జ్వరము వలన సమస్యలు

                                                      పైత్య జ్వరాలు 

అధికంగా వేడి చేసినపుడు , కఫము ఎక్కువగా చేరినపుడు పైత్య జ్వరాలు వస్తాయి.

పెసర కట్టు ఆహారం :--

పచ్చి పెసలు            ------------ 80 gr
           నీళ్ళు       ----------- 1280 gr
దోరగా వేయించిన జిలకర పొడి    -- 5 gr
" " పిప్పళ్ల పొడి                     --- 2 gr
      శొంటి పొడి                     ---- 5 gr
సైంధవ లవణం                       --- 5 gr

ఒక పాత్రలో కడిగి ,నానబెట్టిన పెసలు ,నీళ్ళు పోసి సన్న మంట మీద మెత్తగా గుగ్గిళ్ళ లాగా ఉడకాలి.

పోసిన నీళ్ళలో పావు వంతు మిగలాలి.దీనిని దించి ,మెత్తగా ముద్దకంతో రుద్దాలి. తరువాత వడకట్టాలి.ఆరసం లో పోడులన్నివేసి బాగా కలపాలి. దీనిని గ్లాసులో పోసుకొని మూడు పూటలా గోరువెచ్చగా తాగాలి.

       దీని వలన జ్వరము ,కఫం,తల నొప్పి తగ్గుతాయి.

      జ్వరం వున్న వాళ్లకు దీనినే ఆహారంగా ఇవ్వవచ్చు


జ్వరం వలన వచ్చే వాంతులు, విరేచనాలు -- నివారణ                                         19-11-10.

ఒక కప్పు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులను వేసి అరకప్పుకు కషాయం వచ్చేట్లుగా కాచాలి. దీనిలో

    మిరియాల పొడి ---- అర టీ స్పూను

        పిప్పళ్ళ పొడి ---- అర టీ స్పూను

          శొంటి పొడి ---- ఒక టీ స్పూను

                      వీటిని పేస్ట్ లాగా చేసి కషాయంలో వేసి కాచాలి.

                     దీనిని తాగితే జ్వరము, వాంతులు, విరేచనాలు తగ్గుతాయి.

జ్వరంలో నోరు ఎండిపోవడం                                                                      21-1-11.

       ఎండుద్రాక్ష, బెల్లం కలిపి నూరి దానిమ్మ రసం కలిపి పుక్కిలించాలి.


                                                లోజ్వరం                                                 21-2=11.

తిప్ప తీగ  చూర్ణం         ---- 50 gr
నేలవేము చూర్ణం           ---- 50 gr
వంశ లోచనం                ---- 50 gr
అతిమధురం                ---- 50 gr
కటుక  రోహిణి               ---- 50 gr
తుంగ ముస్థలు             ---- 50 gr
శొంటి                          ---- 25 gr
పిప్పళ్ళు                      ----25 gr
మిరియాలు                 ---- 25 gr
బెల్లం                         ---- తగినంత

 అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి నూరి

          శనగ గింజలంత మాత్రలు చేసి ఆర బెట్టాలి. బాగా ఆరిన తరువాత నిల్వ చేసుకోవాలి.

          ప్రతి రోజు ఒక మాత్ర వేసుకుంటూ వుంటే లోజ్వరం తగ్గిపోతుంది.


                                 వేసవిలో వచ్చే పైత్యజ్వరాలు                                          14-3-11.

    లక్షణాలు :--  విరేచనాలు, వాంతులు, కళ్ళమంటలు , ఒళ్లుమంటలు, బలహీనత, కొంతదూరం
 కూడా నడవలేక పోవడం,  ఆహారం జీర్ణం కాకపోవడం, నోరు ఎర్రబారడం, నాలుక మంట,  అతి
  దాహం, ఆకలి, దప్పిక తీరకపోవడం ,  మలం పసుపు రంగులో వుండడం వంటి లక్షణాలు
  ఈ సమస్యలు వుంటాయి.
     సంజీవని వటి,    అమృతారిష్ట    లను వాడాలి.
     ఆహారంలో వేడి చెయ్యని పదార్ధాలను వాడాలి,  చిలికిన మజ్జిగను  వాడాలి.

             కటుక రోహిణి  చూర్ణం            --- 100 gr
             తుంగ ముస్తల చూర్ణం            --- 100 gr (అన్నిరకాల పైత్యజ్వరాలను నివారించడంలో
              తిప్పతీగ         చూర్ణం          --- 100 gr                                         ప్రశస్తమైనది )
       ఎండు ద్రాక్ష(లేదా)ఎండు ఖర్జూరం  --- 100 gr

              అన్ని పదార్ధాలను కల్వంలో వేసి మెత్తగా నూరి శనగ గింజలంత  మాత్రలు చేసి నిల్వ
  చేసుకోవాలి.

              పూటకు రెండు మాత్రల చొప్పున మూడుపూటలా  ( రోజుకు ఆరు మాత్రలు)  వాడాలి.
       మంచి నీటితో గాని,  తియ్యటి మజ్జిగతో గాని మాత్రలను వేసుకోవాలి.


 
                           జ్వరం తగ్గిన తరువాత వచ్చే నీరసం తగ్గడానికి                          16-11-10.

        ఉలవలు, పెసలు వేయించి,  దంచి  చారు ( రసం ) కాచి తాగుతూ వుంటే నీరసం తగ్గుతుంది.
                                                                                                          

                                                                                         













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి