వృషణాలు

                      వరిబీజము  --అండ వృద్ధి --వృషణాల వాపు                    21-12-08.
 
             ఒక వైపు కిందికి జారిపోయి దానిలో చెడు నీరు, గాలి చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది .
 
                                     కరక్కాయ పొడి        -------------- 10 gr
                                     నేలవేము పొడి         -------------- 10 gr
                                     ధనియాల పొడి        -------------  10 gr
                              దో. వే. లవంగాల పొడి       -------------  15 gr
                                  సునాముఖి ఆకు పొడి   ------------   40 gr
                                          కలకండ    పొడి   ------------  120 gr
                                                 తేనె          ------------- తగినంత
 
         కల్వంలో కలకండ పొడి వేసి దానిలో మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి తేనె పోస్తూ  ముద్దగా నూరాలి.దీనిని తీసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
       ప్రతి రోజు ఆహారానికి ముందు 5 గ్రాముల మందును చప్పరించి నీళ్ళు తాగాలి. ఎక్కువ తీసుకుంటే   విరేచనాలు అవుతాయి.అందువలన 1,2  గ్రాముల నుండి ప్రారంభించి 5 గ్రాములకు పెంచాలి. 40 రోజులు  వాడాలి. దీనితో మంచి నీళ్ళ కంటే మజ్జిగ మేలు.
 
      ఈ మందు వాడుతుంటే మొదట మలబద్ధకం నివారింపబడుతుంది.తరువాత వృషణాల లోని నీరు తొలగింప  బడుతుంది.
 
                                   వృషణాలు పెద్దవైతే ---నివారణ                    12-7-10.
 
వావిలాకు              
గచ్చకాయ ఆకు
అవిశాకు
 
     అన్నింటిని నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి వేయించి ఒక బట్టలో వేసి పైకి లాగి కట్టాలి.
 

       వరిబీజం సమస్య తీవ్రత తగ్గడానికి    --- చిట్కా                         18-12-10.

     మునగ చెట్టు బంకను సేకరించి నానబెట్టి వరిబీజం పెరిగిన చోట లేపనం చేసి ఎండిన తరువాత కడుగుతూ వుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.




         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి