అవివాహిత స్త్రీలు తీసుకోవలసిన ఆహారం 21-1-09.
చదువుల పోటీ ఆరోగ్యాన్ని నాశనము చేస్తుంది.నెయ్యి, నూనె వాడితే అందం పెరుగుతుందే గాని తగ్గదు ఖచ్చితంగా దంపుడు బియ్యం తినాలి.
ఒక పండు యొక్క రసం ఒకే టైం క్రమం తప్పకుండా తాగాలి. దీనిలో ఎండు ద్రాక్ష రసం కూడా చాలా మంచిది.
1. ధనియాల కషాయం -- ఒక స్పూను ధనియాలను నలగగొట్టి ,ఒకగ్లాసు నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి.అర గ్లాసుకు రానివ్వాలి. కలకండ కలుపుకొని తాగాలి.
2 కారట్ జ్యూస్ :-- కారట్, బీట్రూట్ మిక్సీ లోవేసి రసం తీసి చక్కర పాకంలో పోసి రసం ఇగిరి పాకం వచ్చే వరకు కాచాలి. పాకం దించిన తరువాత పచ్చ కర్పూరం కలపాలి.
ఈ పాకాన్ని కొద్దిగా గ్లాసులో వేసుకొని ;నీళ్ళు కలుపుకొని తాగాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి