వాతనోప్పులు

                                       వాతనొప్పులను హరించు గరిక తైలం
  తీగ గరిక (తీగ లాగా పాకే గరిక ) కణుపుల దగ్గర గరిక గుబురుగా ఉంటుంది.కణుపుకి, కణుపుకి మధ్యలో కాడ లాగ ఉంటుంది.
     గరిక దొరికినంత తీసుకొని కణుపులను తొలగించాలి.ఆకును సన్నగా తరిగి నీళ్ళు పోసి దంచి
రసం తీయాలి. పలుచని గుడ్డలో వడకట్టాలి.గరిక రసం  పావు కేజీ తీసుకొని సమభాగం పావు కేజీ నువ్వుల నూనెను రసంలో పోసి కలియబెట్టాలి. సన్న మంట మీద నిదానంగా కాచాలి.నీరు మొత్తం ఆవిరయ్యే విధంగా నూనె మాత్రమే మిగిలేటట్లు కాచి వడకట్టాలి.
      నొప్పులపై తైలం పూస్తే తగ్గుతాయి.వాతనొప్పులు, గజ్జి, తామర,చిడుము,చర్మ వ్యాధులు తగ్గుతాయి.      నడకలో వేగం పెరుగుతుంది.నూనెను గోరువెచ్చగా పూస్తే మంచిది .వేగంగా రుద్దాలి.మడమనొప్పులు తగ్గుతాయి. వాతం చేసే పదార్ధాలు వాడకూడదు
  
                                 వాత నొప్పుల నివారణకు ఓమ తైలం                          7-12-08.
                             " మున్నూట అరవై రోగాలకు ముడి ఓమ "
వాము                    ------ 1 కిలో
నీళ్ళు                       ---- 4 లీటర్లు
నువ్వుల నూనె          ----- 1 కిలో
మిరియాల పొడి       ----- 30 గ్రాములు
పిప్పళ్ళ పొడి          ----- 30 గ్రాములు
గడ్డ కర్పూరం          ----- 40 గ్రాములు
         వామును కచ్చా పచ్చాగా నలగగొట్టి పెద్ద గిన్నెలో వేసి నీటిని పోసి కలిపి 24 గంటలు నానబెట్టాలి.నానిన వామ్ము, నీరు స్టవ్ మీద పెట్టి 1 kg కషాయం మిగిలే వరకు కాచాలి.స్టవ్ ఆపి వడపోయాలి. కషాయానికి నువ్వుల నూనె కలిపి స్టవ్ మీద పెట్టి నిదానంగా మరిగించాలి.నూనె మిగిలే వరకు కాచి వేరే గిన్నెలోకి వడ పోసుకోవాలి.
నూనెలో మిరియాల పొడి,పిప్పళపొడి,కర్పూరం వేసి మూత పెట్టాలి.చల్లారిన తరువాత సీసాలో భద్ర పరచాలి.
ఉపయోగాలు :-- భుజాల నొప్పులు,నడుమునొప్పి,తుంటి నొప్పి,తొడల నొప్పులు,వెన్ను నొప్పి,మోకాళ్ళ నొప్పులు, (ముఖ్యంగా మధుమేహ రోగులకు )తిమ్మిర్లు, కండరాలు పట్టేయ్యడం మొదలైనవి నివారించ బడతాయి
మందును ఉపయోగించే ముందు కొద్దిగా వేడి చేసి నొప్పుల మీద గోరువెచ్చగా పూయాలి.

                వాత నొప్పులను నివారించడానికి వావిలాకు మాత్రలు             11-3-09.

     ఇవి వాత నొప్పులను మాత్రమే కాక డెంగ్యు,చికెన్ గున్యా, టైఫాయిద్ వలన వచ్చే నొప్పులను కూడా నివారిస్తాయి.

 వావిలాకు              ------50 gr
 తులశాకు              ------50 gr
 తిప్ప తీగ ఆకు        -----50 gr
 వెల్లుల్లి                  ------50 gr
వాము                    ------50 gr
మిరియాలు            ------50 gr
అల్లం రసం             ------ తగినంత

      మూడు ఆకులను కల్వం లోవేసి నూరాలి.మెత్తగా అయిన తరువాత వాము పొడి,మిరియాల పొడి, దంచిన వెల్లుల్లి గుజ్జు వేసి నూరడానికి వీలుగా తగినంత అల్లం రసం వేస్తూ నూరాలి. మాత్ర కట్టుకు వచ్చేటంతగా ముద్దగా నూరాలి. తరువాత శనగ గింజలంత మాత్రలు కట్టాలి, ఫాను కింద గాని నీడలో గాని తేమ లేకుండా ఎండి పోయేట్లు చేయాలి. తేమ వుంటే బూజు పడుతుంది. అవి పనికి రావు.

గాజు సీసాలో భద్రపరచాలి,

పెద్దలకు           ----- శనగ గింజంత
పిల్లలకు           ----- సగం
పసి పిల్లలకు    ----- పావు

          చొప్పున వాడాలి. దీనిని వాడితే డెంగ్యు , చికెన్ గున్యా,కఫజ్వరాలు, ఒళ్ళు నొప్పులు,
చలి జ్వరం, నివారింప బడతాయి.

ఆహారానికి ముందు ఉదయం, రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.

102 డిగ్రీల జ్వరం వుంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాలి.

 పక్ష వాతం, సయాటికా, మెడలు పట్టుకు పోవడం, నడుము పట్టుకు పోవడం, తొడలు పట్టుకు పోవడం వంటి సమస్యలు ఎక్కువగా వున్నపుడు మూడు పూటలా వేసుకోవాలి.

 మొదట్లో కొంత వేడి చేస్తుంది. వేడి చేస్తేనే వాతం తగ్గుతుంది.

మొదట  ఒక మాత్రతో ప్రారంభించ వచ్చు.

 మూతి పక్కకు లాగడం, పక్షవాతం, కాలు,చెయ్యి చచ్చు పడడం, కన్ను మూసుకు పోవడం వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.

                       వాతనొప్పులకు వావిలాకు తైలం లేదా నిర్గుండి తైలం               16-3-09.

 నువ్వుల నూనె            ----- పావు కిలో
వావిలాకు దంచిన రసం ----- పావు కిలో

   నువ్వుల నూనెను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి కాగే టపుడు ఆకులను వెయ్యాలి . ఆకులలోని రసం నూనె లోకి దిగుతుంది. లేదా వావిలాకు రసం, నువ్వుల నూనె కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. నల్లగా మాడకూడదు.

వాతాన్ని కలిగించే ఆహార పదార్ధాలను తినకూడదు.

తైలాన్ని చెవి సమస్య వున్న వాళ్ళు గోరు వెచ్చగా చెవిలో నాలుగైదు చుక్కలు వేసుకోవాలి. చల్లగా వేసుకోకూడదు.

వాత నొప్పులున్న వాళ్ళు తైలాన్ని వేడి చేసి నొప్పులున్న చోట మర్దన చెయ్యాలి. ఇసుకతో గాని ,ఇటుక రాయి పొడి తో గాని, ఉప్పు తోగాని కాపడం పెట్టాలి.

దీనిని వాడడం వలన కాళ్ళు పట్టుకుపోవడం, కాళ్ళు బిగుసుకు పోవడం వంటివి నివారింప బడతాయి.

                             తులసితో వాత నొప్పుల నివారణ                   27-2-10.

           శరీరమంతా ఎక్కువ నొప్పులున్న వాళ్ళు ఆవనూనేతో, తక్కువ నొప్పులున్న వాళ్ళు నువ్వులనూనెతో లేదా ఓమ తైలంతో లేదా అగస్త్య తైలంతో గాని గోరువెచ్చగా చేసి మర్దన చెయ్యాలి. ఒక గంట అలాగే వుంచి తరువాత స్నానం చెయ్యాలి.

 కారణాలు:-- వేళకు ఆహారం తినకపోవడం, అరగని పదార్ధాలను తినడం, అతి చల్లని పదార్ధాలను సేవించడం వలన వాత నొప్పులు వస్తాయి.

 నెలకొకసారి పొట్టను శుభ్ర పరచుకోవాలి. ఆహారం ఎంత అవసరమో అంతే సేవించాలి.

 తులసి ఆకుల రసం         --- 50 gr
నేల ఉసిరి సమూల రసం    --- 50 gr
గుంటగలగర రసం            --- 50 gr
మంచి పసుపు                  ----50 gr

  అన్నింటిని కల్వంలో వేసి తగినంత మంచి నీటితో గుజ్జుగా నూరాలి. బటాణి గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత శరీరంలో కీళ్లలో నొప్పులు వచ్చిన రెండు మాత్రలు వేసుకొని గోరువెచ్చని నీటిని తాగాలి.

తులసి తైలం

  కృష్ణ తులసి నిజరసం     ---- ఒక గ్లాసు
                   ఆవనూనె    ---- ఒక గ్లాసు

  రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. పసుపు రంగు తైలం మిగులుతుంది. దీనిని వడకట్టి సీసాలో భద్రపరచు కోవాలి.

ప్రతి రోజు స్నానానికి గంట ముందు తైలాన్ని గోరువెచ్చగా చేసి శరీరంలో మొద్దుబారిన అవయవాలకు రుద్దాలి. నొప్పులున్నచోట మర్దన చెయ్యాలి.

                            వాత నొప్పులకు ---- వావిలాకు                22-5-10.

1. స్నానం చేసే ప్రతిసారి నీటిలో వావిలాకు వేసి కాచాలి

2. కాళ్ళు వాచి బిగుసుకున్నపుడు :-- వావిలాకును కచ్చాపచ్చాగా నలగగొట్టి ఆముదం వేసి వేయించాలి. దీనిని ఒక గుడ్డలో వేసి భరించ గలిగినంత వేడిగా వాపుల మీద కాపడం పెట్టాలి. తరువాత దానిని వాపుమీద వేసి గుడ్డతో కట్టు కట్టాలి. ఉదయం విప్పాలి.

 3. వావిలి చిగుళ్ళు      --- పది
                  నీళ్ళు      --- ఒక గ్లాసు
                    తేనె      --- ఒక టీ స్పూను

వావిలాకును చిన్న ముక్కలుగా తుంచి నీటిలో వేసి కాచి అర గ్లాసుకు రానివ్వాలి. దించి వడపోసి గోరు వెచ్చగా అయిన తరువాత తేనె కలిపి తాగాలి. విధంగా 40 రోజులు ఉదయం, సాయంత్రం తాగుతూ వుంటే వాత నొప్పులు పూర్తిగా తగ్గి పోతాయి.
  
                        వాత రోగాలు--- నివారణ                            24-5-10.
తంగేడు పూల రసం --- రెండు టీ స్పూన్లు
             వేడి పాలు --- అర కప్పు
తంగేడు పూల రెక్కలను కడిగి దంచి ముద్దగా నూరి రసం పిండాలి.
తంగేడు పూల రసాన్ని వేడి పాలల్లో కలుపుకొని ఉదయంసాయంత్రం తాగాలి.
తంగేడు పూలను నీడలో ఆరబెట్టి దంచిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి. అర టీ స్పూను నుండి ఒక టీ స్పూను వరకు సేవించాలి.
తంగేడు మొక్కను సమూలంగా తెచ్చి కడిగి ముక్కలుగా చేసి వెడల్పాటి పాత్రలో వేసి నీళ్ళు పోసి బాగా మరిగించాలి. పాత్రను నులక మంచం కింద పెట్టి వాత నొప్పులున్న రోగిని మంచం మీద పడుకోబెట్టాలి. ఆవిరి పట్టాలి. నీటిలో గుడ్డను ముంచి నొప్పులున్న చోట కాపడం పెట్టాలి.
 
                               అల్లంతో వాత నొప్పుల నివారణ                   26-5-10.
అల్లం రసాన్ని ఉదయం, రాత్రి ఒక్కొక్క టీ స్పూను చొప్పున ఆహారానికి ముందు నీళ్ళలో కలుపుకొని  తాగుతూ వుంటే వాత నొప్పులు హరించ బడతాయి.

                                వాత నొప్పుల నివారణకు                          17-12-10.

ఆవ నూనె               --- 100 gr
మహిషాక్షి గుగ్గులు      --- 30 gr

 రెండింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతి రోజు నొప్పులున్న చోట రాస్తూ వుంటే అధిక కొవ్వు వలన వచ్చే వాత నొప్పులు హరించ బడతాయి.

                                 వాత హర తైలము ---శివ శివాని తైలము

 ఉల్లి రసం       --- పావు లీటరు
 ఆవాల నూనె ---- పావు లీటరు

  రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. చల్లారిన తరువాత కర్పూరం కలుపుకోవాలి. తైలాన్ని వేడి చేసి నొప్పుల మీద పూస్తే నొప్పులు తగ్గుతాయి.

                        వాత రోగాలు ( సంధి వాతము ) --- నివారణ                   2-7-10.

      అధికమైన బరువు చేరే శారీరక భాగాలు స్త్రీలలో అధికంగా వుంటుంది. ఊబకాయం , బహిష్టు సమస్యలు, యూరిక్ ఆసిడ్ కీళ్లలో చేరడం, మొదలైనవి వస్తాయి.

 ఆహారంలో సరైన పోషక పదార్ధాలు లేక పోవడం వలన ( నీరసం వలన ) నొప్పులు వస్తాయి. వేసవి కాలంలో వాత సమస్యలు ఎక్కువగా వుండవు. వర్షాకాలంలో, చలి కాలంలో వాతం పెరుగుతుంది. అందువలన నొప్పులు ఎక్కువవుతాయి.

వాత నొప్పులు ప్రాధమిక దశ లో వున్నపుడు అనగా
 30 -- 40 సవత్సరాల వయసులో తగ్గడం సాధ్యం తరువాత  
 40 --50 సంవత్శరాల వయసులో తగ్గడం కష్టతరం ,
 50 -- 60 -- 70 సంవత్సరాల వయసులో తగ్గడం అసాధ్యం.

ఆహారంలో చేపలు, గుడ్లు, సముద్రపు ఆహారం ఎక్కువగా వాడాలి.

వెల్లుల్లి పాయలను, ఆముదపు గింజల పప్పును పాలల్లో ఉడికించి పాలు తాగాలి.
తిప్ప సత్తును పాలల్లో కలుపుకొని తాగాలి.

యోగ రాజ గుగ్గులు, మహారాజ యోగ గుగ్గులను వాడితే కూడా నొప్పులు తగ్గుతాయి.

                                    వాతజ గ్రహణి                                 29-9-10.

   గ్రహణి అనునది వ్యాధి యొక్క పేరు మాత్రమే కాదు శరీరంలోని అన్ని అంగాలకు సంబంధించిన వాత నొప్పి.. డియోడినం ( గ్రహణి) అను వ్యాధిని వాతము బారిన పడినపుడు వాత గ్రహణి అని అంటారు.

వగరు, చేదు, కారం తరచుగా మితిమీరి తినడం, చల్లని, చల్లారిన ఆహారాన్ని తినడం, తినవలసిన దాని కంటే ఎక్కువ, తక్కువ తినడం. అసలే తినకపోవడం, ఎక్కువ శ్రమ చేయడం, ఎక్కువ దిగులు, బాధ మొదలైన కారణాల వలన వ్యాధి వస్తుంది.

  ఆహారం చాల ఆలస్యంగా జీర్ణమవడం ఆహారం పుల్లగా మారడం, నోరు గొంతు ఎండిపోయినట్లు వుండడం గాలితో నిండి ఉబ్బరించి వుండడం వంటి లక్షణాలు వుంటాయి. చేతి వేర్ల చివర్లలో నొప్పి, చెవులలో శబ్దాలు రావడం, మలం పలు మార్లు రావడం--ద్రవయుక్తంగా మారడం, నొప్పితో నురుగుతో శబ్దంతో రావడం జరుగుతుంది.

  వ్యాధి నివారణలో అతివిషాది చూర్ణం చాల బాగా పని చేస్తుంది.

  అతివిష శొంటి  పిప్పళ్ళు మిరియాలు' సైంధవ లవణం యవాక్షారం ఇంగువ అన్నింటి యొక్క
చూర్ణాలను  సమాన భాగాలుగా తీసుకుని నిల్వ చేసుకోవాలి.

 అర టీ స్పూను పొడిని అర కప్పు మజ్జిగలో కలిపి తాగాలి. విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తాగాలి. విధంగా రెండు, మూడు వారాలు తీసుకుంటే పై వ్యాధి నివారింప బడుతుంది.

                   వృద్ధుల వాత నొప్పులను హరించే తైలం                  15-8-09.

కీళ్లలో మలినపదార్ధాలు చేరడం వలన వాత నొప్పులు వస్తాయి.

వెల్లుల్లి రసం      --- 20 gr ( ముద్దగా దంచి నిజ రసం తీయాలి )
నువ్వుల నూనె   --- 20 gr

చర్మం బాగా ఎర్రగా వున్నవాళ్ళు ( పైత్య శరీరం) , వేడి శరీరం వున్నవాళ్ళు నువ్వుల నూనెను ఉపయోగించాలి. లేని వాళ్ళు ఆవ నూనెను వాడాలి.

   పై రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. తైలాన్ని నొప్పులున్న చోట మర్దన చెయ్యాలి. దీని వలన అతి త్వరగా ఉపశమనం కలుగుతుంది. శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దన చేసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి. చలి కాలంలో చల్లని నీటితో స్నానం చేస్తే వాత నొప్పులు ఎక్కువ అవుతాయి.
                                                   వాత హర లస్సి                            9-2-11.
 
 వాతం వలననే గుండె వేగంగా కొట్టుకోవడం, వేగంగా రక్తప్రసరణ జరగడం వంటివి జరుగుతాయి.
పన్నీరు           --- అర కప్పు
పెరుగు             ---అర కప్పు
నీళ్ళు              --- ఒక కప్పులో మూడవ వంతు
జిలకర            --- ఒక టీ స్పూను
తేనె                ----ఒక టేబుల్ స్పూను
నిమ్మ రసం     ----ఒక టీ స్పూను
  పన్నీరు, పెరుగు, నీళ్ళు మిక్సిలో వేసి తిప్పాలి. దీనిలో జిలకర పొడి వేసి మళ్లీ ఆన్ చేయాలి.
తరువాత తేనె, నిమ్మరసం కలపాలి .
   దీనిని ఫ్రిజ్ లో పెట్ట కూడదు . పెడితే వాతం పెరుగుతుంది. చిక్కని లస్సీని అలానే తాగాలి. ఎక్కువ నీళ్ళు కలప కూడదు.

                                కంప వాతం  ( కాళ్ళు చేతులు వణకడం )                          9-3-11.

    శరీరంలో వాత లక్షణాలు ఎక్కువైనపుడు  ఈ సమస్య వస్తుంది.

శారీరకంగా నరాలు బలహీనంగా వున్నవాళ్ళలో కూడా వస్తుంది.

 రక్తప్రసరణ లో లోపం వలన కూడా ఈ సమస్య వస్తుంది.

    ఈ సమస్య వున్నవాళ్ళు వస్తువులను సరిగా పట్టుకోలేరు.

    వాత గజాంకుశ
    మహాయోగ రాజ గుగ్గులు

    పై రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు.

 1. ఒక పూటకు మోతాదు:--

       నువ్వుల నూనె               --- 3 gr
        వెల్లుల్లి                         --- 3 gr
        సైంధవ లవణం               --- 1 gr

     వెల్లుల్లిని బాగా దంచి అన్నింటిని కలిపి తీసుకోవాలి.

     ఈ విధంగా రోజుకు రెండు సార్లు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే  వాతం తగ్గి పోతుంది.

 2.  తిప్ప తీగ పొడి                 --- 100 gr
      సన్న రాష్ట్రం పొడి            ---- 100 gr
      గలిజేరు వేర్ల పొడి             ---- 100 gr (వాతాన్ని సాధారణ స్థాయి కి తెస్తుంది )
               శొంటి                    ---- 100 gr

      అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచాలి.

      ఒక టీ స్పూను పొడిని  రెండు గ్లాసుల నీటిలో మరిగించి ఒక గ్లాసుకు రానిచ్చి మూడు పూటలా
 తీసుకోవాలి.
     దీని వలన ప్రారంభ దశలో వున్న కంప వాతం నివారింపబడుతుంది.

                      వృద్ధాప్యం లో కీళ్ళు,  కాళ్ళు, నడుము  నొప్పుల నివారణ               28-5-11.

జటామాంసి                         ---10 gr
బ్రాహ్మి  సమూల చూర్ణం       --- 10 gr
శంఖ పుష్పి                        --- 10 gr
గుంటగలగర                      --- 10 gr
వస చూర్ణం                        --- 10 gr
అశ్వగంధ                          --- 10 gr
శతావరి                             --- 10 gr
పల్లేరు కాయల చూర్ణం       -   -- 10 gr
నేలగుమ్మడి                       --- 10 gr
దూలగొండి గింజలు             --- 10 gr
అతిమధురం                      --- 10 gr

       అన్నింటి యొక్క చూర్ణాలను  ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి
       రెండు నెలలకొకసారి తయారు చేసుకోవాలి . దీనిని జీవితమంతా వాడుకోవచ్చు

       ఒక టీ స్పూను పొడిని తలకొట్టి అనగా మూడు గ్రాములు తీసుకొని నీళ్ళలో కలుపుకొని
తాగాలి  లేదా తేనెతో తీసుకోవచ్చు

       దీని వలన నొప్పులు, కుంగుబాటు నివారింపబడతాయి .  కంటి చూపు మెరుగుపడుతుంది

       ఈ ఔషధం లో ANTACIDS ( యాంటాసిడ్స్ )  వుంటాయి . వీటివలన శరీరంలోని
మానసిక , శారీరక  రుగ్మతలు నివారింపబడతాయి

      కీళ్లలో అరుగుదల ఎక్కువగా వుంటే బాగా విశ్రాంతి తీసుకోవాలి .  బరువు పెరగకూడదు .

                                   వాత నొప్పుల నివారణకు  -- వాత సంహారిణి          31-5-11.
                                            (వాత రోగాలు  80 రకాలు)

సన్న రాష్ట్రం      చూర్ణం               --- 50 gr
తిప్ప తీగ             "                   --- 50 gr
దేవదారు చెక్క      "                   --- 50 gr
ఆముదపు వేరు    "                    --- 50 gr
దోరగా వేయించిన శొంటి   "          --- 50 gr

        అన్ని చూర్ణాలను  కల్వం లో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి బటాణి  గింజలంత
మాత్రలు తయారు చేయాలి  .

       ప్రతి రోజు  పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి

       మెడ బిగుసుకున్నవాళ్ళు ,  మోకాళ్ళు బిగుసుకున్న వాళ్ళు మొదలైన సమస్య తీవ్రంగా
వున్న వాళ్ళు  రోజుకు మూడు పూటలా మూడు మాత్రలు వాడాలి . సమస్య తక్కువగా వున్నవాళ్ళు   పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు వాడాలి

                                                 వాత రోగాల నివారణ                                1-6-11.

త్రిఫల చూర్ణం                         --- 100 gr
సునాముఖి ఆకు చూర్ణం          ---   50 gr
నల్ల ఉప్పు                            ---   25 gr

     అన్ని చూర్ణాలను  కల్వంలో వేసి తగినంత నిమ్మ రసం కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు
తయారు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .

     ఉదయం ఒకటి ,  సాయంత్రం ఒకటి  మాత్రల చొప్పున వాడాలి .

      వీటిని అందరూ వాడవచ్చు .  నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ,  వాత సమస్యలు నివారింప
బడతాయి .  


                                         వాతరోగాల నివారణకు  --- గుటికలు                                   16-6-11.

వావిలాకు చిగుళ్ళు                   --- 100 gr
శొంటి పొడి                                --- 100 gr
పిప్పళ్ళ పొడి                            --- 100 gr
మిరియాల పొడి                         --- 100 gr
పిప్పలి కట్టే పొడి                        --- 100 gr
అల్లం రసం                               --- తగినంత

      అన్ని పొడులను కల్వం లో వేసి తగినంత అల్లం రసం పోస్తూ మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరాలి
బటాణీ  గింజలంత  మాత్రలు చేసి ఆరబెట్టాలి .

     ప్రతి రోజు ఒక మాత్ర వేసుకొని బార్లీ గాని ధనియాల కషాయం గాని తాగాలి

                                                    వాతనోప్పులు  --- నివారణ                                  7-9-11.

సమూల కృష్ణతులసి నిజ రసం                ---- ఒక గ్లాసు
నువ్వుల నూనె                                     ---- ఒక గ్లాసు

     రెండింటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె మాత్రమె మిగిలేట్లు కాచాలి . అడుగంటకుండా
కలియబెడుతూ వుండాలి .  దించి , వడపోసుకొని   వున్నపుడు ముద్దకర్పూరం కలపాలి .కరిగిన  తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి .

     దీనిని ఒక చిన్న గిన్నెలో వేసి వేడి చేసి గోరువెచ్చగా నొప్పుల పై రుద్దాలి .  ఈ విధముగా ప్రతి రోజు చేస్తూ వుంటే
నొప్పులు తగ్గుతాయి .


.



  .
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి