భగందర సమస్య (లూటి) --నివారణ 4-2-09.
ఆసనానికి ఏదో ఒక వైపు రంధ్రం పడితే దానిని ఆసన లూటి లేదా భగందరము అంటారు.
1. ఒక తొట్టిలో నీళ్ళు పోసుకొని చేతులు, కాళ్ళు బయట పెట్టి పొట్టవరకు నీళ్ళలో ఉండేటట్లు కూర్చోవాలి.అలా
కూర్చొని పొట్టను నిమురుతూ వుండాలి. ఈ విధంగా చేస్తే భగందరము లోని మంట తగ్గుతుంది. అర గంట తరువాత లేచి అటు ఇటు తిరగాలి.
2. మట్టి పట్టిని గోచీ లాగా పెట్టుకోవచ్చు.
3. ఆసనాన్ని, గుదము యొక్క కండరాలను లాగి, బిగించి పట్టి ఉంచాలి. అలా కొన్నిసార్లు చెయ్యాలి.
4. మోకాళ్ళ మీద కూర్చొని పొట్టను లాక్కోవాలి.గాలిని మెల్లగా పీల్చి,మెల్లగా వదలాలి.
ఆహారము :-- విరేచనం కాని రోజు తేలికైన ఆహారం తీసుకోవాలి. అన్నం వార్చిన గంజి,తేనె, మెత్తటి జావ,
పండ్ల రసాలు తీసుకోవాలి.
"అనుభవం":-- కానుగ ఆకునకు పసుపు రాసి భగందరానికి పెడితే మానుతుంది.కానుగ ఆకును, పసుపును
కలిపి నూరి కడితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ నూరిన ముద్దను బిళ్ళగా చేసి దూదికి మీద పెట్టి అంటించి
దానిపై ప్లాస్టర్ అంటించాలి.
పెద్ద లూటి అయితే పెద్ద సిరంజి తీసుకొని దానిలోకి కానుగ రసాన్ని నింపి లూటీ లోకి ఎక్కించాలి.
తరువాత కానుగ బిళ్ళను అంటించాలి, దూది వేసి ప్లాస్టర్ అంటించాలి. .
మలద్వారంలో పుండు -- నివారణ 11-12-10.
విరేచనం అయిన ప్రతి సారి నొప్పి రావడం, రక్తం పడడం జరుగుతుంది.
కారణాలు :-- పీచు పదార్ధాలు లేని ఆహారం తీసుకోవడం, నీరు తక్కువగా వున్నా పదార్ధాలు తీసుకోవడంజిగటగా వున్న్పదార్ధాలను తినడం మొదలైన కారణాల వలన మలము గట్టిపడి అది బహిష్కరింప బడేటపుడు మలద్వారము చిరిగి పుండు ఏర్పడుతుంది. ఇది కత్తెరతో కత్తిరించబడినట్లు గా అనిపిస్తుంది.
పుండు మానడానికి :--
త్రిఫల చూర్ణము ----- 100 gr
నీళ్ళు ---- రెండు లీటర్లు
చూర్ణాన్ని నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక లీటరు కషాయం వచ్చే వరకు మరిగించాలి.
ఈ కషాయాన్ని కూర్చోవడానికి అనుకూలంగా వున్న టబ్ లో పోసి దానిలో కూర్చోవాలి. ఈ విధంగా ప్రతిరోజు విరేచనం తరువాత చెయ్యాలి. తరువాత స్నానం చేసి శుభ్రంగా తుడిచి నెయ్యి పూయాలి.
ఈ విధంగా పది రోజులు చేస్తే తగ్గుతుంది.
విరేచానానికి :--
తేగడ వేర్ల పొడి --- 100 gr
సునాముఖి పొడి --- 100 gr
సైంధవ లవణం --- 25 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడి వేడి నీటితో తీసుకోవాలి. దీని వలన ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది.
దీనిని కొంత కాలం వాడాలి. ఆహారంలో సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను వాడాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి