శరీరం

                      శరీరంలోని మలినాలను తొలగించడానికి --సంజీవని రసాయనం        1-1-2009.

        ఉత్తరేణి లోని అన్ని భాగాలలో అమృతం నిండి వుంటుంది. కాని అశుభ్రమైన ప్రదేశాలలోని మొక్కలు  పనికి రావు ( స్మశానంలో,రోడ్ల పక్కన,మలిన ప్రాంతాలు)

         శుభ్రమైన మొక్కలను  వేళ్ళతో సహా తెచ్చి వెళ్ళాను కత్తిరించి పక్కన పెట్టాలి.  పరిశుభ్రమైన ఆకులు కలిగిన చెట్లను తెచుకోవాలి.ఆకులను వేర్లను ఎండబెట్టి విడివిడిగా దంచి పొడి చెయ్యాలి.

                                   ఆకులపొడి             ---- 50 gr
                                   వేర్ల పొడి                ---- 50 gr
                                   కలకండ  పొడి        ---- 100 gr
 
     కలిపి గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి.
 
     మూడు చిటికెల పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి.తిన్న తరువాత ఒక గంట వరకు ఏమి తినరాదు.
 
ఉదయం పూట మాత్రమే వేసుకోవాలి.
 
      ఇది శరీరంలోని  ఏ భాగం లోని మలినాలనైనా తొలగిస్తుంది.

                      శరీర దుర్వాసన --నివారణ                                           3-2-09.
 
                  నల్ల ఉలవల పిండి                             ----- 100 gr
                  మెంతుల పొడి                                 -----  100 gr 
                  మంచి పసుపు                               ------  100 gr
                  బావంచాలు                                   -----  100 gr
                  కరక్కాయల బెరడు పొడి                 -----   100 gr
                  కచ్చూరాలు                                 -----   100 gr
 
       అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి, కలిపి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇది కొంచం బరకగా వుంటే మంచిది .
 
      ఈ పిండిని తగినంత తీసుకొని నీల్లుగాని, పాలుగాని కలిపి శరీరానికి పట్టించి కొంతసేపైన తరువాత స్నానం చెయ్యాలి.
 
               శరీరం లోని వేడిని, మలినాలను తొలగించడానికి మృత్తికా స్నానం          11-2-09.
 
      ఇది శరీరం లోని సకల మలినాలను తొలగిస్తుంది.
 
      పూర్వం ఒండ్రుమట్టి తెచ్చి పిసికి  ఒంటికి, తలకు రుద్దుకొనే వాళ్ళు. తలపై కొంతసేపటికి పులిసేది .
 ఒండ్రు మట్టి 5 లేక 10 కిలోలు తెచ్చి ఎండబెట్టి జల్లించాలి.
 
    వేపాకు, తులసి ఆకు, పసుపు లను విడివిడిగా దంచి జల్లించి విడివిడిగా నిల్వ చేసుకోవాలి.  
 
                             వేపాకు పొడి          ----- 2 టీ స్పూన్లు
                             తులసి ఆకుల పొడి ---- 2 టీ స్పూన్లు
                             పసుపు పొడి          ---- 2 టీ స్పూన్లు
                             ఒండ్రు మట్టి            ----- తగినంత
 
     బాగా వేడి శరీరం వున్న వాళ్ళు కొద్దిగా ముద్దా కర్పూరం కలుపుకోవచ్చు.
 
    ఈ పోడులన్నింటిని తగినంత నీరు కలిపి ముద్దగా చేసి ఒంటికి, ముఖానికి, తలకు పట్టించాలి. అర గంట  తరువాత స్నానం చేయవచ్చు. దీని వలన శరీరం లోని మలినాలు, వేడి తగ్గి పోతాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది

                      శరీర దృఢత్వానికి దృఢబల రసాయనం                                9-5-09.
 
                     అశ్వగంధ దుంపల పొడి           ----- ఒక టీ స్పూను
                                  పాలు                      ----- ఒక గ్లాసు
                                 నెయ్యి                      ----- ఒక టీ స్పూను
                              పటికబెల్లం                   ----- ఒక టీ స్పూను

       అశ్వగంధ దుంపలను పాలతో శుద్ధి చేసి పొడి తయారు చేసుకోవాలి.

      వేడి పాలలో అన్నింటిని కలిపి తాగాలి.

      ఇది శారీరక , మానసిక రోగాలను కూడా నివారిస్తుంది, మరియు
బాలెంతలు, గర్భిణి స్త్రీలు, పిల్లలు, అనారోగ్యవంతులకు,  పురుషులకు కూడా ఎంతో ఉపయోగ
పడుతుంది    ఎంతో శక్తిని ఇస్తుంది.

                         శరీరం ఉల్లాసంగా ఉండడానికి చిట్కా                    18-11-10.

ఆలివ్ ఆయిల్                   --- పది చుక్కలు
రోజ్ వాటర్                       --- పది చుక్కలు
పాలు                               --- పది చుక్కలు

     అన్నింటిని కలిపి శరీరానికి మర్దన చేసి అర గంట తరువాత స్నానం చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

                     శరీరంలో మంటలను నివారించే లేపనం                              16-1-11.

నువ్వుల నూనె                   --- 16  టీ స్పూన్లు
సజ్జ రసం పొడి                    ---   4        "
మైల తుత్తం                       ---   2        " ( పెరుగులో నానబెట్టి శుద్ధి చేయాలి)
పటిక  పొడి                        ---   2        "

         నువ్వుల నూనెను స్టవ్ మీద పెట్టి నురుగు మాత్రమే వచ్చే వరకు వేడి చేయాలి.  పొగ రాకూడదు.  దీనిని స్టవ్ మీద నుండి దింపి అన్ని పొడులను  ఒకదాని తరువాత మరొకటి చొప్పున బాగా కలియబెడుతూ వేయాలి.
 
దీనిని వేడిగా ఉండగానే వడపోసుకోవాలి.  పూర్తిగా చల్లారనిచ్చి చల్లని నీళ్ళు పోసి పిసకాలి.  20,  30  సార్లు బాగా  పిసికితే  ఆయింట్మెంట్  తయారై  నీళ్ళు వేరవుతాయి.   ఈ నీటిని  వంచేయాలి.  దీనిని సీసాలో వేసి కొద్దిగా నీళ్ళు  పోసి ఉంచాలి.  దీని వలన తాజాగా వుంటుంది.

ఉపయోగాలు :--    దీనిని పై పూతకు మాత్రమే వాడాలి.
 
           ఇది కాలిన గాయాల వలన ఏర్పడిన మంటలను,  మలద్వారంలో ఏర్పడే మంటలను,  అర్శమొలల  వలన   ఏర్పడే మంటలను నివారిస్తుంది.    దీని వలన దురదలు కూడా తగ్గుతాయి.

                                                శరీరం లో మంటలు  --- నివారణ                       2-6-11.

          ప్రశస్తమైన వంటాముదాన్ని అరికాళ్ళకు పట్టించి బాగా మర్దన చేయాలి. తలకు, శరీరానికి కూడా మర్దన చేయాలి.

          బార్లీ  నీళ్ళు, ధనియాల కషాయం, చెరకు రసం, ద్రాక్ష రసం, దానిమ్మ రసం ఎక్కువగా వాడాలి.

     



                                
                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి