మొక్కలు -- ఆయుర్వేద ఉపయోగాలు

                                                 మొక్కలు   --  ఆయుర్వేద ఉపయోగాలు  


                                                                  ఉత్తరేణి                                                 19-8-11.

      ఉత్తరేణి వేరును కుంచేలాగా చేసి పళ్ళు తోముకోవాలి . ఎండిన పుల్లను రాత్రి నీటిలో నానబెట్టి తే ఉదయానికి మెత్తబడుతుంది . దీనితో పళ్ళు తోముకుంటే పళ్ళు , చిగుళ్ళు గట్టి పడడమే కాక నాలుక ద్వారా మెదడును చేరి
మతిమరుపును పోగొట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది .

                                                 రెడ్డివారి నానబాలు  మొక్క --- ఉపయోగాలు             23-8-11.

      దీనిని పచ్చబొట్టు మొక్క అని కూడా అంటారు . దీనిలో రెండు రకాలు వుంటాయి .చిన్న మొక్క  ( తెల్లనిది ) , పెద్ద
మొక్క  ( ఎర్రనిది )  .

   ఈ మొక్క యొక్క  కాడను  తుంచితే పాలు వస్తాయి .  ఆ పాలను కళ్ళలో వేసుకొని కళ్ళకు సంబంధించిన వ్యాయామాలు
కళ్ళను గుండ్రంగా తిప్పడం ,  అరిచేతులను రుద్ది ఆ వేడిని కళ్ళ  మీద పెట్టడం వంటివి చేయాలి . పైత్య శరీరము కలిగిన
వాళ్ళు ఈ పాలను కళ్ళలో వేసుకుంటే  కళ్ళు కొంచం చురుకుమంటాయియి , ఎరుపు గా అవుతాయి . అయినా భయపడవ
వలసిన పని లేదు అటువంటి వాళ్ళు చిన్న చెట్టు  పాలు వేసుకోవాలి  . అలా దొరకని పక్షం లో  పెద్ద మొక్క అయినా
పరవా లేదు

                                                గాయపాకు  లేదా గడ్డిచేమంతి   లేదా పలకాకు               24-8-11.

       ఇది తెగిన  లేదా ఎక్కడైనా గీరుకున్న , లేదా కొడవలి వంటి వాటి వలన కలిగిన గాయాలైన సులభంగా మానిపోతాయి
        గాయాన్ని శుభ్రం చేసి దాని మీద ఆకు పసరు పిండాలి . దాని మీద దూది కప్పి దూదిని కూడా పసరుతో తడపాలి .
ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే గాయం నొప్పి లేకుండా సులభంగా మానిపోతుంది .

                                                        పిప్పింటాకు  --- ఉపయోగాలు                             14-9-11
                                                    
                                                            1          పిప్పి పన్ను            

       ఒక్క ఆకును నలిపి  పంటి మీద పెడితే నొప్పి తగ్గుతుంది .  ఈ ఆకు యొక్క రసం లో దూది ని ముంచి  పంటి
మీద పెడితే నొప్పి తగ్గుతుంది          

                                                               2. చర్మ వ్యాధులు

పిప్పింటాకు  రసం
పుల్లటి మజ్జిగ
ముద్ద కర్పూరం

      అన్నింటిని కలిపి ఒక మట్టి పాత్రలో పోసి గుడ్డ కట్టి నెల రోజులు అలాగే  ఉంచాలి , తరువాత దానిని తీసి చూస్తే
లేపనం లాగా తయారై ఉంటుంది .  ఇది చర్మ వ్యాధులను ఎంతో బాగా నివారిస్తుంది .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి