కూరగాయలు --- ఆయుర్వేద ఉపయోగాలు

                                        కూరగాయలు--- ఆయుర్వేద ఉపయోగాలు

                                         టమాటో                                            24-1-11.
1. రేచీకటిని నివారిస్తుంది :--

       టమాటా ఆకులను వేడి నీళ్ళలో వేసి రెండు గంటలసేపు ;మూతపెట్టి తరువాత నీటిని
భోజనానికి ముందు తీసుకుంటూ వుంటే మంచి ఫలితం వుంటుంది.

  2. స్థూలకాయం

  ప్రతి రోజు ఒకటి, రెండు పండ్లను యధాతధంగా గాని లేదా జూస్ రూపంలో గాని అల్పాహారానికి బదులుగా తీసుకోవాలి. జూస్ ను వడకట్ట కూడదు.

3. గర్భిణీ  స్త్రీలలో పైత్యపు వికారం :--

  టమాటా రసం               --- ఒక గ్లాసు
  మిరియాల పొడి            --- చిటికెడు
  ఉప్పు                         ---- చిటికెడు

       అన్నింటిని కలిపి ఉదయం పూట తాగితే వికారం తగ్గుతుంది.

4. కీళ్ళ నొప్పులు :--

   టమాటా ఆకుల రసం    --- ఒక గ్లాసు
   నువ్వుల నూనె            --- నాలుగు గ్లాసులు
   
        రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.

     ఈ తైలంతో కీళ్ళ మీద మర్దన చేస్తుంటే నొప్పులు తగ్గుతాయి.

                                                     అల్లం                                                         28-1-11.

     విరేచనాలు :-

    అల్లం        --- 50 gr
  మిరియాలు --- 50 gr
      కర్పూరం --- 50 gr

   అన్నింటిని కలిపి మెత్తగా నూరాలి. వేళ్ళకు నెయ్యి రాసుకుని శనగ గింజలంత మాత్రలు చేయాలి.

      పూటకు రెండు మాత్రల చొప్పున మజ్జిగతో వాడాలి.

 కామెర్లు :--

    అల్లంరసం       ---- 2 gr
    నేలుసిరి రసం ---- 4 టీ స్పూన్లు

           కలిపి వాడాలి.
      దీని వలన ఆకలవుతుంది. నివారింపబడతాయ

                                                   వంకాయ                                                    14-3-11.

       లేత వంకాయలను మాత్రమే ఆహారంగా ఉపయోగించాలి.
       వంకాయలను వండేటపుడు  అల్లాన్ని  తప్పనిసరిగా చేర్చాలి. దీనితో వంకాయ వలన కలిగే
 దోషాలు నివారింప బడతాయి.

       వంకాయలు ఆరోగ్యానికి మంచిది. వంకాయలను  తొడిమతో సహా తినాలి.

       సూచన :--  వంకాయలను ప్రతిరోజు తినకూడదు. 

       చర్మవ్యాధులు, లివర్ వ్యాధులు, కీళ్ళ వ్యాధులు, ఒళ్ళు నొప్పులు,  దద్దుర్లు, పేగుల్లో పురుగులు వున్నవాళ్ళు వంకాయలు తినకూడదు.

   అర్శ మొలలు :-- 

        లేత వంకాయలకు  అల్లం చేర్చి వండుకుని 

   విటమిన్  E లోపం :-- 

        ఈ సమస్య వలన అకాల వార్ధక్యము, చర్మం మీద ముడతలు వుంటాయి.
        వంకాయలను మజ్జిగతో  కలిపి వండుకుని తినాలి.

   దగ్గు,  కఫం :--

         వంగ ఆకుల రసం                --- అర టీ స్పూను
                  తేనె                           --- ఒక టీ స్పూను
 
        కలిపి రోజుకు  మూడు,  నాలుగు సార్లు తీసుకోవాలి.

                                                  సొరకాయ                                                    16-3-11.

         ఇది శరీర తాపాన్ని తగ్గిస్తుంది.  వడదెబ్బ, చర్మం కాలడం, నిర్జలీయత  లనుండి  కాపాడుతుంది.  మలబద్ధకాన్నిపోగొడుతుంది,  స్థూలకాయాన్ని తగ్గిస్తుంది.

      ,మూత్రంలో మంట:--   

                     సొరకాయ రసం             ---ఒక గ్లాసు 
                          నిమ్మ రసం              ---ఒక టీ స్పూను
                          పంచదార                 --- ఒక టీ స్పూను
       కలిపి తాగాలి.

       అతిదాహం, నిస్సత్తువ,  నిస్త్రాణ :---

                       సొరకాయ రసం           --- ఒక గ్లాసు
                             నిమ్మ రసం          --- ఒక టీ స్పూను
                                   ఉప్పు            --- అర టీ స్పూను
        కలిపి తాగాలి.

         అరిచేతులు,  అరికాళ్ళు దురదలు :--

                 సొరకాయ రసాన్ని అరి చేతులు, అరికాళ్ళ పై బాగా రుద్దాలి

    















































































































































































































































































































































































































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి