చిట్కాలు
అతిగా మాంసం తిన్నపుడు సమస్య ఏర్పడితే 3-1-11
నల్ల నువ్వులు --- ఒక టీ స్పూను
బెల్లం --- తగినంత
రెండింటిని కలిపి తింటే సమస్య నివారింప బడుతుంది.
9-1-11
2. అనారోగ్యానికి వాడే మందులు సక్రమంగా పనిచెయ్యాలంటే 4-1-11.
అనుపానాలను సక్రమంగా వాడాలి కేవలం నీటిని మాత్రమే తీసుకునే వాళ్ళు వాటితో పాటు అన్నం వార్చిన గంజి తీసుకుంటే మందులు బాగా పనిచేస్తాయి.
భోజనంలో పాల పదార్ధాల ఆవశ్యకత 6-1-11.
భోజనంలో పాల పదార్ధాలు లేకుండా భుజించ కూడదు.
రాజుకు భూమి
ముఖానికి నేత్ర సౌందర్యం
పదాలకు లాలిత్యం
ఎలాంటివో భోజనానికి పాల పదార్ధాలు అలాంటివి.
భస్మక రోగం 6-1-11.
రేగు పండ్ల గింజలను చూర్ణం చేసి ప్రతి రోజూ తీసుకుంటూ వుంటే ఎంత తిన్నా ఇంకా తినాలనే కోరిక నివారింప బడుతుంది.
శరీరంలో అనవసరంగా నీరు చేరితే 7-1-11.
ఈ సమస్య రావడానికి అతి ముఖ్య కారణం ఆహారం తక్కువ తీసుకోవడం.
దాల్చిన చెక్క చూర్ణం --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
కలిపి ప్రతి రోజు తీసుకుంటే ఆరు నెలల్లో శరీరంలోని నీరు పూర్తిగా తగ్గిపోతుంది.
9-1-11
ఎక్కువ నీళ్ళు తాగితే ఆకలి చల్లారుతుంది, తక్కువ తాగితే జీర్ణ శక్తి నశిస్తుంది. జత రాగ్నిని పెంచుకోవాలంటే కొద్ది కొద్దిగా తాగుతూ వుండాలి
శీతాకాలంలో శరీరం మీద పగుళ్ళు 11-1-11.
పెసలు
నిమ్మ తొక్కలు
రెండింటిని కలిపి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
మొదట శరీరాన్ని తైలంతో మర్దన చెయ్యాలి. తరువాత పై పిండితో రుద్దుకుని స్నానం చేయాలి.
శీతాకాలంలో చర్మం మృదుగా ఉండాలంటే 15-1-11
పొడిబారిన చర్మం మీద ఆవు నెయ్యి రాస్తే చర్మం మృదువుగా మారుతుంది.
కుక్క తరిమితే 17-1-11.
మార్నింగ్ వాక్ కి వెళ్ళినపుడు కుక్క వెంట బడి అరుస్తూ వుంటే అది అరిచేతపుడు దాని కళ్ళలోకి సూటిగా చూడాలి. చూపు అటుఇటు కదలకూడదు, పరుగెత్త కూడదు. నిలబడి దాని కళ్ళలోకి మాత్రమే చూడాలి.
గొంతు మధురంగా ఉండాలంటే
ప్రతిరోజు మామిడి చిగుళ్ళను తింటూ వుండాలి
గొంతు మధురంగా ఉండాలంటే
ప్రతిరోజు మామిడి చిగుళ్ళను తింటూ వుండాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి