రక్త వృద్ధి

                                    రక్త వృద్ధికి కారెట్ హల్వా                                             23-2-09.
 
                                 టమోటా                    ------ 50 gr
                                 కారెట్                        ------ 50 gr
                                 బీట్ రూట్                  ------ 20 gr
                                 కలకండ                      ------ 15 gr
                                 తేనె                          ------  50 gr
                                 నిమ్మరసం                 ------  1 కాయ
 
రక్త లేమి యొక్క లక్షణాలు :--  పాండు రోగం, కళ్ళకింద నలుపు,పాలిపోయిన పెదవులు  మొదలగునవి.
 
     టమోటా, కారెట్, బీట్ రూట్ లను ముక్కలుగా చేసి చాలా కొద్దిగా నీళ్ళు చేర్చి మిక్సి లో వేసి తిప్పాలి. దీనిని వడకట్టాలి.ఈ రసంలో కలకండ కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కాచాలి.నిదానంగా నీరు ఇంకిపోయి పాకం మిగిలే వరకు కాచాలి. పాకం ముదురుగా, లేతగా కాకుండా ఉండేట్లు చూసుకోవాలి.చల్లారిన తరువాత తేనె కలపాలి.  బాగా చల్లారిన తరువాత తడిలేని గాజు సీసాలో భద్ర పరచాలి. 2,3 స్పూన్ల పాకాన్ని ఒక గ్లాసు నీటికి కలిపి దానిలో నిమ్మరసం కూడా కలుపుకొని తాగాలి.

                                పిల్లలకు     ---- ఒక స్పూను
                                పెద్దలకు     ---- రెండు స్పూన్లు .

                             రక్తవృద్ధికి అమృతాహారం                                                 28-6-09.

 తొక్క తీసిన కారెట్ తురుము                 ---- 100 గ్రాములు
ఒక ఆపిల్ పండు ముక్కలు
ఒక బత్తాయి లేదా నారింజ లేదా కమలాపండు ముక్కలు
పచ్చి కొబ్బరి తురుము                         ----- పావు కాయ
దోరగా వేయించి దంచిన మిరియాల పొడి ---  5  గ్రాములు
                                         తేనె   ---  2 నుండి 4 స్పూన్లు

      అన్నింటిని బాగా కలపాలి.

      దీనిని అల్పాహారంగా గాని లేదా పెందలకడనే భోంచేసి గంట తరువాత గాని తినాలి.

      దీనిని అధిక రక్తపోటు, అల్పరక్తపోటు, మధుమేహం, చర్మ వ్యాధులు వున్నవాళ్ళు కూడా తినవచ్చు.

జీర్ణశక్తిని బట్టి ఎంత తినగలిగితే అంత తినవచ్చు.

రక్త హీనత వలన నష్టాలు:--  మెదడుకు రక్త సరఫరా తగ్గడం వలన శక్తి తగ్గి చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసుకుంటారు. మానసిక సమస్యలు ఏర్పడతాయి. జుట్టు ఊడిపోతుంది.

                                                 రక్తాన్ని పెంచడానికి పానీయం

టమోటా రసం            --- ఒక కప్పు
నిమ్మ రసం               ---  ఒక కాయ
అల్లం రసం                ---  ఒక టీ స్పూను
మిరియాల పొడి         --- చిటికెడు
       తేనె                 ---  ఒక స్పూను

     అన్నింటిని గ్లాసులో పోసుకొని బాగా కలిపి పరగడుపున తాగాలి.

    పైన చెప్పబడిన అమృతాహారాన్ని ఒక పూట,  పానీయాన్ని ఇంకొక పూట తీసుకోవాలి.

                              రక్తాల్పత ----నివారణ                                                   1-6-10.
 
      రక్తము ప్రాణ సంబంధమైనది.
 
      రక్త హీనత వలన వెంట్రుకలు ఊడిపోవడం, బిరుసేక్కడం, చర్మం బిరుసుగా, ఎండినట్లు గా కావడం, గోళ్ళు బిరుసుగా అయి పగలడం జరుగుతుంది.
 
కారణాలు:--  అధిక ఋతు రక్త స్రావం, ఆపరేషన్ల సమయంలో సరైన ఆహారం తీసుకోక  పోవడం  గాయలైనపుడు
 
అధికంగా రక్తం పోవడం, కాన్సర్  మొదలైన కారణాల వలన  రక్త హీనత ఏర్పడుతుంది.
 
పిల్లలకు                      ---- 10 --- 11 మి.గ్రా 
స్త్రీలకు                       ---- 12 --- 13    "
పురుషులకు                ---- 14              "
 
  రక్తం వుండాలి. 
 
  రక్తం తగ్గకుండా ఉండాలంటే
 
       ఆకుకూరలు --- తోటకూర వారానికి కనీసం మూడు రోజులు లేదా ప్రతి రోజు వంద గ్రాములు,మెంతికూర పొన్నగంటికూర, మునగాకు, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలను ఎక్కువగా ఏదో ఒక రూపంలో ప్రతి రోజు ఆహారంలో వుండే విధంగా చూసుకోవాలి.
 
రక్త లోపం వున్నవాళ్ళు:--
 
   దోరగా వేయించి దంచిన జీలకర్ర పొడిని పటికబెల్లం పొడి కలిపి తీసుకుంటూ వుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.మంచి పుస్టినిస్తుంది.  ఉదయం, సాయంత్రం పూటకు అర టీ స్పూను చొప్పునవాడాలి
 
                మండూరం, లోహ భస్మం, పునర్నవ మండూరం మొదలైన ఔషధాలను వాడుకుంటే బాగా రక్త వృద్ధి జరుగుతుంది.

                                                        రక్త వృద్ధి కి   చిట్కా                         28-6-11.
వాము
ఉప్పు
మిరియాలు
          అన్నింటిని సమాన భాగాలుగా చేసి సీసాలో భద్రపరచుకోవాలి .
          ప్రతి రోజు అర  టీ స్పూను పొడిని తీసుకుంటూ వుంటే రక్త వృద్ధి జరుగుతుంది

                                                         రక్తహీనత   --- నివారణ                  16-7-11.

కరక్కాయ పెచ్చుల పొడి            --- 100 gr
                 శొంటి  పొడి           ---    50 gr
ఉసిరి కాయ పెచుల పొడి          ---     50 gr
సుగంధపాల వేర్ల      పొడి         ---   100 gr
లోహభస్మం                          ---     25 gr

         అన్నింటిని బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
         ప్రతిరోజు ఆహారానికి ముందు ఉదయం , సాయంత్రం  అర టీ స్పూను పొడికి తగినంత తేనె కలిపి సేవించాలి . ఈ
విధంగా  40 రోజులు వాడాలి   లేదా తయారు చేసుకున్న చూర్ణానికి తగినంత బెల్లం కలిపి బాగా నూరి శనగ గింజలంత
మాత్రలు చేసుకొని ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు పూటకు రెండు మాత్రల చొప్పున వాడాలి . ఈ
విధంగా 40 రోజులు వాడాలి .

                                                          రక్తవృద్ధి కొరకు                                   15-8-11.

యవలు  ( పొడుగు గోధుమలు )       ---- 4 టీ స్పూన్లు
                            మెంతులు         ---- 1 టీ స్పూను

          రెండింటిని  ఒక గ్లాసు నీటిలో వేసి 24 గంటలు నానబెట్టాలి  ఉదయం వదపోసుకోవాలి
ఈ నీటిలో దోరగా వేయించిన శొంటి పొడి         --- 2 gr
                                               తేనె         --- ఒక టీ స్పూను
కలిపి తాగాలి .
          పైన వదకట్టగా మిగిలిన  గింజలను గుడ్డలో కడితే మరుసరి రోజుకు మొలకలు వస్తాయి వాటి మీద  3 , 4
చిటికెలు  మిరియాల పొడి , అర టీ స్పూను సైంధవ లవణం , అర టీ స్పూను ఉసిరిక పొడి అన్నింటిని నీటిలో కలిపి తాగాలి . గింజలను తాగ లేకపోతే వాటిని మెత్తగా నూరి కలుపుకోవచ్చు .
     

 


                                               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి