యువకులలో మీసాలు, గడ్డాలు పెరగడానికి 29-5-09.
యువకులలో హార్మోన్స్ సరిగా పని చేయనపుడు ఈ విధంగా జరుగుతుంది. శిరస్సులో రక్తప్రసరణ బాగా జరిగితే ఈ సమస్య నివారింప బడుతుంది.
1.సర్వాంగాసనం :-- వెల్లకిలా పడుకొని వీపు మాత్రమే నేల మీద ఆనేట్లుగా వుండాలి. నడుము నుండి కాళ్ళ వరకు పైకేత్తాలి.
2.మత్స్యాసనం-- వెల్లకిలా పడుకొని పద్మాసనం వేసుకోవాలి.
3. శుక్ర వజ్రాసనం-- వెల్లకిలా పడుకొని పద్మాసనం వేసుకొని తలను వెనుకకు నేలకుఆనించాలి, మెడ నేలకు తగలకూడదు.
4. చక్రాసనం:-- వెల్లకిలా పడుకొని చేతులను, పాదాలను మాత్రమే నేలకు ఆన్నించాలి, శరీరం మొత్తాన్ని పైకి బాణం లాగా ఎత్తాలి.
కారణాలు:-- నిద్ర లేచిన వెంటనే సుఖవిరేచనం జరగకపోవడం, శరీరంలో సరిగా రక్త ప్రసరణ జరగక పోవడం శరీరంలో తగినంత రక్తం లేకపోవడం, ప్లీహము, పారా థైరాయిడ్ గ్రంధి వంటివి సరిగా పని చెయ్యకపోవడం మొదలైనవి.
కిస్మిస్ పండ్లు ---- 32
అంజూర పండ్లు ---- 2
ఎండుఖర్జూరం ---- 1
అన్నింటిని రాత్రి పూట అరగ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే పళ్ళు తోముకొని ఒక్కొక్క పండు తిని ఆ నీళ్ళు తాగాలి.
టొమాటోలు ----- 2
కారెట్ ----- 1
బీట్ రూట్ ----- చిన్న ముక్క
సాయంత్రం వేళ అన్నింటిని కలిపి జూస్ చేసుకొని దానిలో తేనె చక్కెర కలుపుకొని తాగడం గాని లేదా ముక్కలు చేసుకొని వాటి మీద తేనె చక్కెర కలిపి తినడం గాని చెయ్యాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి