పండుగలు ---- వాటి ప్రాధాన్యత
ఉగాది 27-3-09.
ఈ కాలంలో పూసే మోదుగ పూలను నీళ్ళలో వేసి నానబెట్టి పిసికితే ఎర్రని వసంతం తయారవుతుంది.
ఉగాది పచ్చడి
కొత్త చింత పండు రసం --- 100 gr
కొత్త బెల్లం --- 100 gr
వేప పువ్వు రేకులు --- 50 gr (ఉత్తరాదిలో మామిడి పూత వాడతారు )
లేత మామిడి ముక్కలు ---- తగినన్ని
సన్న అరటి పండు ముక్కలు --- తగినన్ని
సన్నగా తుంచిన చెరకు ముక్కలు -- తగినన్ని
నెయ్యి --- రెండు స్పూన్లు
తేనె ---- నాలుగు స్పూన్లు
అన్నింటిని బాగా కలపాలి. దీనితో ఉగాది పచ్చడి తయారవుతుంది.
ఉగాది పండుగ --- షడ్రుచుల ప్రాధాన్యత 2-4-11.
1. తీపి :-- ప్రసన్నత, శక్తి కలుగుతాయి. అతిగా వాడితే లావెక్కడం, కొవ్వుపెరాడం, మధుమేహం వంటి సమస్యలు ఏర్పడతాయి.
2. పులుపు :-- జీర్ణశక్తిని పెంచుతుంది. ఎక్కువైతే అజీర్ణం ఏర్పడుతుంది.
3. ఉప్పు :-- ఎక్కువ తీసుకుంటే నష్టం , తీసుకోకుంటే గుండెబలహీనమవుతుంది.జుట్టు రాలుతుంది.
4. కారం :-- ఇది జీర్ణ శక్తికి అవసరం. ఎక్కువైతే జుట్టు రాలుతుంది.
5. వగరు :-- రోగనిరోధక శక్తికి పనికొస్తుంది.
6. చేదు :-- శరీరంలోని రోగాలను నిర్మూలించే శక్తి దీనికున్నది.
అన్ని రుచులను ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.
ఉగాది పండుగ ఋతువుల యొక్క ప్రారంభ దినం కాబట్టి ఈ రోజు నుండి ప్రారంభించి
ప్రతి రోజు అన్ని రుచులను కలిపి తింటూ వుంటే సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఉగాది పచ్చడి
చింతపండు రసం
బెల్లం
సైంధవ లవణం
ఎండు కారం పొడి లేదా పచ్చిమిర్చి ముక్కలు
వేప పూత
తానికాయపొడి లేదా కరక్కాయ పొడి --కొద్దిగా
తరువాత వీటికి మనకు ఇష్టమైన పదార్ధాలను వేనినైనా కలుపుకోవచ్చు.( మామిడి, చక్కెర ,
తేనె)
పండుగ రోజు ప్రతి ఒక్కరు కనీసం అరకప్పు పచ్చడి సేవించాలి.
ఉగాది 4-4-11.
శిశిరంలో ఆకులు రాలి, వసంతంలో చిగురిస్తాయి. అలాగే చర్మం మీది పొలుసులు రాలి
కొత్త చర్మం వస్తుంది.
ఉగాది పచ్చడి
షడ్రుచులు కలిగిన ఆహారం = Balanced Diet
ఆరు రుచులు పంచ మహా భూతాల నుండి తయారవుతాయి.
చింతపండు రసం --- ఒక కప్పు
దోర మామిడి ముక్కలు --- అరకప్పు
చిన్న పచ్చి మిరపకాయ --- ఒకటి (చిన్న ముక్కలు)
వేప పూత --- రెండు టీ స్పూన్లు
ఉప్పు --- పావు టీ స్పూను
బెల్లం --- రెండు టీ స్పూన్లు
కొబ్బరి --- చిన్న ముక్క
చింత పండు రసం లో అన్నింటిని కలపాలి. ఇది ఆహార ఔషధం
జీవితంలో అన్ని రకాల రుచులను తిని అన్ని రకాల అనుభూతులను పొందాలి.
ఉగాది పచ్చడి లోని పదార్ధాల ఉపయోగాలు:--
1. బెల్లం :-- ఇది బలాన్ని కలిగిస్తుంది. పెరిగే పిల్లలకు టానిక్ లాగా పని చేస్తుంది. రక్తహీనతను
నివారిస్తుంది. జుట్టు ఊడదు. నీరసం, ఆయాసం వంటి వాటిని నివారిస్తుంది.
సంవత్సరం క్రితం తయారైన పాత బెల్లాన్ని మాత్రమే వాడాలి.
2. చింతపండు :-- సుఖవిరేచాన్ని కలిగిస్తుంది. వాపులను తగ్గిస్తుంది.
3. ఉప్పు :-- మలమూత్రాలను జారీ చేస్తుంది. విష హరిణి గా పని చేస్తుంది. సైనస్ సమస్య
లో కఫాన్ని లేక శ్లేష్మాన్ని బయటకు రప్పిస్తుంది.
4. మిరప లేక మిరియాలు :-- ఆకలిని పెంచుతుంది ( ఉద్దీపన)
5. వేపపువ్వు :-- విరేచానాన్ని ఆపుతుంది, ( గ్రాహీగుణం), చికెన్ పాక్స్ ను తగ్గిస్తుంది.
6. మామిడి :-- శీత వీర్యం. ఆహార పదార్ధాల రుచిని పెంచుతుంది. అన్ని రకాల రక్త స్రావాలను
ఆపుతుంది.
విజయదశమి 28-9-09.
" శమీ శమయతే పాపం "
అగ్ని హోత్రంలో ఆవు పిడక పెట్టి కర్పూరం, ఆవునెయ్యి వేసి వెలిగించాలి. దీనిలో జమ్మి, రావి, మోదుగయొక్క పుల్లలను. ఆకులను, కాడలను వెయ్యాలి. లేదా వాటి చూర్నాలను హోమం లో వెయ్యాలి.
ఈ ధూపం పర్యావరణాన్ని శుభ్ర పరుస్తుంది. వర్ష ఋతువులో ఇంటిలోనికి ప్రవేశించే వ్యాధికారక
క్రిములను ఈ పొగ నిర్మూలిస్తుంది.
విజయలక్ష్మి -- ఇచ్చ, సంకల్పం, సాధించాలనే కోరిక ఇచ్చాశక్తి.
సరస్వతి :-- జ్ఞానశక్తి . దిశా నిర్దేశం చేసేది.
దుర్గా దేవి :-- అన్ని శక్తులను నడిపించే శక్తి.
దీపావళి 17-10-09.
స్నానం చేసే నీటిలో ఉత్తరేణి, తగరిస ( తగరించ) మొక్కలను మట్టి పెళ్లలతో సహా తెచ్చి నీటిలో జాడించిఆ నీటితో స్నానం చెయ్యాలి.
దీపావళి రోజునుండి ప్రారంభించి మినప సున్నుండలు, నువ్వులతో కారం, తీపి పదార్ధాలను వాడాలి.
మినప సున్నుండలు ;-- మినప పప్పును ఒక రోజంతా కొబ్బరి నీళ్ళలో నానబెట్టి కడిగి ఎండబెట్టి వేయించి బెల్లం, నెయ్యి కలిపి దంచి ఉండలు చెయ్యాలి.
నువ్వుండలు :-- నువ్వులను కారంతో గాని బెల్లంతో గాని కలిపి వాడాలి.
1. వాతావరణం లోని క్రిములను నాశనం చేయడానికి గంధకం, పెట్లుప్పు బాగా ఉపయోగ పడతాయి.
2. తగరిస మొక్కను సమూలంగా తెచ్చి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి తైలం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది ఎటువంటి చర్మ వ్యాధులను నివారిస్తుంది.
3. తగరిస గింజల పొడిని ఖాళి క్యాప్సుల్స్ లో గాని ఎండుద్రాక్ష లో పెట్టి మింగుతూ వుంటే రక్త శుద్ధి జరుగుతుంది. ఎలాంటి చర్మ వ్యాదులైనా నివారింప బడతాయి.
ఈ మొక్కకు పొడవు కాయలు సన్నని పసుపు పూలు వుంటాయి.
4. ఉత్తరేణి శిరో రోగాలను, కఫరోగాలను పోగొడుతుంది. దీని రసాన్ని ముక్కులో పిండితే అరతల నోప్పి నివారింపబడుతుంది.
5. హోమం లో గాని నిప్పుల్లో గాని పై రెండు మొక్కల యొక్క చూర్నాలు వేసి ఆ పొగను పీలిస్తే నరనరాలలో గడ్డ కట్టుకొని వున్న చెడు పదార్ధాలు బయటకు తోసివేయ బడతాయి.
ఒక పగలు, ఒక రాత్రి ఉపవాసం వుండాలి. తరువాత తీసుకునే ఆహారం తేలికగాజీర్ణమై, శక్తిని ఇచ్చేదిగా వుండాలి.
ముద్గ పాయసం
ముక్కులో, చిగుళ్ళలో రక్తస్రావం, దద్దుర్లు, వాంతులు, నిర్జలీయత, బలహీనత వలన వచ్చే దగ్గు వంటివి నివారింప బడతాయి. దప్పిక తీరుతుంది.
పెసర పప్పు ---- అర కప్పు
బెల్లం ---- అర కప్పు
యాలకుల పొడి ---- చిటికెడు
మరిగించిన పాలు ---- నాలుగు కప్పులు
నీళ్ళు ---- నాలుగు కప్పులు
పెసర పప్పును దోరగా వేయించి నీళ్ళు పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత బెల్లం
కలిపి ఉడికించాలి. తరువాత పాలు పోసి ఉడికించాలి. తరువాత యాలకుల పొడి కలపాలి.
దీనిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది ఉపవాసం వున్న వాళ్ళు దీనిని ప్రసాదం గా
తీసుకోవాలి.
ఇది ఒళ్ళు నొప్పులను కూడా తగ్గిస్తుంది.
శ్రీరామ నవమి 12-4-11.
అయనము = బాట
రామాయణము = రాముడు నడచిన బాట
పానకం
తురిమిన బెల్లం --- 6 టీ స్పూన్లు
మిరియాల పొడి --- అర టీ స్పూను
యాలకుల పొడి --- ఒక టీ స్పూను
అల్లం తురుము --- ఒక టీ స్పూను
నీళ్ళు --- రెండు గ్లాసులు
ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని బెల్లం వేసి కరిగించాలి. దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి.
దీనితో సహజ పదార్ధాలతో పానకం తయారవుతుంది.
ఇది పానీయమే కాదు ఒక ఔషధం కూడా
వడపప్పు
నానబెట్టిన పెసరపప్పు --- ఒక కప్పు ( అన్నింటి కంటే ఉత్తమమైనది)
పచ్చి మిర్చి తురుము --- ఒక టీ స్పూను
సైంధవ లవణం లేదా ఉప్పు --- చిటికెడు
కొబ్బరి తురుము --- నాలుగు టీ స్పూన్లు
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
తురిమిన కొత్తిమీర
మొదట పెసర పప్పు ను ఒక గిన్నెలో వేసి దానికి మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా కలపాలి.
పప్పులన్నింటిలోకి పెసరపప్పు శ్రేష్టమైనది.
వేసవి కాలంలో ఆకలి తగ్గడం అనేది ముఖ్యమైన సమస్య . దీనికి పానకం చాలా అద్భుతమైన
ఔషధం.
వడపప్పు యొక్క ఉపయోగాలు :-- దీనిలోని పెసరపప్పు రక్తస్రావాలను ఆపుతుంది. దప్పికను తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది మరియు నివారిస్తుంది. నిద్రను కలిగిస్తుంది. దద్దుర్లను
తగ్గిస్తుంది. పొడి దగ్గును నివారిస్తుంది.
పానకం యొక్క ఉపయోగాలు :-- దీనిని తాగితే ఎన్ని నీళ్ళు తాగినా తగ్గని దాహం తగ్గుతుంది.
తక్షణం శక్తిని ఇస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. దుమ్ము, ధూళి వలన వచ్చే జలుబును నివారిస్తుంది.
ఆకలిని పెంచుతుంది. ఇది ద్రవాహారం కాబట్టి నిర్జలీయతను రానివ్వదు. వడదెబ్బ నుండి
కాపాడుతుంది.
12-4-11.
వేసవి కాలం లో మానవులు కొంత పని చేసే సరికే అలసి పోతుంటారు. దీని నివారణకు
వడపప్పు, పానకం ఎంతో ఉపయోగకరమైనవి.
వడపప్పు యొక్క ఉపయోగాలు:--
అరికాళ్ళ మంటలు :-- పెసర పప్పును నానబెట్టి నూరి కర్పూరం కలిపి పాదాలకు పూయాలి.
శిరోవేదన, మంటలు :-- పెసరపప్పును నానబెట్టి నూరి మాడు మీద అంటించాలి.
కొబ్బరి :-- శక్తిని వృద్ధి చేస్తుంది.
పంచదార :-- తక్షణ శక్తిని ఇస్తుంది.
పానకం :-- బెల్లం, మిరియాలు, నీళ్ళు

శివ రాత్రి 2-3-11.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి