పిచ్చి మాటలు

          పిచ్చి మాటలు --ఉన్మాదము --నివారణ                             12-2-10.
 
    మారేడు చెట్టు యొక్క బెరడును తెచ్చి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
 
     ఒక టీ స్పూను పొడిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. గోరువెచ్చగా అయిన తరువాత అర టీ స్పూను తేనె కలిపి  ఉదయం, సాయంత్రం తాగుతూ  వుంటే పిచ్చిగా, ఉన్మాద భరితంగా   మాట్లాడడం నివారింప బడుతుంది.
 
              మాటలతో ఎదుటివాళ్ళను మెప్పించడానికి                       5-3-10.

     తులసి కాండాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మధ్యలో రంధ్రం చ్గేసు వెండి తీగతో గాని, రాగితీగాతో గాని  చుట్టి మూడు వరుసలు మేడలో వెయ్యాలి. మణికట్టు దగ్గర, దండెములకు మూడు వరుసలు కట్టాలి.  ఇది చాలా  ప్రభావ వంతమైనది.

     ఉన్మాదం వున్న వ్యక్తులున్న గదిలో పూల కుండీలను ఉంచాలి లేదా కిటికీల దగ్గర పూల మొక్కలను   పెంచాలి.  ఆ గాలి పీల్చడం చాలా ఉపయోగకరం.

     పద్మాసనంలో కూర్చొని చేతులను చాపి బొటన వ్రేలును, చూపుడు వ్రేలును కలిపి మిగిలిన మూడు వ్రేళ్ళను  కిందకి పెట్టి నిటారుగా కూర్చోవాలి.   ఇది గొప్ప జ్ఞాన, ధ్యాన ముద్ర.

    ఈ వ్యాధి కలిగిన వాళ్ళు పడుకునే ముందు దిండు కింద తులసి వేరు ముక్కను ఉంచాలి.

                      ఉన్మాదం --పరిష్కారమార్గములు                                  24-11-10.

     విచిత్రమైన,  అసహ్యమైన ఆలోచనలుంటాయి.

     ఆకలి లేకపోవడం, వాంతులు కావడం, ఉన్నట్లుండి విరేచనాలు కావడం, ఉన్నట్లుంది నిద్రలో లేచి పరుగెత్తడం   వంటి లక్షణాలు వుంటాయి.

బ్రాహ్మీవటి
సారస్వతారసం

    వీటిలో ఏ ఒకటైనా వాడవచ్చు.

సరస్వతి ఆకు చూర్ణం                  --- 150 gr
వస                                          --- 150 gr

    పై రెండు దొరకని పక్షంలో ఏ ఒకటైనా వాడుఇకోవచ్చు.  అప్పుడు ఒక్కొక్కటి 300 గ్రాములు తీసుకోవాలి.

చెంగల్వ కోష్టు                            --- 300 gr 

    అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి భద్ర పరచుకోవాలి.

    వాడుకునేటపుడు  మూడు గ్రాములు మాత్రమే తీసుకోవాలి. వేడి చేస్తుంది, వాంతి కలిగే లక్షణం
వుంటుంది. ఈ పొడిని మూడు గ్రాములు తీసుకుని దానిలో ఐదు గ్రాముల తేనెను కలిపి తీసుకోవాలి.  దీనిని తీసుకున్న తరువాత ఒక గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకో కూడదు. దీనిని ప్రతి రోజు వాడుతూ వుండాలి. దీనిని వాడితేఉన్మాద నివారణ,  మానసిక ప్రశాంతత
 కలుగుతాయి.  ఉదయం,  సాయంత్రం వాడాలి  3   + 3 గ్రాములు వాడాలి.

                           మానసిక రుగ్మత    ---  ఉన్మాదం -- పిచ్చి                                  7-1-11.

       మనో  అభిఘాతం వలన ఎన్నో మార్పులు జరుగుతాయి.  వీటిపై  వాతావరణ  ప్రభావం వుంటుంది.  అమావాస్య ,  పౌర్ణమి  ల ప్రభావం,  మబ్బు లేవడం,  సూర్య కాంతిలో బాగుండడం.   వంటి లక్షణాలు వుంటాయి.

1.  వస కొమ్ముల పొడి               --- అర టీ స్పూను
      ఆవు పాలు                        --- ఒక కప్పు
 
           ఈ విధంగా ఉదయం సాయంత్రం తీసుకోవాలి.

2.  ఆవు నెయ్యి                       --- అర టీ స్పూను
     కరక్కాయ పొడి                   --- అర టీ స్పూను
     తేనె                                  --- అర టీ స్పూను
     చక్కెర                              --- ఒక టీ స్పూను
     ఆవు పాలు                         --- ఒక కప్పు
 
            అన్నింటిని కలిపి తాగాలి.  ఈ విధంగా దీర్గాకాలం వాడాలి.

3.   సర్పగంది                          ---- అర టీ స్పూను
      ఆవు పాలు                        ---- ఒక కప్పు
 
             కలిపి తాగాలి.

4.   బ్ర్రహ్మి  చూర్ణం                    ---- అర టీ స్పూ ను
      తేనె                                   ---- ఒక టీ స్పూను
 
            కలిపి తీసుకోవాలి.

5.   శంఖ పుష్పి సమూల చూర్ణం     ---అర టీ స్పూను
                             ఆవు పాలు    --- ఒక కప్పు

6.   జటామాంసి వేరు చూర్ణం         --- అర టీ స్పూను
                        ఆవు పాలు          --- ఒక కప్పు
 
              కలిపి తాగాలి.




    










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి