అల్సర్

                                అల్సర్ (కడుపులో పుండ్లు) --నివారణ                                     2-2-09.
 
           అతివేడి, అతి ఉప్పు, అతి పులుపు, అతి కారం వలన ఎక్కువవుతుంది.
 
           మంచి  మెత్తటి రేగడి మట్టిని తెచ్చి మట్టి పట్టి తయారుచెయ్యాలి.పొట్ట మీద పట్టివేసి దుప్పటి కప్పాలి. దీని వలన ప్రేగులలోని పుండ్లు నివారింప బడతాయి.
 
          పెద్దవాళ్ళు  ఒక లీటరు గోరు వెచ్చని నీటిని తీసుకొని కొంచం ఉప్పు కలిపి తాగాలి.నోట్లో వేళ్ళు పెట్టి కక్కాలి
 
బి. పి వున్నవాళ్ళు ఉప్పు లేని నీళ్ళు తాగాలి.
 
శీతలీ ప్రాణాయామం :--   పద్మాసనంలో కూర్చొని,నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని రెండు, మూడు సార్లు పీల్చి మింగాలి. తరువాత నెమ్మదిగా వదలాలి.
 
     సూర్యోదయం కాగానే కడుపులోని కాలేయం(లివరు ) మీద ప్రభావం చూపుతుంది.సూర్య రసం ఉత్పత్తి అవుతుంది.  ఆ సమయంలో పొట్టను కాఫీ లాంటి వేడి వస్తువులతో నింప రాదు.
 
ఆహారం :--
 
1. ఎంత నొప్పితో బాధ పడుఅతున్న వెంటనే తగ్గించుకోవచ్చు. పాలను కాచి మట్టి పాత్రలో పోసి పెట్టుకొని చక్కర 
కలుపుకొని మెల్ల మెల్లగా తాగాలి.
 
2.       అల్లం రసం                   ---- 1 టీ స్పూను 
          పాత బెల్లం                  ----  10 gr 
          దో, వే. నల్ల నువ్వుల పొడి  ---10 gr
 
       అన్నింటిని కలిపి ముద్దగా దంచాలి. ఆ ముద్దను బుగ్గలో పెట్టుకొని రసం మింగుతూ వుండాలి.అరగంట వరకు ఏమి తినకూడదు  నీళ్ళు కూడా తాగ కూడదు.
 
                        గాస్త్రిక్  అల్సర్ -- నివారణ                                                  17-6-10.
 
       కడుపులో పుండుకు, మంటకు తేడా వుంటుంది. ప్రేవుల గోడలకు అంటుకొని వున్నమ్యూకస్ పొర చిరిగిన చోట పుండు ఏర్పడుతుంది.

కారణాలు :--
 
      ఎక్కువ పులుపు, కారం పదార్ధాలను తిని చల్లని పదార్ధాలను తినకుండా, నీరు తాగకుండా వుండడం వలనమాంస పదార్ధాలను ఎక్కువగా భుజించడం, ఆహార పదార్ధాలలో నూనె లేకుండా తినడం, మద్యపానం, ధూమపానం వంటి వాటి వలన వస్తుంది.
 
       ఈ వ్యాధి వున్నవాళ్ళు మూడు నెలలు పెరుగన్నం, మజ్జిగన్నం ఎక్కువగా తినాలి.  పైన చెప్పబడినచేయకూడని పనులను చేయడం మానెయ్యాలి.  ఒత్తిడిని తగ్గించుకోవాలి.

వ్యాయామాలు చెయ్యాలి. కడుపు నొప్పివచ్చినపుడు గోరువెచ్చని నీరు తాగాలి.  తియ్యని మజ్జిగ ఏ పూటకాపూట తోడుబెట్టుకొని వాడాలి.
 
అతి మధురం   పొడి           ---- 100 gr
సోంపు గింజల పొడి             ---- 100 gr
 
      రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని గోరువెచ్చని పాలు తాగాలి.
      దీనితో పుండు మానుతుంది, మంట తగ్గుతుంది.
 
      శీతాఫల చూర్ణం, త్రికటు చూర్ణం వాడాలి.

                                  అల్సర్--- నివారణ                                                     14-12-10.

      బొడ్డు  నుండి చాతీ వరకు నొప్పి వుంటుంది.  పొట్ట ఖాళీగా వున్నపుడు ఎక్కువగా వుంటుంది,. దానితో ఎక్కువగా తినడం, లావెక్కడం జరుగుతుంది. మలం నలుపు రంగులో వుంటుంది. ఆహారం సరిగా తీసుకోక పోవడం వలన బరువు తగ్గడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వలన ఎక్కువగా వస్తుంది. ధూమపానం వలన, ఆల్కహాల్ తీసుకోవడం వలన ప్రేవులలోని శ్లేష్మపు పోర రేగుతుంది.  ఒత్తిడి ఎక్కువగా వున్నపుడుయాసిడ్ ఎక్కువగా తయారవుతుంది.

      "  నాకు కోపం వస్తే మండుతుంది" అనడం ఒక ఉదాహరణ

1. పాలు యాన్టాసిడ్(Antacid) గా పనిచేస్తుంది. మూడు పూటలా వాడాలి.

2. ఆవు నెయ్యికి గాయాన్ని మాన్పే శక్తి వున్నది. ఒక కప్పు ఆవు పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని తాగితే శ్లేష్మపు పొరపై పుండు నివారింప బడుతుంది. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

3. ఒక కప్పు పాలలో బాగా పండిన 2, 3 పచ్చ అరటి పండ్ల గుజ్జును కలిపి తినాలి.

4. కరక్కాయ పొడి              --- అర టీ స్పూను
    బెల్లం                           --- అర టీ స్పూను
    తేనె                             --- అర టీ స్పూను
             కలిపి తినాలి

                                                                 27-8-11

     ఒక జామ ఆకును  రాత్రి ఒక గ్లాసు  నీళ్ళలో వేసి ఉంచాలి . ఉదయం  ఆ నీటిని ఆకుతో సహా ఒక చిన్న గిన్నెలో పోసి
సన్న మంట మీద  కాచి సగానికి రానివ్వాలి . తరువాత  ఆ నీటిని గోరువెచ్చగా తాగాలి .  ఈ విధంగా ప్రతి రోజు రెండు
పూటలా తాగాలి 

    ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ వుంటే తగ్గుతుంది .












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి