అతినిద్ర --నివారణ 26-12-08.
పుట్టుకతో కఫ భార సమస్య గల వాళ్లకు మగత నిద్ర అలవాటు వుంటుంది.
వ్యాయామం -- ప్రాణాయామం ను చాలా చాలా వేగంగా చెయ్యాలి.హ్రస్వభస్త్రిక, దీర్ఘ భస్త్రిక, వేగ భస్త్రిక చెయ్యాలి.
గాలి పీల్చేటపుడు ముక్కు, శరీరం వేగంగా కదలాలి.ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నూనెతో మర్దన చెయ్యాలి
ఆసనాలు:-- వ్యాఘ్రాసనం :-- దండేలు, బస్కీలు తీసే విధంగా మోకాళ్ళు, చేతులు నేల మీద ఆనించి, వీపును పైకిలేపి ముందుకు,వెనుకకు కదలాలి (ఊగాలి).
ఆహారం ఎక్కువగా తింటూ ఏ పని లేకుండా వుంటే తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. దీనివలన
అతినిద్ర ఏర్పడుతుంది.
గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చెయ్యాలి.వాకింగ్ చెయ్యాలి..బాగా బరువుగా వున్నవాళ్ళు నెమ్మదిగా నడవాలి.వేగంగా నడిస్తే బరువు మోకాళ్ళ మీద పడుతుంది
.
.
1. 20 గ్రాముల నల్ల నువ్వులను నానబెట్టి ఉడకబెట్టి గుగ్గిళ్ళు తయారు చేసుకొని సైంధవ లవణం కలుపుకొని సాయంత్రం పూట తినాలి .దీనివలన కొవ్వు కరుగుతుంది.అదనంగా పెరగదు.20 గ్రాముల నుండి ప్రారంభించి
100 గ్రాముల వరకు పెంచుకుంటూ వెళ్ళాలి.
2. ఆముదపు చెట్టు పూలు 50 గ్రాములు తీసుకొని పాలు పోసిమెత్తగా నూరాలి. రెండు కణతలకు పట్టు వేస్తే అతి నిద్ర తగ్గుతుంది ఈ ముద్దను తలకు కూడా పట్టు లాగా వేసుకోవచ్చు.
అతినిద్ర -- నివారణ 14-7-09.
నాసా జలపానం:--
ఒక గ్లాసులో నిండుగా నీటిని పోసి ముక్కుతో పీల్చాలి. దీని వలన తలలో చేరిన కఫం నివారింప బడుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి చైతన్యం కలుగుతుంది.
గోధుమ జావ, కొర్ర జావ (ఒంట్లో వున్ననీటిని లాగేస్తుంది),
సజ్జలు మొదలైనవి ఎక్కువగా వాడాలి. బియ్యం వాడకం తగ్గించాలి.
తీపి పదార్ధాలు బాగా తగ్గించాలి, వీలైతే అసలే తినరాదు.
శరీరాన్ని ఆవనూనె లేదా నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి.
ఆహారంలో నూనె వాడకూడదు.
గోరువెచ్చని నీరు తాగాలి.
రాత్రి పూట ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.
ఉదయం త్రికటుక చూర్ణం (దోరగా వేయించిన పొడి) సైంధవ లవణం కలిపి తాగాలి
. ఆముదం చెట్టు పూలు, పాలు కలిపి నూరి మెత్తగా ముద్దలాగా చేసి కణతలకు పూసి తలకు పట్టు లాగా వేయాలి.దీని వలన మంచి చురుకుదనం ఏర్పడుతుంది.
గేదె కొమ్ముల గంధం, బూడిద గుమ్మడి కాయ రసం రెండు సమాన భాగాలుగా తీసుకొని కలిపి వెన్నుపూస మీద, వీపు మీద, పొత్తికడుపు మీద రుద్దుతూ వుంటే అతి నిద్ర నివారింప బడుతుంది.
4-8-11
పచ్చకర్పూరం ---- పెసరగింజంత
నిమ్మ రసం ---- రెండు చుక్కలు
తేనె ---- రెండు చుక్కలు
ఒక చిన్న శుభ్రమైన ప్లేటులో అన్నింటిని వేసి బాగా రంగరించాలి .
కంటి యొక్క కింది రెప్పను కిందికి లాగి దానికి ఈ మిశ్రమాన్ని కాటుక లాగా పెట్టుకోవాలి .దీనిథొ కళ్ళనుండి
నీళ్ళు టపటప రాలి కళ్ళు శుభ్రపడతాయి . నిద్ర తొలగిపోతుంది .
సూచన :---ఒక ప్లాన్ ప్రకారం నిద్రపోవాలి . అర్ధశక్తి వ్యాయామం చేయాలి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి