నిద్రలో పక్క తడపడం సమస్య ---నివారణ 26-7-09.
మెత్తటి ఎండుకొబ్బరి తురుము ----- 100 gr
జొన్న పేలాల పొడి ----- 100 gr
తెలక పిండి ----- 100 gr
పాత బెల్లం ----- 100 gr
( తెలక పిండి అనగా నువ్వుల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పి )
అన్ని కలిపి రోట్లో వేసి ముద్దగా దంచాలి. 10 నుండి 20 గ్రాముల ముద్దలు చెయ్యాలి . తేమ లేదు కాబట్టి ఎక్కువ కాలం నిల్వ వుంటుంది. ప్రతి రోజు ఒక మాత్రను తినాలి.
దీని వలన నిద్రలో పక్క తడిపే అలవాటు నివారింప బడడమే కాకుండా మూత్రావయవాలకు శక్తి, బలం చేకూరుతుంది.
1-12-10
పిల్లలలో ఈ సమస్య వున్నపుడు వాళ్ళను తిట్టడం, కొట్టడం వలన ఈ సమస్య పెరుగుతుంది. పెద్దలలో మెదడుకు, మూత్ర వ్యవస్థకు సమన్వయం లేక పోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
దానిమ్మ పూలను నీడలో ఆరబెట్టి దంచి చూర్ణం చేయాలి.
తుమ్మ బంకను శుద్ధి చేయడం :-- త్రిఫల చూర్ణాన్ని రెండు, మూడు కప్పుల నీటిలో వేసి కషాయం కాచాలి. తుమ్మ బంకను గుడ్డలో కట్టి ఈ కషాయంలో వేలాడదీయాలి. నల్ల నువ్వులను దోరగా వేయించాలి. జిలకరను సున్నపు తేటలో నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి చూర్ణం చేయాలి. దనియాలను దోరగా వేయించాలి.
దానిమ్మ పూల చూర్ణం --- 50 gr
తుమ్మ బంక --- 50 gr
నల్ల నువ్వులు ---- 50 gr
జిలకర ---- 50 gr
ధనియాలు ---- 50 gr
అన్ని చూర్ణాలను కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి నూరాలి. కంది గింజంత గాని కుంకుడు గింజంత గాని మాత్రలు కట్టాలి. చిన్న పిల్లలకు వాడడానికి జొన్న గింజలంత మాత్రలు కట్టాలి. పిల్లలకు రెండు, మూడు మాత్రలు వాడాలి. పెద్దలకు కుంకుడు గింజంత మాత్రలు రోజుకు రెండు, మూడు చొప్పునఐ ఇవ్వాలి

19-1-11
కొంతమంది పిల్లల్లు రాత్రి పూట మాత్రమే నిద్రలో పక్క తడుపుతూ వుంటారు. ( శయన మూత్రం ) కొంతమందిలో ఈ సమస్య అసాధారణంగా 16 -- 20 సంవత్సరాల వరకు కూడా వుంటుంది.
శారీరక కారణాలు :-- మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్ చేరడం, మూత్ర సంబంధ సమస్యలు , నులిపురుగులు చేరడంమొదలైన కారణాల వలన కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
మానసిక కారణాలు :-- తెలియకుండానే బయట పోస్తున్నామనుకుంటూ నిద్రలోనే పక్క మీదనే పోసేస్తుంటారు.
1. ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ఒక టీ స్పూను తేనె తీసుకుంటే ఈ సమస్య నివారింప బడుతుంది. తేనెను నీటితోకలిపి గాని లేదా అలాగే గాని తీసుకోవచ్చు.
2. అర టీ స్పూను ఆవాల పొడిని ఒక కప్పు పాలకు కలిపి రాత్రి పడుకునే ముందు తాగిస్తే తగ్గుతుంది. దీనికి కొద్దిగా పంచదార కూడా కలుపుకోవచ్చు.
పద్యాపధ్యాలు :-- పిల్లలతో రాత్రి పడుకునే ముందు మూత్ర విసర్జన చేయించాలి.
సాయంకాలం టీ , కాఫీ లాంటి పానీయాలు తాగకూడదు. బంగాళాదుంప ల చిప్స్ కూడా తిన కూడదు.
10-4-11
5 సంవత్సరాల వయసు దాటిన తరువాత కూడా పిల్లలు పక్క తడుపుతూ వుంటే దానిని
సమస్యగా గుర్తించ వచ్చు.
కారణాలు :-- ఎదుగుదల లో ఆలస్యం, అనువంశికత మొదలైనవి.
పిల్లలు తాగే నీళ్ళమీద, జ్యూస్ ల మీద నియంత్రణ ఉంచాలి. సాయంత్రం నాలుగు
గంటల తరువాత ద్రవాహారాన్ని ఇవ్వకూడదు.చల్లటి కాఫీ, టీ లను, శీతల పానీయాలను
మాన్పించాలి.
శయ్యా మూత్రాంతక లేహ్యం
ఉసిరి పెచ్చుల చూర్ణం -- 10 gr
నల్లజీలకర్ర చూర్ణం -- 10 gr
తేనె -- 60 gr
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీనిని సీసాలో నిల్వ చేసుకుని పిల్లలకు
ప్రతి రోజు తినిపించాలి.
పిల్లలు రాత్రి నిద్రించడానికి అరగంట ముందు ఒక స్పూను లేహ్యాన్ని తినిపించాలి. ఈ విధంగా
కొంత కాలం వాడితే సమస్య నివారింపబడుతుంది.
అర గ్రాము ఆవాల పొడిని అన్నంలో గాని లేదా పాలలో గాని కలిపి ఇస్తే మంచి ఫలితం '
వుంటుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి