నిమ్మ పండు యొక్క ఉపయోగాలు

                 నిమ్మ పండు యొక్క ఉపయోగాలు                                      15-12-10.

1.  విరేచనాల   సమయం లో నిర్జలీకరణ (Dehydration)  జరిగినపుడు:--

                 నిమ్మ రసం           --- ఒక టీ స్పూను
                         ఉప్పు         --- చిటికెడు
               గోరువెచ్చని నీరు    ----ఒక గ్లాసు

     అన్నింటిని కలిపి తాగాలి. ఈవిధంగా రెండు, మూడు గంటలకొకసారి తాగితే సమస్య నివారింప బడుతుంది.

2. ఊబ కాయము :--

               నిమ్మ రసం               --- ఒక టీ స్పూను
                       తేనె                 --- ఒక టీ స్పూను
  గోరువెచ్చని నీరు                   ---- ఒక కప్పు

       అన్నింటిని కలిపి తాగాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి.

3. చెవిపోటు:--  నిమ్మ రసంలో ఒకే ఒక్క ఉప్పు కల్లు కరిగించి వేడి చేసి చెవిలో వేస్తి చెవిపోటు నివారించ    బడుతుంది.

4. దురదలు, చిడుము:--  నిమ్మ ఆకులకు పసుపు కలిపి నూరి లేపనం చేస్తే తగ్గుతుంది.

5. గోరుచుట్టు:--  నిమ్మ కాయకు రంధ్రం చేసి దానిలో ఉప్పు, పసుపు వేసి కూరి గోరుచుట్టు లేచిన వేలికి తొడగాలి. ఈ విధంగా రెండు, మూడు రోజులు చేస్తే తగ్గుతుంది.




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి