అతిదాహం

                 అతి దాహం -- నివారణ --భావమిశ్ర గులాబి పానీయం                           15-2-09.
                          ఎండిన గులాబి రేకులు          ----- 60 gr
        గులాబి రేకులను బాగా గాలి తగిలే చోట నీడలో ఆరబెట్టాలి. అవి బాగా ఎండిన తరువాత వాటిలో రెండు లీటర్ల నీళ్ళు పొయ్యాలి.బాగా పిసికి స్టవ్ మీద పెట్టి  ఒక లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి. మంటని ఆపి నిదానంగా వడకట్టాలి.ఈ కషాయంలో పావు కేజీ కలకండ కలపాలి

  మరలా  స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై మరిగిస్తే పాకం మిగులుతుంది.దానిని చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి.

      ఒక స్పూను పాకాన్ని ఒక గ్లాసు నీటికి కలుపుకొని తాగాలి.ఇది తాగి ఎంత ఎండలో తిరిగినా
ఏమి కాదు అతి దాహం నివారింపబడుతుంది.అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది.
                                                 దప్పిక -- నివారణ                          18-11-10.
          ధనియాలను నలగగొట్టి దానికి ఆరు రెట్లు నీటిని చేర్చి రాత్రంతా నానబెట్టాలి (హిమ కషాయం) ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి. దానిలో పంచదార, తేనె కలిపి తీసుకుంటే ఎంత తీవ్రమైన దాహం కూడా నివారింపబడుతుంది.

                                               అతి దాహం                                                16-3-11.

        లక్షణాలు :-- శరీరమంతా మంటగా వుండడం, అతిదాహం, మూత్రం ఎక్కువసార్లు రావడం,
  నీరసం అనే లక్షణాలు వుంటాయి.

        కారణాలు :--   రక్తహీనత, ఆహారం సరిగా వంటబట్టకపోవడం,  అతి చెమట  మొదలగు
   కారణాల వలన వస్తుంది.
     
       సూచన ;--   నీటిశాతం ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను తినాలి.

       1.      వట్టివేర్ల  పొడి      --- ఒక టీ స్పూను
                       నీళ్ళు         --- ఒక గ్లాసు

        నీటిలో పొడి వేసి కాచి  అర గ్లాసుకు  రానిచ్చి చక్కెర  కలిపి  తాగాలి.

        2.      సుగంధపాల వేర్ల పొడి           
                          చక్కెర

         పొడి ని నీళ్ళలో వేసి  కాచి చక్కెర కలిపి తాగాలి.

         3.      వట్టివేర్ల పొడి
                  సుగంధపాల వేర్ల పొడి
                  శతావరి వేర్ల పొడి

                           అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని నిల్వ చేసుకోవాలి.
           ఒక స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి  కాచి అర గ్లాసుకు రానిచ్చి చక్కెర కలిపితాగాలి.





              







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి