మలము సరైన సమయంలో బయటకు వెళ్లకపోతే అపాన వాయువులు ఊర్ధ్వ ముఖముగా వెళ్లి సమస్యలు ఏర్పడతాయి.
లేపాలి. ఉంచగాలిగినంత సేపు అలాగే వుంచి మెల్లగా కాలును దించాలి.దీనిని గాలి పీలుస్తూ కాలును పైకేత్తాలి
గాలిని వదులుతూ దించాలి. అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి. లేదా రెండు కాళ్ళు ఒకేసారికూడా ఎత్తవచ్చు
దీని వలన వాయువులు కిందికి దిగుతాయి.
శరీర స్థితిని బట్టి వాళ్లకు జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు 200 గ్రాముల నల్ల ద్రాక్ష ను కడిగి గిన్నెలో వేసి నీళ్ళు పోసి, పొద్దున్న వాటిని పిసికి గింజలు,తొక్కలు తీసి పరగడుపున తాగాలి. దీని వలన సుఖవిరేచనము అవుతుంది.
గుండె సంబంధిత సమస్యలు --నివారణ 24-2-09.
వాత, పిత్త, కఫములు ఎక్కువైనపుడు ఇవి సంభవిస్తాయి.
1. పాదహస్తాసనం 2. కటిచాక్రాసనం 3. అర్ధచంద్రాసనం వెయ్యాలి.
ఆహారనియమాలు:--
త్రిదోషాలకు త్రిఫలాలను తీసుకుంటే శరీరంలో ధాతువులన్ని నియంత్రణ లో వుంటాయి. (balanced గా )
కరక్కాయల పొడి ----- 100 gr
తానికాయల పొడి ----- 200 gr
ఉసిరికాయల పొడి ----- 400 gr
వీటిని 1:2:4 నిష్పత్తిలో గాని సమాన నిష్పత్తిలో గాని వాడుకోవచ్చు
ఈ మూడింటిని విడివిడిగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసి వేయించి, దంచి పొడి చెయ్యాలి. అన్నింటిని అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
వాదేవిధానం:--
1. వాత శరీరం వున్నా వాళ్ళు పావు టీ స్పూను తో ప్రారంభించి పావు గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగాలి.
కొంచం లావుగా వున్న వాళ్ళు ముప్పావు స్పూను పొడిని ముప్పావు గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.ఇంకా లావుగా వున్న వాళ్ళు ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.
2. పైత్య శరీరం వున్న వాళ్ళు పైన చెప్పబడిన మోతాదులో మజ్జిగతో వాడాలి.
3. కఫ శరీరం వున్నవాళ్ళు అదే మోతాదులో తేనెతో వాడాలి.
పావు టీ స్పూను పొడి ముప్పావు టీ స్పూను పొడి ఒక టీ స్పూను పొడి
పావు గ్లాసు నీళ్ళు ముప్పావు గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు
వాతం వలన కలిగే గుండె జబ్బులు --నివారణ 25-2-09.
లక్షణాలు:-- గుండెల్లో సూదులు గుచ్చినట్లు గా వుంటుంది.
వ్యాయామం:-- ముందు చాతీ మీద గోరు వెచ్చని తైలం(ఓమ లేక ఏరండతైలం) పూసి ఉప్పు తో నెమ్మదిగా కాపడం పెట్టాలి.
వ్యాయామం :-- హృదయ ముద్ర :--
చిటికెన వేలును కిందకు దించి, చూపుడు వేలును మడవాలి.బొటన వేలు
మధ్యవేలు,ఉంగరపు వేలు కలిపి పట్టుకోవాలి. ఈ విధంగా ముద్ర వేసుకోవాలి
2 అనులోమ, విలోమ ప్రాణాయామం లు చెయ్యాలి. 3. వేగ భస్త్రిక వ్యాయామాలను చెయ్యాలి.
ఆహారం:--
వాము ------- 100 gr
శొంటి ------- 100 gr
పిప్పళ్ళు ------- 100 gr
వస కొమ్ములు ------- 100 gr
ఇంగువ ------- 100 gr
సైంధవ లవణం -------- 100 gr
సౌవర్చ లవణం -------- 100 gr
యవాక్షారం -------- 100 gr
వాము, శొంటి, పిప్పళ్ళను విడివిడిగా దోరగా వేయించి విడివిడిగా పొడులను చేయాలి. వస కొమ్ములను ఒక రోజంతా నానబెట్టి తీసి తుడిచి నలగగొట్టి బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి. ఇంగువను గరిటలో పెట్టి పొంగించాలి. సైంధవ, సౌవర్చ, యవాక్షారాలను విడివిడిగా పొడి చెయ్యాలి.
అన్ని పదార్ధాల చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచాలి.
ఉదయం, సాయంత్రం పావు టీ స్పూను పొడిని ఒక కప్పు ఉలవకట్టు లో గాని, లేదా నీటిలో గాని కలుపుకొని తాగాలి.
గుండె జబ్బుల నివారణకు అర్జున టీ 9-3-09.
పద్మాసనం లో చిన్ముద్ర వేసుకొని నిటారుగా పది నిమిషాలు కూర్చోవాలి.
తెల్ల మద్ది చెట్టు బెరడు తెచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి గాలి తగిలే చోట ఆరబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి. బెరడును కడిగిన తరువాత ఒక రోజు ఎండలో పెట్టవచ్చు.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పొడి వేసి ఒక కప్పు కషాయం వచ్చే వరకు మరిగించి దానిలో ఆవుపాలు,కలకండ కలుపుకొని టీ లాగా తాగాలి.
గుండె జబ్బుల నివారణ 10-3-09.
కరక్కాయలను, శొంటి, పిప్పళ్లను, సన్న రాష్ట్రాన్ని కొద్దిగా నేతి చుక్కలు వేసి దోరగా వేయించాలి.
వసను 24 గంటలు నానబెట్టి, తీసి చిన్న ముక్కలుగా నలగ గొట్టి బాగా ఎండబెట్టి దంచి పోదిచేయ్యాలి.
కరక్కాయల బెరడు ----100 gr
శొంటి ---- 100 gr
పిప్పళ్ళు ---- 100 gr
గంధ కచ్చూరాలు ---- 100 gr
సన్న రాష్ట్రము ---- 100 gr
వస ---- 100 gr
పుష్కర మూలం లేదా చెంగల్వ కోష్టు ---- 100 gr
అన్నింటి పొడులను కలిపి గాజు సీసాలో భద్ర పరచాలి.
ఇది అన్ని రకాల వాత, పిత్త, కఫ సంబంధ గుండె జబ్బులు నివారింప బడతాయి.
ఈ చూర్ణం ఉదయం, రాత్రి ఆహారానికి అర గంట ముందు పావు లేక అర టీ స్పూను నీటిలో కలిపి సేవించాలి.
గుండె జబ్బుల నివారణకు భావ మిశ్ర పానీయం 13-3-09.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- గుండె జబ్బులున్న వాళ్ళు అతి పుల్లని పదార్ధాలను, వగరు పదార్ధాలను వాడరాదు. పుల్లని పెరుగు వాడ కూడదు. తాజా పెరుగుతో చేసిన మజ్జిగను లేదా మజ్జిగ చారు వాడవచ్చు. ఆవకాయ తినకూడదు.
అమృత ఫల రసం (ఆపిల్ జూస్)
ఆపిల్స్ ను బాగా కడిగి కొంత చెక్కు తీసి లోపల ఉన్న గింజల చుట్టూ వున్న భాగం తొలగించి మిక్సి లో వేసి రసం తయారు చెయ్యాలి. గాజర్ గడ్డలు(కారెట్) కూడా అదే విధంగా రసం తీయాలి.
ఆపిల్ జూస్ --- ఒక కిలో
కారెట్ జూస్ --- అర కిలో
పటికబెల్లం --- 300 gr
అన్నింటిని ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలి. నీటి శాతం తగ్గి లేత పాకం రాగానే దించాలి. దీనిని నిల్వ చేసుకోవాలి.
దీనిని ఉదయం, సాయంత్రం వాడాలి.
చిన్న పిల్లలకు ---- అర స్పూను
పెద్ద పిల్లలకు ---- ఒక స్పూను
పెద్దలకు ---- రెండు స్పూన్లు
ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.
దీని వలన గుండె దడ, గుండె కు సంబంధించిన ఇతర వ్యాధులు నివారింపబడతాయి.
ఆహారానికి గంట ముందు ఒక గ్లాసు జూస్ తాగితే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
గుండె జబ్బుల నివారణ 16-3-09.
ఎడమ చిటికెన వ్రేలి బుడిపెను కుడి బొటన వ్రేలు చూపుడు వ్రేలుతో రెండు నిమిషాలు నొక్కి పెట్టాలి. ఇదే విధంగా కుడి చేతికి కూడా చేయాలి.
పెద్ద వాళ్ళు ప్రతి రోజు కొబ్బరి పచ్చడి వాడాలి. రోజు కాకున్నా రోజు మార్చి రోజైనా తినాలి. చిన్న పిల్లలకు కొబ్బరి బర్ఫీలు చేసి తినిపించాలి. ఒక వెల్లుల్లి పాయను సన్న ముక్కలుగా కట్ చేసి ఆవు నేతిలో కొద్దిగా వేయించి అన్నం లో కలిపి పిల్లలకు తినిపించాలి.
అంజీర, అక్రోటు, ఎండు ద్రాక్ష, నల్లద్రాక్ష లు వాడాలి.
బహిష్టు సమస్యల వలన వచ్చే గుండె జబ్బుల నివారణ 25-6-09.
దీనికి ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. అందులో భస్త్రిక ప్రాణాయామం మరీ చాలా ముఖ్యమైనది.
1.ముద్ర వేసుకొని కూర్చొని, దీర్ఘంగా గాలి పీల్చి దీర్ఘంగా వదలాలి. 2. వేగంగా గాలిని పీల్చి వేగంగా, దీర్ఘంగా వదలాలి. ఒక్కొక్కటి 6 సార్లు గాని, 12 సార్లు గాని, 18 లేదా 24 సార్లు చెయ్యాలి.
కపాల భాతి ప్రాణాయామం :-- నాభి దగ్గర నుండి గాలిని లాగి వేగంగా బయటకు కొట్టాలి.
బహిష్టు లో జరిగే అవకతవకల వలన కాలేయము, ప్లీహము బలహీనపడి దాని వలన రక్తపోటు వస్తుంది. గుండె బలహీన పడుతుంది.
తినదగిన ఆహార పదార్ధాలు:-- పెసరకట్టు, ఉలవకట్టు, యవలకట్టు(అన్ని వ్యాధులకు పనిచేస్తుంది), కాకర, పొట్ల,గుమ్మడి, లేత ముల్లంగి తీపి దానిమ్మ, తియ్యని మామిడి, నల్లని ఎండు కిస్మిస్, నల్లని పండు ద్రాక్ష మొదలైనవి
తినకూడనివి:-- నూనె పనికి రాదు, చాలా తక్కువగా వాడాలి. వంటాముదం, ఆవు నెయ్యి కలిపి వంటలలో వాడితే చాలా శ్రేష్ఠము.
వగరు, చేదు, పుల్లని పదార్ధాలు పనికి రావు.
మానసిక ఆవేదనను వదలాలి. బహిష్టు సమస్య వున్నవాళ్ళు తల బాదుకోవడం, ఏడవడం, కొట్టుకోవడం చేస్తుంటారు .వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
తెల్ల మద్ది చెక్క (అర్జున) ను (బెరడు) తెచ్చి కడిగి ముక్కలుగా కొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి .
మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని ఒక టీ స్పూను ఆవునేతి తో గాని, ఆవు పాలతో గాని లేదా కరిగించిన పాతబెల్లంతో గాని సేవించ వలెను.
ఓంకార శబ్దం చెయ్యాలి.తూర్పుకు ఎదురుగా కూర్చొని (పెద్ద వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు) మనసును అంతర్భాగం లో వున్న హృదయం మీద లగ్నం చేసి "
యం" అని ఉచ్చరించాలి.
కుడి చేతిని కుడి మోకాలి మీద పెట్టి చిటికెన వేలి కింది భాగంలో అర చేతి వైపు నొక్కాలి. అదే విధంగా రెండవ చేతికి కూడా చెయ్యాలి.
గుండె దడ నివారణకు పానీయం 1-8-09.
నీళ్ళు ---- ఒక కప్పు
పుదీనా ---- 5 gr
మిరియాలు ---- అర పావు టీ స్పూను
కలకండ ---- అర టీ స్పూను లేదా తాటిబెల్లం
నీళ్ళు స్టవ్ మీద పెట్టి పుదీనాను నీళ్ళలో వెయ్యాలి. తరువాత మిరియాల పొడి వేసి సగానికి రానివ్వాలి.
వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత అర టీ స్పూను కలకండ కలుపుకొని తాగాలి.
ఈ సమస్య వున్నవాళ్ళు ఏదో ఒక నిమ్మపండు రసం, ఉసిరి ఆహారంలో ఏదో ఒక రూపంలో వుండాలి.
ఒక పచ్చి ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా తినాలి.
ఆహారంలో త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలను తినాలి. అతి చల్లని, అతి వేడి పదార్ధాలు పనికి రావు.
ప్రాణాయామం:-- కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో దీర్ఘంగా గాలిని పీల్చాలి. కుడి ముక్కుతో గాలిని వదలాలి. మల్లి కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ఇది ఒక ఆవృతం . ఈ విధంగా పన్నెండు ఆవృతాలు చెయ్యాలి. ఉదయం, సాయంత్రం ఈ విధంగా చెయ్యడం ఎంతో ఆరోగ్యకరం.
గుండెను శక్తివంతంగా చెయ్యడానికి
పాలు ---- అర గ్లాసు
నల్లని ఎండు ద్రాక్ష --- పది (చిన్న పిల్లలకు ఐదు)
ద్రాక్షను ముక్కలుగా చేసి పాలల్లో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు పొంగించాలి. షుగర్ లేని వాళ్ళు కలకండ కలుపుకోవచ్చు. పాలు త్రాగే ముందు ఉడికిన పండ్లను తినాలి. కేవలం ఇరవై నుండి నలభై రోజులలో గుండెకు ఎంతో శక్తి వస్తుంది. సాఫీగా విరేచనమవుతుంది. గుండెకు, కాలేయానికి, ప్లీహానికి శక్తి వస్తుంది.
ఉదయం పరగడుపున గాని, రాత్రి నిద్రించే ముందు గాని సాయంకాలం గాని వాడుకోవచ్చు.
ఎక్కువ సేపు శ్రమిస్తే ఆయాస పడే వాళ్లకు ఇది ఎంతో బలాన్నిస్తుంది.
గుండెల్లో మంట --- పైత్య హృదయ రోగాలు 3-9-09.
మోకాళ్ళఫై కూర్చొని ఎడమ ముక్కునుండి మాత్రమే గాలిని పీల్చి కుడి ముక్కుద్వారా గాలిని వదలాలి.
శీతలి ప్రాణాయామం:-- అలాగే కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని బాగా పీల్చి పొట్టలో కొంతసేపు నిలిపి వదలాలి.
శీత్కారి ప్రాణాయామం:-- నోరు తెరిచి పళ్ళు బిగించి నాలుకను మడిచి గాలిని దీర్ఘంగా పీల్చి లోపల నిలిపి ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని వదలాలి.
ల
క్షణాలు;-- గొంతు ఎండి పోవడం, అతి దాహం వుంటాయి.
కరక్కాయ పొడి ---- 5 gr
నల్ల ద్రాక్ష రసం ---- ఒక గ్లాసు
కలకండ ---- ఒక టీ స్పూను
అన్నింటిని కలిపి తాగాలి. రెండు పూటలా వాడాలి.
ఇది గుండె మంటను, పైత్యాన్ని, వేడిని తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ద్రాక్ష రసం, బార్లీ, నానబెట్టిన ఎండుద్రాక్ష, చలువ చేసే ఆకు కూరలు వంటివి వాడుకోవాలి.
గుడ్డ పట్టి తప్పని సరి.
గుండె పట్టుకున్నట్లు వుంటే --- నివారణకు 14-2-10.
తులసి ఆకుల పొడి ---- పావు టీ స్పూను
దోరగా వేయించిన మిరియాల పొడి -- పావు టీ స్పూను
పాత బెల్లం ---- పది గ్రాములు
అన్నింటిని కలిపి దంచి ముద్దగా చేసి ఆహారానికి గంట ముందు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ వుంటే పై సమస్య త్వరగా నివారింప బడుతుంది.
తులసి ఆకులను మట్టి మూకుడులో వేసి ఐదారు చుక్కల నీటిని చల్లి వేడి చెయ్యాలి. లేదా గిన్నెలో నీళ్ళు పోసి దానికి గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద తులసి ఆకులను వుంచి స్టవ్ వెలిగించాలి. ఆవిరికి ఆకులు ఉడుకుతాయి.
తులసి ఆకులను దంచి రసం తీసి తగినంత తేనె కలుపుకొని తాగాలి.
తులసి పూసలను రాగి తీగతో చుట్టి మెడలో ధరించాలి.
హృదయ ముద్ర లేదా పానవాయు ముద్ర:-- పద్మాసనంలో కూర్చొని మోకాళ్ళ పై చేతులుంచి చూపుడు వేలును కిందికి దించి , చిటికెన వేలును పైకి లేపి, మిగిలిన వెళ్ళాను కలిపి కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా ఉంచాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే అద్భుతంగా గుండె జబ్బులు నివారింప బడతాయి.
పై ముద్ర వేసుకొని "యం" అనే బీజాక్షరాన్ని నెమ్మదిగా అవకాశం ఉన్నంత సేపు పలకాలి . అక్షరానికి ఎంతో ప్రాముఖ్యమున్నది.
గుండెపోటు నివారణకు --హృదయ గుటికలు 2-5-10.
గుండెల్లో నొప్పిగా అనిపించినపుడు ;-----
100 గ్రాముల మంచి శనగలను తీసుకొని నల్లగా బూడిద లాగా అయ్యేంత వరకు వేయించాలి. నలగగొట్టి వేయిస్తే త్వరగా బూడిద లాగా వుతాయి.
శనగల బూడిద ---- 4 చిటికెలు
బెల్లం ---- 10 గ్రాములు
రెండింటిని బాగా పిసికి ముద్దగా చెయ్యాలి. కుంకుడు కాయంత ముద్దను ఆహారానికి గంట ముందు చప్పరించి తినాలి. అప్పటికప్పుడు కలుపుకొని తినవచ్చు.
హృదయ ముద్ర వేసుకోవాలి;--
తూర్పు కెదురుగా కూర్చొని మందును బుగ్గలో పెట్టుకొని "యం" అనే అక్షరాన్ని పలకాలి.
ఆహారంలో కారం, ఉప్పు, పులుపు తగ్గించి తినాలి.
గుండె జబ్బులు-- లక్షణాలు 4-6-10.
మద్యపానం, ధూమపానం కారణంగా వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు;-- నడవలేక పోవడం, నడిస్తే ఆయాసంగా వుండడం, ఎడమ చెయ్యి, శరీరంలోని ఎడమ భాగం, ,మెడ మీద నొప్పిగా ఉండడం జరుగుతుంది. పడుకున్నపుడు ఆయాసంగా వుండడం, కూర్చుంటే బాగుండడం, కింది భాగాలలో నీరు చేరడం,నొక్కితే గుంట పడడం జరుగుతుంది.
గుండెపోటు -- నివారణ 13-9-10.
తమలపాకులు -- రెండు
తేనె -- రెండు టీ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు -- రెండు
అల్లం --- చిన్న ముక్క
నీళ్ళు --- ఒక గ్లాసు
తమలపాకులను, వెల్లుల్లిని కలిపి నూరి గ్లాసు నీటిలో కలిపి దానిలో తేనె కలిపి పరగడుపున తాగాలి.దీని వలన గుండెపోటు రాకుండా నివారింపబడుతుంది. ఈ విధంగా రోజుకొక్క సారి చేయాలి.
పుల్లని పదార్ధాలను మితంగా వాడితే గుండెకు మంచిది.
సీజన్ ప్రకారం కూరగాయలను, పండ్లను తప్పనిసరిగా వాడాలి.
నూనె పదార్ధాలు, వేపుళ్ళు కారాలు, ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్ధాలు వాడకూడదు.
మొలకలు మంచిది.
గుండె పదిలంగా ఉండాలంటే 20-12-10
కటుక రోహిణి చూర్ణానికి నీరు కలిపి మెత్తగా చేసి గుండె వున్నచోట పైన లేపనం చేయాలి. దీనితో నొప్పి నివారింప బడుతుంది.
గుండె చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉండాలంటే (హృద్దౌర్బల్యము ) 17-1-11.
రక్త నాళాలు కుంచించుకు పోయి గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోవడం వలన గుండె బలహీనంగా మారుతుంది.
లక్షణాలు :-- ఊపిరాడనట్లుగా వుండడం, ఆయాసంగా వుండడం, కాళ్ళు చేతులు వాపు వుండడం వంటి లక్షణాలు వుంటే గుండె బలహీనంగా వున్నదని చెప్పవచ్చు.
1. తెల్ల మద్ది బెరడు చూర్ణం తయారు చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఆవు పాలు -- ఒక గ్లాసు
నీళ్ళు -- ఒక గ్లాసు
తెల్ల మద్ది చూర్ణం -- ఒక టీ స్పూను
నీళ్ళు, పాలు కలిపి దానిలో చూర్ణాన్ని వేసి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు మిగిలే వరకు కాచాలి. వడ పోసి పంచదార కలుపుకుని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేయాలి. దీని వలన మంచి ఫలితం వుంటుంది.
2. చెంగల్వ కోష్టు --- 100 gr
పిప్పళ్ళు --- 50 gr ( నిమ్మ రసంతో శుద్ధి చేయాలి)
శొంటి --- 50 gr ( దోరగా వేయించాలి)
గలిజేరు వేర్లు --- 50 gr
వస --- 25 gr
కరక్కాయల పెచ్చులు --- 25 gr
నేతిలో వేయించిన ఇంగువ --- 25 gr
సౌవర్చ లవణం --- 50 gr ( బియ్యపు గంజిలో నానబెట్టి ఎండబెట్టాలి).
యవాక్షారం --- 50 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి సీసాలో హ్హద్రపరచుకోవాలి.
ఒక గ్లాసు బార్లీ నీటిలో ఒక స్పూను పొడిని కలుపుకుని తాగితే గుండె బలహీనత నివారింప బడుతుంది.
గుండె చప్పుడులో వ్యత్యాసం లేదా క్రమం తప్పడం 30-3-11.
ఆహారంలో తేడాలు వుండడం వలన, ఒత్తిడి వలన, సమస్యల వలన జరుగుతుంది.
చెమట పట్టడం, నీరసం, పని చెయ్యలేకపోవడం, ఉద్రేకం వంటి లక్షణాలు వుంటాయి.
తెల్ల మద్ది చెక్క పొడి --- 100 gr
మోదుగ విత్తనాల పొడి --- 50 gr
మోదుగ పువ్వుల పొడి --- 50 gr
వాయు విడంగాల చూర్ణం --- 50 gr ( గోమూత్రంలో నానబెట్టి ఎండబెట్టి దంచాలి )
బోడసరం పూల చూర్ణం --- 50 gr
పుష్కరమూలం చూర్ణం --- 50 gr
సైంధవ లవణం --- 50 gr
పాత బెల్లం ---- తగినంత
అన్ని చూర్ణాలకు తగినంతః బెల్లం కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు కట్టాలి.
ప్రతి రోజు మూడు పూటలా పూటకు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి.
ఎంత కాలమైనా వాడవచ్చు.
గుండె జబ్బుల నివారణకు 5-4-11.
తెల్ల మద్ది చెక్క చూర్ణాన్ని నిల్వ చేసుకోవాలి.
అర గ్లాసు ఆవు పాలలో గాని లేదా దేశవాళీ గేదె పాలలో గాని అర టీ స్పూను పొడిని వేసి
కలకండ కలుపుకుని తాగాలి.
ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తాగాలి.
గుండె జబ్బుల నివారణకు --- శోధగ్న చూర్ణం 3-6-11.
కారణాలు, లక్షణాలు :-- కాళ్ళు , ముఖము , శరీరం లో నీరు చేరడం
ఆయాసం , పాదాలలో, శరీరం లో వాపు, మెట్లెక్కితే ఆయాసం, నడిస్తే ఆయాసం , బలహీనత ,
నిస్త్రాణ, నీరసం, కూర్చొని లేస్తే కళ్ళు తిరగడం రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు వుంటాయి .
అధిక రక్తపోటు వలన హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కుటుంబ
వారసత్వం, మధుమేహం, డెలివరీస్, ఉప్పును అధికంగా వాడడం మొదలైన కారణాల వలన
వచ్చే అవకాశాలు ఎక్కువ .
కటుకరోహిణి చూర్ణం ----20 gr
నేలవేము చూర్ణం ----20 gr
శొంటి చూర్ణం ----20 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
ఒక గ్రాము ( చిటికెడు ) చూర్ణాన్ని అర కప్పు పాలలో గాని, నీటిలో గాని, లేదా దానికి రెట్టింపు
పంచదారతో గాని , లేదా తేనెతో గాని తీసుకోవాలి . ఇది చాలా చేదుగా వుంటుంది .
సూచనలు :-- ఒత్తిడి , ఆందోళన తగ్గించుకోవాలి . సిగరెట్లు , మద్యం మానెయ్యాలి . మద్యం లివర్
ను దెబ్బ తీస్తుంది . రోజుకు రెండు గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలి . యోగా చేయాలి .
పాదాల్లో వాపును తగ్గించడానికి యాంటి బయాటిక్స్ వాడకూడదు . దీనితో పాటు పొటాషియం
కూడా పోతుంది . దీని వలన పిక్కలు పట్టేయ్యడం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడతాయి
అరటిపండు, సోయాబీన్స్, గోధుమలు వాడాలి .
గుండె సమస్యలు --- నివారణ 3-8-11.
ముదురు , లేత కానటువంటి రావి ఆకును తీసుకొని రాత్రి వేళ ఒక గ్లాసు నీటిలో వేయాలి . ఉదయం లేచిన తరువాత
ఆ నీటిని మూడు భాగాలుగా చేసి మూడు పూటలా ఆహారం తరువాత మాత్రమె సేవించాలి . పరగడుపున ఎంతమాత్రం
సేవించకూడదు . ఈ విధంగా రోజు వాడుతూ వుంటే గుండె సమస్యలు నివారించబడతాయి .
గుండెపోటు --- నివారణ 3-8-11.
కారణాలు :-- అధిక రక్తపోటు , ఒత్తిడి , మధుమేహం , పొగతాగడం , రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా వుండడం , మెనోపాజ్
టైం మొదలైనవి .
లక్షణాలు :-- ఛాతీలో నొప్పి , అసౌకర్యం , నడకలో మార్పు , దవదలోకి నొప్పి వ్యాపించడం , కళ్ళు తిరగడం మొదలైనవి .
వెల్లుల్లి గర్భాలు --- 3
పచ్చి పాలు --- ఒక కప్పు
పచ్చి పాలల్లో వెల్లుల్లిని ఒక గంట సేపు నానబెట్టాలి . తరువాత వాటిని తీసి తిని , ఆ పాలు తాగాలి .
ఈ విధంగా చేస్తూ వుంటే గుండెపోటు రాకుండా కాపాడ బడుతుంది గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా దీనిని వాడవచ్చు .
గ్యాస్ వలన ఎసిడిటి వలన వచ్చే గుండెపోటు
ఇంగువ పొడి --- 20 gr
జీలకర్ర పొడి --- 20 gr
వాము పొడి --- 20 gr
సైంధవ లవణం --- 5 gr
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో వేసి భద్రపరచుకోవాలి .
అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే కడుపులో గ్యాస్ తగ్గి , ఉదరవితానం ఫ్రీ అవుతుంది . దీనివలన
గ్యాస్ ఒత్తిడి తగ్గి నొప్పి నివారించబడుతుంది .
సూచన :-- ఆహారాన్ని ఎక్కువగా భుజించకూడదు . అర్ధశాక్తిగా వ్యాయామం చేయాలి