వేవిళ్ళు

                 


                                                            
                                                        వేవిళ్ళు
          

           గర్భం ధరించిన రోజునుండి ప్రసవించే వరకు వాంతులు కాకుండా ఉండాలంటే

శొంటి                ----- 100 gr
సోంపు గింజలు   ------ 100 gr
సరస్వతి ఆకు   ------ 100 gr (పొడి)

  శొంటి, సోంపు గింజలను విడివిడిగా దోరగా వేయించి, జల్లించి, వస్త్రగాయం పట్టాలి.సరస్వతి ఆకుపొడినికూడా వస్త్రగాయం పట్టాలి.అన్నింటిని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలి.

     ప్రతి రోజు అర స్పూను పొడి, అర స్పూను కలకండ పాలల్లో కలుపుకొని తాగాలి .

ఉపయోగాలు :-- వాంతులు కావు,మలబద్ధకం ఉండదు ,ఆకలి అవుతుంది.

                                     వేవిళ్ళ నివారణ                                 4-6-10.

    వేవిళ్ళు వున్నవాళ్ళు ఒక లవంగాన్ని చప్పరిస్తూ వుంటే తగ్గి పోతాయి లేదా సైంధవ లవణంతో కలిపి కూడాతీసుకోవచ్చు.

    మర్రి వూడల నిజ రసం లేక కషాయం తాగితే మందులకు తగ్గని వేవిళ్ళు తగ్గి పోతాయిపాలు అభివృద్ధిచెందుతాయి.
                                                19-11-10

పుదీనా రసం
నిమ్మ రసం
తేనె

   అన్నింటిని కలిపి చప్పరించి మింగుతూ వుంటే వేవిళ్ళ వలన వచ్చే వాంతులు తగ్గుతాయి.

                                                  6-12-10

దానిమ్మ గింజల రసాన్ని తేనె కలిపి తీసుకుంటే తగ్గుతాయి.

                                                   7-7-10

మర్రి వూడల స్వరసం గాని, లేదా కషాయం రూపంలో గాని తాగితే వేవిళ్ళు తాగుతాయి.


                        గర్భిణి స్త్రీల లో వాంతుల సమస్య -- నివారణ                 13-1-11.


      అతిగా వాంతులైతేనే ప్రమాదం. రెండు, మూడు నెలల వరకు వుంటాయి. ఇవి ఐదు నెలల
వరకు కొనసాగవచ్చు .  మరికొంత మందిలో ప్రసవించే వరకు చాలా ఎక్కువగా అవుతుతాయి. ఇవి పిండం మీద ప్రభావం చూపే అవకాశం  కలదు. నిర్లక్ష్యం చేయకూడదు.

      ఈ సమస్యను నివారించడానికి మాదీఫల రసాయనం బాగా పని చేస్తుంది.


1. నిమ్మ కాయ రసం ప్రధమ చికిత్సగా అతి ప్రధానమైనది. నిమ్మరసాన్ని తేనెతో గాని, ఉప్పుతో గాని సేవిస్తే మంచది.

2. మారేడు పండు గుజ్జు పొడి --- ఒక టీ స్పూను
           అన్నం వార్చిన గంజి --- ఒక గ్లాసు

           గంజిలో పొడిని కలిపి తాగితే మంచి ఫలితం వుంటుంది.

3. మారేడు పండు గుజ్జు పొడి     --- 100 gr
                           అల్లం పేస్ట్ --- 100 gr
                     ధనియాల పొడి --- 50 gr
                                   బెల్లం --- తగినంత

      అన్నింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి బటాని గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలిదీనిని అన్నం యొక్క మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. వాంతులు ఎక్కువగా వుంటే మాత్రను నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి.

నియమాలు :-- వికారాన్ని ప్రేరేపించే ( కారం, తీపి, వగరు, చేదు ) పదార్ధాలను నివారించాలి. పుల్లని పదార్ధాలు ఎక్కువగా వాడితే అజీర్ణం చేస్తాయి. కాబట్టి తక్కువగా వాడుకోవాలి.

                                                        15-2-11.

      దానిమ్మ గింజల రసానికి నిమ్మ రసం కలిపి తాగాలి.
                                 
                                                         9-3-11

       హార్మోన్ల లో  తేడాల వలన  గర్భిణి సమయంలో  వాంతులు,  వికారాలు, ఆహార పదార్ధాల పై
 విముఖత ఏర్పడతాయి.

   అల్లం రసం               ---అర స్పూను   
   నిమ్మ రసం             --- ఒక టీ స్పూను
   పుదీనా రసం           --- ఒక టీ స్పూను 
          తేనె                 --- ఒక పెద్ద స్పూను

    అన్నింటిని కలిపి తీసుకోవాలి.

 2  లవంగాల పొడి       ---  ఒక గ్రాము   
     దానిమ్మ రసం       ---  అర కప్పు 

     రెండింటిని కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి.

 3. ఉసిరిక రసం          --- ఒక టీ స్పూను  
     జాజి కాయ  పొడి   ---  చిటికెడు 

                 రెండింటిని కలిపి తీసుకోవాలి.

     సూచనలు :--  శరీరానికి సరిపడని  అరగని ( నూనె) పదార్ధాలను వాడకూడదు.             
    వాంతి వచ్చే  ఫీలింగ్  ని  రానివ్వకూడదు.

    తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకోవాలి.

    అర గంట తరువాత కూడా తిన్న పదార్ధాల త్రేన్పులు  రాకూడదు.

                                                         వేవిళ్ళ నివారణకు  --- గర్భ మిత్ర                            2-9-11.
ఎండుద్రాక్ష                  ----50 gr
వట్టి వేర్ల చూర్ణం            ----50 gr
అతిమధురం  చూర్ణం     ----50 gr
పంచదార                    ----50 gr
తేనె                            ----50 gr   ( 5 టీ స్పూన్లు )

      అన్నింటిని కలిపి , ముద్దగా దంచి నిల్వ చేసుకోవాలి .

      ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం  పూటకు  10 గ్రాముల చొప్పున నోట్లో వేసుకొని చప్పరిస్తూ రసాన్ని మింగాలి .
దీనివలన గర్భిణి వేవిళ్ళ వలన కలిగే వాంతులు , మరియు పైత్యం వలన కలిగే వాంతులు కూడా నివారింపబడతాయి .
     
  
     












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి