సాధారణ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాధారణ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పండుగలు ---ప్రాధాన్యతలు

                                                           పండుగలు  --- ప్రాధాన్యతలు

                                                           వినాయక చవితి ---ప్రాధాన్యత                                1-9-11.

       వర్షాకాలం లో భూమిలో నుండి పైకి వచ్చిన సూక్ష్మ జీవులు మన కాళ్ళ ద్వారా మన ఇళ్ళలోకి ప్రవేశిస్తాయి . వాటిని నాశనం చేయడానికి చేసే పండుగే వినాయక చవితి .

         వివిధ రకాల మొక్కల ఆకులను , కాయలను , పూలను తెచ్చి పూజకు పెట్టడం వలన ఆ గాలి ఇంటిలో వ్యాపించి
సూక్ష్మ జీవులు నశిశ్తాయి.. ఈ విధంగా తొమ్మిది రోజులు చేయాలి

                         విఘ్నేశ్వర పూజలో ఉపయోగించే  21 రకాల పత్రాల  వలన కలిగే విశిష్ట ప్రాధాన్యత    2-9-11.
                                               ఇవి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి

  పత్రాలు                            నివారణ చర్యలు

1. మాచీపత్రం :---  దద్దుర్లు , తలనొప్పి , వాతనోప్పులు

2. గరిక ( దూర్భా యుగ్మ) :--- గాయాలు , చర్మ వ్యాద్ధులు , మూత్రంలో మంట , ముక్కులో రక్తస్రావం , అర్శమొలలు

3. ఉత్తరేణి ( అపా మార్గ పత్రం ) :--- పిప్పి పన్ను , చెవిపోటు , రక్త స్రావం , అర్శమొలలు , ఆనెలు , గడ్డలు , అథిఆకలు
    దంత సమస్యలు , జ్వరము , మూత్ర పిండాలలో రాళ్ళు .

4. గన్నేరు  ( కరవీర పత్రం ) :--- కణుతులను  కరిగిస్తుంది . తేలుకాటు , విష కీటకాల కాటు , దురదలు , కంటివ్యాధులు
    చర్మ వ్యాధులు

5. దేవదారు :--- అజీర్తి , ఉదర , చర్మ , కంటి వ్యాధులు

6. జాజిమల్లె :--- జీర్నాషయ వ్యాధులు , మలాశయ , నోటిపూత ( ఆకులను నమిలి మింగవచ్చు ) , నోటి దుర్వాసన ,
    కామెర్లు , దురదలు .

7. రావి ఆకు ( ఆశ్త్వ పత్రం ) :--- మలబద్ధకం , కామెర్లు , వాంతులు , మూత్రవ్యాధులు , జ్వరాలు నోటిపూత             
    చర్మవ్యాధులు .

8. వాకుడు ఆకు (బృహతీ పత్రం ) :--- దగ్గు , జలుబు , జ్వరము , అజీర్ణము , మూత్రవ్యాదులు , కంటివ్యాధులు , దంత
    చిగుళ్ళ సమస్యలు .

9. ఉమ్మెత్త  ( దత్తూర) :--- సెగగడ్డలు < చర్మవ్యాధులు , పెనుకోరుకుడు , ఒళ్ళు నొప్పులు ( ఆకులను నీటిలో వేసి
    మరిగించి ఆ కషాయాన్ని నొప్పుల మీద పూయాలి .

10. తులసి :-- ( ఆకు రసం  + తేనె ) , వైరల్ జలుబులు , చెవి పోటు ( రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా చెవిలో వేయాలి )

11. విష్ణుక్రాంత :--- జ్వరం , కఫం , పడిశం , దగ్గు , ఉబ్బసం  యొక్క నివారణకు తిరుగు లేని ఔషధం . ( ఆవిరి లేక
      కషాయం )

12 మరువం :--- జుట్టు రాలడం  ( ఆకు పేస్ట్ --హెయిర్ ప్యాక్ ), చర్మ వ్యాధులు ( ఆకు + పసుపు ), జీర్ణశక్తి (కషాయం )

13. దేవ కాంచన  (గంటకి):--- మూర్చ వ్యాధి ( కషాయం ), కఫం , నులిపురుగులు ( కషాయం + తేనె ).

14. అర్జున ( తెల్లమద్ది ) :--- చర్మ వ్యాధులు , కీళ్ళ నొప్పులు , మలాశయ దోషాలు , గుండె జబ్బులు ( ఆకు కషాయం +
      తేనె ) ---రుజువు చేయబడినది .

15. మారేడు ఆకు ( బిల్వ పత్రం ):--- జిగట విరేచనాలు , జ్వరం , మధుమేహం , కామెర్లు ( ఆకు యొక్క కషాయం +తేనె )

16. రేగు ( బదరీ పత్రం ) :--- జీర్ణకోశ వ్యాధులు , స్థూల కాయం ( ఆకు యొక్క కషాయాన్ని ఆహారానికి ముందు తాగితే
      చాలా బాగా తగ్గుతారు

17. మామిడి ఆకులు :--- విరేచనాలు (కషాయం ), చర్మ వ్యాధులు ( ఆకులు కాల్చిన బూడిద ).

18. దానిమ్మ (దాళిని పత్రం ) :--- దీని కషాయం విరేచానాలను ఆపుతుంది . దగ్గు ( కషాయం + తేనె + నిమ్మరసం +
      అల్లం రసం ) ,  ఆర్ష మొలలు ,  కామెర్లు .

19.  వావిలాకు ( సింధూవార పత్రం ) :--- జ్వరము , తలనొప్పి , గాయాలు , చెవిపోటు , చర్మవ్యాధులు , మూర్చ ,
       ప్రసవానంతర నొప్పులను  చాలా గొప్పది .

20. జమ్మి ( శమీపత్రం ) :--- కఫ సంబంధ సమస్యలు ( కషాయం ), ఆర్ష మొలలు , చర్మవ్యాధులు , అతిసారం ,  దంత
      వ్యాధులు  ( పుల్లతో పళ్ళు తోముకోవాలి ) .

21. జిల్లేడు (అర్క పత్రం ) :--- చర్మ వ్యాధులు , సెగ గడ్డలు ( ఆకును వేడి చేసి గడ్డ మీద కట్టాలి ) . కీళ్ళ నొప్పులు




మొక్కలు -- ఆయుర్వేద ఉపయోగాలు

                                                 మొక్కలు   --  ఆయుర్వేద ఉపయోగాలు  


                                                                  ఉత్తరేణి                                                 19-8-11.

      ఉత్తరేణి వేరును కుంచేలాగా చేసి పళ్ళు తోముకోవాలి . ఎండిన పుల్లను రాత్రి నీటిలో నానబెట్టి తే ఉదయానికి మెత్తబడుతుంది . దీనితో పళ్ళు తోముకుంటే పళ్ళు , చిగుళ్ళు గట్టి పడడమే కాక నాలుక ద్వారా మెదడును చేరి
మతిమరుపును పోగొట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది .

                                                 రెడ్డివారి నానబాలు  మొక్క --- ఉపయోగాలు             23-8-11.

      దీనిని పచ్చబొట్టు మొక్క అని కూడా అంటారు . దీనిలో రెండు రకాలు వుంటాయి .చిన్న మొక్క  ( తెల్లనిది ) , పెద్ద
మొక్క  ( ఎర్రనిది )  .

   ఈ మొక్క యొక్క  కాడను  తుంచితే పాలు వస్తాయి .  ఆ పాలను కళ్ళలో వేసుకొని కళ్ళకు సంబంధించిన వ్యాయామాలు
కళ్ళను గుండ్రంగా తిప్పడం ,  అరిచేతులను రుద్ది ఆ వేడిని కళ్ళ  మీద పెట్టడం వంటివి చేయాలి . పైత్య శరీరము కలిగిన
వాళ్ళు ఈ పాలను కళ్ళలో వేసుకుంటే  కళ్ళు కొంచం చురుకుమంటాయియి , ఎరుపు గా అవుతాయి . అయినా భయపడవ
వలసిన పని లేదు అటువంటి వాళ్ళు చిన్న చెట్టు  పాలు వేసుకోవాలి  . అలా దొరకని పక్షం లో  పెద్ద మొక్క అయినా
పరవా లేదు

                                                గాయపాకు  లేదా గడ్డిచేమంతి   లేదా పలకాకు               24-8-11.

       ఇది తెగిన  లేదా ఎక్కడైనా గీరుకున్న , లేదా కొడవలి వంటి వాటి వలన కలిగిన గాయాలైన సులభంగా మానిపోతాయి
        గాయాన్ని శుభ్రం చేసి దాని మీద ఆకు పసరు పిండాలి . దాని మీద దూది కప్పి దూదిని కూడా పసరుతో తడపాలి .
ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే గాయం నొప్పి లేకుండా సులభంగా మానిపోతుంది .

                                                        పిప్పింటాకు  --- ఉపయోగాలు                             14-9-11
                                                    
                                                            1          పిప్పి పన్ను            

       ఒక్క ఆకును నలిపి  పంటి మీద పెడితే నొప్పి తగ్గుతుంది .  ఈ ఆకు యొక్క రసం లో దూది ని ముంచి  పంటి
మీద పెడితే నొప్పి తగ్గుతుంది          

                                                               2. చర్మ వ్యాధులు

పిప్పింటాకు  రసం
పుల్లటి మజ్జిగ
ముద్ద కర్పూరం

      అన్నింటిని కలిపి ఒక మట్టి పాత్రలో పోసి గుడ్డ కట్టి నెల రోజులు అలాగే  ఉంచాలి , తరువాత దానిని తీసి చూస్తే
లేపనం లాగా తయారై ఉంటుంది .  ఇది చర్మ వ్యాధులను ఎంతో బాగా నివారిస్తుంది .


ఆయుర్వేద వక్కపొడి

                                                            ఆయుర్వేద వక్కపొడి                                  19-7-11

నేతిలో దోరగా వేయించిన చిన్న కరక్కాయ పెచ్చుల ముక్కలు     ----  50 gr
          దోరగా వేయించిన నలగ గొట్టిన జిలకర                          ----  25 gr
          దోరగా వేయించిన సోంపు గింజలు                                  ----  25 gr
అల్లం రసం     --- ఒక టీ స్పూను
నిమ్మ రసం    --- ఒక టీ స్పూను
సైంధవ లవణం

             కరక్కాయ పెచ్చులను ,  జిలకర పొడిని , సోంపు గింజలను ఒక గిన్నెలో వేసి వాటిపై  అల్లం రసాన్ని , నిమ్మ రసాన్ని చిలకరించాలి తరువాత తగినంత సైంధవ లవణాన్ని కలపాలి .

             ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి .
             రోజుకు రెండు , మూడు సార్లు కొన్ని ముక్కలను నోట్లో వేసుకొని చప్పరించాలి .

ఉపయోగాలు :---

ఆకలిని కలిగిస్తుంది .
కఫాన్ని నివారిస్తుంది .
మంచి నిద్రను కలిగిస్తుంది .
నోట్లో పుండ్లు , నోటి పూత రాకుండా కాపాడుతుంది .
అన్నవాహిక  శుభ్రపడుతుంది







ఆయుర్వేద మూలికలు --ఉపయోగాలు

                                                         ఆయుర్వేద మూలికలు  --ఉపయోగాలు

                              కరక్కాయ -- ఉపయోగాలు                                       30-12-10.

1. మలబద్ధక నివారణ                                                                
     కరక్కాయ
     తానికాయ
     ఉసిరికాయ

            అన్నింటి చూర్ణాలను  సమానముగా తీసుకుని కలుపుకోవాలి.  దీనిని త్రిఫల చూర్ణం అంటారు. దీనిని ప్రతి రోజు  ఒకటి, రెండు టీ స్పూన్ల పొడిని రాత్రి పూట   అర గ్లాసు  నీటితో తీసుకోవాలి. లేదా పాలతో కూడా తీసుకోవచ్చు.  దీనితో మలబద్ధకం నివారింప బడుతుంది.  పేగులకు  బలం చేకూరుతుంది.

2.  కళ్ళకలక :--

            కరక్కాయ పెచ్చులను రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని  వడకట్టి రెండు చుక్కలను కళ్ళలో
వేసుకుంటే కళ్ళ మంటలు తగ్గుతాయి.

3. ఆయాసం :--

             కొన్ని కరక్కాయలను కాల్చి హుక్కాలో వేసి  పొగను పీలిస్తే ఆయాసం తగ్గుతుంది.








పండుగలు ---- వాటి ప్రాధాన్యత

                                        పండుగలు ---- వాటి ప్రాధాన్యత

                                                        ఉగాది                                                  27-3-09.

               ఈ కాలంలో పూసే మోదుగ పూలను నీళ్ళలో వేసి నానబెట్టి పిసికితే ఎర్రని వసంతం తయారవుతుంది.
                                                   ఉగాది పచ్చడి

కొత్త చింత పండు రసం                    --- 100 gr
కొత్త బెల్లం                                    --- 100 gr
వేప పువ్వు రేకులు                          --- 50 gr (ఉత్తరాదిలో మామిడి పూత వాడతారు )
లేత మామిడి ముక్కలు                  ----  తగినన్ని 
సన్న అరటి పండు ముక్కలు             --- తగినన్ని
సన్నగా తుంచిన చెరకు ముక్కలు       -- తగినన్ని
                 నెయ్యి                         --- రెండు స్పూన్లు
                  తేనె                          ---- నాలుగు స్పూన్లు

                   అన్నింటిని బాగా కలపాలి. దీనితో ఉగాది పచ్చడి తయారవుతుంది.

               ఉగాది పండుగ --- షడ్రుచుల ప్రాధాన్యత                                               2-4-11.

 1. తీపి :--    ప్రసన్నత, శక్తి కలుగుతాయి. అతిగా వాడితే లావెక్కడం,  కొవ్వుపెరాడం, మధుమేహం  వంటి సమస్యలు ఏర్పడతాయి.

 2. పులుపు :-- జీర్ణశక్తిని పెంచుతుంది. ఎక్కువైతే అజీర్ణం ఏర్పడుతుంది.

 3. ఉప్పు  :-- ఎక్కువ తీసుకుంటే నష్టం ,  తీసుకోకుంటే గుండెబలహీనమవుతుంది.జుట్టు               రాలుతుంది.

 4. కారం :--  ఇది జీర్ణ శక్తికి అవసరం.  ఎక్కువైతే జుట్టు రాలుతుంది.

 5. వగరు :--  రోగనిరోధక శక్తికి పనికొస్తుంది.

 6. చేదు  :--  శరీరంలోని రోగాలను  నిర్మూలించే శక్తి దీనికున్నది.

          అన్ని రుచులను ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.

          ఉగాది పండుగ ఋతువుల  యొక్క ప్రారంభ దినం కాబట్టి  ఈ రోజు నుండి ప్రారంభించి
  ప్రతి రోజు అన్ని రుచులను కలిపి తింటూ వుంటే సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.

                                                 ఉగాది పచ్చడి
     చింతపండు రసం
     బెల్లం
     సైంధవ లవణం
     ఎండు కారం పొడి లేదా పచ్చిమిర్చి ముక్కలు
     వేప పూత
     తానికాయపొడి లేదా కరక్కాయ పొడి --కొద్దిగా

      తరువాత వీటికి మనకు ఇష్టమైన పదార్ధాలను వేనినైనా కలుపుకోవచ్చు.( మామిడి, చక్కెర  ,
  తేనె) 

       పండుగ రోజు ప్రతి ఒక్కరు కనీసం అరకప్పు పచ్చడి సేవించాలి.

                                                      ఉగాది                                                     4-4-11.

        శిశిరంలో ఆకులు రాలి,  వసంతంలో చిగురిస్తాయి.  అలాగే చర్మం మీది పొలుసులు రాలి
  కొత్త చర్మం వస్తుంది.

                                                  ఉగాది పచ్చడి

         షడ్రుచులు  కలిగిన ఆహారం  =  Balanced Diet

        ఆరు రుచులు పంచ మహా భూతాల నుండి తయారవుతాయి.

                   చింతపండు రసం              --- ఒక కప్పు
                   దోర  మామిడి ముక్కలు   --- అరకప్పు
                   చిన్న పచ్చి మిరపకాయ   --- ఒకటి (చిన్న ముక్కలు)
                                వేప పూత           --- రెండు టీ స్పూన్లు
                                    ఉప్పు             --- పావు టీ స్పూను                 
                                    బెల్లం              --- రెండు టీ స్పూన్లు
                                    కొబ్బరి            --- చిన్న ముక్క

          చింత పండు రసం లో అన్నింటిని కలపాలి.    ఇది ఆహార ఔషధం
            
          జీవితంలో అన్ని రకాల రుచులను తిని అన్ని రకాల అనుభూతులను పొందాలి.

   ఉగాది పచ్చడి లోని పదార్ధాల ఉపయోగాలు:--

    1. బెల్లం :--  ఇది బలాన్ని కలిగిస్తుంది. పెరిగే పిల్లలకు టానిక్ లాగా పని చేస్తుంది. రక్తహీనతను
 నివారిస్తుంది. జుట్టు ఊడదు.  నీరసం,  ఆయాసం వంటి వాటిని నివారిస్తుంది.

        సంవత్సరం క్రితం   తయారైన పాత బెల్లాన్ని మాత్రమే వాడాలి.

    2.  చింతపండు :--     సుఖవిరేచాన్ని కలిగిస్తుంది.  వాపులను తగ్గిస్తుంది.

    3.  ఉప్పు :--    మలమూత్రాలను జారీ చేస్తుంది. విష హరిణి గా పని చేస్తుంది. సైనస్ సమస్య
  లో కఫాన్ని లేక శ్లేష్మాన్ని బయటకు రప్పిస్తుంది.

    4. మిరప లేక మిరియాలు :--  ఆకలిని పెంచుతుంది  ( ఉద్దీపన)

    5. వేపపువ్వు :--    విరేచానాన్ని ఆపుతుంది, ( గ్రాహీగుణం),  చికెన్ పాక్స్ ను తగ్గిస్తుంది.

    6. మామిడి :--   శీత వీర్యం.  ఆహార పదార్ధాల రుచిని పెంచుతుంది. అన్ని రకాల రక్త స్రావాలను
       ఆపుతుంది.

                                               విజయదశమి                                            28-9-09.

                                  " శమీ శమయతే పాపం "

    అగ్ని హోత్రంలో ఆవు పిడక పెట్టి కర్పూరం, ఆవునెయ్యి వేసి వెలిగించాలి. దీనిలో జమ్మి, రావి, మోదుగయొక్క పుల్లలను. ఆకులను, కాడలను వెయ్యాలి. లేదా వాటి చూర్నాలను హోమం లో వెయ్యాలి.

ధూపం పర్యావరణాన్ని శుభ్ర పరుస్తుంది. వర్ష ఋతువులో ఇంటిలోనికి ప్రవేశించే వ్యాధికారక
క్రిములను పొగ నిర్మూలిస్తుంది.

విజయలక్ష్మి -- ఇచ్చ, సంకల్పం, సాధించాలనే కోరిక ఇచ్చాశక్తి.

సరస్వతి :-- జ్ఞానశక్తి . దిశా నిర్దేశం చేసేది.

దుర్గా దేవి :-- అన్ని శక్తులను నడిపించే శక్తి.

                                                   దీపావళి                                       17-10-09.

  స్నానం చేసే నీటిలో ఉత్తరేణి, తగరిస ( తగరించ) మొక్కలను మట్టి పెళ్లలతో సహా తెచ్చి నీటిలో జాడించి నీటితో స్నానం చెయ్యాలి.
దీపావళి రోజునుండి ప్రారంభించి మినప సున్నుండలు, నువ్వులతో కారం, తీపి పదార్ధాలను వాడాలి.

మినప సున్నుండలు ;-- మినప పప్పును ఒక రోజంతా కొబ్బరి నీళ్ళలో నానబెట్టి కడిగి ఎండబెట్టి వేయించి   బెల్లం, నెయ్యి కలిపి దంచి ఉండలు చెయ్యాలి.

నువ్వుండలు :-- నువ్వులను కారంతో గాని బెల్లంతో గాని కలిపి వాడాలి.

1. వాతావరణం లోని క్రిములను నాశనం చేయడానికి గంధకం, పెట్లుప్పు బాగా ఉపయోగ పడతాయి.

2. తగరిస మొక్కను సమూలంగా తెచ్చి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి తైలం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది ఎటువంటి చర్మ వ్యాధులను నివారిస్తుంది.

3. తగరిస గింజల పొడిని ఖాళి క్యాప్సుల్స్ లో గాని ఎండుద్రాక్ష లో పెట్టి మింగుతూ వుంటే రక్త శుద్ధి జరుగుతుంది. ఎలాంటి చర్మ వ్యాదులైనా నివారింప బడతాయి.

మొక్కకు పొడవు కాయలు సన్నని పసుపు పూలు వుంటాయి.

4. ఉత్తరేణి శిరో రోగాలను, కఫరోగాలను పోగొడుతుంది. దీని రసాన్ని ముక్కులో పిండితే అరతల నోప్పి నివారింపబడుతుంది.

5. హోమం లో గాని నిప్పుల్లో గాని పై రెండు మొక్కల యొక్క చూర్నాలు వేసి పొగను పీలిస్తే నరనరాలలో  గడ్డ కట్టుకొని వున్న చెడు పదార్ధాలు బయటకు తోసివేయ బడతాయి.


                                                             శివ రాత్రి                                   2-3-11.

    ఒక పగలు, ఒక రాత్రి ఉపవాసం వుండాలి. తరువాత తీసుకునే ఆహారం తేలికగాజీర్ణమై, శక్తిని ఇచ్చేదిగా వుండాలి.

                                                    ముద్గ పాయసం

     ముక్కులో, చిగుళ్ళలో రక్తస్రావం, దద్దుర్లు, వాంతులు, నిర్జలీయత, బలహీనత వలన వచ్చే దగ్గు వంటివి నివారింప బడతాయి. దప్పిక తీరుతుంది.

పెసర పప్పు                   ---- అర కప్పు
బెల్లం                           ---- అర కప్పు
యాలకుల పొడి             ---- చిటికెడు
మరిగించిన పాలు            ---- నాలుగు కప్పులు
నీళ్ళు                           ---- నాలుగు కప్పులు

      పెసర పప్పును దోరగా వేయించి నీళ్ళు పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత బెల్లం
కలిపి ఉడికించాలి. తరువాత పాలు పోసి ఉడికించాలి. తరువాత యాలకుల పొడి కలపాలి.
దీనిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది ఉపవాసం వున్న వాళ్ళు దీనిని ప్రసాదం గా
తీసుకోవాలి.

ఇది ఒళ్ళు నొప్పులను కూడా తగ్గిస్తుంది.

                                                 శ్రీరామ నవమి                                                   12-4-11.
       అయనము  = బాట
       రామాయణము   = రాముడు నడచిన బాట

                                                    పానకం

        తురిమిన బెల్లం       --- 6 టీ స్పూన్లు
        మిరియాల పొడి      --- అర టీ స్పూను
        యాలకుల పొడి      --- ఒక టీ స్పూను 
        అల్లం తురుము      --- ఒక టీ స్పూను
                   నీళ్ళు        --- రెండు గ్లాసులు

        ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని బెల్లం వేసి కరిగించాలి. దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి.
 దీనితో సహజ పదార్ధాలతో పానకం తయారవుతుంది.
        ఇది పానీయమే కాదు ఒక ఔషధం కూడా

                                                 వడపప్పు

       నానబెట్టిన పెసరపప్పు          --- ఒక కప్పు ( అన్నింటి కంటే ఉత్తమమైనది)
       పచ్చి మిర్చి తురుము          --- ఒక టీ స్పూను
       సైంధవ లవణం లేదా ఉప్పు    --- చిటికెడు
                     కొబ్బరి తురుము   --- నాలుగు టీ స్పూన్లు
                      నిమ్మ  రసం         --- ఒక టీ స్పూను
               తురిమిన కొత్తిమీర
     
     మొదట  పెసర పప్పు ను ఒక గిన్నెలో వేసి దానికి మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా కలపాలి.
 
    పప్పులన్నింటిలోకి  పెసరపప్పు శ్రేష్టమైనది.
  
    వేసవి కాలంలో ఆకలి తగ్గడం అనేది ముఖ్యమైన సమస్య .  దీనికి పానకం చాలా అద్భుతమైన
 ఔషధం.

  వడపప్పు యొక్క ఉపయోగాలు :--   దీనిలోని పెసరపప్పు రక్తస్రావాలను ఆపుతుంది. దప్పికను  తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది మరియు నివారిస్తుంది. నిద్రను కలిగిస్తుంది. దద్దుర్లను
 తగ్గిస్తుంది. పొడి దగ్గును నివారిస్తుంది.

పానకం యొక్క ఉపయోగాలు :-- దీనిని తాగితే ఎన్ని నీళ్ళు తాగినా తగ్గని దాహం తగ్గుతుంది.
తక్షణం శక్తిని ఇస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. దుమ్ము, ధూళి వలన వచ్చే జలుబును నివారిస్తుంది.
ఆకలిని పెంచుతుంది. ఇది ద్రవాహారం కాబట్టి  నిర్జలీయతను రానివ్వదు. వడదెబ్బ నుండి
కాపాడుతుంది.
                                                  12-4-11.

       వేసవి కాలం లో మానవులు కొంత పని చేసే సరికే అలసి పోతుంటారు. దీని నివారణకు
 వడపప్పు,  పానకం ఎంతో ఉపయోగకరమైనవి.

వడపప్పు యొక్క ఉపయోగాలు:--

 అరికాళ్ళ మంటలు :-- పెసర పప్పును నానబెట్టి నూరి కర్పూరం కలిపి పాదాలకు పూయాలి.

శిరోవేదన, మంటలు :-- పెసరపప్పును నానబెట్టి నూరి మాడు మీద అంటించాలి.

కొబ్బరి :-- శక్తిని వృద్ధి చేస్తుంది.

పంచదార :-- తక్షణ శక్తిని ఇస్తుంది.

 పానకం :--   బెల్లం,  మిరియాలు, నీళ్ళు
        

        












వంట ఇంటి దినుసులు -- ఆయుర్వేద ప్రయోజనాలు



వంట ఇంటి దినుసులు -- ఆయుర్వేద ప్రయోజనాలు

శీతాకాలంలో వెల్లుల్లి ఉపయోగాలు                                29-5-10.

గుండెపోటు గలవారికి రెండు గంటల లోపు చికిత్స జరగకపోతే చాలా ప్రమాదం

1. Brain Stroke 2. Heart Stroke అని రెండు రకాలు.
రక్తం సరిగా సరఫరా జరగకపోవడం వలన సమస్యలు వస్తాయి.
" వెల్లుల్లి హృదయం ఆకారంలో వుంటుంది. దీనికి మహౌషధి అని పేరు "

వెల్లుల్లి యొక్క ఉపయోగాలు

1. గుండెకు రక్తం అందలేని పరిస్థితులలో రక్తం అడ్డు లేకుండా సరఫరా జరిగేట్లు చేస్తుంది.

2. 2, 3 పాయలను పాలల్లో ఉడికించి చక్కెర కలిపి తీసుకుంటే పక్షవాత సమస్యలు నివారింప బడతాయి.

3. రెండు తెల్ల పాయలను సన్నగా తరిగి ఆవు నేతిలో వేయించి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో కాలంగా వున్నవాత నొప్పులు నివారింప బడతాయి.

రసోన = వెల్లుల్లి


          అల్లం యొక్క ఉపయోగాలు ( ఆయుర్వేద సంహిత నుండి)                28-12-10.

ఇది  అజీర్ణం, వాంతులు, వేవిళ్ళను నివారించడం లో అమోఘమైనది.

అజీర్ణం :--

ఆహారానికి ముందు ఒక చిన్న అల్లం ముక్కను ఉప్పులో అద్దుకుని తినాలి.

దగ్గు, ఆయాసం :--

అల్లం రసం --- అర టీ స్పూను
          తేనె --- అర టీ స్పూను

        రెండింటిని కలిపి రోజుకు రెండు మూడు సార్లుగా తాగితే మంచిది.

                                   వేరుశనగ పప్పు ---ఉపయోగాలు                                   11-3-11.

            వేరుశనగ పప్పుల  యొక్క నాలుకలలో విష పదార్ధాలు వుంటాయి.  వాటిని తినడం
  వలన శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి.

   ఉపయోగాలు ;--    దీనిని వాడితే పిల్లలు పుష్టిగా ఎరుగుతారు.
     ఉప్పుతో కలిపి వాడితే కదిలే దంతాలు గట్టి పడతాయి .













బోదకాలు :--






అల్లం రసం --- పావు లీటరు






కరక్కాయ పొడి --- 100 gr






అర టీ స్పూను పొడిని అర టీ స్పూను అల్లం రసం తో కలిపి తీసుకోవాలి.







జీలకర్ర 29-12-10.













ప్రధానంగా జీలకర్రను ఆహారం యొక్క అరుగుదలకు వాడుతారు.






జలుబు, శిరోభారం :__ ఇది జలుబును, శిరోభారాన్ని బాగా నివారిస్తుంది.






జీలకర్ర --- ఒక స్పూను






పసుపు ---- ఒక స్పూను






బెల్లం ---- ఒక స్పూను






అన్నింటిని కలిపి దంచి గుడ్డలో కట్టి వాసన పీలిస్తే తల బరువు, జలుబు, సైనసైటిస్ నొప్పి తగ్గుతాయి.













జ్వరం :-- వృద్ధాప్యంలో కూడా వాడుకోదగినది.






ఒక టీ స్పూను జిలకరను దంచి రసం తీసి అర టీ స్పూను పసుపు కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది.













అరుచి :-- ఆకలి వుంటుంది కాని రుచి తెలియదు. అటువంటపుడు :--






జీలకర్ర --- ఒక టీ స్పూను






అల్లం రసం --- పావు కప్పు






జీలకర్రను అల్లం రసంలో నానబెట్టాలి. జిలకరను ఎండబెట్టి దానిని తింటూ వుంటే రుచి చాలా బాగా






తెలుస్తుంది.













ఎక్కిళ్ళు :-- జీలకర్రను పొగ పీల్చే గొట్టంలో వేసి పీలిస్తే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి.



















రక్తపోటు :--






జీలకర్ర






ధనియాలు






అల్లం






అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి దంచి రసం తీసి పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తీసుకుంటే రక్తపోటు నివారింప బడుతుంది. క్రమంగా తగ్గుతుంది.













నీళ్ళ విరేచనాలు :-- ఒక కప్పులో ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకుని తాగితే తగ్గుతాయి.







మిరియాలు ( Blachk Pepper) 10-1-11.













జలుబు "--






మిరియాల పొడి --- అర టీ స్పూను






బెల్లం ---- కొంచం






పెరుగు ----కొంచం






కలిపి తీసుకోవాలి













వేడి పాలలో కొద్దిగా మిరియాల పొడి చల్ల్లి, పసుపు కలిపి తాగాలి













ఎక్కిళ్ళు :--













ఒక మిరియాల గింజను సూదికి గుచ్చి కాల్చాలి. పొగను పీలిస్తే టక్కున ఆగిపోతాయి.






తల నొప్పి కూడా తగ్గుతుంది.













కంటి సమస్యలు :--






మిరియాల పొడి --- అర టీ స్పూను






నెయ్యి --- అర టీ స్పూను






కలిపి తీసుకుంటే కళ్ళ మంటలు, నీరు కారడం, పుసులు కట్టడం వంటి సమస్యలు నివారింప బడతాయి.













దగ్గు, ఆయాసం :--






మిరియాల పొడి --- అర టీ స్పూను






తేనె --- ఒక టీ స్పూను






కలిపి తీసుకోవాలి.







నువ్వులు 11-1-11.




అర్శమొలలు :-- ఒక టీ స్పూను నువ్వులను నీటితో కలిపి నూరి వెన్నతో కలిపి తినాలి. మూడు పూటలా వాడాలి.




దీని వలన రక్తస్రావం ఆగిపోతుంది. నొప్పి, దురద తగ్గిపోతాయి.




బహిష్టు నొప్పి :--




నువ్వుల నూనె --- రెండు టీ స్పూన్లు




పాలు --- ఒక గ్లాసు




నువ్వులను నూరి పాలలో కలుపుకుని ప్రతినెల మొదటి మూడు రోజులు తాగితే నొప్పి తగ్గుతుంది. బహిష్టుకు ఒకటి, రెండు రోజుల ముందు నుండి తీసుకున్నా మంచిది.








ఆవాలు 26-1-11.




దురదలు, చిడుము, ఇతర చర్మ వ్యాధులు:-- పై పూతకు మందు :--




ఆవ నూనె --- పావు లీటరు




జిల్లేడు ఆకుల ముద్దా -- పది గరాములు




పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు


రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేవరకు కాచాలి. వడపోసి సీసాలో భద్ర


పరచుకోవాలి.




దీనిని పై పూతగా వాడాలి.




దంత వ్యాధులు :--




ఆవాల పొడి --- 50 gr




కల్లుప్పు పొడి --- 50 gr




రెండింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.




పొడితో ప్రతి రోజు పళ్ళు తోముకుంటే పళ్ళ మీది జిడ్డు, పాచి తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్ చేరదు .

















పొడి దగ్గు :-- అర టీ స్పూను నువ్వులను ముద్దగా నూరి పటికబెల్లం కలుపుకుని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది.







ముళ్ళు గుచ్చుకుంటే :--






నువ్వుల నూనె -- ఒక టీ స్పూను






నువ్వు పిండి -- ఒక టీ స్పూను






ముద్దగా నూరి పట్టు వేయాలి.

శొంటి 12-1-11.







శొంటి శోధిస్తుంది.






అజీర్ణం, ఆకలి లేకపోవడం:--






శొంటి పొడి ---అర టీ స్పూను






అల్లం రసం --- ఒక టీ స్పూను






బెల్లం --- 50 gr






కలిపి తీసుకోవాలి.













తలనొప్పి :--






శొంటిని సాన రాయి మీద నీటితో అరగదీసి గంధాన్ని నొసటి మీద, కనతల మీద పూస్తే తగ్గుతుంది.













వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు :--






శొంటి పొడి ---అర టీ స్పూను






ఆముదం --- ఒక టీ స్పూను






రెండింటిని కలిపి లేహ్యం లాగా కలిపి నాకాలి. తరువాత వేడి నీరు తాగాలి.













నేత్ర సమస్యలు :--






శొంటి పొడి --- 10 gr






వేపాకు --- గుప్పెడు






సైంధవ లవణం --- 10 gr






అన్నింటిని కలిపి ముద్దగా నూరి బిళ్లలుగా చేసి కళ్ళ మీద పెట్టుకోవాలి.

సున్నం 13-1-11.







సున్నపు రాయిని బట్టీలలో కాలిస్తే క్యాల్షియం ఆక్సైడ్ తయారవుతుంది.






సున్నపు తేత = చూర్నోదకం













అరుచి :--






సున్నం --- చిటికెడు






అల్లం రసం --- ఒక టీ స్పూను






తేనె --- ఒక టీ స్పూను






కలిపి తీసుకోవాలి.













అజీర్ణం :--






సున్నపు తేట --- ఒక టీ స్పూను






పాలు --- ఒక కప్పు






కలిపి తాగాలి.













అతిసారం:--






సున్నపు తేట ---ఒక టీ స్పూను






మజ్జిగ --- ఒక గ్లాసు






కలిపి తాగాలి.













తేలుకాటు :--






సున్నం --- ఒక టీ స్పూను






వేపాకు రసం --- ఒక టీ స్పూను






బాగా కలిపి తేలుకాటు మీద పట్టు వేయాలి. చెవిలో కూడా రెండు మూడు చుక్కలు వేయాలి.













కాలిన గాయాలు :--






సున్నపు తేట కు మీగడ లేక అవిశ నూనె లేక గుగ్గిలం లేక కొబ్బరినూనె కలిపి పూయాలి.













బహిష్టు సమయంలో రొమ్ముల్లో నొప్పి :--






సున్నం --- ఒక టీ స్పూను






తేనె --- ఒక టీ స్పూను






కలిపి పట్టు వేస్తే త్వరగా తగ్గుతుంది,













ఎముకలు విరిగినపుడు :--






సున్నం --- ఒక టీ స్పూను






వెన్న --- ఒక టీ స్పూను






ఎముకలు విరిగినపుడు, వాపు వున్నపుడు కలిపి పట్టు వేస్తే వాపు తగ్గిపోతుంది.







చింత 17-1-11.













దీనిలో అన్ని భాగాలు ఉపయోగ పడతాయి.













వాపులతో కూడిన దెబ్బలు :--






చింత పండు గుజ్జు --- 10 gr






చింతాకు రసం --- 10 gr






గోధుమ పిండి --- 10 gr






అన్నింటిని కలిపి మెత్తగా నూరి గుడ్డకు పూసి గాయం మీద వేసి కట్టు కట్టాలి. దీనితో వాపు తగ్గుతుంది.













ఎముకలు విరగడం :--






50 గ్రాముల చింత పండును గుజ్జును వేడి చేసి దానికి తగినంత నువ్వుల నూనెను కలిపి గాయం మీద వేసి






కట్టాలి.













ఆకలి తగ్గడం :--






చింత పండు గుజ్జు






బెల్లం






దాల్చిన చెక్క






యాలకులు






మిరియాలు






అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా నూరి కుంకుడు గింజంత ముద్దా నోట్లో పెట్టుకుని చప్పరించాలి. దీనితో ఆకలి పెరుగుతుంది.







బియ్యం 18-1-11.






బియ్యం =తండుల = శాలి ధాన్యం













1. అర్శమొలలు :--






బియ్యం






వెన్న






నెయ్యి






అన్నింటిని కలిపి మేక పాలు పోసి వండి తింటూ వుంటే రక్త లేదా అర్శమొలలు నివారింప బడతాయి.






2. రక్త హీనత :--






బియ్యం






బార్లీ






రెండింటిని కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటూ వుంటే రక్త వృద్ధి జరుగుతుంది.













4. కాలిన గాయాలు :--






మొదట గాయాన్ని శుభ్ర పరచి తరువాత వరి పొట్టు యొక్క మెత్తటి తవుడుకు నెయ్యి కలిపి పూయాలి.













5. అధిక ఋతుస్రావం :--






ఎర్రబియ్యం






ఆవు పాలు






కలిపి ఉడికించి చల్లార్చి తేనె కలిపి తీసుకోవాలి.






చింత ---ఉపయోగాలు 25-1-11.






దీనిలో ఆకులు, పువ్వులు, గింజలు, పండు, బూడిద అన్ని ఉపయోగపడతాయి.






పాము కాటు :-- వైద్య మనోరమ అనే గ్రంధంలో దీనిని గురించి చాల గొప్పగా చెప్పబడినది.






చింతాకు రసం --- 160 ml






ఉప్పు --- 20 gr






రెండు కలిపి తాగితే సర్ప విషం హరింప బడుతుంది.






ఎముకలు విరగడం :-- సిద్ధ భేషజా మణిమాల అనే గ్రంధంలో చెప్పబడినది.






చింతపండు గుజ్జు ---- 100 gr






సున్నం ---- తగినంత






గుజ్జును ఉడికించి సున్నం కలిపి పట్టు వెయ్యాలి. దీని వలన ఎముకలు అతుక్కుంటాయి.

                                             టీ  పొడి యొక్క ఉపయోగాలు                       12-3-11.
    విరేచనాలను  తగ్గిస్తుంది.
    మూత్రంలో మంటను నివారిస్తుంది.
    కురుపులను,  గాయాలను మాన్పుతుంది.