సాధారణమైన జీవితం గడుపుకోవచ్చు.

                  మేనోరేజియా (అధిక ఋతు రక్త స్రావం) --చికిత్స                                4-6--10.
 
లక్షణాలు:--   3 నుండి 7  రోజుల వరకు  ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ వుండడం, 15 రోజుల వరకు ఆగకుండా వుండడం,  నెల మధ్యలోనే బహిష్టు రావడం, మొదలైన లక్షణాలను మేనోరేజియా
 అంటారు.
కారణాలు:--

 ఇది హార్మోన్లలో తేడాల వలన, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, రక్తం పలుచబడడం  మొదలైనవి. 
     ఈ వ్యాధికి  యూనాని వైద్యంలో  మంచి ఔషధాలు వున్నాయి.
     స్త్రీ ప్రసవించిన తరువాత, అబార్షన్ తరువాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఒక్కో సారి అది   కొనసాగుతూ వుంటుంది(కంటిన్యు  అవుతుంది) దీని వలన శరీరంలోరక్తం తగ్గి ఎనీమిక్ గా తయారవుతారు.
    దీనిని యోగా, మెడిటేషన్, వేకువ జామున నడక మొదలైనవి చెయ్యడం వలన కొంత వరకు కంట్రోల్ చెయ్య 
వచ్చు.
     వేడి చేసే పదార్ధాలను మానెయ్యాలి. , కారం, పులుపుల వాడకం బాగా తగ్గించాలి.
దానిమ్మ పూల పొడి
మాజో
ధనియాల పొడి
   అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
   పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తేనెతో వాడాలి.
   మార్సె బందిష ఫూలో అనే ఔషధాన్ని వాడాలి.
   జీర్ణ శక్తిని కంట్రోల్ చేసుకుంటూ వుండాలి. 

                     అధిక ఋతుస్రావ  నివారణకు --లాక్షా( లక్క ) చూర్ణము                      11-12-10.

    దీని  వలన బహిష్టు సమయంలో అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.

    అధిక ఋతుస్రావం    వలన రక్త హీనత, ఆయాసం, తిమ్మిర్లు, మాటి మాటికి ఇన్ఫెక్షన్ రావడం, జుట్టు ఊడిపోవడం  మొదలగు సమస్యలు వస్తాయి.

     ఈ సమస్యలన్నింటిని  ఈ చూర్ణం నివారిస్తుంది.

     100  గ్రాముల లక్కను తెచ్చి బాగా ఎండబెట్టాలి. మెత్తగా నూరి చూర్ణం చేయాలి. ( రాతి కల్వంలో గాని లేదారోట్లో గాని) మెత్తగా దంచి వష్టఘాలితం పట్టాలి  దీనిని పరిశుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.

మోతాదు      --- ఒక గ్రాము నుండి మూడు గ్రాములు
           ఒక టీ స్పూను   =  5 గ్రాములు

       తీవ్రతను బట్టి రోజుకు మూడు సార్లు ఎనిమిది గంటల తేడాతో ఆహారానికి అరగంట ముందు గాని లేకతర్వాత గాని వాడాలి.
                అధిక  ఋతుస్రావం -- ఆయుర్వేద చికిత్స                                             8-9-10.

      కొంత శారీరక,  ఎక్కువగా మానసిక కారణాల వలన  ఈ సమస్య వస్తుంది.

      పిట్యూటరీ  గ్రంధి నుండి వచ్చే హార్మోన్ల వలన ఎక్కువగా సమస్య ఏర్పడుతూ వుంటుంది.

      నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోక పోవడం  కూడా ఒక కారణం.   బహిష్టు ముందుగా రావడానికి    ఆలస్యంగా రావడానికి  మాత్రలు వాడడం  వలన పిట్యూటరీ గ్రంధిలో నెల వారీగా విడుదలయ్యే హార్మోన్ల  పని  ఆగిపోవడం వలన కూడా ఋతుక్రమంలో మార్పులు వస్తాయి. దీని వలన రక్తహీనత, ఆకలి లేకపోవడం జరుగుతుంది.   దీనికి ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడం సరైన పని కాదు. దీని వలన చాలా సమస్యలు  ఏర్పడతాయి.

బోలా ( రక్త బోలా)  --- దీని పై గాటు పెడితే  రసం  వస్తుంది. దీనిని ఎండబెట్టాలి. దీనిని రోజుకు 500  మిల్లి గ్రాముల చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగాలి.  దీని వలన అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.

             అధిక  ఋతుస్రావం   -- పరిష్కార మార్గాలు                                            23-12-10.

      రక్తం అంటుకున్న గుడ్డను ఉతికినపుడు  మరక  పూర్తిగా తొలగింప బడితే   ఆరోగ్యకరమని అర్ధము. మిగిలితే  ఏదో  సమస్య వున్నట్లు లెక్క.

      అధిక ఋతుస్రావం వలన  నిస్సత్తువ, రక్త హీనత, కళ్ళు తిరగడం, సన్నబడడం, జరుగుతుంది.        సంతానం మీద కూడా ఈ ప్రభావం వుంటుంది.

అశోకారిష్ట
లోదారిష్ట

     వీనిలో ఏదైనా వాడుకోవచ్చు.

     గరిక తక్షణ  పరిష్కారాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా పెరిగిన గరిక మొక్క రసాన్ని 60 ml  కి తగ్గకుండా తాగితే  వెంటనే తగ్గుతుంది. 5, 6 రోజుల తరువాత కూడా ఋతుస్రావం ఆగకుండా అవుతూ వుంటే ఈ గరికరసం  తాగడంవలన వెంటనే ఫలితం కనబడుతుంది.

        అశోక చెట్టు యొక్క బెరడు దంచి కషాయంగా గాని లేదా క్షీర పాకంగా గాని తాగవచ్చు.

అశోక బెరడు  చూర్ణం              --- 100 gr
కోడిశపాల గింజల చూర్ణం         ----100 gr
అతిమధురం                        ---- 100 gr

     అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి పెట్టుకోవాలి.

     ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని ఉదయం,  సాయంత్రం తాగాలి.  ఈ విధంగా రెండు, మూడునెలల పాటు చేస్తే మంచి ఫలితం వుంటుంది. దీనితో పూర్తిగా అధిక ఋతుస్రావం  నివారింప బడుతుంది.

     పాల పదార్ధాలను,  మాంస పదార్ధాలను వాడకూడదు.  తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను వాడాలి.


   
                                              
                                                  






Restless Leg Syndrome

                                          Restless Leg Syndrome                    1-6-10.
      గర్భం దాల్చడం (Pregnancy),  అధిక బరువు, ధూమ పానం, కొన్ని రకాల నరాల జబ్బులు, హార్మోన్లలో  తేడాలు,  HYPO THYRAOIDISM,  మద్యపానం, కొన్ని రకాల విటమిన్ల లోపం  మొదలైన సమస్యల వలన  ఈ వ్యాధి వచ్చే అవకాశం కలదు.
చెంగల్వ కోష్టు               ----- 125 gr
సైంధవ లవణం              ------125 gr
నువ్వుల నూనె              ----- ఒక కిలో
నీళ్ళు                          ----- నాలుగు లీటర్లు
     రెండు మూలికలను విడివిడిగా చూర్ణాలు చేయాలి. ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో నీళ్ళు, నువ్వుల నూనె, చూర్ణాలు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.  నూనె మాత్రమే మిగిలే వరకు కాచి దించి, చల్లార్చి వడపోసి సీసాలో భద్ర పరచాలి.
     ఈ నూనెతో నొప్పి వున్నచోట మర్దన చేయాలి. దీనితో రక్త ప్రసరణ బాగా జరిగి నరాలకు పటుత్వం వచ్చి,నొప్పులు తగ్గుతాయి.
సూచన:--  దురలవాట్లను మానుకోవాలి, షుగర్ వ్యాధిని కంట్రోల్ లో వుంచుకోవాలి.




అవివాహిత స్త్రీ యొక్క ఆహారము

                అవివాహిత స్త్రీలు తీసుకోవలసిన ఆహారం                                       21-1-09.
          చదువుల  పోటీ   ఆరోగ్యాన్ని నాశనము చేస్తుంది.నెయ్యి, నూనె వాడితే అందం పెరుగుతుందే గాని తగ్గదు    ఖచ్చితంగా దంపుడు బియ్యం తినాలి.
          ఒక పండు యొక్క రసం ఒకే టైం క్రమం తప్పకుండా తాగాలి. దీనిలో ఎండు ద్రాక్ష రసం కూడా చాలా మంచిది.
1. ధనియాల కషాయం --     ఒక స్పూను ధనియాలను నలగగొట్టి ,ఒకగ్లాసు నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి.అర  గ్లాసుకు రానివ్వాలి. కలకండ కలుపుకొని తాగాలి.
2 కారట్  జ్యూస్  :--    కారట్, బీట్రూట్ మిక్సీ లోవేసి రసం తీసి చక్కర పాకంలో పోసి రసం ఇగిరి పాకం వచ్చే  వరకు కాచాలి. పాకం దించిన తరువాత పచ్చ కర్పూరం కలపాలి.
  ఈ పాకాన్ని కొద్దిగా గ్లాసులో వేసుకొని ;నీళ్ళు కలుపుకొని తాగాలి.

యోనిసమస్యలు

                                               స్త్రీ జననాంగములోని స్థాయిలు
 
         దీనిలో 3 నాడులుంటాయి.
 
        1. సమీరణ    ----పై భాగంలో ఉంటుంది
        2. చాంద్రమతి --- మధ్య భాగంలో
        3. గౌరీ          ---- కింది చివర
 
        పురుష వీర్యము సమీరణ లో పడితే వ్యర్ధ మవుతుంది చంద్రమతి లో పడితే ఆడపిల్ల, గౌరిలో పడితే  మగపిల్లవాడు పుడతారు.
 
        మర్మాంగానికి, ఆసనానికి మధ్యగల స్థానములో మూలాధార చక్రము ఉంటుంది దీనికొరకు ఆసనాలు :--
 
 1.       సుఖాసనంలో కూర్చోవాలి.కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టుకొని , కుడి  మోకాలును కుడి చేత్తో  ఊపాలి. అదే విధంగా ఎడమ వైపు కూడా చెయ్యాలి.ఆ విధంగా తొడపై కాలు పెట్టలేని వాళ్ళు పాదాన్ని తొడకు ఆనించి చెయ్యవచ్చు.
 
2.       రెండు చేతులతో పాదాల వేళ్ళను పట్టుకొని రెండు  మోకాళ్లను పైకి కిందికి ఊపాలి.
 
3.       పూర్తిగా వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి కాళ్ళను రెండు వైపులా వెడల్పు వెడల్పు చెయ్యాలి. చేసి కాళ్ళను ఊపాలి.
 
మర్మాంగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :--
 
      ఒక గ్లాసు వార్చిన గంజి ఏ సమయంలోనైనా తాగాలి.ప్రతి రోజు మినుములతో చేసిన ఏదో ఒక పదార్ధం అదే విధంగా నువ్వులతో చేసిన ఏదో ఒక పదార్ధం తప్పకుండా వాడుతుంటే మర్మాంగం  లో ఎలాంటి వ్యాధులు రావు.త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో వేసి ఆ నీటిలో మర్మాంగాన్ని కడుగుతుంటే ఎలాంటి వ్యాధులు రావు.
                                                                    29-6-09. 

       ఒక గిన్నెలో 5 గ్లాసుల నీళ్ళు పోసి దానిలో 5 పిడికిళ్ల వేపాకును నలిపి వేయాలి, దానికి 5 స్పూన్ల పసుపును  కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మూత్రానికి వెళ్ళినపుడు ఆ నీటితో కడుక్కుంటూ వుంటే యోని మార్గంలో  ఇన్ఫెక్షన్ లు రావు.

జిలకర            ---- 100 gr
ధనియాలు      ---- 100 gr
కలకండ          ---- 100 gr

     జిలకర, ధనియాలను దోరగా వేయించి పోడులుగా చేసుకోవాలి దానికి కలకండ పొడి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

     ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున వాడుతూ వుంటే మర్మాంగంలో పుండ్లు పడకుండా నివారించ బడుతుంది.
                                           స్త్రీ జననేన్ద్రియములో దురదలు  --- నివారణ                   2-8-11.

1. చందం పొడి
    కొబ్బరి నూనె
           రెండింటిని కలిపి దురదల మీద పూస్తే తగ్గుతుంది .

2. ఉసిరిక పొడి          ---5 gr
        తేనె                ---5 gr
            రెండింటిని  కలిపి పేస్ట్ లాగా చేసి చప్పరిస్తూ , మింగుతూ వుండాలి . ఈ విధంగా నెల రోజులు చేస్తే  మంటలు ,
    దురదలు  తగ్గుతాయి .

3. శుద్ధి చేయబడిన గంధకం                ---- 2 gr
           కొబ్బరి నూనె                        ---- ఒక టీ స్పూను
            రెండింటిని కలిపి పూస్తే తగ్గుతుంది . కాని మొదట టెస్ట్ డోస్ వాడి చూడాలి  ఫలితం వేరేగా వుంటే మానేయాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను భుజించాలి . మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .
మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి . మజ్జిగ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది .

                                             జననాంగం లోని  మంట నివారణకు  --- ధాత్రి కషాయం             29-8-11.

         అతిగా వేడి చేయడం వలన వస్తుంది .

         ధాత్రి    =   ఉసిరిక

ఉసిరిక పొడి                    ---- ఒక టీ స్పూను
పటికబెల్లం                     ---- ఒక టీ స్పూను
    నీళ్ళు                       ---- ఒక గ్లాసు

    నీళ్ళలో  ఉసిరిక పొడి వేసి సగం గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి . దీనిలో కలకండ కలుపుకొని తాగాలి .

సూచన :---దీనితోబాటు ద్రాక్షరసం , దానిమ్మ రసం , ధనియాల కషాయం , బార్లీ జావ తాగాలి . బీరకాయ సొరకాయ     
వంటి కూరగాయలను వాడాలి . పులుపు ,  కారం తగ్గించి వాడాలి 



 

గర్భాశయ సమస్యలు

                                                  గర్భాశయ సమస్యలు
                                 రక్త గుల్మ వ్యాధి ( Fybroids)                                5-11-08.
      బహిష్టు రాకుండా చేయడం చాలా ప్రమాదకరం .రాకుండా మాత్రలు వాడకూడదు .harmonal inbalance జరుగుతుంది.
                         ఉసిరికాయల పొడి                   ----- 100 gr
                         దోరగా వేయించిన మిరియాల పొడి   ---25 gr
 
       రెండిటిని కలిపి నిల్వ చేసుకోవాలి .ఉదయం,సాయంత్రం అర టీ స్పూను చొప్పున సేవించాలి.
ఇది పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ లో గడ్డలు గా  అవుతుంటే పై మందు బాగా ఉపయోగ  పడుతుంది.

                                గర్భాశయం లో గడ్డలు  (గుల్మములు )                    22-1-09
 
  మట్టి పట్టి :--  మొదట పొడి బంక మట్టిని  జల్లించి దానికి కలబంద రసం కలిపి పెట్టుకోవాలి.ఒక మందమైన నూలు గుడ్డను తీసుకొని తడిపి, పిండి,విదిలించాలి. ఆ అగుడ్డ మీద తయారు చేసుకున్న మట్టి పేస్టును మందంగా పూయాలి . ఆ మట్టి పట్టిని గర్భాశయం మీద ,పొట్ట మీద పరచాలి. ఈ విధంగా రోజుకు రెండు,మూడు సార్లువెయ్యాలి.
యోగాసనం :-- నౌకాసనం :--  బోర్లా పడుకొని చేతులను ముందుకు చాపి, కాళ్ళను పూర్తిగా వెనుకకు చాపి  ఉంచాలి, అదే విధంగా వుంది ప్రక్కలకు వంగాలి
.
ధనురాసనం :-- బోర్లా పడుకొని రెండు పాదాలను రెండు చేతులతో పట్టుకొని ఊగాలి.
ఆహారం :--  బహిష్టు  సమయంలో ఘాటైన ఆహార పదార్ధాలు సేవించడం, ఉపవాసాలు వుండడం,
బహిష్టు సమయాన్ని ఆపడం వలన గుల్మ వ్యాధి వస్తుంది.
 
                                                       నెత్తుటి గడ్డలు కరగడానికి
 
                శొంటి పొడి        ------ 10 gr
                మిరియాల పొడి  ----- 10 gr
                పిప్పళ్ళ పొడి     ------10 gr
                కరక్కాయల పొడి  ---- 10 gr
                సైంధవ లవణం    ----- 10 gr
 
     అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి  దంచి పొడి చేసి అన్నింటిని సైంధవ లవణం పొడితో కలపాలి.   
       తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
     కలబంద గుజ్జును రసం తీయాలి. 50 గ్రాముల రసంలో 10 గ్రాముల పొడిని కలపాలి.లేదా  ఆవు నేతిలో  కలుపుకోవచ్చు. పొడిని బాగా గిలకొట్టి పరగడుపున తీసుకోవాలి. 1 గంట వరకు ఏమి తిన కూడదు.దీనితో  గడ్డలు కరిగిపోతాయి. ముఖ్యంగా వర్షా కాలం లో సేవిస్తే మంచిది.

     సమస్య తీవ్రంగా వున్నవాళ్ళు రెండు పూటలా వాడాలి. లేకున్నఒక పూట చాలు.

     దీనిని సేవించడం వలన గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి. బహిష్టు సక్రమమవుతుంది.
శరీరంలో కొవ్వు కరుగుతుంది.
 
      2.       ఉసిరికాయ ముక్కలు           ----- 10 gr
                                 కాచు                ----- 10 gr
 
      ఒక గిన్నెలో వాటిని వేసి  అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పావు లీటరు కషాయం వచ్చే వరకు  కాచాలి.దీనిని రెండు భాగాలు చేసి ఉదయం, సాయంత్రం  సమానంగా తీసుకోవాలి.దీనిలో పావు టీ స్పూను  బావంచాల పొడి ని కలిపి తీసుకోవాలి.కొంచం గోరువెచ్చగా తీసుకోవాలి.
 
      మాంసం,చేపలు,గుడ్లు, పాలు,వెన్న కలిపి తినరాదు.  "మాంసాహారం, పాలపదార్ధాలు  కలిపి ఒకేసారి   తినరాదు"  అతి పులుపు పనికి రాదు.
                   గర్భాశయం లో, రొమ్ముల్లో గడ్డలు రాకుండా -- నివారణ                12-3-09
.
                                               కలబంద హల్వా తయారి

                                    కలబంద గుజ్జు                  ----- 400 gr
                                    పటిక బెల్లం పొడి               ----- 400 gr
                                    గోధుమ పిండి                   ----- 100 gr
                                    నెయ్యి                           ------ 100 gr
                                    తేనె                               ------ 100 gr

    కలబంద గుజ్జు లో  రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  సన్న సెగ మీద   కలుపుతూ వేయించాలి. చల్లారిన తరువాత మిక్సి లోవేసి జూస్ చెయ్యాలి. తిరిగి దీనిని బాణలిలో పోసి దానిలో  పటిక బెల్లం వేసి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఈ పాకంలో గోధుమ పిండి కలపాలి. కొద్దిగా ఉడికిన తరువాత నెయ్యి కలపాలి. నురుగులా వచ్చి, నురుగు తగ్గిన తరువాత చల్లారనిచ్చి తేనె కలపాలి. ఇది పొంగు లాగా వచ్చిన తరువాత స్టవ్ ఆపాలి. బాగా చల్లారిన తరువాత నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం :--  భోజనానికి గంట ముందు ఉదయం, రాత్రి ఒక టీ స్పూన్ మందును వాడాలి.

                               10  ----12 సంవత్సరాల వారికి       ----- పావు టీ స్పూను
                               12-----20        "                "       ----- అర స్పూను

       బహిష్టు సరిగా రాకుండా, ఎక్కువ గా లేదా తక్కువగా రక్త స్రావం కావడం, కాన్సర్ కారక పుండ్లు వున్నవారు, మూత్ర సమస్యలున్న వాళ్ళు ఈ హల్వా వాడవచ్చు.

                              గర్భాశయ సమస్యల --నివారణ                              11-4-09.
 
పది కరక్కాయల పెచ్చులు
పది తానికాయల పెచ్చులు
పది ఉసిరిక కాయల ముక్కలు
 నీళ్ళు       ---అర లీటరు
 
     రాత్రి పూట ఈ పెచ్చులన్నింటిని నీళ్ళలో వేసి నానబెట్టి, ఉదయం కషాయం లాగా కాచాలి. మూత్ర విసర్జనకు
వెళ్ళినపుడు రెండు మూడు సార్లకు ఒక  సారి ఈ నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. దీని వలన తెల్ల బట్ట వంటి
వ్యాధులు కూడా నివారింప బడతాయి.
                                                                   14-4-09
 
1. ఒక నూలు బట్టను తీసుకొని చల్లని నీటిలో ముంచి, పిండి పొట్ట మీద నాలుగు పొరలుగా వేసి దాని పై పొడిబట్టను వెయ్యాలి.
2.  6 అడుగుల నూలు బట్టను తీసుకొని చల్లని నీటిలో ముంచి, పిండి నాభి నుండి గజ్జల వరకు లుంగీ లాగా కట్టాలి.
3. ఎర్ర మట్టి జల్లించి నూరి పొట్ట మీద పట్టు లాగా వేసి 20 నిమిషాలు వుంచుకోవాలి.
      పై మూడు రకాలుగా చేయడం వలన అధికమైన వేడిని తగ్గించ వచ్చును. పొట్టలోని చెడు వాయువులను  నివారింప వచ్చును.
                                               శరీర అంతః , బాహ్య సౌందర్యానికి
 
       గర్భాశయ, మర్మాంగ సమస్యలు రాకుండా ఉండడానికి నువ్వులను అధికంగా వాడాలి. నువ్వుండలు,  నువ్వుల పొడి వాడుతూ నువ్వుల నూనెతో  శరీరమంతా మర్దన చేయడం వలన శరీర సౌందర్యం పెరుగుతుంది.
 
                                                 సన్నిపాత ప్రదర సమస్య
 
1. వేపాకు నీటిలో వేసి ఉడికించి పేస్ట్ లాగా చేసి దానిని పొత్తి కడుపు మీద పట్టు లాగ వేసి నూలు బట్టతో  కప్పాలి.
2. మూడు గుప్పెళ్ళ వేపాకు, ఐదు చిటికెల పసుపు వేసి ఐదు గ్లాసుల నీటిలో వేసి  పది నిమిషాలు మరిగించి    ఆ నీటితో మర్గాన్గాన్ని కడుక్కోవాలి.
 
    బహిష్టు సమయంలో రక్త స్రావం గడ్డలు  లేదా రక్త గుల్మ వ్యాధి (Fybraoids)             10-6-09.-.
 
                                           అతిమధురం పొడి              ----  100 gr
                                                     శొంటి పొడి             ----- 100 gr
                                                  పిప్పళ్ళ పొడి           -----  100 gr
                                              మిరియాల పొడి           -----  100 gr
                                                      పాతబెల్లం           -----  400 gr

   అన్ని పొడులను కలిపి బెల్లం కలిపి దంచి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను  చొప్పున తినాలి.
   దీనితో బహిష్టు సమయం లో రక్త స్రావంలో గడ్డలు పడుతూ వుంటే కరిగి బయట పడతాయి.
   నౌకాసనం,   మట్టిపట్టి

                  బహిష్టు సమయంలో రక్తస్రావం సరిగా జరగక పోవడం వలన వచ్చే పొట్ట తగ్గడానికి
1. వెల్లకిలా పడుకొని కాళ్ళు,చేతులు పూర్తిగా చాపాలి.ఒక కాలు పూర్తిగా పైకి లేపాలి, దించాలి (వేగంగా) అదే   విధంగా రెండవ కాలు తరువాత రెండు కాళ్ళతో చెయ్యాలి.

2.  పక్కకు తిరిగి పడుకొని చేయి వెనుకకు పెట్టుకొని కాలును తలవైపుకు పైకేత్తాలి.  అదే విధంగా రెండవ వైపు చేయాలి. దీని వలన అధికంగా ఏర్పడిన కొవ్వు తగ్గుతుంది.

       ఒక చిన్న గ్లాసు బియ్యం కడిగి దానిలో 14 గ్లాసులో నీళ్ళు పోసి శొంటి, మిరియాలు,అల్లం, కొత్తిమెర, పుదీనా  కరివేపాకు మొదలైన వాటినిచిటికెడు చొప్పున  వేసి ఉడికించి తినాలి.

3. అన్ని కూరగాయలలో పైవన్నీ వేసి వుకించి తినాలి.

4. ఉలవచారు వాడాలి.

5.పాత రాగులు, గోధుమలు, బార్లీ  అన్ని కలిపిన పిండితో రొట్టెలు చేసుకొని దానిలో ఒక టీ స్పూను ఆముదంకలుపుకొని చేసుకొని తినాలి.

                దీని వలన అధికంగా వున్న కొవ్వు తగ్గుతుంది

                                                         ఉత్తరేణి తైలం

      100 గ్రాముల నువ్వుల నూనెను తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి దానిలో కొన్ని ఉత్తరేణి ఆకులను వేసి బాగా కాచాలి. తరువాత వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ తైలం తో పొట్ట మీద రుద్దితే కొవ్వు కరుగుతుంది.

                              తులసి ---గర్భ దోషాలు -- నివారణ                            7-3-10.

        తులసి ఆకులను నూరి నాభి మీద పట్టు వెయ్యాలి.  తరువాత మట్టి పట్టి వెయ్యాలి.  దీని వలన   గర్భాశయం లోని గడ్డలు, నీటి బుడగలు నివారింప బడతాయి.

        ఉదరచాలనము, ఉడ్యానబంధము, భుజంగాసనం, శలభాసనం వెయ్యాలి.

                                                 బహిష్టు సక్రమంగా రాకపోవడం ---నివారణ   

        కృష్ణ తులసి గింజల పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

       ఆడపిల్లలు బహిష్టు వచ్చిన రోజు నుండి వరుసగా మూడు రోజులు ఆహార నియమాలు పాటిస్తూమూడు చిటికెల తులసి గింజల చూర్ణాన్ని ఆహారానికి ముందు నీటితో సేవించాలి.

    2.   కృష్ణ తులసి సమూలంగా తెచ్చి విడివిడిగా నీడలో ఆరబెట్టి దంచి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.

     బహిష్టు ఆగిన తరువాత రోజునుండి తిరిగి బహిష్టు వచ్చే వరకు సేవిస్తే  1. గర్భాశయ ద్వారము ముడుచుకు పోవడం 
2. అతిరక్తస్రావం, చాలా తక్కువగా రక్తస్రావం కావడం, బహిష్టు సరిగా రాకపోవడం మొదలైన సమస్యలు    నివారింప బడతాయి.

                                                అండం సరిగా విడుదల కావడానికి

     ఎర్ర తులసి ఆకులు, కాండం ఎర్రగా వుంటాయి. దీనిని సమూలంగా తెచ్చి ఎండబెట్టి, దంచి పొడి చేసి నిల్వ  చేసుకోవాలి.

     మూడు చిటికెల పొడిలో సమానంగా కలకండ పొడి కలుపుకొని సేవించాలి.

     తప్పకుండా ఆహార నియమాలను పాటించాలి.

                                                                  గర్భధారణ

కృష్ణ తులసి దళాలు                 ---- పిడికెడు                           నువ్వుల నూనె       పావుకిలో         
తెల్ల జిల్లేడు  ఆకు                     ---- ఒకటి     
                                                                                            చిట్టాముదం   --- పావుకిలో
నల్లేరు                                     ---- జానెడు పొడవు                    వేప నూనె      ----పావుకిలో
వెల్లుల్లి పాయలు                       ---- రెండు
మర్రి ఆకుల చిగుళ్ళు               ----- రెండు
తామర గింజలు                       ----- రెండు

     అన్నింటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అన్ని నూనెలను ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగిస్తూ పై పదార్ధాల ముద్దను ఆ పాత్రలో మరుగుతున్న నూనేలలో వెయ్యాలి. నిదానంగా కలియబెడుతూ వుండాలి.  పదార్ధమంతా మాడిన తారువాత దించి వడపోసి నిల్వ చేసుకోవాలి.

     పది రోజులలో బహిష్టు రాబోతున్న దనగా ఈ తైలంతో రాత్రి పడుకునే ముందు నాభి చుట్టూ మర్దన చెయ్యాలి.  ఉదయం స్నానం చెయ్యాలి.

                                     గర్భాశయంలో గడ్డలు ----నివారణ ( Fybroids)
                    
కలబంద గుజ్జు                ---- 30 gr
పసుపు                         ---- మూడు వేళ్ళకు వచ్చినంత
జిలకర                          ----     "            "         "
నీళ్ళు                            ---- ఒక కప్పు

     అన్నింటిని కలిపి బాగా గిలకొట్టాలి.  ఉదయం, సాయంత్రం తాగాలి.  కపాలభాతి ప్రాణాయామం చెయ్యాలి.
              
  గర్భాశయంలో పుండు ( Survical Erosion ) --కారణాలు                         16-6-10.
 
లక్షణాలు:-- యోని నుండి చిక్కగా, తెల్లగా, జిడ్డుగా వున్న స్రావాలు రావడం.  లోపల బాక్టీరియా వలన ఇన్ఫెక్షన్    ఎక్కువై పసుపు రంగు ద్రవం ఏర్పడి దుర్వాసన కూడా వుంటుంది.
 
      నెల  మధ్యలో బ్లీడింగ్ కావడం వలన రావచ్చు. sexual intercourse వలన పెల్విస్  చిరిగి బ్లీడింగ్ కూడా  అవుతుంది.  survicks లో unwanted gowth వలన పుండు లాగ ఎత్తైన భాగం ఏర్పడుతుంది. దీని వలన కూడా బ్లీడింగ్ ఏర్పడుతుంది.
 
       మలబద్ధకం వలన ముఖద్వారం దగ్గర బ్లీడింగ్ అయ్యే అవకాశం వున్నది
       గర్భ నిరోధక మాత్రలు వాడడం వలన కూడా ఏర్పడుతుంది.
       ఫంగస్ చేరడం వలన కూడా ఏర్పడుతుంది.
       పై కారణాల వలన గర్భాశయం లో పుండ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
       దీనిని నివారిన్చుకోవడానికి నిపుణులైన స్త్రీ వైద్యులను సంప్రదించాలి.
 
యోని ప్రక్షాళనం ;--
 
మర్రి, రావి, మేడి, జువ్వి, గంగరావి ( పంచ వల్కలాలు ) ల యొక్క బెరడులను తెచ్చి కషాయం కాచి ఎనిమా క్యాన్ ద్వారా యోని మార్గంలో పెట్టి ఒత్తిడి ( ప్రెషర్) ఉపయోగించి పంపించాలి. దీనిని వైద్యుల ద్వారా చేయించుకుంటే మంచిది.
 
1."పుష్యానుగ చూర్ణం "  + తేనె కలిపి తీసుకోవాలి. ఈ ఔషధం 26  రకాల మూలికలతో విలక్షణం గా తయారు చేస్తారు.
      నేరేడు గింజల చూర్ణం లేదా మామిడి విత్తుల చూర్ణం, లేదా మాచికాయ చూర్ణం లలో ఏదో ఒకదానిని ఒకటి నుండి మూడు గ్రాముల చూర్నానికి తేనె కలిపి ఉండలాగా చేసి మింగి బియ్యం కడిగిన నీళ్ళు తాగాలి.
ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది.
     ఇది తెల్లబట్ట వ్యాధిని కూడా నివారిస్తుంది.
      ఇది గర్భాశయాన్ని కూడా  శుద్ధి చేస్తుంది.
2. ప్రదరాంతకవటి    టాబ్లెట్లను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. వీటికి అనుపానంగా
అశోకారిష్ట ,  రుద్రాంతకవటి  లను వాడాలి.

                                గర్భాశయ సమస్యలు-- నివారణ                                  10-4-09.
 
       పిల్లలు మొదటి సారి రజస్వల అయినప్పటినుండి బహిష్టు సమయంలో మూడు రోజులు అన్నం, పెసర పప్పు, నెయ్యితినాలి

 .  మరియు అన్నంలో పాలు, చక్కెర   తినాలి. సున్నుండలు, కొబ్బరి  ఉండలు  నువ్వుండలు  తింటూ 
వుంటే గర్భాశయ సమస్యలు ఏర్పడవు

                                గర్భ సంచి బలంగా ఉండడానికి                                      18-9-10.

     ప్రతి రోజు లవంగం లోని బుడిపే భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని నమిలి ( రోజుకొక్కటి)  తింటూ వుంటే గర్భ సంచి బలంగా తయారవుతుంది,

               గర్భాశయంలో రక్తం పేరుకు పోవడం --నివారణ                                  8-10-10
.
      దీనినే గ్రంధి భూత ఆర్తవము అంటారు.        ( Menstrual  Clots ).

      మోదుగ ( పలాస ) ఆకులు, బెరడు, కాండము  తెచ్చి చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టి  కాల్చి బూడిద చెయ్యాలి. ( పలాశ భస్మము )

మోదుగ భస్మం                    --- పావు కిలో
 ఆవు నెయ్యి                       --- ఒక కిలో
నీళ్ళు                                --- ఒక లీటరు

    అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి కాచాలి.  తైలం మాత్రమే మిగలాలి. దీనిని ప్రతి రోజు ఒక టీ స్పూను తైలం
ఒక గ్లాసు పాలలో కలుపుకొని తాగుతూ వుంటే ఈ సమస్య నివారింప బడుతుంది.

                                                     గర్భాశయ   క్యాన్సర్ --నివారణ                                             5-1-11.

     బహిష్టు సమయంలో సరిగా శుభ్ర పరచుకోక పోవడం వలన,  ఎక్కువ కాలం  తెల్లబట్ట,  ఎర్రబట్ట కావడం
దానితో గడ్డలు ఏర్పడడం కారణంగా ఇది క్రమేపి క్యాన్సర్ కి దారి తీయడానికి అవకాశం వుంది.

     ప్రాధమిక స్థాయిలో అయితే పెరగకుండా కాపాడుకోవచ్చు.
     ప్లాస్టిక్ వస్తువులను ఆహార పదార్ధాల ఉపయోగానికి వాడడం క్యాన్సర్ సమస్యలకు కారణం అవుతుంది.
 
                 వజ్ర భస్మం       వాడాలి.

నల్ల జీడి గింజలను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయం ఇసుకలో వేసి దంచాలి. ఈ విధంగా ఏడు సార్లు చేయాలి. తరువాత అదే విధంగా మూడు సార్లు పెదలో నానబెట్టి ఉదయం ఇసుకలో వేసి దంచాలి.

అశోక చెట్టు బెరడు చూర్ణం
శుద్ధి చేసిన జీడి గింజల చూర్ణం
త్రిఫల చూర్ణం
తెల్ల చిత్ర మూలం పొడి
తిప్ప తీగ పొడి
 
         అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలపాలి.  కల్వంలో వేసి నీటితో గాని,  గోమూత్ర అర్కంతో గానినూరి శనగ గింజలంత మాత్రలు చేయాలి.

                                                
        ప్రతి రోజు పూటకు  రెండు మాత్రల  చొప్పున మూడు పూటలా ఆరు మాత్రలు వాడుతూ వుంటే క్యాన్సర్ యొక్క తీవ్రతను తగ్గించవచ్చు.

                                   గర్భాశయం  జారిపోవడం                                              28-3-11.

        ఇదొక దురదృష్టకరమైన  సమస్య .

        స్త్రీలు  మూత్ర విసర్జనకు వెళ్ళినపుడు మూత్రానికి అడ్డుపడినట్లుగా అనిపిస్తే జారిందని గుర్తించ
 వచ్చు.

        గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, గుల్లలు వున్నపుడు   కండరాలు  వదులైనపుడు  సమస్య
ఏర్పడే అవకాశం కలదు.  దీని ప్రభావం మూత్రాశయం మీద, మలాశయం మీద పడుతుంది.
ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వలన కూడా గర్భాశయం జారిపోయ్యే ప్రమాదం వున్నది.
ఆహారం సరిగా తీసుకోక పోవడం వలన శారీరక ఆరోగ్యం చెడిపోవడం వలన కూడా ఈ వ్యాధి
రావచ్చు.

సమస్య ప్రారంభ దశలో వున్నపుడు :---

సుకుమార తైలం, బలా తైలం ,  వల్కల తైలం  లలో ఏదైనా వాడవచ్చు.

1. త్రిఫల చూర్ణం           --- రెండు టీ స్పూన్లు
         నీళ్ళు                --- రెండు గ్లాసులు

   నీళ్ళలో  చూర్ణాన్ని వేసి బాగా కాచి ఆ కషాయం తో కడగాలి.

2. వరుణ ( ఉలిమిరి) చెక్క చూర్ణం               --- 50 gr
                లొద్దుగ   చెక్క  చూర్ణం               --- 50 gr
    మాంస రోహిణి  ( సోమిడి) చెక్క చూర్ణం      --- 50 gr
                అశోక  చెక్క చూర్ణం                  ---100 gr
                        నువ్వుల నూనె               --- 250 gr
                            నీళ్ళు                       ----ఒక లీటరు

        అన్ని చూర్ణాలను, నువ్వుల నూనెను, నీటిని కలిపి ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి కలియ
బెడుతూ కాచాలి. నీటి శాతం ఆవిరై తైలం మాత్రమె మిగిలే వరకు కాచాలి.

      దీనిని ప్రతి రోజు ఒక టీ స్పూను తైలాన్ని ఒక కప్పు పాలలో కలుపుకొని తాగాలి.

                                                  గర్భాశయ క్యాన్సర్ --- నివారణ                                   18-6-11.

1. మర్రి,  రావి పండ్లు
          కలకండ  

       రెండింటిని  సమానంగా తీసుకొని కలిపి హల్వా తయారు చేయాలి .

      ప్రతి రోజు ఒక టీ స్పూను హల్వా తినాలి ,

2.  త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజు రాత్రి వాడాలి . 

3.  మునగ చెట్టు బెరడు పొడి                    --- 100 gr
        రావి  చెట్టు బెరడు పొడి                   ---  100 gr
                            వస పొడి                   ---  100 gr

       అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

       ఒక టీ స్పూను పొడిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి అరకప్పుకు రానివ్వాలి . దించి దానిలో
చిటికెడు ఇంగువ పొడి,  చిటికెడు సైంధవ లవణం పొడి కలిపి గోరువెచ్చగా తాగాలి .  ఈ విధంగా ప్రతి రోజు చేయాలి

                               గర్భాశయ సమస్యలు  ( అండాశయం లోని నీటి బుడగలు ) --- నివారణ    3-7-11.

   పొత్తి కడుపు మీద రెండు పూటలా పదిహేను  నుండి ఇరవై నిమిషాల పాటు మట్టి పట్టీని వేయాలి . తరువాత దానిని
తీసి  ఒక గుడ్డను వేడి నీటిలో ముంచి కాపడం పెట్టాలి . తరువాత రెండు నిమిషాల పాటు ఆ వేడి గుడ్డను పొట్ట మీద
పరచాలి . తరువాత దానిని తీసి  చన్నీటి లో ముంచిన గుడ్డను వేయాలి . ఈ విధంగా పట్టీలను మార్చుతూ ఈ   విధంగా మూడు సార్లు చేయాలి

     తరువాత 5, 6 ఆసనాలు వేయాలి

1.భుజంగాసనం  2. శలభాసనం  3. ధనురాసనం  4. పవనముక్తాసనం  5. యోగాముద్రాసనం
    ఒక్కొక్క ఆసనాన్ని రెండు నిమిషాల సేపు వేయాలి .
    ముఖ్యంగా సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు గా వేసే ఆసనం  చాలా ముఖ్యమైనది .
    కపాలభాతి ప్రాణాయామాన్ని శక్తిని బట్టి 50 నుండి 100 చెయ్యాలి .
ఈ విధంగా చేయడం వలన గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి .
     చితికేనవేలు ,  ఉంగరపు వేలు మడిచి దాని మీద బొటన వ్రేలును వుంచి మిగిలిన రెండు వేళ్ళను  చాపి ఉంచాలి
     పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ విధంగా మడిచిన చేతులను మోకాళ్ళపై వుంచి మనసులో గర్భసంచి లోని
గడ్డలు కరుగుతున్నట్లుగా భావిస్తూ ధ్యానం చేయాలి .

   ఈ విధంగా రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు చేయాలి .

అతిమధురం
ఉసిరిక పొడి
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు

     శొంటి ,పిప్పళ్ళు , మిరియాలను దోరగా వేయించాలి .
     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా వేయించి దంచి , జల్లించి బాగా కలిపి సీసాలో నిల్వ
చేసుకోవాలి .
      పొట్ట ఖాళీ గా వున్న సమయం లో పావు టీ స్పూను నుండి అరస్పూను చూర్ణాన్ని మంచి నీటితో ఉదయం , సాయంత్రం సేవించాలి
                                                  గర్భాశయం లో గడ్డలు   --- నివారణ                                   14-7-11.
కలబంద గుజ్జు          --- 3 gr
పసుపు                   --- 3 gr
జిలకర                   --- 3  gr                  
త్రికటుకాల  చూర్ణం   --- 3 gr
ఉసిరిక  చూర్ణం        --- 3 gr

      అన్నింటిని కలిపి  పరగడుపున  కడుపులోకి తీసుకోవాలి  . ఒక గంట వరకు ఏమి తినకూడదు .
సూచన :-- వేపాకు పొడి ,  పసుపు పొడి సమానంతీసుకొని  నీటితో కలిపి రాత్రి పడుకునే ముందు పొత్తి కడుపు మీద
పట్టీ లాగా వేసుకోవాలి

                                    గర్భాశయంలో గడ్డలు మరియు తెల్లబట్ట ---నివారణ                     16-7-11.

1. త్రిఫల చూర్ణం            --- ఒక టీ స్పూను
         నీళ్ళు                 --- ఒక కప్పు

         రెండింటిని కలిపి ఒక చిన్న గిన్నెలో వేసి కాచి అరకప్పు కు రానివ్వాలి . దానిలో అరకప్పు బియ్యం కడగగా
వచ్చిన నీళ్ళు  ( కడుగు ) కలిపి తాగితే గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి .

2. ప్రతి రోజు రెండు బెండకాయలను తినాలి .

3. బెండకాయ రసం లో చక్కర కలుపుకొని తాగాలి

4. ఉసిరిక పొడి , పంచదార , తేనె సమాన భాగాలుగా తీసుకొని కలిపి తినాలి .

5. ఉసిరి పొడి , పంచదార , అరటిపండు కలిపి తినాలి

                             స్త్రీల యొక్క అండాశయం లో సిస్ట్ తయారవడం   --- నివారణ              29-7-11.

లక్షణాలు :---  పొత్తి కడుపు లో నొప్పి వుంటుంది . మలబద్ధకం , ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు వుంటాయి .

1. సైంధవ లవణం  పొడి                     --- ఒక గ్రాము
    పిప్పళ్ళ పొడి                              ---       "
    పిప్పళ్ళ వేరు ( మోడి ) చూర్ణం       ---       "
   చిత్ర మూలం  వేరు చూర్ణం             ---       "
   నల్ల జిలకర చూర్ణం                       ---       "
   దశ మూలాల కషాయం

         దశ మూలాల కషాయం లో అన్ని చూర్ణాలను  కలిపి తాగాలి . రోజుకు  రెండు పూటల చొప్పున  40 రోజులు
వాడాలి .

         దశ మూలాల కషాయం దొరకని పక్షం లో చూర్ణాలను నీటిలో కలుపుకొని అయినా తాగవచ్చును

2. వాము పొడి                             ---- ఒక గ్రాము
    పొంగించిన ఇంగువ పొడి             ----      "
    సైంధవ లవణం                        ----      "
    యవాక్షారం  పొడి                     ----      "
    కరక్కాయ పెచ్చుల పొడి           ----      "
    ద్రాక్షారిష్ట                                ----  20 ml

           ద్రాక్షారిష్ట లో అన్ని చూర్ణాలను  కలిపి తాగాలి  రోజుకు రెండు పూటల చొప్పున  40  రోజులు వాడాలి 
           చూర్ణాలను నీటిలో కలుపుకొని కూడా తాగావచ్చును .

           ఈ విధంగా వాడడం వలన సైస్ట్ లు కరిగి పోతాయి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .  వేడి నీళ్ళు ,  వేడి ఆహార పదార్ధాలను వాడాలి .
పాల పదార్ధాలను , దుంప కూరలను వాడడం తగ్గించాలి . ఆకు కూరలను బాగా ఎక్కువగా వాడుకోవాలి
   
   
   




  

























k,