సెగ గడ్డలు

                                           సెగ గడ్డలు  --- నివారణ                                                 18-5-10.

      గ్రీష్మ ఋతువులో వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి.

      పల్చని మజ్జిగలో సన్నని అల్లం, కొత్తిమీర, పుదీనా, జిలకర, సైంధవ లవణం, నిమ్మరసం  కలిపి తాగాలి.

దీనిని సేవిస్తే వేసవిలో ఎలాంటి సమస్యలు రావు.

     శరీరంలోని వేడి రక్తము  ద్వారా, గడ్డలద్వారా బయటకు నెట్టి వేయబడుతుంది. ఆ సమయంలో శరీరంలో గడ్డలు ఏర్పడతాయి.

బార్లీ గింజల పిండి
గోధుమ పిండి
మినుముల పిండి.

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని దంచి,జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

      ఈ పిండిని అవసరమైనంత తీసుకొనితగినంత నీరు కలిపి మెత్తగా బంకగా, గుజ్జుగా నూరి కొంచం గోరువెచ్చగా
వేడిచేసి గడ్డలపై మందంగా లేపనం చేయాలి.
      ఈ విధంగా చేయడం వలన రాయిలాగా గట్టిపడిన గద్దలుకూడా దీంతో కరిగి పగిలి చీము, రక్తం బయటకు
వస్తాయి.
                            సెగ గడ్డల నివారణకు -- సుర దారు లేపనం                                  12-12-10.

         ఇవి  ముఖ్యంగా ఒత్తిడి పడే చోట వస్తాయి.  మళ్లీ మళ్లీ వస్తుంటాయి.

దేవదారు చెక్క పొడి                   ---- 100 gr
దోరగా వేయించిన శొంటి పొడి       ---- 100 gr
నవాసాగర చూర్ణం                      ---- 100 gr  ( అమోనియం క్లోరైడ్ )

        విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి భద్ర పరచుకోవాలి.

ఉపయోగించే విధానం:-- 

        ఒకటి, రెండు స్పూన్ల పొడిని తీసుకొని నీటిని కలిపి గాని, నిమ్మ రసం కలిపి గాని గడ్డలపై పూయాలి. గడ్డ పక్వ స్థితిలోవున్నపుడు పూస్తే పగులుతుంది. లేనపుడు అణిగి పోతుంది.

                                                           11-10-10

     కరివేపాకును  ముద్దగా నూరి పెనం మీద వేడి చేసి గడ్డల మీద వేసి కట్టాలి. రాత్రి కడితే ఉదయానికి పగిలి  తగ్గిపోతుంది.

                                    సెగ గడ్డలు -- పరిష్కార మార్గాలు                                        28-10-10.

     గడ్డలలోని మలినాలు ఒక్కొక్కసారి విరేచనాల ద్వారా కూడా  బహిష్కరింప బడతాయి.

సుగంధ పాల వేర్ల బెరడు                      ---- 100 gr
వట్టి వేర్లు                                           ----100 gr
శతావరి వేర్లు                                      ----100 gr
అతి మధురం                                      --- 100 gr
రక్త చందనం (బెరడు లేక కాండం)            ----100 gr
బెల్లం లేదా చక్కెర  లేదా పటికబెల్లం     ----1500 gr
                                           నీళ్ళు   ----నాలుగు రెట్లు

    ఒక పాత్రలో నీళ్ళు పోసి చక్కెరను, మూలికల చూర్ణాలను వేసి బాగా కలిపి వేడి చెయ్యాలి. బాగా కాగిన తరువాత జావ  లేదా పాయసం లాగ తయారవుతుంది. వడకట్టి  10,  15 గ్రాముల పచ్చకర్పూరం కలుపుకోవాలి.

సీసాలో నిల్వ చేసుకోవాలి.

    50 గ్రాముల పానకాన్ని 10 ml నీటిలో కలుపుకొని తాగాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చెయ్యాలి.      దీని వలన కురుపులు, గడ్డలు నివారింపబడతాయి.
 
     " ఎక్కువగా వేడి చేసినపుడు కూడా ఈ పానకాన్ని తాగవచ్చు"

      ఏది కూడా ఎక్కువగా వాడకూడదు.  మాంసం ముఖ్యంగా కోడి మాంసం, గుడ్లు ఎక్కువగా వాడకూడదు

కీర, దోస వంటి చల్లని పదార్ధాలను వాడాలి.

                            చిట్కా                                                                           24-11-10.

       కంద గడ్డకు బంక మట్టి పేస్ట్  పూసి  నిప్పులపై కాల్చి మట్టిని తీసేసి గడ్డకు బెల్లం కలిపి నూరి సెగ గడ్డల  మీద పూయాలి.
                                                              23-12-10

చారెడు మెంతులు
చారెడు గోధుమ పిండి

           రెండింటిని కలిపి ఉడికించి గడ్డలపై పూయాలి.

                        శరీరంలో పెరిగే గడ్డలు  --కిలాయిడ్స్  --నివారణ                                 10-1-11.
          
           ఇవి ఒక పట్టాన తగ్గవు.   ఇది దీర్ఘకాల వ్యాధి.  ఒక వరణం  లేక గాయం మానుతూ గట్టిపడి  నిలబడిపోయి
గడ్డ లాగా  అవుతుంది.   ఈ సమస్య  కొంత మందిలో వుంటుంది.   ఇవి ముఖ్యంగా చాతీ మీద, వీపు మీద, చెవి తమ్మెల మీద వస్తుంటాయి.

           వాత శరీర తత్వం వలన కొంత మందిలో మాత్రమే  ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు  శరీరం మీద నిప్పు రవ్వలు  పడకుండా జాగ్రత్త వహించాలి.  ఇవి శాశ్వతంగా తయారవుతుంటాయి.

లక్షణాలు :-   రబ్బరు బంతి లాగా,  గడ్డ లాగా వుంటుంది.  క్రమంగా ముదురు రంగుకు మారుతుంది.  దీని మీద   వెంట్రుకలు మొలుస్తాయి.  వీటిని గిల్లకూడదు.  వేడి నూనె వంటివి పడకుండా చూసుకోవాలి. 

           నాణ్యమైన టేప్  ను  వీటి మీద అంటిస్తే  క్రమిపి తగ్గి  అణిగి పోతాయి.

           మిరియాలను కొబ్బరి నూనెలో వేసి కాచి  చల్లార్చి పూయాలి.

                                సెగ గడ్డలు లేక చీము గడ్డలు                                             10-4-11.

       ఇవి ఎక్కువగా వచ్చే ప్రదేశాలు :-- చర్మం మీద,  మొటిమలలో ఇన్ఫెక్షన్ చేరడం వలన,
 చంకలలో, గజ్జలలో మాటి మాటికి రావడం, పిరుదుల ముడతలలో( ఎక్కువగా కూర్చోవడం వలన ) చర్మంలో  చెక్క పేళ్లు  గుచ్చుకోవడం వలన  మొదలగునవి.

                                              వేప మలాం ( Neem Ointment)

                     తేనె మైనం                          --- 60  gr
                     తాజా పచ్చి వేపాకులు          --- 25 gr 
                          నువ్వుల నూనె               --- 50 gr

          వేపాకులను కల్వంలో వేసి నీళ్ళు చల్లుతూ మెత్తగా ముద్దగా నూరాలి.

          ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత
 దానిలో వేపాకుల ముద్దను వేయాలి. సన్న మంట మీద తేమ ఇంకి పోయే వరకు కలియబెట్టాలి.
 తరువాత వడకట్టి  వేడిగా ఉండగానే దానిలో తేనె మైనం కలపాలి. ( తేనె మైనాన్ని ముందే వేడిచేసి
 వడకట్టి పెట్టుకోవాలి)   దీనిని వెడల్పు మూత కలిగిన సీసాలో పెట్టి చల్లారిన తరువాత మూత
 పెట్టాలి.
              దీనిని చీము పట్టిన గడ్డలపై పూయాలి . గడ్డ పగులుతుంది. పగిలిన గడ్డలపై పూసినా
  త్వరగా మానిపోతాయి.  దీనిని గాయాలకు కూడా వాడవచ్చు. 

               వేడి నీటిలో ఉప్పు వేసి దానిలో గుడ్డను ముంచి పిండి గడ్డలపై కాపడం పెడితే వాపు
  తగ్గుతుంది.

                            శరీరంలో ఎటువంటి గడ్డలు వున్నా నివారణకు చిట్కా               13-4-11.

          పెరుగు            --- 50 gr
          తులసి రసం     --- 25 gr

   రెండింటిని కలిపి తాగాలి.  ఈ విధంగా రోజుకు రెండు సార్లు తాగాలి.
   ఈ విధంగా చేయడం వలన శరీరంలో ఎటువంటి గడ్డలు వున్నా కరిగిపోతాయి.

                                                  సెగ గడ్డలు    ---  నివారణ                            24-6-11 .

       
    వేడి చేసే పదార్ధాలు వాడకూడదు .    ఎంతటి వేడి చేసిన సమస్యలకైనా  అతిమధురం వాడడం చాలా  శ్రేష్ట కరం

    అతిమధురం పొడిని నీటిలో వేసి కాచి తాగాలి ,

    కలబందగుజ్జు లో పసుపుపొడి కలిపి గడ్డ మీద వేసి కట్టు కట్టాలి ,  లేదా మట్టి పట్టి వేయవచ్చు .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--

    బార్లీ నీళ్ళు, తీపి దానిమ్మ రసం , పలుచని మజ్జిగ  ఎక్కువగా వాడాలి ,

    వరుణముద్ర  వేయాలి . బొటనవ్రేలి  చివర ,  చిటికెన వ్రేలి చివర  కలిపి మిగతా మూడు వ్రేళ్ళను కిందికి దించాలి .
    చంద్రభేదన ప్రాణాయామం చేస్తే  వేడి బాగా తగ్గుతుంది .

                                                      సెగ గడ్డలు   --- నివారణ                            26-7-11.
లక్షణాలు :---  విపరీతమైన నొప్పి వుండి ,  పగిలి చీము కారుతూ వుంటుంది ..  జ్వరము , వణుకు వుంటుంది .

కారణాలు :--- ఇన్ఫెక్షన్ వున్న వ్యక్తితో సన్నిహితంగా మెలగడం .  వ్యాధి నిరోధక శక్తి తగ్గడం

1. ఆవాల పొడి              --- ఒక టీ స్పూను
    గసాల పొడి               --- ఒక టీ స్పూను
    కర్పూరం                 --- ఒక టీ స్పూను
    పెరుగు                    --- తగినంత

          అన్నింటిని పేస్ట్  లాగా కలిపి ఒక గుడ్డ ముక్క మీద పూసి  గడ్డల  మీద పరిస్తే కొంత సేపటికి గడ్డ పగిలి చీము
బయటకు వస్తుంది .

2. ముసామ్బరం           --- ఒక టీ స్పూను
    ఇంగువ                  --- ఒక టీ స్పూను
    ఆవుపాలు              --- తగినన్ని

         అన్నింటిని మెత్తగా నూరి ముద్దగా నూరి ఒక గుడ్డ మీద పట్టీలాగా పూయాలి దీనిని గడ్డ మీద పరచాలి . దీనితో
గడ్డ లో వేడి పుట్టి  పగులుతుంది

 
        










 

1 కామెంట్‌: