లైంగిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లైంగిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ప్రసవానంతర సమస్యలు

          ప్రసవానంతర సమస్యలు -- బాలెంత జ్వరము                                       23-6-10.
      ప్రసవించిన తరువాత వారంలోపల జ్వరం రావడం  ఇది శ్వాస సంబంధ, మూత్ర సంబంధ, గర్భ సంబంధ,ఫిజియో తెరపి సంబంధ  మైనది కావచ్చు.
త్రిపల చూర్ణము
అతి మధురం చూర్ణము
తిప్పతీగ చూర్ణము
వస చూర్ణము
   అన్ని చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేఉకోవాలి.  ఒక టీ స్పూను పొడిని నీటిలో వేసి కషాయం కాచి వడకట్టి  గోరువెచ్చగా అయిన తరువాత దానిలో తేనె గాని చక్కెర గాని కలుపుకొని తాగాలి.
ఈ విధంగా మూడు పూటలా తాగితే బాలెంత జ్వరం త్వరగా తగ్గుతుంది.
     పై కషాయంలో పసుపు, బెల్లం కూడా కలుపుకొని తాగ వచ్చు.

                   ప్రసవానంతరం ఏర్పడే మానసిక రుగ్మతలు -- నివారణ                         1-9-10
.
     ఆత్మ న్యూనత, చికాకు, కోపం, పిల్లలేడుస్తున్నా పట్టించుకోక పోవడం  మొదలైన లక్షణాలు వుంటాయి.

      ఒకటిన్నర టీ స్పూను జటామాంసి వేర్ల చూర్ణాన్ని గ్లాసు నీళ్ళలో వేసి కాచి అరగ్లాసుకు రానివ్వాలి.  దించివడకట్టి కలకండ కలుపుకొని తాగాలి.

క్షీరబల తైలం
బ్రాహ్మి తైలం

      ఏదో ఒక తైలాన్ని వేడి చేసి దానిలో గుడ్డను ముంచి తలపై పట్టు వేస్తూ వుండాలి. ఆరితే మరలా మరలా  వేస్తూ వుండాలి.  ఈ విధంగా చెయ్యడం వలన డిప్రెషన్ తగ్గి పోతుంది.

                                 ప్రసవం తరువాత  వచ్చే ఒళ్ళు నొప్పులు                   16-12-10.

                                                      సూతికా వాతం

       ఇంగువను నేతిలో వేయించి పొడి చేసి నిల్వ చేసి చిటికెడు పొడిని అన్నంలో వేసుకుని తింటూ ఉండాలి.

                 ప్రసవానంతరం పొట్టను తగ్గించే ఆయుర్వేద సూతికా కల్పం        30-5-11.

                ప్రసవానికి సంబంధించిన ఆందోళన లో ఎక్కువగా తినడం వలన కొవ్వు చేరి పొట్ట లావెక్కుతుంది  ప్రసవం తరువాత లావెక్కిన శరీరాన్ని తగ్గించడానికి తినకపోవడం వంటి కారణాల వలన శరీరాకృతి లో మార్పులు వస్తాయి .

గోధుమ పిండి            --- 20 gr
నెయ్యి                     --- తగినంత
శొంటి పొడి                --- ఒక గ్రాము
మోదుగ బంక            --- ఒక గ్రాము
తుమ్మ బంక             --- రెండు గ్రాములు
డ్రై  ఫ్రూట్స్             --- చారెడు  ( అన్ని రకాలు)
పంచదార                 --- తగినంత

      ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి రెండు టీ స్పూన్ల నేతిని వేసి వేడి చెయాలి. దానిలో గోధుమ పిండిని
వేసి వేయించాలి . తరువాత గిన్నెను దించి దానికి శొంటి పొడిని కలపాలి . తరువాత మోదుగ బంక
మరియు తుమ్మ బంకలను కలపాలి .  తరువాత దీనిలో పంచదార ,  డ్రై ఫ్రూట్స్ కలపాలి

     రెండు టీ స్పూన్ల పొడిని పాలలో కలుపుకొని తాగాలి . 

సూచనలు :-- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి , సాత్వికాహారం భుజించాలి

శొంటి        ---- వాతాన్ని తగ్గిస్తుంది ,  శరీరాన్ని నాజూకుగా తయారు చేస్తుంది .
మోదుగ బంక  ---- ప్రసవం తరువాత గర్భాశయం లో మిగిలిన రక్తాన్ని తొలగిస్తుంది . పొట్ట యొక్క
                             కండరాలు గట్టి పడేట్లు   చేస్తుంది .
తుమ్మ బంక   ---- పొట్ట యొక్క కండరాలు బిగుసుకునేట్లు  చేస్తుంది .

                                       గర్భధారణ సమయం లో వచ్చే స్ట్రెచ్ మార్క్స్                 7-9-11

      ఈ చారలు  పొట్ట మీద , తొడల మీద , స్థనాల మీద ఏర్పడి జీవితాంతం అలాగే వుంటాయి ,

కలబంద గుజ్జు                  --- అర టీ స్పూను
బొప్పాయి లోపలి గుజ్జు      --- అర టీ స్పూను
రోజ్ వాటర్                     --- ఒక టీ స్పూను      
మంచి గంధం పేస్టు            --- ఒక టీ స్పూను
బాదం నూనె                    --- 10 చుక్కలు
లావెండర్ నూనె                ---  2 చుక్కలు
పాల మీగడ                      --- రెండు టీ స్పూన్లు

      అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తరువాత పాల మీగడ కొంచం , కొంచంగా కలుపుతూ బాగా కలియ
తిప్పాలి . స్నానానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని చారల మీద పూయాలి . తరువాత సున్నితంగా మర్దన చేయాలి .
తరువాత స్నానం చేయాలి .

     ఈ విధంగా వారానికి రెండు ,  సార్లు చొప్పున రెండు , మూడు నెలలు వాడితే చారలు తగ్గుతాయి .
      ప్రసవం అయిన తరువాత నువ్వుల నూనెతో శరీరాన్ని రుద్దుతూ వుంటే అలాంటి మచ్చలు ఏర్పడవు

    

      

     









      

సుఖ రోగాలు

                   సుఖ రోగాలు (సవాయి రోగాలు) --- నివారణ                                    6-3-10.
 
       ఈ రోగాలు చెడు వ్యసనాల వలననే కాక ఆ రోగులు మూత్ర విసర్జన చేసిన చోట ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన  చేయడం వలన, వారి దుస్తులను ధరించడం వలన కూడా వస్తాయి.
 
       వీటిలో తెల్ల సెగ, పచ్చ సెగ, అడ్డగర్రలు (గజ్జల్లో గడ్డలు ) మొదలైన రకాలుంటాయి.
మూలబంధనం:-- పద్మాసనం   వేసుకొని ఆసనాన్ని గట్టిగా బంధించాలి.
 
ఉడ్యానబంధనం, ఉదరచాలనం , కపాలభాతి ప్రాణాయామం  చెయ్యాలి.
 
        ఈ వ్యాధి వున్న వాళ్లకు జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం లేక, తెల్లని ద్రవం,లేక  ఎర్రని ద్రవం కారుతూ వుంటుంది.
 
                                            అడ్డగర్రలు ---నివారణ
 
        గజ్జల్లో పెద్ద పెద్ద గడ్డలు వాచి ఉండడాన్ని అడ్డగర్రలు అంటారు.
 
తులసి ఆకుల చూర్ణము
నల్ల ఉమ్మెత్త ఆకుల చూర్ణము
గాడిదగడపాకు చూర్ణము
 
        అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
 
        అవసరమైనంత పొడిని నీటితో కలిపి మెత్తగా నూరి గడ్డలపై పట్టు వేస్తే కరిగి పోతాయి.
 
                                  సెగ రోగము (గనేరియా) ---నివారణ
 
లక్షణాలు:--  మూత్రవిసర్జనలో మంట, శరీరమంతా విపరీతమైన మంటలుగా వుండడం, జననాంగము నుండి   పసుపు పచ్చని ద్రవం కారడం, మగవాళ్ళకు జననాంగము చివర ద్రవము అతుక్కొని మూత్ర విసర్జన సమయంలో చాలా బాధగా వుంటుంది.
 
లక్ష్మితులసి సమూలం ఎండబెట్టి దంచిన పొడి      ---  మూడు వేళ్ళకు వచ్చినంత
                                               కలకండ            ----తగినంత
 
     రెండింటిని కలిపి నాలుకతో అద్దుకొని చప్పరించాలి.

                           ముదిరిన పచ్చ సెగరోగము--నివారణ

తులసి గింజల పొడి
సబ్జా గింజల పొడి
మంచి గంధం
మిరియాల పొడి
రేవల చిన్ని పొడి
ఉసిరిక పొడి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .

     అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. దీనితో ఎంతో కాలంగా వున్న రోగామైనా నివారింప  బడుతుంది.

                                                        ఎర్రని, తెల్లని సెగరోగం -- నివారణ

తులసి ఆకులు                            -----  50 gr
పమిడి (పైడి) పత్తి ఆకులు             -----  50 gr
బియ్యం కడిగిన నీళ్ళు                  -----  50 gr
మేడి చెట్టు ఆకులు                      -----  50 gr
పిప్పళ్ళు                                   -----  50 gr
మిరియాలు                                ----- 50 gr
లవంగాలు                                  ----- 50 gr
జాజికాయ                                  ----- 50 gr
జాపత్రి                                       ----- 50 gr

         అన్నింటిని రోట్లో వేసి దంచి ముద్దగా అయ్యేంత వరకు నూరాలి.  రేగిపండు గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి , బాగా ఎండిన తరువాత సీసాలో భద్రపరచాలి.

         ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.

పద్యం చాలా ముఖ్యం:--   కందిపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. పప్పులో ఉప్పు వేసుకోకూడదు.

15 రోజుల తరువాత వేయించిన ఉప్పు వేసుకోవచ్చు.

                     గనేరియా తీవ్రత నివారణకు చిట్కా                             19-11-10.

         పటికను పెనం మీద పొంగించి  పొడి చెయ్యాలి.  ఈ పొడిని ముల్లంగి ముక్కల మీద చల్లి  పది రోజులు తింటే   వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

                                గనేరియా --నివారణ                                       12-1-11.

  ఇది ఎక్కువగా పురుషులలో వస్తుంది. పురుష మర్మాంగానికి వస్తుంది. ఇది  అంటువ్యాధి   ఇది బ్యాక్టీరియా  ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక,  మరియు  ఇతర లోపాల వలన వ్యాపిస్తుంది.
 మంటలు,  దురదలతో ప్రారంభమై   ఐదారు  వారాల తరువాత బయట పడుతుంది.  చివరి భాగం పెద్దదయి,  వాఛి  బుడ్డ లాగా  తయారై మంట  గా  వుంటుందికూడా ,  నడవలేక పోతారు.  ఈ సమస్య తీవ్రమైతే  కీళ్ళ నొప్పులు వస్తాయి,  మోకాళ్ళలో చీము పట్టి పుండ్లు  రావడం జరుగుతుంది.

ఉసిరిక పొడి                --- 100 gr
కరక్కాయ పొడి           --- 100 gr
తాని కాయ పొడి          --- 100 gr
 
       కలిపి నిల్వ చేసుకోవాలి.
 
       రెండు టీ స్పూన్ల పొడిని రెండు కప్పుల నీటిలో వేసి కాచి ఆ కషాయం తో  మర్మాంగాన్ని రోజుకు రెండు సార్లు  కడగాలి.

త్రిఫల చూర్ణం                --- 100 gr
తుంగ ముస్తల చూర్ణం   ---    50 gr
నీళ్ళు                          ---  రెండు గ్లాసులు
 
        రెండు చూర్నాలను కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        రెండు టీ స్పూన్ల పొడిని  రెండు గ్లాసుల నీటిలో వేసి కషాయం కాచాలి.  బొటన వేలంత సైజులో వున్నా తిప్ప  తీగ ముక్కను నీటిలో వేసి కాచాలి. దించి బాగా పిసకాలి. ఆ విధంగా చేయడం వలన నీళ్ళ అడుగున తిప్పసత్తు  మిగులుతుంది.  నీటిని వంచేసి మిగిలిన తిప్ప సత్తును   అంతకు ముందు కాచిన త్రిఫల,  తుంగ గడ్డ ల కషాయానికి   కలిపి  తీసుకోవాలి.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- అంగ శుద్ధి,  వస్త్ర శుద్ధి,  స్నానం,  ఆహారం  విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. గిట్టని పదార్ధాలు వాడకూడదు. పచ్చి మిరిచి,  వంకాయ, గోంగూర, శనగ పిండి, మైదా వాడకూడదు.






                                                    





















 

వృషణాలు

                      వరిబీజము  --అండ వృద్ధి --వృషణాల వాపు                    21-12-08.
 
             ఒక వైపు కిందికి జారిపోయి దానిలో చెడు నీరు, గాలి చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది .
 
                                     కరక్కాయ పొడి        -------------- 10 gr
                                     నేలవేము పొడి         -------------- 10 gr
                                     ధనియాల పొడి        -------------  10 gr
                              దో. వే. లవంగాల పొడి       -------------  15 gr
                                  సునాముఖి ఆకు పొడి   ------------   40 gr
                                          కలకండ    పొడి   ------------  120 gr
                                                 తేనె          ------------- తగినంత
 
         కల్వంలో కలకండ పొడి వేసి దానిలో మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి తేనె పోస్తూ  ముద్దగా నూరాలి.దీనిని తీసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
       ప్రతి రోజు ఆహారానికి ముందు 5 గ్రాముల మందును చప్పరించి నీళ్ళు తాగాలి. ఎక్కువ తీసుకుంటే   విరేచనాలు అవుతాయి.అందువలన 1,2  గ్రాముల నుండి ప్రారంభించి 5 గ్రాములకు పెంచాలి. 40 రోజులు  వాడాలి. దీనితో మంచి నీళ్ళ కంటే మజ్జిగ మేలు.
 
      ఈ మందు వాడుతుంటే మొదట మలబద్ధకం నివారింపబడుతుంది.తరువాత వృషణాల లోని నీరు తొలగింప  బడుతుంది.
 
                                   వృషణాలు పెద్దవైతే ---నివారణ                    12-7-10.
 
వావిలాకు              
గచ్చకాయ ఆకు
అవిశాకు
 
     అన్నింటిని నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి వేయించి ఒక బట్టలో వేసి పైకి లాగి కట్టాలి.
 

       వరిబీజం సమస్య తీవ్రత తగ్గడానికి    --- చిట్కా                         18-12-10.

     మునగ చెట్టు బంకను సేకరించి నానబెట్టి వరిబీజం పెరిగిన చోట లేపనం చేసి ఎండిన తరువాత కడుగుతూ వుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.




         

వరిబీజము

                                 వరిబీజము --- నివారణ                                             25-7-09.
 
కరక్కాయల పొడి        --          60 gr
పిప్పళ్ల పొడి               -----     30 gr
సైంధవ లవణం            ----      15 gr
నీళ్ళు                       ----       తగినన్ని
వంటాముదం             ----       100 gr
 
     అన్నింటిని కల్వంలో వేసి తగినన్ని నీళ్ళు కలిపి గుజ్జుగా నూరాలి. దీనిని గిన్నెలోకి తీసుకొని నీళ్ళు కలిపి  పలుచగా చేయాలి

 . దీనికి వంటాముదకలిపి  స్టవ్  మీద పెట్టి ఆముదం మాత్రమే మిగిలే వరకు కాచాలి. వడపోసి  
నిల్వ చేసుకోవాలి.
 
     ఆహారానికి ఒక గంట ముందు ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూను కడుపులోకి సేవిస్తే 40 రోజులలో నివారింప బడుతుంది.
 
     దీనిని వాడేటప్పుడు వాతం చేసే పదార్ధాలు వాడకూడదు. తగ్గే వరకు దుమక కూడదు, ఎగరకూడదు.
 
సేఫ్టీ డ్రాయర్లు వేసుకోవాలి.

మీసాలు ,గడ్డాలు పెరగడానికి

                              యువకులలో మీసాలు, గడ్డాలు పెరగడానికి                        29-5-09.
 
               యువకులలో  హార్మోన్స్ సరిగా పని చేయనపుడు ఈ విధంగా జరుగుతుంది.  శిరస్సులో రక్తప్రసరణ  బాగా జరిగితే ఈ సమస్య నివారింప బడుతుంది.
 
1.సర్వాంగాసనం :-- వెల్లకిలా పడుకొని వీపు మాత్రమే నేల మీద ఆనేట్లుగా వుండాలి. నడుము నుండి కాళ్ళ వరకు  పైకేత్తాలి.
 
2.మత్స్యాసనం-- వెల్లకిలా పడుకొని పద్మాసనం వేసుకోవాలి.
 
3. శుక్ర వజ్రాసనం-- వెల్లకిలా పడుకొని పద్మాసనం వేసుకొని తలను వెనుకకు నేలకుఆనించాలి, మెడ నేలకు  తగలకూడదు.
 
4. చక్రాసనం:-- వెల్లకిలా పడుకొని చేతులను, పాదాలను మాత్రమే నేలకు ఆన్నించాలి, శరీరం మొత్తాన్ని పైకి బాణం లాగా ఎత్తాలి.
 
కారణాలు:--  నిద్ర లేచిన వెంటనే సుఖవిరేచనం జరగకపోవడం, శరీరంలో సరిగా రక్త ప్రసరణ జరగక పోవడం శరీరంలో తగినంత రక్తం లేకపోవడం, ప్లీహము, పారా థైరాయిడ్ గ్రంధి వంటివి సరిగా పని చెయ్యకపోవడం  మొదలైనవి.
 
                                  కిస్మిస్ పండ్లు                ---- 32
                                  అంజూర పండ్లు              ----   2
                                  ఎండుఖర్జూరం              ----   1
 
    అన్నింటిని రాత్రి పూట అరగ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే పళ్ళు తోముకొని ఒక్కొక్క పండు తిని ఆ నీళ్ళు  తాగాలి.
                      
                                  టొమాటోలు                 ----- 2
                                  కారెట్                          ----- 1
                                  బీట్ రూట్                    ----- చిన్న ముక్క
 
   సాయంత్రం వేళ అన్నింటిని కలిపి జూస్ చేసుకొని దానిలో తేనె చక్కెర కలుపుకొని తాగడం గాని లేదా ముక్కలు చేసుకొని వాటి మీద తేనె చక్కెర కలిపి తినడం గాని చెయ్యాలి.

రోమాలు

                                  అవాంచిత రోమాలు-- నివారణ                                    28-5-09.

            హార్మోన్లలో తేడా వలన వస్తాయి.

1. అర్ధ మత్స్యాసనం;--  పద్మాసనం వేసుకొని కుడికాలును ఎడమ మోకాలు పై పెట్టుకొని చేతితో కాలును పట్టుకొని  వెనక్కి వంగాలి. అలాగే రెండవ వైపు చెయ్యాలి.

2. యోగాముద్రాసనం:-- ఈ ఆసనం వేయడం వలన ఎంత కాలం నుండి ఋతుక్రమం  ఆగిపోయివున్నా తిరిగి   ప్రారంభం అవుతుంది.

3.విపరీత కరణి :-- వెల్లకిలా పడుకొని నడుము వరకు కాళ్ళను పూర్తిగా పైకెత్తి చేతులను పిరుదుల దగ్గర పట్టుకోవాలి.

4. మత్స్తాసనం:-- వెల్లకిలా పడుకొని తలను వెనుకకు వంచి చేతులను పొట్టపై పెట్టుకోవాలి.
5గరుడాసనం :-- నిటారుగా నిలబడి కుడికాలు చుట్టూ ఎడమ కాలును బిగించి చేతులు పైకెత్తి మెలిక లాగా  వేసుకోవాలి. అదే విధంగా రెండవవైపు చేయాలి. ఈ విధంగా చేస్తే అవాంచిత రోమాలు వాటంతట అవే తగ్గి పోతాయి. 

        శమీ వృక్షానికి రోమ హస్త్రి అని పేరు అనగా రోమాలను పోగొట్టునది అని అర్ధము.

        దీని బెరడు తెచ్చి చాది గంధం తీసి వెంట్రుకలపై పట్టు వెయ్యాలి. వెంట్రుకలు పీకి రంధ్రాల పై పట్టు వేస్తే  ఇంకా మంచిది.  కాని మంట పుట్టవచ్చు కొబ్బరినూనె పూస్తే మంట తగ్గుతుంది.

       జమ్మి ఆకుల రసం గాని, లేదా వ్రేళ్ళ యొక్క గంధంగాని పూయవచ్చు.

                          అవాంచిత రోమాలు --నివారణ                            28-12-10.
 
       మహిళలలో బహిష్టు తరువాత ఒక సిస్ట్ ఏర్పడుతుంది.  కాని ఒక్కొక్క సారి ఇవి ఎక్కువగా విడుదల అవుతాయి  ఈ కారణం వలన, మరియు హార్మోన్ల లో తేడాల వలన,  వంశ పారంపర్యం కారణంగా ఈ సమస్య   ఏర్పడవచ్చు.
 
1.  బీర గింజల నుండి తీసిన నూనెను అవాంచిత   రోమాలపైన రాస్తే పెరగవు.
 
2.  జమ్మి ఆకులు
     జమ్మి కాయలు
     జమ్మి పట్ట
 
              అన్నింటిని కలిపి  ముద్దగా నూరి పూయవచ్చు. లేదా అన్నింటిని ఎండబెట్టి కాల్చి బూడిదను పూస్తే తగ్గుతాయి.
 
3.  ఉమ్మెత్త గింజలను ( విష పదార్ధము)  నూరి పూస్తూ వుంటే తగ్గుతాయి.
 
4.  గన్నేరు వేరు, నేపాళపు వేరు, తెగడ వేరు, చేదు బీరపండ్లు, కలిపి ముద్దగా నూరి నీటిలో ఉడికించి వడకట్టి ఆ కషాయాన్ని నువ్వుల నూనెలో కలిపి నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి.

     ఈ తైలాన్ని అవాంచిత రోమాలపై రాస్తూ వుంటే  పెరగవు.

     ఆకులను,  కాయలను,  పట్టను  కలిపి నూరి కూడా పూయవచ్చు . లేదా అన్నింటిని కలిపి ఎండబెట్టి  కాల్చి,  బూడిద చేసి కూడా పూయవచ్చు .
                                                          14-7-11

 1 యవాక్షారం యొక్క పొడిని వెంట్రుకలపై పూస్తూ వుంటే కొంత కాలానికి రాలిపోతాయి .
 2 ఉత్తరేణి మొక్కను సమూలంగా తెచ్చి రేకు మీద పెట్టి కాల్చి బూడిద ( ఉత్తరేణి క్షారం )  చేయవలెను .  దీనికి నీటిని కలిపి
పోయాలి .
 3. కుసుమ నూనెను పూస్తూ వుంటే కొంత కాలానికి రాలిపోతాయి .

                                                          

 
 

సంతానం



                                              ఉత్తమ సంతానం కొరకు


      బహిష్టు ఆగిన 4 రోజు నుండి సరి రోజుల్లో కలిస్తే మగపిల్లలు,బేసి రోజుల్లో కలిస్తే ఆడ పిల్లలు పుడతారు.

     4 రోజు కంటే 14 రోజుకడుపున పడే బిడ్డలు, 5 రోజు కంటే 15 వరోజు బిడ్డలు గొప్ప వారవుతారు. ఇది   వాస్తవం.

    గర్భిణి స్త్రీ కి రక్తపోటు తగ్గాలంటే రోజుకు రెండు ,మూడు సార్లు పుదీనా ఆకును నలగగొట్టి వాసన చూపిస్తే  నియంత్రణ లో ఉంటుంది.ఆందోళన ,భయం,ఉండరాదు.ప్రశాంతంగా ఉండాలి.పుదీనా ఆకును నలగ గొట్టి ఇస్తే   గర్భ స్రావాన్ని కూడా ఆపుతుంది.

                                                 గర్భ ధారణ

    భార్యాభర్తలు అమావాస్య నాడు కలవడం వలన గర్భం ధరిస్తే శక్తి వంతమైన ఆడపిల్లలు, పౌర్ణమి
రోజున గర్భం ధరిస్తే తేజోవంతమైన మగపిల్లలు పుడతారు.

వీరభాద్రాసనం, వీరంజనేయాసనం వేయాలి.

సన్నగా, బలహీనంగా వుండి సంతాన హీనులైన స్త్రీ,పురుషులకు కానుక

నాటు ఆవు లేదా గేదె పాలు   ------ 20 gr
                              నెయ్యి ------ 10 gr
                                తేనె ------- 20 gr
                     పటిక బెల్లం  ------- 20 gr

 పాలు ముందుగా కాచి, చల్లార్చి,మిగిలిన పదార్ధాలు కలిపి తాగాలి. ప్రతి పదార్ధాన్ని గ్రాముల లెక్కన పెంచుకుంటూ వాడుకోవాలి. 7 గంటలకు భోజనము చేసి 10 గంటలకు నిద్రపోవాలి. పాలు రాత్రి నిద్రించే  ముందు తాగాలి.

                                         సంతానవతులగుటకు                                 22-2-09.

దోరగా వేయించిన శొంటి పొడి    ----- 100 gr
"              "      పిప్పళ్ళ పొడి ----- 100 gr
"               " మిరియాల పొడి  ----- 100 gr
                   నాగకేసరాల పొడి  -----100 gr

అన్ని పొడులను కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

పల్లేరు కాయల పొడి ---100 gr

పల్లేరు కాయల పొడిని వేరే సీసాలో భద్రపరచుకోవాలి.

       బహిష్టు వచ్చిన రోజు నుండి నాలుగు రోజుల వరకు పరగడుపున నాలుగు పొడులు కలిసిన పొడిని వాడాలి నాలుగు రోజులు అన్నము, ఆవు పాలు, కలకండ కలుపుకొని మాత్రమే తినాలి.
నాల్గవ రోజు రాత్రి నుండి పల్లేరు కాయల పొడిని ఆహారానికి అర గంట ముందు గాని తరువాత గాని అర టీ  స్పూను పొడిని అర టీ స్పూను నెయ్యి కలిపి తినాలి. 4,5,6,7,8,9 రోజు వరకు వాడాలి.
10 రోజు నుండి 16 రోజు వరకు భర్త తో సంసారం చేయాలి. విధంగా చేస్తే 6 నెలలలోపు సంతానం   కలగడానికి అవకాశం కలదు.

                                 సంతానం కొరకు ఔషధం                                 15-3-09.

కారణాలు:-- రజస్వల నియమాలు పాటించక పోవడం, ఋతు క్రమం సరిగా లేక పోయినా పట్టించుకోక పోవడం.

స్త్రీలలో అండం సరిగా విడుదల కానపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:--

పెద్ద పల్లేరు కాయలను తెచ్చి ఎండబెట్టి దంచి వస్త్రగాయం పట్టి గాజు సీసాలో భద్రపరచాలి.
వావిలాకు కడిగి నీళ్ళు కలపకుండా దంచి రసం తీయాలి.

పల్లేరు కాయల పొడి ---5 gr
వావిలాకు రసం    --- 30 gr

పల్లేరు కాయల పొడిని తగినంత వావిలాకు రసం లో కలిపి కల్వంలో వేసి నూరి కుంకుడు గింజలంత మాత్రలను తయారు చేయాలి గాలిలో ఆరబెట్టాలి  ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు రెండేసి  మాత్రల ను సేవించాలి
  ముఖ్యంగా బహిష్టు కాలంలో తీసుకుంటే గర్భాశయం లోని లోపాలు తొలగి పోతాయి. నాల్గవ రోజు నుండి పదవరోజు వరకు సంసారం చెయ్యాలి.

బహిష్టు నాలుగు రోజులు తప్పకుండా ఉదయం, సాయంత్రం తప్పకుండా తాగాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- గుడ్డను గట్టిగా కట్టడం, త్వరగా నడవడం చెయ్యకూడదు వీటి వలన గర్భాశయంలో వాయువు చేరుతుంది. బహిష్టు రోజులలో అధికంగా రక్త స్రావం అయ్యే వాళ్ళు నాల్గవ రోజు నుండి పదవరోజు వరకు వాడి పదవ రోజు నుండి సంసారం లో పాల్గొనాలి.

            మేనరికాల వలన కలిగే సంతానలోపాలను పోగొట్టే వ్యాయామం                15-5-09.

హోమం చెయ్యడానికి తగిన మట్టి తొట్టి తెచ్చుకొని దానిలో ఆవు పిడకలను కర్పూరం వేసి వెలిగించి
దానిని కాల్చి దానిపై ఆవు నెయ్యి వేస్తూ హోమం చెయ్యాలి.

   మారేడు, నేరేడు, రావి, జువ్వి, మర్రి, మేడి, వేప,తులసి, గరిక మొదలైన ఎండు మొక్కల యొక్క ముక్కలను హోమం లో వెయ్యాలి. తలుపులను బంధించి దూపాన్ని బయటకు పోనివ్వకుండా చెయ్యాలి.

శారీరక, మానసిక లోపం కలిగిన పిల్లలను ఇంటిలో కూర్చోబెట్టి గాలిని పీల్చే విధంగా చెయ్యాలి. దీని వలన రక్త సరఫరాలోచాలా మంచి మార్పులు వస్తాయి. జన్యు లోపాలు సవరించ బడతాయి.

సిద్ధ నాగార్జున ఆయుర్వేద పీఠం వారు దీని పై ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.

మర్రి :-- మరణం లేని చెట్టు .

   మర్రి, రావి, జువ్వి, మేడి పండ్లను సమాన భాగాలుగా తెచ్చి ఎండబెట్టి విడివిడిగా దంచి పొడి చేసి కలిపి   నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను పొడిని, ఒక్కొక్క టీ స్పూను కలకండ పొడిని కలిపి   తినిపించి ఆవు పాలు తాగించాలి. దీని వలన వికలాంగ మైన అవయవాలు పునరుజ్జీవిత మవుతాయి.

మేనరికాల వాళ్ళు గర్భం ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

   రావి చెట్టు యొక్క కాండము పై బెరడు తెచ్చి కడిగి చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి దంచి జల్లించి అతి    మెత్తని చూర్ణం తయారు చెయ్యాలి. అంతే సమాన బరువుతో కలకండ పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి.

దంపతులిద్దరు ఉదయం, సాయంత్రం అర టీ స్పూను నుండి ఒక స్పూను వరకు ఆవు పాలలో కలుపుకొని   తాగాలి. దీనిని వాడేటపుడు 100 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. దీని వలన వీర్యము, ఆస్తావము శుభ్ర పరచబడి ఆరోగ్య వంతమైన పిల్లలు పుడతారు.

గర్భం ధరించిన తరువాత కూడా దీనిని వాడితే సంతానం ఎటువంటి అవయవ లోపాలు లేకుండా కలుగుతుంది

                                                 సంతానం కలగడానికి                               10-4-10.

కలబంద రసం
శంఖ పుష్పి
చందనం
తానికాయల పొడి

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి.

   అన్నిపోడులను కలబంద గుజ్జులో వేసి బాగా కలపాలి. బహిష్టు అయిన నాలుగవ రోజు స్నానం చేసిన      వెంటనే దీనిని తాగాలి. ఆరోజు ఆవు పాలతో అన్నం తినాలి. రోజునుండి సంసారం చెయ్యాలి. విధంగా   చెయ్యడం వలన మంచి సంతానం కలుగుతుంది.


                                      సంతాన సాఫల్య చూర్ణము                                19-4-09.

శివలింగ గింజల పొడి ---50 gr (కడిగి ఆరబెట్టి దంచిన పొడి)
అశ్వగంధ దుంపల పొడి ---100 gr (ఆవు పాలతో శుద్ధి చేయాలి)
పటికబెల్లం ---150 gr ( జల్లించాలి )

అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి/

        ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున ఆహారానికి గంట ముందు తీసుకోవాలి.

    బహిష్టు అయిన  రోజు నుండి వాడాలి. 10, 12, 14, 16, 18 రోజులలో సంసారం చేస్తే అబ్బాయి,
11, 13, 15, 17  రోజులలో సంసారం   చేస్తే అమ్మాయి పుడతారు.


                  అందమైన పిల్లలు పుట్టడానికి --- చ్యవన ప్రాశము                     22-9-10.

     ఎండిన మంచి ఉసిరి ముక్కలను మట్టి పాత్రలో గాని, గాజు పాత్రలో గాని, పింగాణి పాత్రలో గాని వేసి అవి    మునిగే వరకు తేనె పోసి 40 రోజులు కదిలించకుండా ఉంచాలి.

ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు కొద్దిగా తినాలి. దీనిని గర్భిణి స్త్రీ సేవించడం వలన ఆమె  యొక్క ఆరోగ్యం బాగుండడమే కాక తరువాత అందమైన బిడ్డ పుడుతుంది.


                                         స్త్రీలలో సంతానలేమి-- చికిత్స                            7-7-10.

                       ( కారణం తెలియకుండా గర్భం రాకుండా వుంటే )

ధాతకి పుష్పం ( ఆరె పువ్వు ) పొడి
నల్ల కలువ పూల పొడి

             రెండింటిని సమానంగా తీసుకుని కలిపి సీసాలో భద్ర పరచాలి.
బహిష్టు అయిన 5 రోజు నుండి ఉదయం, రాత్రి భోజనానికి ముందు అర కప్పు పాలలో 5 గ్రాముల పొడిని  5 రోజులు తీసుకోవాలి.

విధంగా 2 3 నెలలు చేస్తే కారణం తెలియక గర్భం రాని  స్త్రీలకు తప్పకుండా గర్భం వస్తుంది. ఇది
ఎంతోమంది ద్వారా ప్రయోగం చెయ్యబడినది.

ఆహార నియమాలు:--

కారం, ఘాటైన మసాలాలు, వేపుళ్ళు, నిలువ పచ్చళ్ళు పూర్తిగా మానెయ్యాలి. తేలికగా, సులభంగా
జీర్ణమయ్యే పదార్ధాలు వాడాలి.

                                 వంద్యత్వము ( Infertibility) -- చికిత్స                28-8-10.

గర్భ సంచికి రెండు వైపులా వున్న ఫెలోపియన్ ట్యూబ్స్ లో అవరోధాలు ఏర్పడడం వలన లేదా మూసుకు  పోవడం వలన సంతాన లేమి అనే సమస్య ఏర్పడుతుంది. రెండు వైపులా మూసుకపోతే అండము శుక్రకణము తో కలవ లేదు. అండము ఒక నెల ఒకవైపు ట్యూబ్ నుండి మరొక నెల ఇంకొక వైపు ట్యూబ్ నుండి గర్భాశయాన్ని చేరుతుంది. శుక్ర కణము గర్భాశయ ముఖ ద్వారమునుంది గార్భాశయములోనికి చేరుతుంది

కొన్ని వ్యాధుల వలన కూడా ట్యూబ్ లు మూసుకు పోవడం జరుగుతుంది. కొన్ని సార్లు అబార్షన్ జరగడం వలన, ఇన్ఫెక్షన్ చేరి వాచడం వలన కూడా మూసుకు పోవడం జరుగుతుంది.

పంచ కోలా ఘ్రుతము :---

పిప్పలి
పిప్పలి మూలము (మోడి )
చిత్ర మూలము
శొంటి
చవ్యము
యవాక్షారము

            ఈ ఐదింటిని పంచ కోలాలు అంటారు.

     వీటి యొక్క చూర్ణాలను ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి . అన్ని చూర్ణాలను కలపాలి.దీనిని ఒక పాత్రలో వేసి దానిలో 1200 గ్రాముల ఆవు నెయ్యి, 5 లీటర్ల ఆవు పాలు కలపాలి. అన్నింటిని బాగా  కలిపి స్టవ్ మీద పెట్టి నెయ్యి మాత్రమే మిగిలేట్లు కాచాలి. దీనినే పంచ కోలా ఘ్రుతము అంటారు.

5 నుండి 10 గ్రాముల ఘ్రుతాన్ని వేడి పాలల్లో కలిపి ఆహారానికి ముందు మూడు పూటలా తాగితే 2, 3నెలలలో గర్భం నిలిచే అవకాశం చాలా ఎక్కువ.

                               ఆరోగ్య వంతమైన పిల్లలు పుట్టడానికి                         7-12-10.

ఆరోగ్య వంతమైన పిల్లలు పుట్టక పోవడానికి ముఖ్యమైన కారణం తల్లి దండ్రులు ఆరోగ్యంగా లేక పోవడం.పూర్వం వివాహానికి మూడు నుండి ఆరు నెలల ముందే శరీరాన్ని శుద్ధి చేసే వాళ్ళు అనగా శరీరంలోని
మలినాలను  తొలగించడం . దీనిలో విరేచనం, వమనం లేదా వాంతి అతి ముఖ్యమైనవి.

సూచనలు :-- కేవలం ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి. కారం, ఉప్పు, చేదు ఎక్కువగా ఉన్న పదార్ధాలు  తినకూడదు. తియ్యని, పుల్లని పదార్ధాలు వాడాలి. స్త్రీలు మినుములతో తయారైన పదార్ధాలు ఎక్కువగా  తీసుకోవాలి ( సున్నుండలు, ఇడ్లీలు )

మానసిక సమస్యలు వుండకూడదు. ఇంటిలో వేసే రంగుల వల కూడా మానసిక స్థితి సరిగా వుండదు. అందువలన ముఖ్యంగా ఇంటిలోపల తెల్ల సున్నాన్ని మాత్రమే వాడాలి.

అశ్వగంధ దుంపల చూర్ణం      --- 50 gr
శతావరి వేర్ల చూర్ణం              --- 50 gr
అతిమధురం చూర్ణం             --- 50 gr
శొంటి                                ---- 50 gr
ఉసిరిక చూర్ణం                    ---- 50 gr

         అన్నింటి చూర్నాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

అర టీ స్పూను చూర్ణాన్ని ఒక టీ స్పూను తేనె, అర టీ స్పూను నెయ్యి కలిపి లేహ్యం లాగా కలుపుకొని  ఉదయం, సాయంత్రం తీసుకోవాలి ఎప్పటి కప్పుడు తయారు చేసుకొని వాడాలి. గర్భవతి గా వున్నపుడు  తీసుకోవడం అవసరం


                                  సంతాన లేమి-- పరిష్కారమార్గాలు                                 25-1-11.

సీతా అశోక బెరడు పొడి              --- 100 gr ( ఇది స్త్రీల పాలిటి కల్పతరువు)
శతావరి వేర్ల ( దుంపల) పొడి       --- 100 gr
తిప్ప తీగ పొడి                          --- 50 gr
బోడసరం పూల పొడి                   --- 50 gr
తామర గింజల పప్పు పొడి          --- 50 gr
నల్ల నువ్వుల పొడి                    ---- 50 gr
అతిమధురం పొడి                      --- 50 gr
పాతబెల్లం                                --- తగినంత

   అన్ని పొడులను బాగా కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి బాగా మెత్తగా నూరి సీసాలో భద్రపరచుకోవాలి.

ప్రతి రోజు గోలి అంత సైజు ముద్దను ఆహారం తరువాత సేవిస్తూ వుంటే సంతానలేమికి
సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నివారింపబడతాయి.

                                                          14-9-11

నాగకేసరాల చూర్ణము               --- అర టీ స్పూను
ఆవు నెయ్యి                            --- తగినంత

     రెండింటిని కలిపి ఉదయం పరగడుపున సేవించాలి .

     పిళ్ళేరు కాయ ల చూర్ణాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి . సాయంత్రం అర టీ స్పూను పొడిని తేనెతో సేవించాలి .

     ఈ విధానాన్ని బహిష్టు అయిన 3 వ  రోజు నుండి ప్రారంభించాలి .

      గర్భం దాల్చిన తరువాత  5 వ నెల నుండి నేల  ఉసిరిక పొడిని వాడితే అందమైన పిల్లలు పుడతారు